Saturday, 4 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీలో కొత్త (ప్రతిపాదిత) జిల్లాలు.. వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు

ఏపీలో కొత్త (ప్రతిపాదిత) జిల్లాలు.. వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు 1. *పలాస:* ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం 2. *శ్రీకాకుళం:* శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం 3. *మన్యం పార్వతీపురం:* పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ 4. *విజయనగరం:* విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి 5. *విశాఖపట్నం:* భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి 6. *అల్లూరి సీతారామరాజు అరకు:* అరకు, పాడేరు, మాడుగుల 7. *అనకాపల్లి:* అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని 8. *కాకినాడ:* కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, రామచంద్రాపురం 9. *తూర్పు గోదావరి రాజమహేంద్రవరం:* రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి, రాజానగరం, రంపచోడవరం 10. *బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ అమలాపురం:* అమలాపురం, ముమ్మిడివరం, గన్నవరం, రాజోలు, కొత్తపేట, మండపేట 11. *పశ్చిమ గోదావరి నరసాపురం:* తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం 12. *ఏలూరు:* ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, గోపాలపురం, చింతలపూడి, పోలవరం 13. *కృష్ణా మచిలీపట్నం:* కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు 14. *ఎన్టీఆర్ విజయవాడ:* విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, మైలవరం 15. *అమరావతి:* పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ 16. *గుంటూరు:* గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు 17. *బాపట్ల:* బాపట్ల, వేమూరు, చీరాల, రేపల్లె, పర్చూరు 18. *పల్నాడు నరసరావుపేట:* నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ 19. *మార్కాపురం:* మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి 20. *ఒంగోలు:* ఒంగోలు, అద్దంకి, సంతనూతలపాడు, కొండెపి, కందుకూరు 21. *శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు:* నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావాలి, కోవూరు, ఉదయగిరి 22. *గూడూరు:* గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట 23. *శ్రీ బాలాజీ తిరుపతి:* తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, చంద్రగిరి 24. *చిత్తూరు:* చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం 25. *మదనపల్లి:* మదనపల్లి, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి 26. *సత్యసాయి హిందూపురం:* హిందూపురం, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర 27. *అనంతపురం:* అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, రాప్తాడు, శింగనమల, తాడిపర్తి 28. *ఆదోని:* ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం 29. *కర్నూలు:* కర్నూలు, డోన్, నందికొట్కూరు, కోడుమూరు 30. *నంద్యాల:* నంద్యాల, శ్రీశైలం, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం 31. *వైఎస్సార్ కడప:* కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల 32. *అన్నమయ్య రాజంపేట:* రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, బద్వేలు

కాకినాడ

పెద్దాపురం శివాలయంలో జ్వాలాతోరణం

పున్నమి న్యూస్ పెద్దాపురం 6/10 మెయిన్ బజార్ ఉన్న శివాలయంలోని ఆలయ అర్చకులు, సిబ్బంది ఆధ్వర్యంలో సాయంత్రం 7.30 గంటలకు కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా జ్వాలాతోరణం అంగరంగ వైభవంగా నిరసించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పెద్దాపురం ఎస్సై మౌనిక గారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది.

Blog

భారత హాకీ చరిత్ర- ధ్యాన్ చంద్ జీవితం పై వక్తృత్వ పోటీలు

భారత హాకీ శతాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని నంద్యాల హాకీ సంఘం ఆధ్వర్యంలో నంద్యాల లయన్స్ క్లబ్ సహకారంతో గురువారం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో “భారత హాకీ చరిత్ర – ధ్యాన్ చంద్ జీవితం” అంశంపై ఆంగ్లంలో వక్తృత్వ పోటీలు నిర్వహించారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా విశ్రాంత ఆంగ్ల ప్రొఫెసర్ ఐ. విజయభాస్కర రెడ్డి, డాక్టర్ రవి కృష్ణ వ్యవహరించారు ఈ సందర్భంగా హాకీ ఆంధ్రప్రదేశ్ సంఘం అధ్యక్షులు చాణక్య రాజు,ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ ఒలింపిక్ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నంద్యాల హాకీ సంఘం ఆధ్వర్యంలో ఏడవ తేదీ ఎస్పీజీ మైదానంలో ఉదయం జరిగే హాకీ శతాబ్ది ఉత్సవాలలో వ్యాసరచన,వక్తృత్వ పోటీల బహుమతులు అందజేస్తామన్నారు.దేశ వ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని 1000 హాకీ మ్యాచులు హాకీ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని నంద్యాలలో కూడా హాకీ మ్యాచ్ నిర్వహిస్తున్నామన్నారు హాకీ క్రీడాకారులను సత్కరించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు కోశాధికారి అమిదేల జనార్ధన్,నంద్యాల హాకీ సంఘం ఉపాధ్యక్షులు స్టీఫెన్, కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి పత్తి రంగనాథ్ పాల్గొన్నారు వక్తృత్వ పోటీ విజేతలు గుడ్ షెఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు చెందిన అల్ సుమయ,ముస్కాన్ జవేరియా,మేఘన ప్రథమ,ద్వితీయ,తృతీయ స్థానాలు సాధించగా,జయ ప్రకాష్ రాజ్, ఆఫ్రిన్ స్పెషల్ జ్యూరీ బహుమతులకు ఎంపికయ్యారు.

తిరుపతి

నిరాటంకంగా డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం

శ్రీ శ్రీకాళహస్తి నవంబర్ 06 , పున్నమి న్యూస్ : కాళహస్తి పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కోడలి వద్ద జనసేన నాయకులు పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 67 వ వారం శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జన సైనికులు మాట్లాడుతూ.. జనసేనాని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాల కృషి కోసం పనిచేసే జనసేన నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో ప్రతి వారం నిరాటంకంగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, మనీ ,నవీన్,ముని చంద్ర, రాజా, చందు, యాసిన్ భాష, పలని స్వామి, సాయి, గోపి, వీర మహిళలు బత్తెమ్మ, దుర్గ తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

7 వ తేదీ పద్మావతి నగర్ లో ఉన్న నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉచిత మెగా వైద్య శిబిరం

నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నంద్యాల లయన్స్ క్లబ్ సహకారంతో నవంబర్ 7వ తేదీ, శుక్రవారం ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం 2 వరకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిర వివరాలతో కూడిన కరపత్రాలను గురువారం ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ,నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కోశాధికారి నెరవాటి వినోద్ కుమార్,అమిదేల జనార్ధన్,డాక్టర్ నెరవాటి గగన్ విడుదల చేశారు ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్ మాట్లాడుతూ పద్మావతి నగర్ లో ఉన్న నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో చెవి ముక్కు గొంతు వైద్యులు డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్,సంతాన సాఫల్య నిపుణురాలు డాక్టర్ అరుణకుమారి,ఎముకలు,కీళ్ల వైద్యులు డాక్టర్ సుమన్ కుమార్, ప్రసూతి,స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఫాతిమాబి,జనరల్ మెడిసిన్ వైద్యులు డాక్టర్ దేవేంద్ర నాయక్ లు రోగులను పరీక్షించి,ఉచితంగా వినికిడి పరీక్షలు,ఎముకల సాంద్రత పటిష్ట పరీక్షలు,రక్త పరీక్షలు,అవసరమైన వారికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేసి మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ శిబిరంలో వినికిడి మిషన్ 30 శాతం రాయితీ తో తయారీ కంపెనీ అందజేస్తుందన్నారు నంద్యాల పట్టణం,పరిసర ప్రాంతాల ప్రజలు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

తిరుపతి

అర్ధనారీశ్వరాలయాన్ని శుద్ధిపరిచిన టిడిపి నాయకులు

శ్రీకాళహస్తి తెలుదేశం పార్టీనాయకులు, కూటమి నాయకులు కలసి బుధవారం నాడు అర్ధనారీశ్వరాలయాన్ని శుద్ధిపరిచేసారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన అర్ధనారీశ్వరీ స్వామి ఆలయం నందు మంగళవారం రోజు రాత్రి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆలయం దర్శనానికి వెళ్లిన సందర్భంలో ఆలయం వద్ద నీరు ఉండడం కరెంటు లేకపోవడంతో కార్తీక మాసంలో భక్తులు ఇక్కడ కార్తిక దీపాలను వెలిగించుకోవడానికి వస్తారని ఇక్కడ విద్యుత్తు లేకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేసినట్టు డ్రామాలు చేస్తూ దేవాలయ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నటువంటి ఈవో బాపిరెడ్డిని విమర్శించడం తగదని అనవసరంగా విమర్శిస్తే సహించేది లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయం వద్ద గోమూత్రం, పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ….మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా అర్ధనారీశ్వరుని ఆలయం వద్ద మాట్లాడడం హేయమైనచర్య అతని రాకతో ఈ ఆలయం అశుద్ధి అయ్యిందని కాబట్టి తెలుగుదేశం నాయకులు గోమూత్రం, పసుపునిలతో శుద్ధి చేపట్టామన్నారు. అర్ధనారీశ్వరుని ఆలయాన్ని తానే నిర్మించానని బియ్యపు మధుసూదన్ రెడ్డి చెప్పడం కడు విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నో తరాల నుంచి ఈ ఆలయం ఇక్కడ నిర్మింపబడి ఉందని మాజీ శాసనసభ్యులు బియ్యపు మసూదన్ రెడ్డికి గుర్తు చేశారు. ఈ ఆలయం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇసుక గత ప్రభుత్వంలో మాజీ శాసనసభ్యులు దోచుకున్న విషయాన్ని మరిచిపోయారా అంటూ వారు గుర్తు చేశారు. మరో మారు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోమని తగ్గిన విధంగా బుద్ధి చెబుతామన్నారు. ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు కార్యకర్తలు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

అమరావతి

ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఘటనపై ఆరా తీసిన మంత్రి కందుల దుర్గేష్.

– ఫుడ్ పాయిజన్ తో వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడంపై ఆవేదన – ఈ ఘటనపై విభిన్న కోణాల్లో విచారణ చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు సూచన అమరావతి, నవంబర్ 06 : గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఘటనపై లండన్ పర్యటనలో ఉన్న గుంటూరు జిల్లా ఇంచార్జి మంత్రి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆరా తీశారు. ఫుడ్ పాయిజన్ తో వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలపై ఆరా తీశారు. ఈ ఘటనపై విభిన్న కోణాల్లో క్షుణ్ణంగా విచారణ చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు సూచించారు.ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీకి మంత్రి దుర్గేష్ ఫోన్ ద్వారా పలు సూచనలు చేశారు.

Blog

యువత స్వశక్తితో అద్భుతాలు సాధించాలి. టీడీపీయువనాయకులు,వ్యాపారవేత్త,ఫైర్ బ్రాండ్ కత్తి శ్రావణి.

నంద్యాల : ప్రపంచదేశాల్లో యువత రాణించడం శుభసూచకం యువత మేధాశక్తితో విజయాలు సాధిస్తున్నారు.పుట్టిన గడ్డకు,జన్మనిచ్చిన తల్లిదండ్రులకు,దేశానికి మంచిపేరు తీసుకొని రావడంలో యువత పాత్ర కీలకంగా మారింది.చదువే యువతకు పునాదిగా మారిపోయింది.యువత స్వశక్తితో విజయాలు సాధిస్తున్నారు.యువత ఆలోచనలకు పదును పెడితే ఎన్నో విజయాలు సాధించవచ్చని పుట్టినరోజు సందర్భంగా టీడీపీ యువ నాయకురాలు,వ్యాపారవేత్త ఫైర్ బ్రాండ్ కత్తి శ్రావణి మాటల్లో యువత స్వశక్తితో అద్భుతాలు సాధించవచ్చని అభిప్రాయాన్ని వెల్లడించారు.సమాజంలో యువత ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా స్వశక్తితో ముందుకు అడుగువేస్తే సాధించలేనిది లేదన్నారు యువత ఆలోచనలకు పదును పెడితే ఎన్నో విజయాలు మీ సొంతం అవుతాయన్నారు చదువుతో మంచి మేధస్సు పెరగడంతో విజయాలు సాధించి మరెందరికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నారు గతంలో యువత దేశానికే పరిమితం అయ్యేవారన్నారు.కంప్యూటర్ యుగంలో ప్రపంచదేశాలు ఔరా అన్న విధంగా కంప్యూటర్ పరిజ్ఞానం తో ప్రపంచంలో యువత మంచిపేరు తెచ్చుకున్నారన్నారు.ఇండియా లో చదివి ప్రస్తుతం అగ్రరాజ్యాల్లో సైతం యువత పెద్ద పెద్ద కమిటీలు ఏర్పాటు చేస్తున్నారన్నారు.యువతకు చదువు శ్రీరామ రక్షగా మారిందన్నారు.తల్లిదండ్రులు పొలం పనులు,వ్యాపారాల్లో ఉంటూ పిల్లలు కష్టపడకుండా ఉండేందుకు రెక్కల కష్టంతో పిల్లలను చదివించి ప్రయోజకులను చేశారన్నారు.తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలంగా అన్ని రంగాల్లో యువత పాత్ర అమోఘం అన్నారు కంప్యూటర్ రంగంలో నిష్ణాతులైన యువత విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారన్నారు.ప్రభుత్వాలు సైతం యువతలో దాగిఉన్న నైపుణ్యాన్ని గుర్తించి బాసటగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఉన్నత చదువులు చదివి కొందరు యువత పొలాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారన్నారు.లాభదాయకమైన పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.యువతలో పట్టుదల,సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు.రైతు కుటుంబాల్లో పుట్టిన ఎందరో ఆణిముత్యాలు సాఫ్ట్వేర్ రంగాల్లో రాణిస్తూ దేశానికి,పుట్టిన గడ్డకు మంచిపేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారని అన్నారు.చిన్న వయసులో కొందరు యువత సారవేత్తలుగా ఎన్ని విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.రైతు కుటుంబంలో జన్మించిన కత్తి శ్రావణి సైతం మంచి చదువులు చదివి డేరింగ్ ,డ్యాసింగ్ గా వ్యాపారంలో,రాజకీయంలో చలాకీగా ఉండడానికి ప్రధాన కారణం చదువే.చిన్నతనం నుంచి ఒక గోల్ పెట్టుకొని కష్టాలను ఎదురిస్తూ మనోధైర్యాన్ని కోల్పోకుండా పట్టిన పట్టు విడిచిపెట్టకుండా అనుకున్నది ఎందుకు సాధించలేము,అధైర్య పడకుండా అనుకున్నది సాధిస్తూ వ్యాపార,రాజకీయ రంగాల్లో తనదైన శైలిలో ముద్రవేసుకున్నారు.సంఘంలో గుర్తింపు,వ్యాపారంలో అనుకున్నది సాధించాలని తలంపుతో అందరితో కలిసిపోతూ,స్నేహితుల సహకారం,సేవచేసే గుణం ఉండడంతో సక్సెస్ సాధించారు.యువత అనుకుంటే ఏదైనా సాధించవచ్చనీ,నిరాశ,నిస్పృహ తోడి సాధించలేని ధైర్యంతో ముందడుగు వేస్తే యువత సాధించలేనిది ఏమి లేదని నిరూపించారు.కత్తి శ్రావణి పుట్టినరోజు సందర్భంగా యువత సాధించలేనిది ఏమీలేదని ,అనుభవపూర్వకంగా జరిగిన సంఘటన ను పంచుకున్నారు.పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు అల్ ద బెస్ట్ చెప్పాల్సిందే.

తూర్పు గోదావరి

న్యాయవాదుల భద్రతా చట్టం కోసం చేపట్టిన ” పాదయాత్రను ” జయప్రదం చేద్దాం..

రాజమహేంద్రవరం, నవంబర్ 06 : న్యాయవాదుల రక్షణకై ప్రత్యేక రక్షణా చట్టం తక్షణమే అమలు చేయాలని “ఆలా” అధ్యక్షులు, సీనియర్ హై కోర్టు న్యాయవాది ఎమ్ వి రాజారామ్ స్ఫూర్తితో డోన్ ప్రాంతం నుండి నాయవాదులు లక్ష్మి శెట్టి కృష్ణ ప్రసాద్ , కె. ఈశ్వరయ్య లు యాత్ర ప్రారంభించారు . ఈ యాత్ర అంకుటిటత దీక్షతో గుంటూరు జిల్లాలో గల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాలయం వద్దకు చేరుకొని ముగుస్తుంది. ఈ పాదయాత్ర కు అనేక అవాంతరాలు ఎదురై నప్పటికి “ఆలా” అధ్యక్షులు ఎమ్ వి రాజారామ్ కృషితో న్యాయస్థానం ద్వారా అనుమతి సాధించారు . న్యాయవాదులు అనేక సమస్యలతో సత మత మవుతున్నారనే యదార్థన్ని గమనించిన లక్ష్మిశెట్టి కృష్ణ ప్రసాద్, కె. ఈశ్వరయ్య లు న్యాయవాదుల భద్రత కోసం పాదయాత్ర చేసి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటానికి సిద్దపడి ఎన్ని ప్రయాసలనైనా తట్టుకుని పాదయాత్ర చేయటానికి ముందుకు సాగుతున్నారు. ఈ పాదయాత్ర కు సంఘీబావంగా అనేక ప్రాంతాల నుండి కృష్ణ ప్రసాద్ , ఈశ్వరయ్య లకు మద్దతు తెలుపుతున్నారు . న్యాయవాదుల భద్రతే ప్రధాన లక్ష్యంగా ఆవిర్బవించిన ” ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ ” ఖచ్చితంగా న్యాయవాదులకు అవసరమయ్యే ప్రత్యేక భద్రతా చట్టం , ప్రైవేట్,కార్పొరేట్, ఆసుపత్రుల్లో మెరుగైన ఉచిత ఆరోగ్య సేవలు సాధిస్తామని, ఆలా వ్యూహ రచనతో ముందు ముందు అద్భుతమైన మంచి రోజులు న్యాయవాదులకు వున్నాయని , పూర్తి స్థాయి భద్రత, సంక్షేమం , ఇతర మెరుగైన సౌకర్యాలు ఖచ్చితంగా సాధిస్తామని ఎమ్ వి రాజారామ్ , మేడా శ్రీనివాస్ లు ధీమా వ్యక్త పరిచారు . ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వున్నటు వంటి “ఆలా” సభ్యులు కృష్ణ ప్రసాద్ , ఈశ్వరయ్య లు చేస్తున్న పాదయాత్రకు అండగా నిలిచి వారి పాదయాత్రను విజయవంతం చేయాలని, ఆలా గ్రూపు సభ్యులు అందరు తోటి సహచర న్యాయవాదులకు పాదయాత్ర కోసం తెలియచేసి న్యాయవాదుల భద్రతకు తోడ్పడాలని ఎమ్ వి రాజారామ్ , మేడా శ్రీనివాస్ లు ఆలా సభ్యులకు పిలుపునిచ్చారు. కృష్ణ ప్రసాద్ , ఈశ్వరయ్య ల పాదయాత్ర న్యాయవాదుల చరిత్రలో నిలిచిపోతుందని , వీరి పాదయాత్ర ను ఒక స్ఫూర్తిగా తీసుకుని తోటి న్యాయవాదులందరు మన ఐఖ్యతను తెలియచేసే విధంగా మద్దత్తు తెలపాలని , న్యాయవాదుల కోసం పాదయాత్ర ద్వారా చేస్తున్న పోరాటం మరువలేనిదని , త్వరలో న్యాయవాదుల భద్రత , సంక్షేమం , ఇతర సమస్యలపై ఒక అంతర్గత సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ సిద్దం చేస్తామని రాజారామ్ , శ్రీనివాస్ లు తెలిపారు.

తూర్పు గోదావరి

ఎస్ కెవీటి విద్య సంస్థల్లో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయిల్లో ఉన్నారు : ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.

– కందుకూరి ఆశయ స్ఫూర్తిగా హితకారిణి సమాజం అభివృద్ధికి కృషి చేస్తాం : చైర్మన్ యాళ్ల – ఘనంగా హితకారిణి సమాజం నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారోత్సవం… అభినందన సభ రాజమహేంద్రవరం నవంబర్ 06: నవయుగ వైతాళికులు కందుకూరి వీరేశలింగం పంతులు విద్య సంస్థల్లో చదువుకున్న వేలాది మంది ప్రస్తుతం దేశ విదేశాల్లో ఉన్న స్థాయిల్లో ఉన్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. అసమానతలు లేని సమాజం కోసం, మహిళల విద్య, హక్కుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన కందుకూరి వీరేశలింగం పంతులు ఆశయ స్ఫూర్తిగా హితకారిణి సమాజం అభివృద్ధి కి నూతన కార్యవర్గం పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక ఎస్ కే వీటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద గురువారం హితకారిణి సమాజం చైర్మన్ గా నియమితులైన డాక్టర్ యాళ్ల ప్రదీప్ కుమార్ తో పాటు నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారోత్సవం సభ ఘనంగా జరిగింది. మాజీ కార్పొరేటర్ వర్రీ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ కూటమి పార్టీల మధ్య ఐక్యతను బలపరిచే విధంగా అన్ని దేవదాయ కమిటీలు వేస్తున్నామని, మొట్టమొదటిసారిగా ఈ కార్యవర్గంలో ముగ్గురు రెల్లి కులస్తుల సభ్యులను నియామకం జరిపామన్నారు. సమాజం కోసం విలువైన ఆస్తులను త్యాగం చేసి కందుకూరి పంతులు సమకూర్చిన ఆస్తులను, విద్యా సంస్థలను గత వైసిపి పాలకులు విద్యాశాఖ, దేవదాయ శాఖల్లో అనాలోచితంగా విభజించారని, ఆ సంస్థల్లో పనిచేసే విద్యార్థులను, ఉద్యోగులను ఇబ్బంది పెట్టారన్నారు. తమ ప్రభుత్వంలో ఈ వివాదాన్ని, ఇబ్బందులు తొలగించడానికి నోడల్ అధికారిని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతిష్టాత్మకమైన, సమాజంలో గౌరవం కలిగిన హితకారిణి సమాజం ఆస్తుల పరిరక్షణకు, మౌలిక వసతులు అభివృద్ధికి, విద్యార్థుల, ఉద్యోగుల సంక్షేమానికి కార్యవర్గం చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. తొలి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని ఏకేసి కాలేజీ వద్ద ప్రతిష్టించడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వచ్చే 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, ఆ మేరకు కూటమి ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ నగరంలో ప్రతిష్టాత్మక సంస్థగా ఎదిగిన ఎంతో మంది గొప్ప వ్యక్తులు సేవలు అందించిన హితకారిణి సమాజం పేరు ప్రఖ్యాతలు నిలబెట్టే విధంగా నేటి కార్యవర్గం పనిచేయాలని అన్నారు. గత పాలకులు సమాజం ఆస్తులను దుర్వినియోగం చేయడానికి యత్నాలు చేశారని విమర్శించారు.ప్రజల కోసం నిరంతరం ఆర్థిక, సామాజిక సేవలు అందించే తమ కుటుంబాన్ని విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదని సమయం వచ్చినప్పుడు తమ సత్తా చూపిస్తామన్నారు. చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ యాళ్ల ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ రెండోసారి అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, కందుకూరి ఆశయస్ఫూర్తిగా సమాజం సంస్థల అభివృద్ధికి తమ కార్యవర్గం పాటుపడుతుందన్నారు. ఇంకా ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, చల్లా శంకర్రావు, అత్తి సత్యనారాయణ, పిక్కి నాగేంద్ర, వై శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. నగర తొలి మహిళ మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ నూతన కమిటీ సభ్యులను అభినందించారు. అనంతరం పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. అభినందన సత్కారానికి ముందుగా యాళ్ల ప్రదీప్ తన నివాసం నుంచి భారీ ర్యాలీగా సభ వేదిక వద్దకు చేరుకున్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.