Friday, 3 April 2026

Blog

హైదరాబాద్

మాగంటి ఫ్యామిలీలో సర్టిఫికెట్ లొల్లి – జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై కుటుంబ సభ్యుల అభ్యంతరం

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి తెలంగాణ ప్రతి నిధి) జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీపై వివాదం చెలరేగింది. శేరిలింగంపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో గోపినాథ్ తల్లి, మొదటి భార్య మాలినీ, కుమారుడు తారక్​ ప్రద్యుమ్న హాజరై అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ లీగల్​ అడ్వైజర్​తో కలిసి సునీత కూతురు దిశిర కూడా హాజరై వివరణ ఇచ్చింది. ఈ సందర్భంగా గోపినాథ్ తల్లి మాట్లాడుతూ, “నా కుమారుడి మృతిపై కేటీఆర్ సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు. మాగంటి కుటుంబ అంతర్గత సమస్యగా మొదలైన ఈ వివాదం ఇప్పుడు రాజకీయ రంగు ఎక్కింది.

చిత్తూరు

కర్ణాటక కౌశల్య అవార్డు అందుకున్న పలమనేరు వాసి

పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలానికి చెందిన, పలమనేరు పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న, ధనశేఖర్ రత్నమ్మ దంపతుల కుమారుడు సాయి శ్రీకర్ కర్ణాటక కౌశల్య కార్పొరేట్ ఎక్సలెన్సీ అవార్డు అందుకున్నాడు. స్మార్ట్ ఈడి ఆన్ స్కిల్ ఇన్నోవేషన్ సంస్థను స్థాపించి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ… కాలేజీల్లో విద్యార్థులకు ఆన్లైన్ టెక్నికల్ ప్రోగ్రాం నిర్వహిస్తూ…. 150 మందికి జీవనోపాధి కల్పిస్తూ … ఆ సంస్థ సీఈవో, ఫౌండర్ గా ఉన్న సాయి శ్రీకర్ అతని స్నేహితుడు తిరుపతి కి చెందిన గోకుల్. గురువారం సాయంత్రం బెంగళూరులో జరిగిన కర్ణాటక సమ్మిట్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కౌశల్య కర్ణాటక కార్పొరేట్ ఎక్సలెన్సీ అవార్డును సాయి శ్రీకర్ గోకుల్ కర్ణాటక స్కిల్ డెవలప్మెంట్ మంత్రి చరణ ప్రకాష్ రుద్రప్ప పాటిల్ నుండి అందుకున్నారు. ఈ సందర్భంగా సాయి శ్రీకర్ మరియు గోకుల్ ను ప్రశంసిస్తూ మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలియజేశారు.

తూర్పు గోదావరి

డీఎంఈని మర్యాద పూర్వకంగా కలిసిన జిజిహెచ్ సూపరింటెండెంట్ డా. సత్యనారాయణ.

విజయవాడ / రాజమహేంద్రవరం నవంబర్, 06 – ఆసుపత్రి అభివృద్ధి, సిబ్బంది బలోపేతం అంశాలపై చర్చ. తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జిజిహెచ్) ఇంచార్జి సూపరింటెండెంట్ డా. పి.వి.వి. సత్యనారాయణ గురువారం విజయవాడలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కార్యాలయం లో డీఎంఈ డా. జి. రఘు నందన రావు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి, వైద్య సిబ్బంది బలోపేతం, ఆధునిక పరికరాల అందుబాటు, మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి అంశాలను ఆయన దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ఆసుపత్రిలో సేవల నాణ్యతను మరింత పెంపొందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సూపరింటెండెంట్ సమగ్ర వివరాలు సమర్పించారు. తూర్పు గోదావరి జిల్లా జిజిహెచ్ ఇంచార్జి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన ఈ అనంతరం తొలిసారిగా డీఎంఈ వారిని మర్యాద పూర్వకంగా కలిసినట్లు డా. పి.వి.వి. సత్య నారాయణ తెలియ చేశారు.

ఖమ్మం

పేదల పొట్ట కొడుతున్న లీజుదారులు

*పేదల పొట్ట కొడుతున్న లీజుదారులు* *బడా బాబుల పాలైన బడి స్థలం* *పేదల పొట్ట కొడుతున్న లీజుదారులు* *పాఠశాల అభివృద్ధికి దాత కేటాయించిన స్థలం అన్యాక్రాంతం* *కలెక్టర్‌కు ఏన్కూర్ ప్రజల వినతి* ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి నవంబర్ 07 ఏన్కూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన దుకాణాల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. పాఠశాల అభివృద్ధి కోసం దాత మాదినేని అప్పమ్మ విరాళంగా ఇచ్చిన స్థలం కొందరు ఆర్థికంగా రాజకీయంగా బలమైన లీజుదారుల చేతుల్లో అక్రమ సంపాదనకు ప్లాట్ ఫామ్ గా మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.నెలకు కేవలం రూ.1500 నామమాత్రపు అద్దె చెల్లిస్తూ, అదే దుకాణాలను ఇతరులకు పదివేల రూపాయలకు పైగా సబ్ లీజు ఇవ్వడం ద్వారా భారీగా లాభాలు పొందుతున్నారని వారు పేర్కొన్నారు.కొంతమంది లీజుదారులు పాఠశాల స్థలాన్నే సొంతంగా భావించి విక్రయ ప్రయత్నాలు కూడా చేస్తున్నారని గ్రామస్థుల ఆరోపణ.ఈ అక్రమాలపై విచారణ జరిపి పాఠశాల స్థలాన్ని తిరిగి రక్షించాలని, నిజమైన నిరుపేద వ్యాపారులకు దుకాణాల కేటాయింపు ఇవ్వాలని, పాఠశాల అభివృద్ధికి దాతల ఆశయాలకు న్యాయం చేయాలని ఏన్కూర్ ప్రజలు స్థానిక అధికారులను జిల్లా కలెక్టర్‌ ను కోరుతూ వినతి పత్రం అందజేశారు. గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం పాత దుకాణాల స్థానంలో పక్కా భవనాలు నిర్మిస్తే 40 కుటుంబాలకు ఉపాధి లభించడంతో పాటు పాఠశాల ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. లీజుదారులు అక్రమంగా సంపాదించిన రూపాయలను కూడా తిరిగి పాఠశాల ట్రెజరీకి అప్పజెప్పే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్

E-పేపర్

ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో పరకాల నియోజకవర్గంలో మొదటి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం.*

*పరకాల నియోజకవర్గం చరిత్రలో ఒక కొత్త అధ్యాయం…* *-ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి* *****!!!!!*****!!!!!*****!!!!!!*****!!!!!!***** *ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో పరకాల నియోజకవర్గంలో మొదటి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం.* *పరకాల నియోజకవర్గ చరిత్రలో గురువారం రోజు ఒక ప్రత్యేక గుర్తుగా నిలిచిపోయింది.పరకాల మండలంలోని నాగారం గ్రామంలో పరకాల నియోజకవర్గంలో మొదటి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.* *ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన గౌరవ పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ,రేవూరి ప్రకాష్ రెడ్డి గారికీ పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కటుకూరి దేవేందర్ రెడ్డి-శ్రవంతి గార్లు గ్రామ ప్రజలు,లబ్ధిదారూలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,మహిళలు,కళకారులతో కలసి ఘన స్వాగతం పలికారు,నూతన ఇందిరామ్మా ఇండ్ల గృహ ప్రవేశం ఇండ్లల్లో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు,లబ్ధిదారులకు ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు* ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ గారు మాట్లాడుతూ,కొత్త ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న దంపతులను అభినందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. “మన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఒక్క డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కూడా పూర్తిగా మంజూరు కాని, నిర్మాణం కాని పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు మన పరకాల నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం ప్రజల విశ్వాసానికి నిదర్శనం” అని తెలిపారు. అలాగే,గతంలో నిర్వహించిన గడప గడప యాత్రలో ఎక్కువ మంది ప్రజలు ఇల్లు ఇవ్వాలని కోరరూ ప్రతి అర్హుడికి ఇల్లు కల్పిస్తానని అప్పట్లో హామీ ఇచ్చం,నేడు ఆ హామీ నెరవేరుతోందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు పేర్కొన్నారు. అంతేకాకుండా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కృషి చేసిన ప్రభుత్వ అధికారులు,గ్రామ పంచాయతీ కార్యదర్శులు,హౌసింగ్ శాఖ అధికారులు అందరికీ ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్,పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్,పరకాల మండల మరియు పట్టణ కాంగ్రెస్ సమన్వయ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,ప్రభుత్వ అధికారులు,గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు…

విద్య విజ్ఞానం

స్వాతంత్ర్య పోరాటంలో తారకమంత్రం “వందేమాతరం”. ఆ వందేమాతరం గీతానికి నేటికి “150 ఏళ్ళు”.క్లుప్తంగా కొన్ని వివరాలు..

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి ప్రతి నిధి, తెలంగాణ) ●స్వాతంత్ర్య మంత్రంగా మారిన “వందేమాతరం” వందేమాతరం జాతీయ గీతం యొక్క 150వ జయంతిని 2025 నవంబర్ 7 నుండి ఒక సంవత్సరం పాటు జరుపుకోవాలని నిర్ణయిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం. ఇదే సంకల్పాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ కూడా గత నెల ‘మన్ కీ బాత్’లో పునరుద్ఘాటించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో పాటు సమాజంలోని ఇతర సంస్థలు కూడా వందేమాతరం యొక్క150వ జయంతిని జరుపుకుంటున్నాయి.దేశభక్తితో కూడిన సాంస్కృతిక విలువలను సమాజానికి తీసుకువెళ్లడానికి జరుగుతున్న ఈ ప్రయత్నం ప్రశంసనీయం. ●జూన్ 23, 1757న బెంగాల్‌లోని ప్లాసీ మైదానంలో నవాబ్ సిరాజ్-ఉద్-దౌలా మరియు లార్డ్ క్లైవ్‌ల మధ్య జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వారి చేతిలో భారత్ ఓటమి చవిచూసింది. ఆ విధంగా భారతదేశంలో స్వాతంత్ర్య సూర్యుడు అస్తమించాడు.ఈ పరాజయం అనంతరం, భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలు కూడా బ్రిటిష్ వారి వశమైపోయాయి. మనం వారికి బానిసలమైపోయాం. రష్యాకు చెందిన ప్రసిద్ధ తత్వవేత్త టాల్‌స్టాయ్ మన స్థితిని వర్ణిస్తూ, “ఒక వ్యాపార సంస్థ కేవలం 30 వేల మందిని తమలో కలుపుకోవడం ద్వారా, 20 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని బానిసగా మార్చివేసింది” అని పేర్కొన్నాడు. పరాధీనంగా ఉన్న దేశ దుస్థితిని చూసి, భారతమాతను ఆ బానిసత్వం నుండి విముక్తి చేయాలనే ఆకాంక్ష సమాజంలో ఉవ్వెత్తున ఎగసింది. సమాజంలోని వివిధ వర్గాలలో స్వాతంత్ర్య శంఖారావం ప్రారంభమైంది. కాళీమాత భక్తులు మరియు గురు గోరఖ్‌నాథ్ సంప్రదాయానికి చెందిన సాధువులు ఊరూరా పర్యటిస్తూ “అలఖ్ నిరంజన్” అనే నినాదంతో ప్రజలలో స్వాతంత్ర్య చైతన్యాన్ని మేల్కొలిపారు. ●సంతాల్ తెగలో జన్మించిన సిద్ధూ-కానూ అనబడే ఇద్దరు అన్నదమ్ములు 1885లో 10 వేల మంది సంతాల్‌ ప్రజలతో కలిసి “అపనీ భూమి అప్నాయేంగే అపనీ సర్కార్ బనాయేంగే”(మా భూమిని మేము తీసుకుంటాము,మా ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసుకుంటాము) అని నినదించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1857లో ఒక వ్యవస్థీకృత సాయుధ ఉద్యమం కూడా ప్రారంభమైంది. ●ఆరోజుల్లో సమాజంలో ప్రజ్వలించిన దేశభక్తి వాతావరణంలో, జూన్ 27, 1838న ఒక మహానుభావుడు జన్మించాడు,ఆయనే బంకించంద్ర చటోపాధ్యాయ. కుశాగ్రబుద్ధి కలిగిన బంకిమ్ బాబుకు దేవనాగరి, బెంగాలీ మరియు ఆంగ్ల భాషలలో గొప్ప పాండిత్యం ఉండేది. ఆయన జెస్సోర్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) లో డిప్యూటీ కలెక్టర్‌గా పని చేసారు. ఆయన ఆంగ్లేయుల అకృత్యాలు మరియు హింసలను చూసి,సాహిత్యం ద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావాలని సంకల్పించి, అనేక వ్యాసాలు,నవలలు రచించారు.దేశప్రజలపై బ్రిటిష్ వారు చేస్తున్న దారుణాలు, భారతీయులను వారు పెడుతున్న ఇబ్బందులను సమాజం దృష్టికి తీసుకురావడానికి ఆయన ఎన్నో వ్యాసాలు, నవలలు రచించారు. వీటిలో శ్రీకృష్ణ చరిత్ర, దుర్గేష్ నందిని,రాజసింహ,చంద్రశేఖర్ వంటి కావ్యాలు ప్రఖ్యాతి గాంచాయి. ఆయన తన రచనలన్నింటి ద్వారా బ్రిటిష్ పరిపాలనలోని అన్యాయాలను సమాజం కళ్ళముందుకు తీసుకురావాలని ఎంతో కృషి చేసారు. ఆ నవలల్లో, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సన్యాసుల తిరుగుబాటు నేపథ్యంగా ప్రసిద్ధి చెందిన రచన “ఆనందమఠం” ఒకటి . ఈ నవలలోనే జాతీయ గీతం వందేమాతరం ఆవిర్భవించింది. భారతమాతను ప్రస్తుతిస్తూ సన్యాసులు పాడుకునే ఆనందమఠ్‌ నవలలో వర్ణించబడిన కథ, ప్రత్యేకించి ఈ గీతం కేంద్రంగా చేసుకున్న తిరుగుబాటు సంఘటనలు ముర్షిదాబాద్ మరియు నదియా జిల్లాల పరిధిలోని లాలా గోలా ప్రాంతంలో జరిగాయి. ●1875 నవంబర్ 7న భారతీయ కాలగణన ప్రకారం, కార్తీక మాసం శుక్ల పక్ష నవమి నాడు వందేమాతరం గీతం రచింపబడింది. ఆరోజు అక్షయ నవమి కావడం వల్ల జగద్ధాత్రి పూజ కూడా జరుపుకుంటారు. ●1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం లో,గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటిసారి వందేమాతరం గీతాన్ని ఆలపించారు.ఇది మల్హార్ రాగంలో స్వరపరచబడింది. 1896 తర్వాత, కాంగ్రెస్ సమావేశాలలో వందేమాతరం పాడడం ఒక సంప్రదాయంగా మారింది. ●బెంగాల్ నుండి ఉద్భవించిన స్వాతంత్ర్య ఉద్యమాన్ని విభజించడానికి, అక్టోబర్ 16, 1905న ఆంగ్లేయులు వంగ-భంగ (బెంగాల్ విభజన) పథకాన్ని అమలు చేశారు. బెంగాల్ ప్రభావాన్ని తగ్గించడం, బెంగాలీ విప్లవకారుల ప్రభావాన్ని తగ్గించడం మరియు హిందూ-ముస్లింల మధ్య విభజన సృష్టించడం ఈ వంగ-భంగ పథకం యొక్క ఉద్దేశాలు.విభజనకు ముందే, దూరదృష్టి గల నాయకులు ఆగస్టు 7, 1905న కలకత్తా టౌన్ హాల్‌లో ఒక సభను ఏర్పాటు చేసారు. ఆ సభకు హాజరైన ప్రతి ఒక్క వ్యక్తి ఒక్క “వందేమాతరం” అనే పదాలను మాత్రమే నినదించారు. ●అక్టోబర్ 16న నిర్వహించిన జాతీయ బ్లాక్ డే సందర్భంగా, ఆనంద్ మోహన్ బసు మరియు సురేంద్ర నాథ్ బెనర్జీ నాయకత్వంలో, కలకత్తాలోని సెంట్రల్ మైదాన్‌లో 50,000 మంది ప్రజలు 3.5 కిలోమీటర్ల మేర వందేమాతరం అని నినదిస్తూ, చెప్పులు లేకుండా నడిచారు. మన్మథ్ నాథ్ మిశ్రా నాయకత్వంలో “వందేమాతరం సంప్రదాయం” ఏర్పడింది. ఆంగ్లేయులు విధించిన శిక్షకు నిరసనగా, ఒక యువకుడు 500 సార్లు వందేమాతరం అని వ్రాసాడు. విప్లవకారులు కొరడా దెబ్బలు తింటూ కూడా వందేమాతరం అని పలికారు. ఇలాంటి ఎన్నో సంఘటనల కారణంగా ఆంగ్లేయులు వందేమాతరం నినాదంపైనే నిషేధం విధించారు. అప్పట్లో వందేమాతరం కేవలం దేశప్రజలకి మాత్రమే కాకుండా, విదేశాలలో ఉంటూనే స్వాతంత్ర్య సాధన సంకల్పంతో పనిచేసే విప్లవకారులకు కూడా మంత్రంగా మారింది. ఏప్రిల్ 14, 1906న అస్సాంలో బిహు ఉత్సవంలో వేలాది మంది తమ ఛాతీపై వందేమాతరం బ్యాడ్జ్ ధరించి వచ్చారు. డిసెంబర్ 22, 1908న లండన్‌లోని ఇండియా హౌస్‌లో గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా వందేమాతరం ఆలపించబడింది. ఆగస్టు 22, 1907న, స్టట్‌గార్ట్‌లో జరిగిన అంతర్జాతీయ సామ్యవాదుల సదస్సులో, మేడమ్ కామా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. కెనడా-అమెరికాలో ఉన్న విప్లవకారులు కలుసుకున్నప్పుడు ఇతర సంబోధనలు కాకుండా వందేమాతరం అని మాత్రమే పలకడం ప్రారంభించారు. సోదరి నివేదిత రూపొందించిన జెండాపై వందేమాతరం ముద్రించబడింది. ‘వందేమాతరం’ వార్తాపత్రికను ప్రచురించినందుకు మహర్షి అరబిందోను ఆంగ్లేయులు శిక్షించారు. ●మహాకవి సుబ్రమణ్య భారతి తమిళ భాషలోకి, మహాత్మా గాంధీ గుజరాతీలోకి వందేమాతర గీతాన్ని అనువదించగా, తెలుగు, కన్నడ, మలయాళం మరియు ఉర్దూ వంటి ఇతర భాషలకు కూడా ఈ గీతం అనువదించబడింది.నాగ్‌పూర్‌లోని నీల్ సిటీ పాఠశాల తనిఖీకి వచ్చిన ఆంగ్ల ఇన్‌స్పెక్టర్‌కు సంఘ్ వ్యవస్థాపకులు డా. హెడ్గేవార్ వందేమాతరంతో స్వాగతం పలికారు. ఈ కారణాలన్నింటి వల్ల వందేమాతరం స్వాతంత్ర్య పిపాసులకు మంత్రంగా మారింది. ●స్వాతంత్ర్యంతో పాటు, వందేమాతరం కూడా స్వదేశీ మంత్రంగా మారింది. వంగ-భంగ ప్రకటన రోజున జాతీయ బ్లాక్ డే సందర్భంగా, రవీంద్రనాథ్ ఠాగూర్ రాఖీలు కట్టి స్వదేశీ సంకల్పం చేయించారు. ఆ రోజు “విదేశీ వస్తుబహిష్కరణకు మరియు స్వదేశీ వినియోగానికి´ ప్రతిజ్ఞ చేసారు. విదేశీ వస్తువులను దహనం చేసే సమయంలో “ఓం వందేమాతరం రాష్ట్రాయ స్వాహా” అనే మంత్రాన్ని ఉచ్చరించారు. ఒక్క రోజులో స్వదేశీ ప్రచారం కోసం ప్రజల నుంచి 70,000 రూపాయలు విరాళంగా వచ్చింది. స్వదేశీ సంకల్పం తీసుకునే సమయంలో, మహిళలు పెళ్లి సమయంలో మగ్గంపై నేసిన బెంగాలీ చీర మరియు చేతికి గాజుతో చేసిన గాజులు కాకుండా, శంఖంతో చేసిన స్వదేశీ గాజులనే ధరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆంగ్లేయులు తయారు చేసిన వస్తువులకు వ్యతిరేకంగా భారతదేశంలో స్వదేశీ కంపెనీలు పుట్టుకురావడం ప్రారంభించాయి, ఉదాహరణకు, తూత్తుకుడి (తమిళనాడు) లో ఉన్నటువంటి స్వదేశీ నావిగేషన్ వంటి అనేక కంపెనీలు ఆ కాలంలో జన్మించాయి.లోకమాన్య తిలక్ వందేమాతరం మరియు స్వదేశీకి మూల స్థంభంగా నిలిచారు. వీర సావర్కర్ వందేమాతరం అంటూ విదేశీ వస్తువులను కాల్చడం ద్వారా హోలీ దహనాన్ని గుర్తుచేసారు. లాలా లజపత్ రాయ్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వందేమాతరం అని నినదిస్తూ వారి లాఠీ దెబ్బలను భరించారు.దానితో వందేమాతరం గీతం ఆనందమఠం నుండి వెలువడి,దేశం మొత్తానికి స్వాతంత్ర్యకాంక్షతో పాటు స్వదేశీ మంత్రంగా మారింది. ●ఆంగ్లేయుల కుట్రలు కూడా ఒక్కొక్కటే వెలుగుచూడడం మొదలైంది.దేశభక్తులకు ప్రేరణగా నిలిచిన ఈ మంత్రంలో కొందరికి విగ్రహారాధన కనిపించడం మొదలైంది. ●1923లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో, అప్పటి అధ్యక్షుడు మహ్మద్ అలీ,ఇస్లాంలో విగ్రహారాధన మరియు సంగీతం ఆమోదయోగ్యం కాదని చెప్తూ వందేమాతరం గానాన్ని వ్యతిరేకించారు.అయితే, బద్రుద్దీన్ తయ్యబ్, మహ్మద్ రహీమతుల్లా సయాని, నవాబ్ సయ్యద్ మహ్మద్ బహదూర్, డాక్టర్ ఎం.ఎ. అన్సారీ వంటి ముస్లిం అధ్యక్షులు ఎప్పుడూ వందేమాతరాన్ని వ్యతిరేకించలేదు. ●1915 నుండి నిరంతరం వందేమాతరాన్ని ఆలపిస్తూ వచ్చిన గొప్ప దేశభక్తుడైన విష్ణు దిగంబర్ పలుస్కర్, ఇది ఏ ఒక్క వ్యక్తి యొక్క స్వంత వేదిక కాదు, కాంగ్రెస్ వేదిక అని చెప్పి, వందేమాతరాన్ని సంపూర్ణంగా ఆలపించారు. ఈ వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ నాయకత్వం కొంచెం వెనక్కి తగ్గింది; పూర్తి వందేమాతరం స్థానంలో మొదటి రెండు చరణాలు మాత్రమే ఆలపించడం ప్రారంభించారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వందేమాతర గీతంలో రెండు చరణాలు మాత్రమే పాడాలని, అంతేకాకుండా అవసరమైతే దానికి బదులుగా మరోక గీతాన్ని కూడా జాతీయగీతంగా పాడవచ్చు అని ఒక లేఖ ద్వారా తెలియజేశారు. ఆగస్టు 15, 1947న, శ్రీమతి సుచేతా కృపలాని వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ప్రసిద్ధ సంగీతకారుడు ఓంకారనాథ్ ఠాకూర్ ,సర్దార్ పటేల్ కోరిక మేరకు ఆల్ ఇండియా రేడియోలో పూర్తి వందేమాతరాన్ని ఆలపించారు.అప్పటి అధిష్టానం వివిధ రకాల హాస్యాస్పదమైన వాదనలు చేసి, వందేమాతరం స్థానంలో జనగణమనకు జాతీయ గీతం స్థానాన్ని ఇచ్చింది. దీని గురించి రాజర్షి పురుషోత్తం దాస్ టాండన్, “జాతీయగీతంగా “వందేమాతరాన్ని” తిరస్కరించిన కాంగ్రెస్‌ను నేను ఊహించను కూడా లేను”. అని పేర్కొన్నారు. ●దేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జనవరి 24, 1950న వందేమాతరం మరియు జనగణమన రెండింటికీ జాతీయగీతం గౌరవాన్ని ఇచ్చి ధన్యులయ్యారు .సమావేశం ముగింపులో అందరూ వందేమాతరం అని పలుకుతూ పరస్పరం అభినందించుకున్నారు. ●అక్టోబర్ 31, 2025న జరిగిన ఏక్తా పరేడ్‌లో, వివిధ వాయిద్యాల ద్వారా వందేమాతరం యొక్క సంగీత ప్రదర్శనలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకడం కూడా మన చూసాం.సామ్రాజ్యవాదులు మన దేశంలో నాటిన విభజన బీజాల వలలో దార్శనికత

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఈనెల 21న తిరుమలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీవారి దర్శనం

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ నెల 20, 21 తేదీల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి, తిరుమలలను సందర్శించనున్నారు. నవంబర్ 20న రాష్ట్రపతి ముందుగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని, అనంతరం తిరుమలకు చేరుకోనున్నారు. మరుసటి రోజు, నవంబర్ 21న ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మొదట శ్రీ వరాహస్వామి వారిని, ఆ తరువాత శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు సర్వ సన్నాహాలు చేస్తున్నారు. తిరుమలలోని పద్మావతి విశ్రాంతి భవనంలో గురువారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధ్యక్షత వహించారు. సీవీఎస్వో మురళీకృష్ణతో పాటు ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా భద్రత, వసతి, దర్శన ఏర్పాట్లపై ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు ఈవో సూచించారు. ప్రజా రద్దీని సమర్థంగా నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

చెలరేగిన బౌలర్లు.. టీమిండియా ఘన విజయం

ఇండియా vs ఆస్ట్రేలియా : ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటర్లు విఫలమైన వేళ బౌలర్లు చెలరేగి అద్భుత విజయాన్ని అందించారు._ శుభ్‌మన్ గిల్(39 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 46) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అభిషేక్ శర్మ(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28), శివమ్ దూబే(18 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 23), సూర్యకుమార్ యాదవ్(10 బంతుల్లో 2 సిక్స్‌లతో 20) దూకుడుగా ఆడారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా మూడేసి వికెట్లు తీయగా..గ్జేవియర్ బార్ట్‌లెట్, మార్కస్ స్టోయినిస్ చెరో వికెట్ పడగొట్టారు..అనంతరం ఆస్ట్రేలియా 18.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్(24 బంతుల్లో 4 ఫోర్లతో 30), మాథ్యూ షార్ట్(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, శివమ్ దూబే రెండేసి వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్(3/3) మూడు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు..

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

గ్రామ సచివాలయాలకు నూతన రూపం – ఇకపై “విజన్ యూనిట్స్”గా పేరు మార్చిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలో కీలకమైన మార్పు చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామ సచివాలయాల పేరును అధికారికంగా మార్చుతున్నట్టు ప్రకటించారు. ఇక నుండి గ్రామ, వార్డు సచివాలయాలను “విజన్ యూనిట్స్” గా పిలుస్తామని ఆయన వెల్లడించారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందించే కేంద్రాలుగా ఈ యూనిట్లను అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం తెలిపారు. విజన్ యూనిట్స్ ద్వారా ప్రతి గ్రామంలో పారదర్శక పాలన, సాంకేతికత ఆధారిత సేవల అందుబాటు, ప్రజల సమస్యల పరిష్కారం వేగవంతం చేయడమే తమ ఉద్దేశమని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం, పారదర్శకత — ఈ మూడు సూత్రాలను ఆధారంగా తీసుకుని ప్రతి యూనిట్ పనిచేస్తుందని వివరించారు. ప్రజల అభ్యర్థనలు, ఫిర్యాదులు, పథకాల అమలు, పౌర సేవలన్నీ ఒకే వేదికపై అందుబాటులోకి రానున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ మార్పు ద్వారా గ్రామీణ పరిపాలనలో నూతన దిశను చూపుతూ, విజన్ 2047 లక్ష్యాలను సాధించడానికి ఇది కీలక అడుగు అవుతుందని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీలో కొత్త (ప్రతిపాదిత) జిల్లాలు.. వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు

ఏపీలో కొత్త (ప్రతిపాదిత) జిల్లాలు.. వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు 1. *పలాస:* ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం 2. *శ్రీకాకుళం:* శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం 3. *మన్యం పార్వతీపురం:* పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ 4. *విజయనగరం:* విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి 5. *విశాఖపట్నం:* భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి 6. *అల్లూరి సీతారామరాజు అరకు:* అరకు, పాడేరు, మాడుగుల 7. *అనకాపల్లి:* అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని 8. *కాకినాడ:* కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, రామచంద్రాపురం 9. *తూర్పు గోదావరి రాజమహేంద్రవరం:* రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి, రాజానగరం, రంపచోడవరం 10. *బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ అమలాపురం:* అమలాపురం, ముమ్మిడివరం, గన్నవరం, రాజోలు, కొత్తపేట, మండపేట 11. *పశ్చిమ గోదావరి నరసాపురం:* తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం 12. *ఏలూరు:* ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, గోపాలపురం, చింతలపూడి, పోలవరం 13. *కృష్ణా మచిలీపట్నం:* కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు 14. *ఎన్టీఆర్ విజయవాడ:* విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, మైలవరం 15. *అమరావతి:* పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ 16. *గుంటూరు:* గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు 17. *బాపట్ల:* బాపట్ల, వేమూరు, చీరాల, రేపల్లె, పర్చూరు 18. *పల్నాడు నరసరావుపేట:* నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ 19. *మార్కాపురం:* మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి 20. *ఒంగోలు:* ఒంగోలు, అద్దంకి, సంతనూతలపాడు, కొండెపి, కందుకూరు 21. *శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు:* నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావాలి, కోవూరు, ఉదయగిరి 22. *గూడూరు:* గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట 23. *శ్రీ బాలాజీ తిరుపతి:* తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, చంద్రగిరి 24. *చిత్తూరు:* చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం 25. *మదనపల్లి:* మదనపల్లి, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి 26. *సత్యసాయి హిందూపురం:* హిందూపురం, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర 27. *అనంతపురం:* అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, రాప్తాడు, శింగనమల, తాడిపర్తి 28. *ఆదోని:* ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం 29. *కర్నూలు:* కర్నూలు, డోన్, నందికొట్కూరు, కోడుమూరు 30. *నంద్యాల:* నంద్యాల, శ్రీశైలం, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం 31. *వైఎస్సార్ కడప:* కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల 32. *అన్నమయ్య రాజంపేట:* రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, బద్వేలు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.