Friday, 3 April 2026

Blog

E-పేపర్

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తో, వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి.

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తో, వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి. అన్నమయ్య జిల్లా/ రైల్వే కోడూరు/ తాడేపల్లి – పున్నమి న్యూస్ ప్రతినిధి (సింగమాల వెంకటేష్ ): ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి లోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసిన రైల్వే కోడూరు మండల వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి. ఈ సందర్భంగా నియోజకవర్గం, రైల్వే కోడూరు మాజీ శాసనసభ్యులు వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో, ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపిన కోటి సంతకాల కార్యక్రమం, ఇతర ప్రజా సమస్యలపై పోరాడిన పలు కార్యక్రమాలపై ధ్వజారెడ్డి వివరించారని సమాచారం. స్థానిక రోడ్ల సమస్యలు, మౌలిక సదుపాయాలు, తుఫాన్ సమయంలో వైసీపీ పార్టీ తరపున స్థానికంగా పలు రైల్వే అండర్ బ్రిడ్జిలలో నిలిచిన వరద నీరును సొంత ఖర్చులతో నీటిని తొలగించేందుకు స్పందించిన తీరు పై జగన్మోహన్ రెడ్డికి వివరించగా, ప్రజలలో ఉంటూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ, పార్టీని బలోపేతం చేస్తున్న విధానంపై వైసీపీకి వస్తున్న ప్రజాస్పందన పై సంతోషం వ్యక్తపరిచినట్లు తెలియ వచ్చినది. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేందుకు తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలిపినట్టు సమాచారం.

ఖమ్మం

ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయింది

*ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయింది *ప్రభుత్వ భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నాలు* *ప్రభుత్వ భూములకు హెచ్చరిక బోర్డులు కరువు* *ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి ఆక్రమించుకోగా పత్రికల్లో కథనాలు వచ్చిన పట్టించుకోని అధికారులు* ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి నవంబర్ 08 ఏన్కూరు మండలం లో ఉన్నటువంటి 25 గ్రామపంచాయతీలకు సంబంధించి ప్రభుత్వ భూములకు హెచ్చరిక బోర్డులు అనేది ఏర్పాటు చేయకపోవడం వల్ల భూ బక్క సురులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవాలని గద్దల ఎదురుచూస్తున్నారు రెవిన్యూ అధికారులు తొందరగా స్పందించి ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాకుండా ఉంటుంది కొన్ని గ్రామపంచాయతీలకు సంబంధించి ప్రభుత్వ భూములు అక్రమణకు గురైనట్టుగా మండల ప్రజల నోట బాగా వినపడుతున్న మాట మరి అది నిజమా అబద్దమా అనేది రెవెన్యూ అధికారులు పరిశీలన చేసి నిజ నిజాలు మండల ప్రజలకు తెలియపరచవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉంది అని మండల ప్రజలు గుర్తు చేస్తున్నారు ప్రభుత్వ భూములకు సంబంధించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములను రక్షణ కల్పించాలి. మండల కేంద్రంలో ఓ వ్యక్తి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న విషయం మండల ప్రజలకు అందరికీ తెలుసు కానీ రెవెన్యూ అధికారులకు మాత్రం ఇప్పటివరకు తెలియకపోవడం చాలా బాధాకరం రెవెన్యూ అధికారులు ఎవరూ అటువైపు కన్నెత్తి చూసిన పాపానికి లేదు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి ని రెవెన్యూ అధికారులు వెంటనే పరిశీలించి అట్టి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు భూ కబ్జా చేసిన వ్యక్తిపై చట్టపరమైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేస్తేనే గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఉన్నట్టు గ్రామ ప్రజలకు అందరికీ తెలుస్తుంది ఒకవేళ అట్టి ప్రభుత్వ భూమిని ఎవరైనా కబ్జా చేయాలనుకున్న కానీ ప్రజలు ముందస్తుగా రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వగలుగుతారు. రికార్డులో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి చాలావరకు అన్యక్రాంతమైనట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి మండలం అంతట ప్రభుత్వ భూములను సర్వే చేస్తే అక్రమ వ్యవహారం వెలుగు చూసే అవకాశం ఉంది సర్వే అనంతరం భూములకు హద్దులు ఏర్పాటు చేస్తే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే అవకాశం ఉంటుందని స్థానిక ప్రజలు కోరుతున్నారు ఈ విషయంలో రెవెన్యూ అధికారులు స్పందిస్తారా లేదా అని వేచి చూడాల్సిందే

గూడూరు

దేశభక్తికి శాశ్వత చిహ్నం- వందే మాతరం – వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు

ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అందరూ కలిసి వందేమాతర గేయాన్ని ఆలపించి వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, అధ్యాపకులు డాక్టర్ కే. కోటేశ్వరరావు కిరణమై, కృపా కరుణ వాణి, డాక్టర్ బి. పీర్ కుమార్ తదితరులు మాట్లాడుతూ 2025తో వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయ్యాయి అని, మన జాతీయ గేయం ‘వందే మాతరా’న్ని 1875 నవంబరు 7న అక్షయ నవమి శుభ వేళ బంకించంద్ర ఛటర్జీ రచించారని, ఆయన నవల ఆనందమఠ్ లో భాగంగా బంగదర్శన్ అనే సాహిత్య పత్రికలో వందే మాతరం మొదటిసారి కనిపించిందని, బలానికి, శ్రేయస్సుకు, దైవత్వానికి స్వరూపంగా మాతృభూమిని కీర్తించే ఈ గేయం దేశ ఐక్యత, ఆత్మగౌరవ స్ఫూర్తికి కవితాత్మక వ్యక్తీకరణ అని, ఇది దేశభక్తికి శాశ్వత చిహ్నంగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, గోపాల్, రమేష్, శైలజ, శ్రీలత, పద్మమ్మ, వినయ్ తదితర అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల

భారతదేశ జాతీయ గీతం వందేమాతరం 150వ సంవత్సరాలు పూర్తి…

గద్వాల్ నవంబర్ 7 (పున్నమి ప్రతినిధి) 7 నవంబర్ 2025 ఇవాళటికి భారతదేశ జాతీయ గీతం వందేమాతరం 150వ సంవత్సరాలు పూర్తి చేసుకొనుంది ఈ సందర్బంగా కలెక్టర్లు తమ పరిధిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయలలో మరియు విద్యాసంస్థలు గుర్తింపు పొందిన స్కూల్స్ లో వందేమాతరం అలపించాలని అదేసించడం జరిగింది. అందులో భాగంగానే జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండలం రాజాపురం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ కార్యదర్శి పాల్గొని వందేమాతరం గానం చేసి. వందేమాతరం అనే గేయం యావత్ భారతదేశానికి ధైర్యాన్ని నింపిన మహా శక్తిగా నిలిచి నేటి వరకు విశేష గౌరవం పొందుతుంది.

తిరుపతి

శ్రీకాళహస్తిలో ఘనంగా వందేమాతరం 150వ జయంతి వేడుకలు

శ్రీకాళహస్తి నవంబర్ 07 , పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు శుక్రవారం నాడు 150వ వందేమాతరం జయంతి సందర్భంగా ప్రధానోపాధ్యాయరాలు కె సుచరిత నేతృత్వంలో బీజేపీ నేతలు జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు జీవి అమర్నాథ్, పట్టణ ఉపాధ్యక్షులు శ్రీపురం సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి విద్యార్ధినుల చేత వందేమాతరం పూర్తి గీతాన్ని పాడించి, స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయాలని ప్రతిజ్ఞ చేయించి, కరపత్రాలను వితరణ చేసారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సూచనలు మేరకు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 150వ వందేమాతరం జయంతి వేడుకలను చేపట్టామని వందేమాతరం గీతం జాతీయ ఉద్యమానికి సంబంధించి ప్రత్యేక స్థాయిలో స్పూర్తి కలిగిందని వక్తలు వెల్లడించారు. ఈ వందేమాతరం గీతాన్ని 1875 నవంబరు 7 వ తేదీన బంకీంచంద్రఛటర్జీ రచించారని, వందేమాతరం అంటే మాతృభూమికి నమస్కారం చేయడమని అర్థమని భాజపా నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కె. సుచరిత, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు జీవి అమర్నాథ్, పట్టణ ఉపాధ్యక్షులు శ్రీపురం సుధాకర్ తో పాటు ఉపాధ్యాయబృందం, విద్యార్థునులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

🔸శ్రీ అడివి పేరంటాలమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల…! 🔹దుత్తలూరు కొత్తపేట గ్రామంలో ఘనంగా అడివి పేరంటాలమ్మ విగ్రహ ప్రతిష్ట..!

(పున్నమి)దుత్తలూరు నవంబర్ 7న దుత్తలూరు మండలంలోని కొత్తపేట గ్రామంలో అత్యంత వైభవంగా శ్రీ అడివి పేరంటాలమ్మ శిఖర కలశ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర కార్యక్రమంలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరై, భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేవాలయాలు మన సంస్కృతి, ఆచార వ్యవహారాలకు ప్రతిబింబాలు గా నిలుస్తాయని, ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు గ్రామీణ ప్రజల్లో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తజనులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

బోధి పాఠశాల లో ఘనంగా వందే మాతరం 150 ఏళ్ల వేడుకలు

భారతదేశా స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరి పోసిన వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బోధి పాఠశాల లో ఘనంగా వందే మాతరం వేడుకలు నిర్వహించారు. కార్యక్రమం లో పాఠశాల సిబ్బంది పాల్గొని వందే మాతరం ఉద్యమం, గేయ ప్రస్తావన, బంకించంద్ర చటర్జీ గొప్పతనాన్ని కొనియాడారు. సాంస్కృతిక కార్యక్రమాలు ద్వారా పిల్లలకు వందే మాతరం ఉద్యమం కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇందులో భాగంగా ప్రధాన ఉపాధ్యాయులు P వెంకట్ గారు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

నిర్మల్

విత్తనం నుంచి విక్రయం వరకు రైతు బాధలకు అంతం లేదు

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం వ్యవసాయం. కానీ రైతు కష్టానికి మాత్రం మార్కెట్లో విలువ రావడం లేదు. విత్తనం కొనడం నుంచి పంట ఇంటికి వచ్చే వరకు ఆరు పాలెం శ్రమ, చెమటతో పంట పెంచే వ్యవసాయదారుడు పంట వస్తుందా రాదా అనే భయంతోనే రోజులు గడుపుతున్నాడు. ఇప్పుడిక పంటను మార్కెట్‌కు తీసుకెళ్లినా సీసీఐ ద్వారా అమ్మాలంటే కపాస్ కిసాన్ మొబైల్ యాప్ తప్పనిసరి. కానీ అందరు రైతులు చదువుకున్నవారు కారు, స్మార్ట్‌ఫోన్ లేదా ఆన్లైన్ అవగాహన కూడా లేదు. దీంతో అపాయింట్మెంట్లు, తేదీలు, తిప్పలు, తరువాత పంట అమ్మినా… డబ్బులు ఎప్పుడు వస్తాయో స్పష్టత లేదు. జై జవాన్ – జై కిసాన్ అని గొప్పగా చెప్పుకున్నా, నిజానికి జవాన్ దేశాన్ని రక్షిస్తే – కిసాన్ దేశాన్ని పోషిస్తున్నాడు. అయితే పంట పండించేవాడే అతిపెద్ద ఆర్థిక ఒత్తిడిలో జీవించాల్సి వస్తోంది. నెలల తరబడి శ్రమించి పండించిన పంటకు డబ్బులు వచ్చేదెప్పుడు? అనే ప్రశ్నకు సమాధానం కోసం రైతు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ✊ రైతు బతికితేనే దేశం బతుకుతుంది ✊ రైతుకు న్యాయం కావాలి

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రద్దుచేసిన వేడుకలు

అందరికీ నమస్కారం… 🙏🏻 మాజీ మంత్రివర్యులు, రాజోలు నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఇన్చార్జ్ శ్రీ గొల్లపల్లి సూర్యారావు గారి తనయులు గొల్లపల్లి శ్రీధర్ గారి పుట్టినరోజు వేడుక ఈ సంవత్సరం సూర్యరావు గారికి అనారోగ్యం కారణంగా నిలిపివేయడం జరిగింది. కావున ది:07-11- 2025 తేదీన అనగా రేపటి రోజున ఎవరూ కూడా రావులపాలెం రావద్దని, రాజోలు నియోజకవర్గం Ysrcp నాయకులకు, కార్యకర్తలకు, గొల్లపల్లి సూర్యారావు గారి అభిమానులకు తెలియజేయుచున్నాము… 🙏🏻 ఇట్లు రాజోలు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం – మలికిపురం

E-పేపర్

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన విద్యార్థి విభాగం అధ్యక్షుడు మౌనింద్ర కుమార్ రెడ్డి

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన విద్యార్థి విభాగం అధ్యక్షుడు మౌనీంద్ర కుమార్ రెడ్డి. అన్నమయ్య జిల్లా / రైల్వే కోడూరు తాడేపల్లి / నవంబర్ 07 (పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ ) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో . మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు మౌనెంద్ర కుమార్ రెడ్డి ఈ సమావేశంలో విద్యార్ధుల సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, మెడికల్‌ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలల నిర్వీర్యం వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించారు. అన్నమయ్య జిల్లా / రైల్వే కోడూరు తాడేపల్లి / నవంబర్ 07 (పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ )

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.