Friday, 3 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అర్హులకు రుణాలు మంజూరు చేయాలి

ఉదయగిరి పట్టణం లోని స్త్రీ శక్తి భవనంలో క్లస్టర్ పరిధిలోని బ్యాంకర్ల సమావేశం శుక్రవారం నిర్వహించారు లీడ్ బ్యాంక్ మ్యానేజర్ మణి శంకర్ మాట్లాడుతూ బ్యాంకర్ల వారికి కేటాయించిన లక్ష్యాలను నూరు శాతం పూర్తి చేయాలన్నారు నిజమైన అర్హులను గుర్తించి రుణాలు మంజూరు చేయాలని వారు కోరారు.

తిరుపతి

జిల్లా అధికారులతో కలిసి కళ్ళత్తూరులో పర్యటించిన ఎమ్మెల్యే బొజ్జల

శ్రీకాళహస్తి నవంబర్ 07 , పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నియోజిక వర్గంలోని కెవిబి పురం మండలంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్డీవో, ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి సుధీర్ రెడ్డి ఐదు గ్రామాల్లో పర్యటించారు. ప్రభుత్వం తరఫున అక్కడ ఉన్న ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేశారు. రాయలచెరువుకు గండి పడి కళ్ళతూరు హరిజనవాడ, కళ్ళత్తూరు సెంటర్ నందు పశువులు, వాహనాలు ఇల్లు వరదల్లో కొట్టుకుపోయి నష్టపడిన వారిని పరామర్శించి గ్రామ ప్రజలకు, రైతులకు ప్రభుత్వం తక్షణమే సహాయం చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కోరుతూ.. నష్టపోయిన వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని అధైర్య పడద్దని ప్రజలకు ఎమ్మెల్యే భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని టిడిపి నాయకులూ, కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

*కళ్ళత్తూరు ప్రజలను పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల*

*కెవిబి పురం మండలంలో రాయలచెరువుకు గండి పడి కళ్ళతూరు హరిజనవాడ మరియు కళ్ళత్తూరు సెంటర్ నందు వీళ్లు డ్రైవర్ పశువులు వాహనాలు ఇల్లు వరదల్లో కొట్టుకుపోగా వారిని పరామర్శించి గ్రామ ప్రజలకు మరియు రైతులకు ప్రభుత్వం క్షణమే సహాయం చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ గారిని కోరిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు* *ఈ రోజు శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్, ఆర్డీవో, ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి సుధీర్ రెడ్డి గారు ఐదు గ్రామాల్లో పర్యటించారు. ప్రభుత్వం తరఫున అక్కడ ఉన్న ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని అధైర్య పడద్దని భరోసా కల్పించారు*

తెలంగాణ

వందేమాతర జాతీయగీతం సామూహికాలాపన :150

నకిరేకల్ :నవంబర్ (పున్నమి ప్రతినిధి ) పౌరులలో దేశభక్తి భావనను పెంపొందించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు వందేమాతర జాతీయగీతం సామూహి కాలాపన కార్యక్రమాన్ని చేపట్టినట్టు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ తెలిపారు. శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కలెక్టర్ కార్యాలయ సిబ్బందితో పాటు, వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో, వందేమాతరం జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపించారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, నల్గొండ ఆర్డీవో వై అశోక్ రెడ్డి, కలెక్టర్ కార్యాలయం ఎ ఓ మోతిలాల్, జిల్లా అధికార సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు అన్నమాచార్య విద్యార్థి

పాఠశాల క్రీడా పోటీలలో భాగంగా నిర్వహించిన కబడ్డీ జట్టు ఎంపికలో, మండలంలోని శ్రీ అన్నమాచార్య అకాడమీ విద్యార్థి చాపల్లి దుర్గా అశోక్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ సమ్మెట శివప్రసాద్ తెలిపారు.గురువారం కోడూరులో జరిగిన జిల్లా జట్టు ఎంపిక పోటీల్లో ఉమ్మడి కడప జిల్లా నుంచి 100 మంది విద్యార్థులు పాల్గొనగా, అండర్–14 విభాగంలో ప్రతిభ కనబరిచి దుర్గా అశోక్ రాష్ట్ర జట్టుకు ఎంపిక కావడం విశేషమని ఆయన పేర్కొన్నారు.శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో కరస్పాండెంట్, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థి సాధించిన ఈ విజయం పాఠశాలకు గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలాంజనేయులు, డైరెక్టర్లు మాడపూరి హేమలత, సమ్మెట ఉమామహేష్, వ్యాయామ ఉపాధ్యాయులు వెంకట మధు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

E-పేపర్

నిరుపేదరాలు షకీలమ్మకు అపన్న హస్తం అందించిన భోళా శంకర్ సేవా సమితి*

*నిరుపేదరాలు షకీలమ్మకు అపన్న హస్తం అందించిన భోళా శంకర్ సేవా సమితి రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని పగడాల పల్లి లో నివసిస్తున్న నిరుపేద వృద్ధురాలు షకీలమ్మకు శుక్రవారం భోళా శంకర్ సేవా సమితి అధ్యక్షులు మందల నాగేంద్ర ఆధ్వర్యంలో కీర్తిశేషులు దాసరి సోమయ్య వర్ధంతి పురస్కరించుకొని వారి కుమారులు సునీల్ కుమార్, మణికంఠ మరియు అల్లుడు మాదా నవీన్ కుమార్ దాతృత్వంతో నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. మొదటగా పగడాలపల్లిలోని రామాలయంలో పూజలు నిర్వహించి అనంతరం నిరుపేదరాలైన షకీలమ్మకు బియ్యం మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. తన కష్టాలను గుర్తించి చేయూతనందించిన భోళా శంకర్ సేవాసమితి వారికి మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేసి దాతృత్వం చాటుకున్న దాసరి సునీల్ కుమార్ , మణికంఠ లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మందల నాగేంద్ర మాట్లాడుతూ మన సేవా సమితి ప్రారంభించిన నాటి నుండి ఈరోజు వరకు నిత్యం శివ పరమాత్మ ని దయవల్ల నిరుపేద కుటుంబీకులకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే శుక్రవారం షకీలమ్మకు మన భోళా శంకర్ సేవా సమితి ఆధ్వర్యంలో కీర్తిశేషులు దాసరి సోమయ్య వర్ధంతి పురస్కరించుకొని ఆయన కుమారులు సునీల్, మణికంఠ అల్లుడు మాద నవీన్ కుమార్ ఆ నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ పరమాత్ముని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని ఆయన అన్నారు. త్వరలోనే మన సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వామి భక్తులకు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భోళా శంకర్ సేవా సమితి సభ్యులు చెన్నం శెట్టి రమేష్, రాజేశ్వరమ్మ, వాసా బాబు, బూమ్పల్లి నాగరాజు, మల్లెం మణి, చింతకాయల నరసింహులు, మహంకాళి సుబ్రహ్మణ్యం, పెనుగొండ సుబ్బరాయుడు, కొర్లకుంట శంకరయ్య, నార్జాల కుమార్ పాల్గొన్నారు.

తిరుపతి

నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభంచిన బొజ్జల బృందమ్మ

తొట్టంబేడు నవంబర్ 07 , పున్నమి న్యూస్ : మండలంలోని రౌతు సూరమాల గ్రామం నందు శ్రీకాళహస్తి నియోజిక వర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పర్యటించినప్పుడు గ్రామప్రజలు త్రాగునీటి సమస్యని ఆయనకు విజ్ఞప్తి చేయగా సుమారు 5 లక్షల రూపాయలతొ ఏర్పాటు చేసిన RO ప్లాంట్ ను శుక్రవారం నాడు నూతనంగా ఏర్పాటు చేసిన RO ప్లాంట్ ను ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ… ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించడమే ఎమ్మెల్యే ఆశయంమన్నారు. గతంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పేద ప్రజలకు మంచినీటిని సరఫరా చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారని అదే విధంగా ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుంటారని ప్రతి ఇంటికి మంచి నీటిని అందించే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు రావిళ్ల మునిరజా నాయుడు, కొన్నలి రమేష్, రామానాయుడు, ప్రతాప్ రెడ్డి, రత్నయ్య, సర్పంచ్ రాజా రెడ్డి, వేణు, తిరుపాల్,శ్రీను, సుమతి, కుమారి, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

“క్యాన్సర్” ను జయించవచ్చు

ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ ను జయించవచ్చని, తగు జాగ్రత్తలు పాటిస్తే జయించటం కష్టమేమి కాదని, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డా.పైడి.సింధూర అన్నారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా, స్థానిక కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని, కళాశాల డైరెక్టర్ బరాటం.శ్రీనివాస చక్రవర్తి, ప్రిన్సిపాల్ కె.శివ శంకర్ సహకారంతో నిర్వహించారు. ఇందులో భాగముగా ఆమె మాట్లాడుతూ శరీరంలో ఏ బాగంలోనైనా ఎదుగుతున్న గడ్డలు, కణుతులు, అసహజమైన రక్థస్రావం, పెరుగుతున్న పుట్టుమచ్చలు, మింగటం కష్టంగా ఉండటం, గొంతు బొంగురుపోయి తగ్గకపోవడం వంటి లక్షణాలు ఉంటె, అశ్రద్ధ చెయ్యకుండా వైద్యులను సంప్రదించాలన్నారు. తాజా కూరగాయలు, ఆకు కూరకు ఎక్కువగా తీసుకోవాలని, వీటిలో క్యాన్సర్ కారకాలతో పోరాడే యాంటిజెన్స్ ఉంటాయన్నారు. సర్వైకల్ క్యాన్సర్ వేక్సిన్ అందుబాటులో ఉందని, తొమ్మిది నుంచి పదహారు సంవత్సరాలు దాటిన వారు డోసులు వేసుకోవాలన్నారు. విశిష్ట అతిధులుగా పాల్గొన్న రవితేజ డెవలెపర్స్ అధినేత పి.సింహాచలం, జీఎన్ జ్యుయలర్స్ ఎండి కిరణ్ కుమార్, సంధ్య దంపతులు క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ క్యాన్సర్ పై అవగాహన కల్పించిన లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ బృందానికి ధన్యవాదాలని, మీ పరిసర ప్రాంతాలలో గాని, మీ కుటుంబ సభ్యులలో గాని అనుమానాలుంటే సత్వరమే వైద్యులని సంప్రదించాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి టెక్కం.రామ్ గోపాల్, మెంటార్ నటుకుల.మోహన్, ఉపాధ్యక్షులు ఉర్లం.శివతేజ, ఛైర్పర్సన్ పొడుగు.చరణ్, సభ్యులు రామం, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

సిల్ సదస్సులో భమిడిపాటికి సన్మానం(శ్రీకాకుళం – నవంబర్ పున్నమి ప్రతినిధి)

మానవ వనరుల శాఖ, తెలుగు భాషా ప్రాధికార సంస్థ, నెల్లూరు విక్రమ సింహపురి విశ్వావిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన రెండురోజుల జాతీయ సదస్సులో గాయత్రి కాలేజీ అఫ్ సైన్స్ అండ్ మేనేజ్ మెంట్ కళాశాల తెలుగు విభాగదిపతి భమిడిపాటి గౌరిశంకర్ గౌరవ అతిధిగా పాల్గొని ‘దక్షిణాoధ్రయుగ సాహిత్యం.. తెలుగు పరివ్యాప్తి’ అనే అంశంపై, విక్రమ సింహపురి విశ్వావిద్యాలయ ఆడిటోరియంలో ప్రసంగించారు. ఈ సందర్బంగా భాషా ప్రాధికార సంస్థ సంచాలకులు ఆచార్య మాడ భూషి సంపత్ కుమార్, యోగి వేమన విశ్వావిద్యాలయం ఎన్. ఈశ్వరరెడ్డిలు, గౌరిశంకర్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా గురువారం ఆయనను గురజాడ విద్యాసంస్థల అధినేత జి.వి.స్వామినాయుడు, కళాశాల ప్రిన్సిపాల్ కె.వి.వి. సత్యన్నారాయణ, డా. కె. మార్తాండ కృష్ణ తదితరులు అభినందించారు.

E-పేపర్

తెలంగాణ ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు, బిల్డర్లు అల్టిమేటం జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని, లేదంటే డిసెంబర్ 1 నుండి అన్ని పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు

తెలంగాణ ప్రభుత్వం గత రెండేళ్లుగా కాంట్రాక్టర్లకు రూ.18 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఐఏ) తెలిపింది. కాంట్రాక్టర్లు, బిల్డర్లు తమ ఆస్తులను తాకట్టు పెట్టి, అధిక వడ్డీకి రుణాలు తెచ్చి నిర్మాణ పనులు చేస్తున్నారని, వారిని ఈ ప్రభుత్వం రోడ్డున పడేస్తుందని అసహనం వ్యక్తం చేశారు బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే, డిసెంబర్ 1వ తేదీ నుండి అన్ని ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న నిర్మాణ పనులను ఆపేస్తామని హెచ్చరించింది బీఐఏ. తెలంగాణ ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు, బిల్డర్లు అల్టిమేటం జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని, లేదంటే డిసెంబర్ 1 నుండి అన్ని పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.