Friday, 3 April 2026

Blog

విశాఖపట్నం

90 వార్డ్ అభివృద్ధి బాటలో మరో మైలు రాయి*

*90 వార్డ్ అభివృద్ధి బాటలో మరో మైలు రాయి*. విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- *90వ వార్డ్ లో ….* *లక్ష్మీ నగర్ ఫ్ బ్లాక్ కొండవాలు ప్రాంత వాసులు ఎన్నో యేళ్ళు గా రిటైనింగ్ వాల్స్, సరైన రోడ్డు కాలువలు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో సమస్య ను 90వ వార్డ్ కార్పొరేటర్ బొమ్మిడి రమణ గారి దృష్టికి తీసుకురాగా బొమ్మిడి రమణ గారు స్పందించి, పశ్చిమ నియోకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గణబాబు సూచన మేరకు 17.10 లక్షల జీవీఎంసీ వార్డ్ అభివృద్ధి నిధులు మంజూరు చేయించి రిటైనింగ్ వాల్స్,కాలువలు, సిమెంట్ రోడ్లు కు బొమ్మిడి రమణ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో , వార్డ్ అధ్యక్షులు శరగడం అరుణ్ ,జీవీఎంసీ పబ్లిక్ వర్క్స్ ఇన్స్పెక్టర్ రామ కృష్ణ,పార్లమెంట్ ఉపాధక్షులు నరవ పైడిరాజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, బూత్ ఇంచార్జి పిల్లల మాణిక్యం మహిళా మండలి ప్రెసిడెంట్ కరిమిజ్జి జ్యోతి గారు,మహిళా మండలి సెక్రటరీ వెంకట లక్ష్మి ,తెలుగు యువత ఆర్గానే్జింగ్ సెక్రటరీ పోతల సతీష్ గారు,ధనలక్ష్మి, పలక సత్యవేణి కళ్యాణి మడ్డి శ్రీనుగారు,స్థానికులు,పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తి మొత్తం సంప్రోక్షణ చేసిన కూటమి ప్రభుత్వ పాపాలు పోవు- వైకాపా యువజన విభాగం

శ్రీకాళహస్తి నవంబర్ 07 , పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తిలో అర్ధనారీశ్వర టెంపుల్ వద్ద మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు మాజీ కౌన్సిలర్స్ దర్శనానికి వెళ్ళగా అక్కడ దేవాలయం వద్ద బురదమయమైపోడాన్ని చూసి చెల్లించి మధుసూదన్ రెడ్డి ఈవోని ఉద్దేశించి సమస్యను వెంటనే పరిష్కరించాలి అక్కడ భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా దర్శన భాగ్యం కల్పించాలని మీడియా ద్వారా తెలియజేస్తే అందుకు కూటమి నాయకులు వెంటనే స్పందించి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గురించి వ్యంగంగా మాట్లాడడం పై వైకాపా యువజన విభాగం శుక్రవారం నాడు స్థానిక వైసిపి కార్యాలయంలో ప్రకటన ద్వారా కూటమి నాయకులకు వివరణ ఇంచ్చారు. ప్రకటనలో యువజన నాయకులు మాట్లాడుతూ.. తమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆలయంలో అడుగు పెడితే అపవిత్రం అయ్యిపోయిన్దనదం వారి అజ్ఞానానికి పరాకాష్ట, శ్రీకాళహస్తి మొత్తం సంప్రోక్షణ చేసిన కూటమి ప్రభుత్వ పాపాలు పోవని వైకాపా యువజన విభాగ నాయకులన్నారు. ఒక అధికారికి వ్యవహారాన్ని తెలియజేసినప్పుడు ఆ సమస్యను 24 గంటల్లో స్పందించకపోతే ధర్నా చేస్తానని చెప్పి మా నాయకుడు తెలియజేస్తే 12 గంటల్లోనే అధికారి స్పందించి అక్కడ డోజర్ తో శుభ్రపరచి మట్టిని ఫిల్ చేసి రోల్ చేయడం జరిగింది ఇప్పుడు భక్తులకి సౌకర్యవంతంగా ఉంది అధికారి డ్యూటీ అధికారి చేస్తే మధ్యలో కూటమి నాయకులు పదవులు వస్తాయని పనులు వస్తాయని లేదా దళారీల్లో వాటా వస్తుందని ఎంతెంత దంచిన అంతే కూలి అనేది శ్రీకాళహస్తిలో మీ నాయకుడు పరిస్థితి మీకు పంచేదానికి ఏమీ లేదు అనేది మీకు తెలుసు మాకు తెలుసు మీరు ఎంత ఎగిరి పడిన అంతే కూలి ఎగరకుండా దంచిన అంతేకూలి ఈ విషయాన్ని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తించాలి ట్రస్ట్ బోర్డు నియామకంలోనే మీ అందరి అడ్రస్ గల్లంతయిందని శ్రీకాళహస్తి ప్రజలందరికీ ఆ విషయం అర్థమైంది మా నాయకుడి గురించి భాష గురించి అవాక్కులు చవాకులు పేలుతూ.. అయన హావభవాల గురించి ప్రస్తావించే నైతిక హక్కు మీకు ఎవరికి లేదు సాంప్రదాయ దుస్తులు ధరించాలన్నది ఆ విధానం తీసుకొచ్చినది మా మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మీకు చేతనైతే అభివృద్ధి చేసి చూపండి అంతేగాని ఎవరు మెప్పు కోసమో ఎవరి స్వలాభం కోసమో భజనలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం చూస్తూ ఊరుకోదు ఇది మా హెచ్చరిక బిజెపి నాయకులు జనసేన నాయకులు టిడిపి నాయకులు ఇప్పటికే మూడు కుర్చీలు మూడు ముక్కలాటలని శ్రీకాళహస్తి ప్రజలందరూ చూస్తున్నారు. ఇక ఈ ఈఓకి స్పందించి సమస్యను పరిష్కరించినందుకు మీడియా ద్వారా ధన్యవాదాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ రాష్ట్ర కార్యదర్శి కంఠా ఉదయ్ కుమార్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సురా సురేష్, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముని కృష్ణారెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గం మీడియా కోఆర్డినేటర్ జయ కృష్ణారెడ్డి, ట్రస్ట్ బోర్డ్ మాజీ మెంబర్ మున్న రాయల్, జూమ్లేష భాయ్, పజిల్, గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

* జూబ్లీహిల్స్ లొ నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా సిహెచ్ యాదయ్య ఇంటింటి ప్రచారం *

పున్నమి రంగారెడ్డి జిల్లా నవంబర్ 07 : జూబ్లీహిల్స్ నియోజకవర్గo ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గo ఎల్లారెడ్డి గూడ డివిజన్ లో 282 బూత్ అధ్యక్షుడు కార్తీక్ కుమార్ యాదవ్ తొ కలసి మహేశ్వరం నియోజకవర్గం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొనారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం నాయకులు, మహేశ్వరం మండలం బిసి సెల్ అధ్యక్షులు బొల్లు కుమార్ ఐ ఎన్ టి యు సి మహేశ్వరం అధ్యక్షులు నడికుడ శివ మహేశ్వరం మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు ఎర్ర నవీన్ కుమార్ ,మాణిక్యమగూడ మాజీ ఎంపీటీసీ వడ్డేముని దాసు, మహేశ్వరం మండలం యూత్ కాంగ్రెస్ నాయకులు సిహెచ్ బాలకృష్ణ, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

రంగారెడ్డి

కె ఎల్ ఆర్ ఆదేశాలతో వెంటనే బోర్వవెల్ మరమ్మత్తు — గ్రామ ప్రజలకు తోడుగా బాల్ నింగని జంగయ్య

పున్నమి రంగారెడ్డి జిల్లా నవంబర్ 07 :మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోగల బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ బాలాపూర్ లో గల బోర్ వెల్ గత రెండు నెలల నుంచి పనిచేయకపోవడంతో గ్రామ ప్రజలు నీటి కొరతతో ఇబ్బంది పడుతుండడం వల్ల ఈ యొక్క సమస్యను టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు 15వ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ బాల్ నింగని జంగయ్య మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచెన్నగారి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మరియు డి ఈ లతో మాట్లాడి ఆదేశించడంతో వెంటనే సిబ్బంది వచ్చి బోర్వెల్ ను మరమ్మత్తు చేయడం జరిగింది ఈ సందర్భంగా బస్తిలోని ప్రజలు కిచెన్నగారి లక్ష్మారెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంటెస్టెడ్ కార్పొరేటర్ బాల్ నింగని జంగయ్య, మహేశ్వరం నియోజకవర్గం ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ క్యారాగారి శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీరుడి శ్రీరాములు, కప్పాటి ఆంజనేయులు, పగడాల ఉమేష్ మరియు బస్తీ వాసులు పాల్గొన్నారు

తెలంగాణ

రేపటి నుండి కాలేజీ లు పునః ప్రారంభం

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి ప్రతి నిది తెలంగాణ) ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణతో రాష్ట్రంలోని అన్ని కాలేజీలు రేపటి నుండి తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో నేడు ప్రవేటు కాలేజిల యాజమాన్యం నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. చర్చల ఫలితంగా ప్రభుత్వం తక్షణమే రూ.600 కోట్లు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కింద విడుదల చేయగా, మరో రూ.300 కోట్లు త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అదనంగా, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ప్రక్రియ పర్యవేక్షణకు ప్రభుత్వ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం ప్రతినిధులు కూడా ఉంటారని అధికారులు తెలిపారు. దీంతో విద్యార్థుల తరగతులు సజావుగా సాగేందుకు మార్గం సుగమమైంది.

రంగారెడ్డి

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం.. చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి

పున్నమి రంగారెడ్డి జిల్లా నవంబర్ 07 :జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్‌లో జూబ్లిహిల్స్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ చేయి గుర్తుపై ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి రెహమత్ నగర్ ప్రజలు అత్యంత భారీ మెజారిటీ తో నవీన్ యాదవ్ ను మేము గెలిపించుకుంటాము ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏఐసీసీ విచార్ విభాగ్ కో ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చిగిరింత దయాసాగర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, జెల్ల రమేశ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ బావోజు సిద్దేశ్వర చారి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూతడి సుధాకర్ ,కె. సురేష్, శ్యామ్,నయనా చారి, గిరి ముదిరాజ్, మసూద్, రాకేశ్, కృష్ణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం.. చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి

పున్నమి రంగారెడ్డి జిల్లా నవంబర్ 07 :జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్‌లో జూబ్లిహిల్స్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ చేయి గుర్తుపై ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి రెహమత్ నగర్ ప్రజలు అత్యంత భారీ మెజారిటీ తో నవీన్ యాదవ్ ను మేము గెలిపించుకుంటాము ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏఐసీసీ విచార్ విభాగ్ కో ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చిగిరింత దయాసాగర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, జెల్ల రమేశ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ బావోజు సిద్దేశ్వర చారి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూతడి సుధాకర్ ,కె. సురేష్, శ్యామ్,నయనా చారి, గిరి ముదిరాజ్, మసూద్, రాకేశ్, కృష్ణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

*కార్మికుల హక్కులకై సిఐటియు రాజీలేని పోరాటం…* —సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రుద్రకుమార్**

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 07 : బాలాపూర్ మండలం సిఐటియు జనరల్ బాడీ సమావేశం స్థానిక మంత్రాల చెరువు దగ్గర గల రైతు బజార్ లో సిఐటియు నాయకులు దాసరి బాబు అధ్యక్షతన నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రుద్ర కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటం సిఐటియు కార్మిక సంఘం నిర్వహిస్తుందని తెలిపారు… సంఘటిత రంగం అసంఘటిత రంగం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రంగాలవారీగా సంఘాలను నిర్మించి కార్మికుల సమస్యలపై పాలకవర్గాలకు బలమైన ఉద్యమాల ద్వారా సిఐటియు గళాన్ని వినిపించి కార్మిక సమస్యలు పరిష్కారం కోసం ఎనలేని కృషి చేస్తుందన్నారు… రంగారెడ్డి జిల్లా సిఐటియు మహాసభలు కాటేదాన్ సిఐటియు కార్యాలయంలో ఈనెల10,11 తేదీన నిర్వహిస్తున్నామని పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ సిఐటియు నూతన కమిటీని మరియు బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ సిఐటియు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ సిఐటియు కమిటీ కన్వీనర్ గా దాసరి బాబు సభ్యులుగా యాదగిరి చారి కిషన్ వెంకయ్య విజయ్ రమేష్ మాధవరెడ్డి సత్యం మోహన్ వేణు సి హెచ్ యాదయ్య జగన్ భారతమ్మ గిరి ప్రభాకర్ అంజూర ధనుంజయభాగ్యలక్ష్మి ఇద్దరూ కో ఆప్షన్ సభ్యులతో కూడిన 20 మందితో మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ సిఐటియు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ సిఐటియు కమిటీ కన్వీనర్ గా శేఖర్ యాదవ్ కమిటీ సభ్యులుగా చిన్నబాబు శ్యామ్ కౌసల్య అనురాధ నరసింహ బాలరాజ్ ధనలక్ష్మి శ్రీను నిర్మల యాదగిరి ఇద్దరు కోఆప్షన్ సభ్యులతో కూడిన 13 మందితో బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ సిఐటియు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఖమ్మం

నకిలీ ఐఏఎస్‌ హల్‌చల్‌

నకిలీ ఐఏఎస్‌ హల్‌చల్‌ కామారెడ్డి కలెక్టరేట్లో ఒక మహిళ చీటింగ్ ఉద్యోగం వచ్చిందని నమ్మించేందుకు యత్నం గ్రూప్స్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న ఇస్రత్‌ కామారెడ్డి: తాను ఐఏఎస్‌నని, ఇంచార్జి కలెక్టర్‌ హోదాలో వచ్చానంటూ నకిలీ ఉత్తర్వులతో ఒక మహిళ కామారెడ్డి కలెక్టరేట్‌లో హంగామా సృష్టించింది. అసలు కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ సెలవులో ఉండగా నిజామాబాద్‌ కలెక్టర్‌కు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌ జీడిమెట్లకు చెందిన ఇస్రత్‌ జహాన్‌ అనే మహిళ కారులో వచ్చి కలెక్టర్‌ ఛాంబర్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇంచార్జి కలెక్టర్‌గా తనను నియమించారని నకిలీ ఉత్తర్వులు చూపగా అనుమానం వచ్చిన అదనపు కలెక్టర్‌ ఉత్తర్వులను ప్రభుత్వానికి పంపామని, పైనుంచి ఆదేశాలు వచ్చాక తమ నిర్ణయం చెబుతామని ఆమెకు తెలిపారు. కాసేపు ఛాంబర్‌లో కూర్చొని వెళ్లిపోవడంతో కలెక్టరేట్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ కెమెరాల ఆధారంగా తూప్రాన్‌ వద్ద మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా 2020 నుంచి గ్రూప్స్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న ఆమె ఉద్యోగం వచ్చిందని కుటుంబ సభ్యులను నమ్మించేందుకే ఈ విఫలయత్నం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో పోలీసులు ఆమెపై చీటింగ్‌ కేసు నమోదు చేసి వదిలేశారు.

ఖమ్మం

_నా ముగ్గురు కూతుళ్లు పంపిన జీతమా ఇది.. పరిహారం అందుకున్న తండ్రి ఆవేదన_*

*_నా ముగ్గురు కూతుళ్లు పంపిన జీతమా ఇది.. పరిహారం అందుకున్న తండ్రి ఆవేదన_* చేవెళ్ల బస్సు ప్రమాదంలో ముగ్గురు ఆడబిడ్డలను కోల్పోయిన కుటుంబం ఆవేదన వర్ణనాతీతం. ఒకేసారి ముగ్గురు చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు ఇప్పటికీ కోలుకోలేక పోతున్నారు._ కను మూసినా తెరిచినా వారి జ్ఞాపకాలతో కన్నీరు మున్నీరవుతున్నారు. ఏడ్చి ఏడ్చి కళ్లలో నీళ్లు ఇంకిపోయినా.. గుండెల్లో నుంచి వచ్చే వేదనతో ఆ ఇల్లు ఇప్పటికీ కన్నీటి సంద్రంలోనే మునిగిపోయింది. గురువారం (నవంబర్ 06) పరిహారం అందుకుంటూ ఆ తండ్రి రోధించిన తీరు అక్కడున్న గ్రామస్తులను, అధికారులను భావోద్వేగానికి గురిచేసింది._ చనిపోయిన ముగ్గురు అమ్మాయిల్లో.. ఒకమ్మాయి ఉద్యోగం చేస్తూ నెలనెలా ఇంటికి జీతం పంపిస్తూ ఉండేది. మిగతా ఇద్దరు చదువుతున్నారు. ప్రతినెలా తన కూతురు జీతం పంపే సమయానికే.. ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందడంతో ఆ తండ్రి ఎల్లయ్య గౌడ్ ఆవేదనను మాటల్లో చెప్పలేం. అధికారులు ఇచ్చిన చెక్కును తీసుకుంటూ.. నా ముగ్గురు కూతుళ్లు పంపిన జీతమా ఇది.. అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు._ బస్సు ప్రమాదంలో చనిపోయిన ముగ్గురికి.. ఒక్కొక్కరికి రూ.7 లక్షల చొప్పున మొత్తం 21 లక్షల రూపాయలను బాధిత కుటుంబానికి ప్రభుత్వం అందించింది. గురువారం (నవంబర్ 06) ఉదయం ఎల్లయ్య గౌడ్ ఇంటికి వెళ్లిన అధికారులు.. పరిహారాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా నా కూతురు ఉద్యోగం చేస్తూ నెలకు రూ.60 వేలు సంపాదించేది. ఇప్పుడు ముగ్గురు కలిసి నాకు పంపించిన జీతమా ఇది అంటూ తీవ్రంగా గుండెలు కరిగేలా రోదించాడు తండ్రి. ఎల్లయ్య గౌడ్ హృదయ విదారక పరిస్థితి చూసి అధికారులు, గ్రామస్తులు కలత చెందారు. ఈ దయనీయ పరిస్థితి ఏ ఒక్కరికీ రాకూడదని నిట్టూర్చారు._ తాండూరు నియోజకవర్గం యాలాల మండలం పెర్కంపల్లికి చెందిన ఎల్లయ్య గౌడ్ చాలా ఏండ్ల కింద తాండూరు టౌన్‌కు వలస వచ్చారు. ఆయనకు నలుగురు కూతుళ్లు. ఒక కొడుకు ఉన్నారు. ఎల్లయ్య గౌడ్ ట్రావెల్ ఏజెన్సీ నడిపిస్తున్నాడు. ఇటీవల పెద్ద కూతురు అనూష పెండ్లిని ఘనంగా చేశాడు. రెండో కూతురు తనూష ఎంబీఏ చదువుతూ ఉద్యోగం చేస్తున్నది. మూడో కూతురు సాయిప్రియ హైదరాబాద్‌లోని కోఠి విమెన్స్కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్, నాలుగో కూతురు నందిని అదే కాలేజీలో డిగ్రీ ఫస్టియర్, కొడుకు తాండూరు టౌన్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. అక్టోబర్ 15న జరిగిన అక్క అనూష పెండ్లికి తనూష, సాయిప్రియ, నందిని వచ్చారు. సోమవారం పరీక్షలు ఉండడంతో ముగ్గురూ తాండూరు బస్టాండ్‌ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సెక్కారు._ అంతలోనే మృత్యువు కబళించి ఆ ముగ్గురినీ తీసుకెళ్లింది. చేవెళ్ల దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన 19 మందిలో ఒకే కుటుంబానికి చెందిన ఈ ముగ్గురు యవతులు చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా ఆవేదనకు గురిచేసిన విషయం తెలిసిందే._ _సోమవారం (నవంబర్ 03) ఉదయం చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ దగ్గర రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ తో పాటు బస్సు డ్రైవర్, డ్రైవర్ వెనక కూర్చున్న వాళ్లలో చాలా మంది చనిపోయారు. మొత్తం 19 మంది చనిపోయినట్లుగా పోలీసులు నిర్ధారించారు.__నిర్మాణ పనుల కోసం పటాన్ చెరు నుంచి వికారాబాద్ కు కంకర లోడ్ తో టిప్పర్ వెళ్తున్న క్రమంలో రాంగ్ రూట్ లో వెళ్లి బస్సును ఢీ కొట్టింది టిప్పర్. తాండూర్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఈ బస్సులో ప్రమాద సమయంలో 72 మంది ప్రయాణికులు ఉన్నారు._

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.