Friday, 3 April 2026

Blog

విశాఖపట్నం

వందేమాతరం గీతానికి 150 ఏళ్లు –

వందేమాతరం గీతానికి 150 ఏళ్లు – విశాఖ వుడా హెల్త్ ఎరినా లో ఘన సామూహిక ఆలాపన 🇮🇳 *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* విశాఖపట్నం వుడా హెల్త్ ఎరినా ప్రాంగణంలో, వందేమాతరం గీతం రచించి నేటికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఘనంగా సామూహిక ఆలాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రజా గాయకుడు, సామాజిక కార్యకర్త మజ్జి దేవిశ్రీ సమక్షంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, సాంస్కృతిక ప్రతినిధులు దేశభక్తి ఉత్సాహంతో పాల్గొన్నారు. “వందేమాతరం… వందేమాతరం…” నినాదాలతో వేదిక నిండిపోయింది. ఈ సందర్భంగా మజ్జి దేవిశ్రీ మాట్లాడుతూ — ఆ గీతం స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణ, నేటి తరానికి గౌరవభావానికి నాంది,” అని అన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి KSR బ్యాడ్మింటన్ అకాడమీ సభ్యులు విశేష కృషి చేశారు. అందులో కలిదిండి సుందర రామరాజు, జి.ఎస్.ఎన్. రాజు, మురళి ప్రభాకర్, మజ్జి దేవిశ్రీ, కనక రాజు, కృష్ణం రాజు, విప్పర్ల స్వరూప్ కుమార్, వెంకటేశ్వరరావు (శోభన్ బాబు), బద్రినాధ్, బాబు రాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

పేద కుటుంబానికి వాసుపల్లి రూ. 5000 ఆర్థిక సాయం* …

*పేద కుటుంబానికి వాసుపల్లి రూ. 5000 ఆర్థిక సాయం* … * *ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం నింపిన మాజీ ఎమ్మెల్యే దాతృత్వం* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* దక్షిణ నియోజకవర్గ ఆపద్బాంధవుడు పేదల పెన్నిధి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మరో పేద కుటుంబానికి రూ. 5000లు ఆర్థిక సాయం అందించి దాతృత్వం చాటుకున్నారు. *31 వ వార్డు గొల్లలపాలెం తెలగ కులానికి చెందిన ఆకేటి పవన్ కుమార్ అనారోగ్య పరిస్థితిని ఆ వార్డు అధ్యక్షుడు బాపు ఆనంద్ ద్వారా తెలుసుకొని ఇంటికి వెళ్లి వాసుపల్లి గణేష్ కుమార్ పరామర్శించారు. మెడిసిన్ ఖర్చులకు తన సొంత నిధులతో ఆర్థిక సాయం అందజేసి ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. ధైర్యంగా ఉండాలని ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఏ అవసరం ఉన్న తాను అందుబాటులో ఉంటానని వాసుపల్లి గణేష్ కుమార్ తెలియజేశారు* . దక్షిణ నియోజకవర్గం లో పేదల కష్టంలో తాను ఎప్పుడూ ముందు ఉంటానని, తన శక్తి మేరకు నిరంతరం ఆర్థిక సహాయం కొనసాగిస్తానని వెల్లడించారు. తాను పుట్టి, పెరిగిన దక్షణ నియోజకవర్గం తనకు ఎంతో ఇచ్చిందని, ఇంతటి వాడిని చేసినా తన దక్షిణ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండడం తన బాధ్యతని వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 31వ వార్డ్ కార్పొరేటర్ బీపీన్ జైన్, జిల్లా పబ్లిసిటీ వింగ్ సెక్రటరీ కండెరుగుల అప్పలనాయుడు, జిల్లా స్టూడెంట్ విభాగం సెక్రటరీ మెహన్, మాజీ వార్డ్ ప్రెసిడెంట్ పెంటకోట నాగరాజు, పల్ల త్రినాధ్, శేఖర్, తణుకులు, గోవింద్, కొండా రామ,33వ వార్డ్ మాజీ కార్పొరేటర్ పత్చిరిపిళ్లి రాము, జిల్లా సెక్రటరీ ఆదివిష్ణు,జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ సనపల రవీంద్ర భరత్, 35వ వార్డ్ ప్రెసిడెంట్ అలుపన కనకరెడ్డి, గంగాధర్,37వ వార్డ్ ఇంచార్జి గంగళ్ల రామరాజు,సౌత్ sc సెల్ ప్రెసిడెంట్ ఆకుల శ్యామ్,చింతకాయల వాసు,సంతోష్, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

వందేమాతర స్ఫూర్తి భవిష్యత్ తరాలకు అందించాల్సిన భాద్యత నేటి తరంఫై ఉంది:

*వందేమాతర స్ఫూర్తి భవిష్యత్ తరాలకు అందించాల్సిన భాద్యత నేటి తరంఫై ఉంది: ఈస్ట్ కోస్ట్ రైల్వే కాన్స్టక్షన్స్ చీఫ్ అడ్మినిస్ట్రెటివ్ ఆఫీసర్ అంకుష్ గుప్తా* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్​ 7న ఉదయం 9:50 గంటలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్బంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే కన్స్ట్రక్షన్స్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంకుష్ గుప్త ఆధ్వర్యంలో విశాఖపట్నం కార్యాలయంలో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిధి చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంకుష్ గుప్త, చీఫ్ ఇంజినీర్ -I శ్రీనివాసరావు, చీఫ్ ఇంజినీర్ -III విష్ణుమూర్తి తో పాటు ఇతర నిర్మాణ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్బంగా వందేమాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం సిఎఓ అంకుష్ గుప్తా మాట్లాడుతూ వందేమాతర గీతం నేడు 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ చారిత్రక సందర్భంలో దేశ వ్యాప్తంగా ఈ వేడుకలు నిర్వహించుకోవడం ప్రతీ భారతీయుడు గర్వం గా భావించాలన్నారు. ప్రతీ ఒక్కరూ ఆనాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ఐక్యత,దేశభక్తి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

విశాఖపట్నం

వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు – విశాఖపట్నం రేంజ్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వహణ*

*వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు – విశాఖపట్నం రేంజ్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వహణ* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- * స్వాతంత్ర్య ఉద్యమంలో కోట్లాది భారతీయులలో దేశభక్తి జ్వాలలు రగిలించిన ‘వందేమాతరం’ గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని, విశాఖపట్నం రేంజ్ పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపినాథ్ జెట్టి, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విశాఖ రేంజ్ పోలీస్ కార్యాలయం ఆవరణలో గౌరవం వందనం ఇచ్చి, శ్రద్ధతో వందేమాతరం గీతాలపన చేసి, స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకున్నారు. 1875 నవంబర్ 7న బంకించంద్ర ఛటర్జీ రచించిన ‘వందేమాతరం’ గేయం తొలిసారిగా ఆయన రాసిన ప్రసిద్ధ నవల ‘ఆనంద్ మఠ్’లో ప్రచురితమైంది. అప్పటి నుండి ఇది భారతీయులలో జాతీయాభిమానానికి ప్రతీకగా నిలిచింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, డీఐజీ గారు దేశ స్వాతంత్య్రానికి ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరించుకోవాలని, జాతీయ గీతాల పట్ల గౌరవ భావం కలిగి ఉండాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డీఐజీ గారితో పాటు ఇన్స్పెక్టర్లు రమణమూర్తి, మన్మధరావు, రేంజ్ కార్యాలయం మేనేజర్ బాల సూర్యారావు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

విశాఖపట్నం

మెడికల్ కాలేజిలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ* కార్యక్రమం

ఈ రోజు విశాఖపట్నం 55వ వార్డు కంచరపాలెం మెట్టు దగ్గర ముత్యాలమ్మ తల్లి గుడి వద్ద *మెడికల్ కాలేజిలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ* కార్యక్రమం *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- * విశాఖపట్నం జిల్లా వైయస్సార్సీపి ఇంటలెక్చువల్స్ ఫోరం అధ్యక్షులు దేవరకొండ మార్కండేయులు ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె.కె రాజు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శశికళ ,రాష్ట్ర,పార్లమెంట్,పార్టీ మండల అధ్యక్షులు,సిటీ నాయకులు,సీనియర్ నాయకులు,అనుబంధ సంఘాల సభ్యులు,కార్యకర్తలు *ఇతర ప్రజా ప్రతినిధులు తో కలసి పాల్గొన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి*

విశాఖపట్నం

జివిఎంసి టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కు 22 వినతులు.

జివిఎంసి టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కు 22 వినతులు. – జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానరు ఎ.ప్రభాకారరావు *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- * మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ లో 22 వినతులు వచ్చాయని జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానరు ఎ.ప్రభాకారరావు తెలిపారు. శుక్రవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయం లో సిపి లు, డీసీపీలు, ఏసీపీ లతో కలిసి ప్రత్యేకంగా టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ సిటీ ప్లానరు మాట్లాడుతూ జీవీఎంసీ లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న PGRS కార్యక్రమం లో జివిఎంసి పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి ప్రజల నుండి అధికంగా ఫిర్యాదులు నమోదవుతున్నందున, జివిఎంసి పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి ప్రజల నుండి ఫిర్యాదులు/ వినతులను స్వీకరించేఁదుకు గానూ ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమానికి సంబంధించి 22 వినతులు స్వీకరించడం జరిగినదని, అందులో ముఖ్యంగా 2వ జోన్ కు 07, 3వ జోన్ కు 03, 5వ జోన్ కు 05, 6వ జోన్ కు 04, 8వ జోన్ కు 03 వినతులు వచ్చాయని తెలిపారు. స్వీకరించిన వినతులను /ఫిర్యాదులను నిర్ణీత సమయంలో టౌన్ ప్లానింగు అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించడమైనదన్నారు. పట్టణ ప్రణాళికా విభాగమునకు సంబంధించి ఫిర్యాదులు, అర్జీలు మొదలైనవి ప్రతి శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కార్యక్రమంలో ప్రజలు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు

విశాఖపట్నం

కూటమి ప్రభుత్వం ఆర్సెలార్ మిట్టల్ కోసం, విశాఖ ప్రజలకు, విశాఖ స్టీల్ ప్లాంటుకు ద్రోహం చేసే నిర్ణయం ఆపాలి.

కూటమి ప్రభుత్వం ఆర్సెలార్ మిట్టల్ కోసం, విశాఖ ప్రజలకు, విశాఖ స్టీల్ ప్లాంటుకు ద్రోహం చేసే నిర్ణయం ఆపాలి. *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు అక్రమ నీటి కేటాయింపులు రద్దు చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంటుకు, విశాఖ ప్రజలకు ద్రోహం చేయడం ఆపాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం. జగ్గునాయుడు డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి. జగన్, వి. క్రిష్ణరావులతో కలిసి నేడు జగదాంబ వద్ద గల సిఐటియు జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటుచేసారు. ఈ సందర్భంగా ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆర్సెలార్ మిట్టల్ కోసం 25 లక్షల మంది విశాఖపట్నం ప్రజానీకానికి, విశాఖ స్టీల్ ప్లాంట్కు ద్రోహం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏలేరు కాలువ నుండి 33ఎంజీడిల నీటిని మిట్టల్కు కేటాయించింది. దీనివలన విశాఖ నగర ప్రజలకు,విశాఖ స్టీల్స్టాంట్కు తీవ్రమైన నీటి సమస్య ఏర్పడుతుంది. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గోదావరి, ఏలేశ్వరం రిజర్వాయర్ నుండి ఏలేరు కాలువ ద్వారా విశాఖ నగరానికి 80 ఎంజిడీలు నీరు ప్రస్తుతం సరఫరా అవుతోంది. దీనిలో జివియంసికి 36, విశాఖ స్టీల్స్టాప్లాంట్కు 32, ఎన్టీపిసికి 7.14, ఎస్ఐబసికి 4,19, అదానీ గంగవరం పోర్టుకు 0.22, ఆరడబ్ల్యుఎన్కు 1.04 ఎంజిడీలు నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఏలేరు కాలువ ద్వారా విశాఖపట్నానికి సరఫరా అవుతున్న 80 ఎంజిడీలు నీటిలో 33 ఎంజిడీల నీటిని ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు కేటాయించింది. ఇప్పటికే నగరంలో అనేక ప్రాంతాల్లో తీవ్రమైన త్రాగునీటి సమస్యను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వస్తున్న నీటిని మిట్టల్కు కేటాయిస్తే విశాఖపట్నం ప్రజల యొక్క తాగునీటి సమస్య మరింత అధికమవుతుంది. ఇప్పటికే స్టీల్స్టాంట్ను కేంద్ర ప్రభుత్వం అష్టదిగ్బందం చేస్తోంది. వీటికి తోడు నీటి సమస్య సృష్టించి విశాఖ స్టీల్ ప్లాంటును దెబ్బతీయాలని చూడటం దుర్మార్గం. గోదావరి నుండి విశాఖకు ఏలేరు కాలువ నిర్మాణం స్టీల్స్టాంట్ నిధులతో జరిగింది. పైపులైన్ నిర్మాణం కోసం స్టీల్ ప్లాంట్ 240కోట్లు, జీవియంసి 60కోట్లు, ఎన్టీపిసి 50కోట్లు రూపాయిలు మొత్తం 360 కోట్లు రూపాయిలు ఖర్చుచేసాయి. ఇది ప్రజల సంపద ఈ సంపద మీద ఆర్సెలార్ మిట్టల్కు ప్రభుత్వం ఎలా భాగస్వామ్యం కల్పిస్తుందని ప్రశ్నించారు. దీనితోపాటు మిట్టల్ స్టీల్ నీటి సరఫరా కోసం శరభన్నపాలెం నుంచి ఎత్తిపోతల ద్వారా దాదాపు 46.6 కి॥మీ॥ పైపులైన్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటోంది. దీనికి 660కోట్లు రూపాయిలు ఖర్చు అవుతోంది. దీనిని జివియంసి ద్వారా ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుండి అప్పుతీసుకొని ఈ పైపులైన్ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. మిట్టల్ ఏమైనా పేదవాడా ? దేశ సంపన్నుల్లో ఒక ప్రధానమైన వ్యక్తిగా దాదాపు 3లక్షల కోట్లు ఆస్తి కలిగివున్నారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ నీటికి 660కోట్లు పెట్టుబడులు పెట్టుకోలేరా! ఆయన డబ్బులతో ప్రత్యేకమైన వైపులైన్ ఏర్పాటు చేసుకోమని చెబితే ఎవరికీ అభ్యంతరముండదు. కానీ జివియంసి ద్వారా అప్పు చేయించి, ప్రజలు చెల్లిస్తున్న పన్నుల నుండి ఈ అప్పులు తీర్చడానికి ప్రభుత్వం పూనుకోవడం ప్రజల సొమ్మును మిట్టలు దోచిపెట్టడమే అవుతుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థ విశాఖపట్నం పోర్టుకు జీవియంసి ద్వారా ఒక కిలో లీటర్ కు 90రూపాయిలు చొప్పున నీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మిట్టల్తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఒక కిలో లీటర్కు 50రూపాయిలకే 10సం॥లకు నీటిని సరఫరా చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రభుత్వరంగ సంస్థకేమో అధిక రేటుకు సరఫరా చేసి ప్రైవేటు మిట్టల్ సంస్థకు తక్కువ రేటుకు ఎలా సరఫరా చేస్తారని ప్రశ్నించారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ వస్తే వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని పెద్దగా ప్రచారం చేస్తున్నారు. నిజంగా ఉపాధి కల్పించాలని కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో 5500మంది కాంట్రాక్టు కార్మికులను, 2500మంది పర్మినెంట్ కార్మికులను విధుల నుంచి ఎందుకు తొలగించారు. మరో 2000 మందిని తొలగించేందుకు ఎందుకు సిద్ధపడుతున్నారు. ఒక్క విశాఖ స్టీల్స్టాంట్లోనే 10వేల మందిని ఉ న్న ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారు. రక్షణ రంగం, పోర్టు, హెచ్పీసిఎల్, బిహెచ్ఐఎల్, షిపోయార్డు తదితర ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో వేల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలున్నాయి. ఈ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడంలేదని ప్రశ్నించారు. ఈ మొత్తం పరిణామాలు చూస్తే అభివృద్ధి పేరుతో ప్రజల సంపదను, ఆస్తిని మిట్టల్ తదితర కార్పొరేటర్లకు కట్టబెట్టడమే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం లక్ష్యంగా వున్నది. దీనిలో భాగమే ఈ అక్రమ నీటి కేటాయింపులన్నారు. 25 లక్షల మంది విశాఖ ప్రజలకు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు హాని చేసేటటువంటి ఎలేరు కాలువ ద్వారా మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు నీటి కేటాయింపు నిర్ణయాన్ని రద్దు చేయాలి. జివియంసి నిధులతో కాకుండా, ఆర్సెలార్ మిట్టల్ సొంత నిధులతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి సరఫరా పరిశీలించాలి. లేనిపక్షంలో కూటమి ప్రభుత్వం ప్రజాగ్రహాన్ని ఎదుర్కొవల్సి వుంటుందని హెచ్చరించారు

అమరావతి

శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం నజరానా.. రూ.2.5 కోట్ల నగదు పురస్కారం*

*అమరావతి* (విశాఖ పున్నమి ప్రతినిధి) సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారితో ఉమెన్ వరల్డ్ కప్ విశేషాలు పంచుకుంటున్న ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్. *శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం నజరానా.. రూ.2.5 కోట్ల నగదు పురస్కారం* * భారత క్రికెటర్‌ శ్రీచరణికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు పురస్కారం ప్రకటించింది. దీంతో పాటు గ్రూప్‌-1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. మహిళా వన్డే వరల్డ్ కప్‌లో విశ్వవిజేతగా నిలిచిన టీమ్‌ఇండియా జట్టుకు శ్రీచరణి ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.

విశాఖపట్నం

సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తా గంటా…

సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తా గంటా… విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- ఉన్నతాధికారులకు పంపినంత మాత్రాన పిర్యాదులు పరిష్కారమైనట్టు కాదు.. గ్రీవెన్స్ లో అధికారుల తీరు పట్ల గంటా అసంతృప్తి _మధురవాడ(డి డి న్యూస్) :_ వచ్చే వారం నుంచి గ్రీవెన్స్ నిర్వహణకు ముందురోజు క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలకు పూర్తి స్థాయి పరిష్కారం చూపిస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. మధురవాడ జోనల్ కార్యాలయంలో శుక్రవారం ఆయన గ్రీవెన్స్ నిర్వహించారు. పార్కులు, ఓపెన్ స్పేస్ లు, గెడ్డలు తదితర ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను.. అనధికార నిర్మాణాలను.. స్వయంగా పరిశీలిస్తానని తెలియజేశారు. పిర్యాదుల పరిష్కారంలో టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, విద్యుత్, రెవిన్యూ తదితర విభాగాల పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు, ప్రజా పిర్యాదులను పై అధికారులకు పంపించి పరిష్కారమైన జాబితాలో చూపించడం సరి కాదన్నారు. గ్రీవెన్స్ మొక్కుబడిగా జరగకుండా నివేదికల ఫార్మెట్ మార్చమని అధికారులను ఆదేశించారు. అధికారులు ఏ లెక్కలు చెప్పినా ఆశించినంతగా పిర్యాదుల పరిష్కారం జరగడం లేదని పేర్కొన్నారు. ప్రతి సోమవారం ఉన్నతాధికారులు గ్రీవెన్స్ నిర్వహిస్తున్నా.. ఇంకా అనేక సమస్యలకు పూర్తి స్థాయి పరిష్కారం దొరకడం లేదన్నారు. మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశంతో ప్రతి శుక్రవారం ఎమ్మెల్యేలు కూడా గ్రీవెన్స్ నిర్వహించనున్నామని వివరించారు. గ్రీవెన్స్ లో వచ్చే పిర్యాదులపై ఇక మీదట సంబంధిత అధికారుల క్షేత్ర స్థాయి పరిశీలన తప్పనిసరన్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ కనక మహాలక్ష్మి, కార్పొరేటర్లు గాడు చిన్ని కుమారి లక్ష్మి, మొల్లి హేమలత, లొడగల అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

బాదితురాలుకు సిఎం ఆర్ ఎఫ్ చెక్కు అందజేసిన బొజ్జల బృందమ్మ

శ్రీకాళహస్తి నవంబర్ 07 , పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి నియోజిక వర్గం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ పట్టణంలోని 9 వ వార్డుకు చెందిన బీరాంజీ బుజ్జమ్మ అనారోగ్యంతో చికిత్స తీసుకుంది. ఆమె ఆర్ధిక పరిస్థితి నిలకడగా మెరుగైన చికిత్స ఆర్థిక సాయం కోసం ముఖ్యమంత్రి సహా నిధి ఇప్పించి ఆదుకోవాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని బుజ్జమ్మ కుటుంబ సభ్యులు కోరగా స్పందించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చర్యలు తీసుకుని బుజ్జమ్మకు సిఎం ఆర్ ఎఫ్ నిధి నుంచి సుమారు 90 వేల 728 రూపాయలు చెక్కును ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ చేతులు మీదుగా శుక్రవారం అందజేశారు. దీంతో బుజ్జమ్మ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు టిడిపి అధ్యక్షులు రావిళ్ల మునిరాజా నాయుడు, మహిళా టిడిపి పట్టణ అధ్యక్షురాలు సుమతి, బుజ్జమ్మ కుమారులు సుబ్రహ్మణ్యం, బీరాంజీ మాధవ్ లు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.