Friday, 3 April 2026

Blog

అన్నమయ్య

శ్రీ సద్గురు సాయినాథ్ మందిరం 26వ వార్షికోత్సవంలో స్కౌట్ సభ్యుల సేవా కార్యక్రమం

శ్రీ సద్గురు సాయి నాథ్ మందిరం,సాయి నగర్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో 26వ వార్షికోత్సవ వేడుకలు శ్రద్ధాభక్తులతో నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమం, భక్తులకు స్వామి వారి దర్శన ఏర్పాట్లు, అనంతరం అన్నదానం కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో స్వర్ణేంద్రా మదర్ విక్టరీ స్కౌట్ గ్రూప్, నందలూరు సభ్యులు పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు.స్కౌట్ మాస్టర్ వేపగుంట సాంరాజ్ ఆధ్వర్యంలో 18 మంది స్కౌట్ సభ్యులు భక్తుల దర్శన క్యూలైన్ వ్యవస్థాపన, నీరు, ప్రసాదం పంపిణీ వంటి సేవల్లో పాల్గొన్నారు.గత 15 సంవత్సరాలుగా సాంరాజ్ మరియు వారి బృందం నిరంతరంగా సాయినాథ్ స్వామి సేవలో పాల్గొంటున్నారని ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు.ఈ సందర్భంగా స్కౌట్ బృందాన్ని సన్మానించి ₹3,000/- ఆర్థిక సహాయం అందజేశారు.ఈ వేడుకలకు గౌరవ ముఖ్య అతిథిగా కె.సుబ్బరామి రెడ్డి, దేవస్థానం అధ్యక్షులు కె. కృష్ణమూర్తి,సభ్యులు ఎన్. శివరాజు తదితరులు హాజరై భక్తులతో కలిసి స్వామి వారి ఆశీర్వచనాలు పొందారు.

Blog

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. రమేష్ కుమార్ శుక్రవారం కర్నూలు నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నగరి సుధాకర్, నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప, జిల్లా కోశాధికారి బి.శ్రీనివాసులు తదితరులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న బకాయిలు మంజూరు చేయాలని, మధ్యంతర భృతిని త్వరగా విడుదల చేయాలని వారు ప్రభుత్వానికి నివేదించాలని ప్రధాన కార్యదర్శిని అడిగారు. అలాగే జిల్లా తాలూకాల బలోపేతం, సంఘ కార్యకలాపాల అభివృద్ధిపై కూడా చర్చించారు

అన్నమయ్య

రావిరాల శబరిమల మహా పాదయాత్రకు ఘన స్వాగతం పుల్లంపేట మండలంలోని పుతనవారిపల్లి శివాలయంలో స్వాముల సత్కారం

తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా రావిరాల మండలం నుండి ప్రారంభమైన రావిరాల శబరిమల మహా పాదయాత్ర ఘనంగా సాగుతోంది.దాదాపు 80 మంది అయ్యప్ప మాలధారణ స్వాములు ఈ మహా పాదయాత్రలో పాల్గొన్నారు.శబరిమలై వరకు పాదయాత్రగా బయలుదేరిన ఈ బృందం అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పుతనవారిపల్లి శివాలయం వద్దకు చేరుకున్న సందర్భంగా విశేషంగా స్వాగతం లభించింది.ఈ సందర్భంగా నందలూరు మండలానికి చెందిన అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షులు మరియు బీజేపీ నాయకులు రాచూరి మురళి, గొర్ల శ్రీనివాసులు (బాబు),విస్డమ్ స్కూల్ అధినేత వలిమి సుధాకర్, తెలుగుదేశం పార్టీ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్,తుమ్మది శివ కుమార్,రావిరాల శబరిమల మహా పాదయాత్ర గురు స్వామి జి. వెంకటేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి,వారి బృందానికి మిఠాయి బాక్సులు అందజేశారు.స్థానిక భక్తులు,గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాముల పాదయాత్ర విజయవంతంగా పూర్తవ్వాలని అయ్యప్ప నామస్మరణతో ప్రార్థించారు.

Blog

*నంద్యాలలో ఘనంగా హాకీ శతాబ్ది ఉత్సవాలు*

భారత హాకీ శతాబ్ది ఉత్సవాలను నంద్యాల ఎస్పీజీ మైదానంలో నంద్యాల హాకీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సభా ప్రారంభంలో వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వాహకులు, అతిధులు, విద్యార్థులు సామూహికంగా వందేమాతర గీతం ఆలాపించారు. హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు చాణిక్యరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలలో నంద్యాల డయాసిస్ బిషప్ రెవరెండ్ సంతోష్ ప్రసన్న కుమార్, శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు ఫీల్డ్ డైరెక్టర్ విజయ్ కుమార్, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు చాణక్యరాజు మాట్లాడుతూ భారత హాకీ 1925లో ప్రారంభించబడిందని ఈరోజుతో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు హాకీ ఇండియా ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం, భారత స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో 550 జిల్లాలలో 1000 హాకీ మ్యాచ్ లు నిర్వహిస్తున్నారని నంద్యాలలో కూడా నంద్యాల హాకీ సంఘం ఆధ్వర్యంలో హాకీ మ్యాచ్ లు నిర్వహిస్తున్నామని తెలిపారు. బిషప్ సంతోష్ ప్రసన్న మాట్లాడుతూ రెండు చరితాత్మక సంఘటనలను నిర్వహించుకుంటున్నామని, జాతీయ గీతం వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరం కలిసి వందేమాతర గీతం పాడడం,జాతీయ క్రీడ అయిన హాకీ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. ప్రపంచ హాకీ చరిత్రలో భారత హాకీ సువర్ణ అధ్యాయం లిఖించిందన్నారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ భారతదేశం ఒలింపిక్స్ లో అనేక స్వర్ణ పతకాలు సాధించడంలో కీలక పాత్ర వహించారని గుర్తు చేశారు. క్రీడలకు,ఇతర సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని ప్రకటించారు. డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ భారత హాకీ 1928,1932,1936 వరసగా మూడు పర్యాయాలు ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాలు, మొత్తం ఎనిమిది ఒలింపిక్స్ స్వర్ణ పతకాలు, ఒక రజతం, రెండు కాంస్య పతకాలను కైవసం చేసుకుందన్నారు. 1975 తర్వాత సాధారణ మైదానాల స్థానంలో ఆస్ట్రో టర్ఫ్ మైదానాలు ప్రపంచ హాకీలో రావడంతో భారత హాకీ కొంత వెనుకకు వెళ్లడం జరిగిందని,ఈ శతాబ్ది ఉత్సవాల స్ఫూర్తితో రానున్న ఒలింపిక్స్ లో భారత హాకీ తిరిగి స్వర్ణ యుగానికి నాంది పలుకుతుందని ఆకాంక్షించారు. అటవీశాఖ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించాలని కోరారు.

E-పేపర్

నెరవాటి హాస్పిటల్ లో ఉచిత మెగా వైద్య శిబిరం ను ప్రారంభించిన ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ

పద్మావతి నగర్ లో ఉన్న నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతమైంది. నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ నెరవాటి వినోద్, డాక్టర్ నెరవాటి అరుణ కుమారిల నిర్వహణలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, ప్రముఖ వ్యాపారవేత్త నెరవాటి సత్యనారాయణ, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ నెరవాటి వినోద్,డాక్టర్ నెరవాటి అరుణ కుమారి మాట్లాడుతూ తమ నెరవాటి ఆసుపత్రి రెండు దశాబ్దాలుగా గాంధీ చౌక్ లో సేవలు అందించి ఇటీవల పద్మావతి నగర్ లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించి ప్రారంభించామని, ఆసుపత్రి స్థాపించి 21 సంవత్సరాలు ఆయన సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ సహకారంతో ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించామని తెలిపారు. ఈ శిబిరంలో చెవి ముక్కు గొంతు సంతానలేమి స్త్రీ వ్యాధులు, గర్భిణీ స్త్రీలు, ఎముకలు కీళ్లు, బిపి, షుగర్ వంటి జనరల్ మెడిసిన్ విభాగాలలో తమతో పాటు డాక్టర్లు సుమన్ కుమార్ ఫాతిమా బి దేవేంద్ర నాయక్ వైద్య సేవలు అందించామన్నారు. శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆసుపత్రి వైద్యులు వినోద్ కుమార్, అరుణకుమారి, సుమన్ కుమార్, ఫాతిమా బి దేవేంద్ర నాయక్ లు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు.ఈ ఆసుపత్రిలో వర్టిగో,అలర్జీ ప్రత్యేక క్లినిక్ లు కూడా ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని ప్రశంసించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త నెరవాటి సత్యనారాయణ,నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, జోన్ చైర్మన్ నిజాముద్దీన్,కోశాధికారి అమిదేల జనార్ధన్, డాక్టర్ నెరవాటి గగన్, ఆడియాలజిస్ట్ వినయ్, ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ శిబిరంలో 400 మంది రోగులను వైద్యులు పరీక్షించి అవసరమైన వారికి లక్ష రూపాయల విలువైన వినికిడి పరీక్షలు,ఎముకల సాంద్రత పరీక్షలు,అల్ట్రా సౌండ్ స్కానింగ్,రక్త పరీక్షలు ఉచితంగా చేసి, అవసరమైన వారికి మొత్తం లక్ష రూపాయల విలువైన మందులను పంపిణీ చేశారు.

Blog

నంద్యాలలో యూరాలజీ వైద్యుల రాష్ట్ర స్థాయి సదస్సు

నంద్యాల యూరాలజీ వైద్యుల సంఘం,కర్నూలు యూరాలజీ వైద్యుల సంఘం సంయుక్త నిర్వహణలో రెండు తెలుగు రాష్ట్రాల 37 వ వార్షిక యూరాలజీ వైద్యుల వైజ్ఞానిక సదస్సు ఈనెల 8,9 వ తేదీలలో నంద్యాలలో సౌజన్య కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహిస్తున్నారు నంద్యాల కు చెందిన యూరాలజీ వైద్య నిపుణులు డాక్టర్ భార్గవ వర్ధన్ రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ తో కలిసి శుక్రవారం స్థానిక ఐఎంఏ కార్యాలయంలో సదస్సు వివరాల పుస్తకాలు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో సదస్సు నిర్వాహక కమిటీ కోశాధికారి డాక్టర్ జై బాబు రెడ్డి,నిర్వాహక కమిటీ సభ్యులు డాక్టర్ దాసరి రమేష్,డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి సదస్సు నిర్వాహక కార్యదర్శి డాక్టర్ భార్గవ వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో ప్రతిష్టాత్మకమైన రెండు తెలుగు రాష్ట్రాల సంయుక్త రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య,కార్యదర్శి డాక్టర్ భార్గవ వర్ధన్ రెడ్డి, తెలుగు రాష్ట్రాల యూరాలజీ వైద్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్ జగదీశ్వర్,కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో జరిగే సదస్సులో రెండు తెలుగు రాష్ట్రాలు,దేశంలోని వివిధ నగరాలకు చెందిన 25 మంది ప్రముఖ యూరాలజీ నిపుణులు వివిధ అంశాలపై సదస్సులో ప్రసంగిస్తారని, యూరాలజీ విభాగ పీజీ విద్యార్థులు పరిశోధన పత్రాలు సమర్పిస్తారని, చికిత్సా విధానాలపై చర్చా గోస్టులు నిర్వహిస్తామన్నారు.రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 300 మంది యూరాలజీ వైద్య నిపుణులు ఈ సదస్సులో ప్రతినిధులుగా నమోదు చేసుకుని పాల్గొంటున్నారని తెలిపారు.శనివారం సాయంత్రం నాలుగు గంటలకు సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇందులో దక్షిణ భారత యూరాలజీ వైద్యుల సంఘం కార్యదర్శి డాక్టర్ చంద్రమోహన్, ఉస్మానియా ఆసుపత్రి విశ్రాంత సూపరింటెండెంట్,తెలుగు రాష్ట్రాలలో యూరాలజీ విభాగ ఆద్యులు డాక్టర్ విక్రమసింహారెడ్డి, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అతిధులుగా పాల్గొని సదస్సు ప్రారంభిస్తారని తెలిపారు డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ యూరాలజీ విభాగంలో వచ్చిన ఆధునిక వైద్య విధానాలపై వినియోగంలోకి వచ్చిన అత్యంత ఆధునిక పరికరాల గురించి యూరాలజీ చికిత్సలు అందిస్తున్న వైద్యులకు అవగాహన కల్పించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యమన్నారు. తద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ సదస్సులు దోహదం చేస్తాయన్నారు. నంద్యాలలో మొట్టమొదటిసారిగా ఒక సూపర్ స్పెషాలిటీ విభాగం రెండు తెలుగు రాష్ట్రాల రాష్ట్రస్థాయి వైద్య వైజ్ఞానిక సదస్సు నిర్వహించడం నంద్యాల వైద్యులకు గర్వకారణం అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ దాసరి రమేష్, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఈనెల 21న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఈనెల 21న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము *తిరుపతి*(విశాఖ పున్నమి ప్రతినిధి):- 20న తిరుచానూరు అమ్మవారి దర్శనం, ఆలయ సంప్రదాయం ప్రకారం ముందుగా వరాహస్వామి దర్శనం రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై టీటీడీ అధికారుల సమీక్ష భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ నెల 21న ఆమె స్వామివారి సేవలో పాల్గొంటారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆమె తిరుపతికి రానున్నారు. పర్యటనలో భాగంగా ఈ నెల‌ 20న రాష్ట్రపతి ముందుగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడి నుంచి తిరుమలకు చేరుకుంటారు. మరుసటి రోజు ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మొదట శ్రీ వరాహస్వామి వారిని, ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకుంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఈ మేరకు గురువారం తిరుమలలోని పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీవీఎస్వో మురళీకృష్ణతో పాటు ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు. రాష్ట్ర‌ప‌తి పర్యటన సందర్భంగా భద్రత, వసతి, దర్శన ఏర్పాట్లపై వారు చర్చించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు అదనపు ఈవో సూచించారు.

విశాఖపట్నం

సీసీ రోడ్డు పనులను పరిశీలించిన 59 వ వార్డు టిడిపి శ్రేణులు

సీసీ రోడ్డు పనులను పరిశీలించిన 59 వ వార్డు టిడిపి శ్రేణులు విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- 59వ వార్డు ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీ ప్రభుత్వ విప్ పశ్చిమ గణబాబు సహకారంతో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్.కోట ఎన్నికల పరిసరాకులో సిహెచ్ రామ్మోహన్ నాయుడు వార్డు ప్రధాన కార్యదర్శి ముత్తిరెడ్డి శంకర్ ములగడ మండల అధ్యక్షుడు లక్కరాజు రామకృష్ణ వార్డు టిడిపి నాయకులు పెద్దాడ పైడిరాజు వరప్రసాద్ కూటమి నాయకులు పరిశీలించారు. నాణ్యతతో పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు.

విశాఖపట్నం

వందే మాతరం పాట వ్రాసి 150 సంవత్సరములు అయిన సందర్భంగా mass sing కార్యక్రమం

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ రోజు కింగ్ జార్జ్ హాస్పిటల్ లో వందే మాతరం పాట వ్రాసి 150 సంవత్సరములు అయిన సందర్భంగా mass sing కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఐ. వాణి మాట్లాడుతూ వందేమాతరం పాట యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. ప్రతి భారతీయుడు భారతమాతని గౌరవించాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ లు డా. రాధాకృష్ణన్, డా.ఎం.చంద్రశేఖరం నాయుడు, అడ్మినిస్ట్రేటర్ బి. వి.రమణ, ఏ.ఆర్. ఎం.ఓ.లు డా.ఏ.రాజేష్, డా. ఎస్.చంద్రబాబు నాయుడు, నర్సింగ్ స్టాఫ్ స్టూడెంట్స్ మినిస్టరియల్ స్టాఫ్ పాల్గొనడం జరిగింది.

విశాఖపట్నం

క్యాన్సర్ పై విజయం – స్క్రీనింగ్ తో సాధ్యం*

*క్యాన్సర్ పై విజయం – స్క్రీనింగ్ తో సాధ్యం* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* నవంబర్ 7,2025.‘జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం’ సందర్భంగా కింగ్ జార్జ్ హాస్పిటల్ లో ర్యాలీ నిర్వహించారు.సమాజంలో జీవన ప్రమాణాలు పెరగడం, జీవన శైలిలో మార్పులు రావడంతో అసంక్రమిత వ్యాధులు (Non Communicable Diseases- (NCDs)-దీర్ఘ కాలిక వ్యాధులు)పెరుగుతున్నాయి. బి. పి., షుగర్ లతో పాటు ఈ రోజుల్లో క్యాన్సర్ కేసులు కూడా గణనీయంగా నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం చాలా ఎక్కువ సంఖ్యలో కొత్త క్యాన్సర్ కేసులు గుర్తింప బడుతున్నాయి. వీటిలో చాలా కేసులు ఆలస్యంగా గుర్తించబడటంతో రేడియో , కీమో చికిత్సలు తీసుకోవలసిన అవసరం రావడం, తిరిగి నయం చేయలేని స్థితిలో వుండటంతో అధిక మరణాలు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితులలో పేషెంట్ తో పాటు కుటుంబాలు అధిక ఆర్ధిక భారం, మానసిక ఒత్తిడి ని ఎదుర్కొంటున్నాయి. దీనికి ఒకే ఒక పరిష్కారం–“ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవడం మరియు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం”. బి. పి., షుగర్ పరీక్షలు ఎంత ముఖ్యమని భావనలో వున్నారో, అదే విధంగా క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవడంలో వుండాలి. క్యాన్సర్ అంటే భయపడాల్సిన పని లేదు , ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయగల వ్యాది ఇది. రాష్ట్ర ప్రభుత్వం, 18 సంవత్సరాల పైబడిన ప్రతి పౌరునికి ఉచితంగా నోటి, రొమ్ము మరియు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ సదుపాయం కల్పిస్తోంది. ఈ పరీక్షలు చేయించుకోవడానికి మీ ఇంటి వద్దకు వచ్చే ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందికి సహకరించండి. అలాగే, మీ సమీపంలోని ప్రతి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈ పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేయబడతాయి.ఇది కొందరికే వస్తుంది, నాకు రాదు అనే అపోహలు వదిలేయండి.ప్రజలందరూ ముందుకు వచ్చి ఈ పరీక్షలు చేయించుకోండి. ముఖ్యంగా మహిళలు మొహమాటం, బిడియంతో వెనుకంజ వేయకుండా ఆరోగ్య సిబ్బందికి సహకరించాలి. మీ వ్యక్తిగత వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి. ఏమైనా అనుమానాస్పద లక్షణాలు వుంటే వారిని వెంటనే మెడికల్ కాలేజీ ఆసుపత్రులలోని ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ప్రివెంటివ్ అంకాలజీ యూనిట్ కి రిఫర్ చేసి, వెంటనే ప్రత్యేక వైద్య సదుపాయం, ఉచితంగా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.ఐ. వాణి , ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్స్ పాల్ డా. కె.వి. ఎస్. ఎం. సంధ్య దేవి , జిల్లా వైద్య ఆరోగ్య వైద్య శాకాధికారి డా. పి. జగదీశ్వర రావు , మెడికల్ అంకోలాజి డిపార్ట్మెంట్ విభాగధిపతి డా.కె. శిల్ప , ప్రీవెన్టివ్ అంకోలాజి నోడల్ అధికారి డా . కె. సాయి సుష్మ , జిల్లా యన్. సి. డి ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. హారిక మరియు ఇతర ప్రోగ్రామ్ ఆఫీసర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు .

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.