Friday, 3 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జోన్సులగడ్డ నర్మదా గారి మరణంపై సిపిఎం నేతల సంతాపం

( పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా కమిటీ సభ్యులు, సిపిఎం పార్టీ నాయకులు కామ్రేడ్ జోన్నలగడ్డ వెంకమరాజు గారి సతీమణి జోన్నలగడ్డ నర్మద అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం పార్టీకి, కుటుంబానికి తీరని లోటని సిపిఎం నేతలు తెలిపారు. నెల్లూరు జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి మరియు జిల్లా కమిటీ సభ్యులు ,మండల కమిటీ సభ్యులు కలిసి నర్మద మృతదేహానికి నివాళులర్పించారు. పార్టీ తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ఈ కష్టసమయంలో ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు. *సిపిఎం పార్టీ నేతల సంతాప ప్రకటన* కామ్రేడ్ జోన్నలగడ్డ వెంకమరాజు సతీమణి జోన్నలగడ్డ నర్మద అకాల మరణం చెందడంతో, సిపిఎం పార్టీ నేతలు ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖ్యంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు మోహన్రావు, అజయ్ కుమార్, గోగుల శ్రీనివాస్, మాదాల వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, కత్తి శ్రీనివాసులు, ముత్యాల గురునాథం, డాక్టర్ దత్తాత్రేయులు,డాక్టర్ రాజేశ్వరరావు, రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగలి పుల్లయ్య, మూలె వెంగయ్య, యుటిఎఫ్ నాయకులు బాబిరెడ్డి,పరం ధామయ్య, జనవిజ్ఞాన వేదిక నాయకులు మాదాల రాము, పోతంసెట్టి విద్యాచరణ్, న్యాయవాది ఐ.రాజా, నారా గోపాల్, ప్రజాశక్తి డెస్క్ ఇన్‌చార్జి ఎం.రమణయ్య, వరికూటి వేంకటరెడ్డి,జగన్నాథం, రామచంద్రరావు, జానా వెంకయ్య, మాజీ మండల అధ్యక్షుడు చంద్రమౌళి గారు తదితరులు పాల్గొని సంతాపం తెలిపారు. నర్మద మరణానంతరం ఆమె కళ్ళని దానం చేసారు.

E-పేపర్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి రైల్వేకోడూరు సమస్యలు తెలిపిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి రైల్వేకోడూరు సమస్యలు తెలిపిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర రైల్వేకోడూరు మేజర్ న్యూస్ రైల్వేకోడూరు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని తాజ్ హోటల్ లో కలిసి రైల్వే కోడూరు ఫారెస్ట్ సమస్యలు ప్రధానంగా మూడింటిని వివరించి వినతి పత్రము ఇవ్వడం జరిగింది.. రైల్వే కోడూరు – వెంకటగిరి రోడ్డు టోల్ గేట్ సెంటర్ లో ఒక ఫారెస్ట్ కాంప్లెక్స్ నిర్మించి అటవీశాఖకు ఆదాయం మరియు చాలా మందికి ఉపాధి కలుగుతుందని అంతేకాకుండా బ్రిటిషు కాలంనుండి ఉన్న ప్రతిష్టాత్మక ఫారెస్ట్ బంగ్లా ఆధునీకరణ లేదా నూతన నిర్మాణము చెప్పడంతో అధ్యక్షులు స్పందించి వెంకటగిరి రోడ్డు గతంలో కూడా నాదృష్టికి తెచ్చావు కదా పరిశీలిస్తాను అని వినతి పత్రాన్ని ఓ ఎస్ డి కి గారికి అందించారు

ఖమ్మం

సత్తుపల్లి ఘటనపై ఖమ్మం సీపీకి జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసులు జారీ

పువ్వాడ నాగేంద్ర కుమార్ ( తెలంగాణ పున్నమి ప్రతినిధి) బీసీ రిజర్వేషన్ బంద్ రోజున సత్తుపల్లి పట్టణంలో సత్తుపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షులు భూక్యా విజయ్ మీద మరియు బీజేపీ నాయకులు ల మీద డాడీ నేపథ్యంలో చోటుచేసుకున్న దుర్ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ ఖమ్మం జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ) సునీల్ దత్ ని వివరణ కోరింది. బంద్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన విషయమై ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు, జాతీయ నాయకులు మరియు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ఇంచార్జి శ్రీ సుధాకర్ రెడ్డి పొంగులేటి చొరవతో ఈ ఫిర్యాదు జాతీయ ఎస్టీ కమిషన్‌ కు చేరింది. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన జాతీయ ఎస్టీ కమిషన్, ఖమ్మం కమిషనర్ ఆఫ్ పోలీస్ గారిని ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించి యథార్థ నివేదికను తక్షణం సమర్పించాలని ఆదేశించింది. లేనిపక్షంలో సంబంధిత పోలీసు అధికారులు ఢిల్లీలోని జాతీయ ఎస్టీ కమిషన్ ఎదుట హాజరుకావాల్సి ఉంటుందని కమిషన్ హెచ్చరించింది.

ఆదిలాబాదు

ప్రజా సేవే పరమావధిగా మచ్చా గంగాధర్ (ఎంజిఆర్)

కాకినాడ : ప్రజా సేవే పరమావధిగా ఎందరికో ఆపన్న హస్తం అందిస్తూ సేవా దృక్పథంతో ముందుకు వెళుతూ అందరి మన్ననలు పొందుతున్నారు జనసేన సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్). ప్రజా సేవలో ముందువరుసలో ఉండాలనే ఉద్దేశంతో నిరంతరం ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్పూర్తితో, ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ ల ఆశయాలకు అనుగుణంగా మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) సేవ చేస్తున్నారు. కాకినాడ పట్టణంలోని జగన్నాధపురంలోని 16వ డివిజన్ గోళీలపేటలో ఇటీవల మృతి చెందిన సూరపు సత్తిబాబు కుటుంబ సభ్యులను శనివారం ఆయన కలిసి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన వీర మహిళ బండే సుజాత మాట్లాడుతూ సూరపు సత్తిబాబు కుటుంబానికి జనసేన పార్టీ తరపున మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) అండగా వుంటారని, ఎలాంటి కష్టం ఉన్నా తమంతా ఉన్నామని, అధైర్య పడవద్దని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఇప్పటి వరకు 305 మందికి ఆర్ధిక సహాయం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకుడు 16వ డివిజన్ ఇంచార్జీ ప్రసాద్, జనసేన పార్టీ వీర మహిళలు బంటు లీల, రచ్చ ధనలక్ష్మి, దీప్తి, సంధ్య, రమ్య, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆచార్య దేవోభవ పురస్కారం అందుకున్న నైనాల రఘురామయ్య గారు

చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఆచార్య దేవోభవ పురస్కార” కార్యక్రమంలో శ్రీ నైనాల రఘురామయ్య గారు గౌరవప్రదమైన అవార్డును అందుకున్నారు. ఈ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు మరియు ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీ పెరాబత్తుల రాజశేఖర్ గారు కలిసి ప్రదానం చేశారు. విద్యారంగంలో విశేష సేవలు అందిస్తూ, విద్యార్థులలో నైతిక విలువలు, సృజనాత్మక ఆలోచనలను పెంపొందించడంలో నైనాల రఘురామయ్య గారి కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారం ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు వివిధ స్థాయిల నుండి అప్పనపల్లి ఎంపీపీ స్కూల్ టీచర్స్ బి. పెద్దిరాజు, బి. రామకృష్ణ , షబ్బీర్ ర్ హుస్సేన్, యం. అనంత లక్ష్మి దేవి గార్లు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సమాజాభివృద్ధికి విద్యార్ధులే మూలాధారం అన్న దృష్టితో ఆయన చేస్తున్న సేవలు ప్రేరణీయమని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రముఖులు అభినందించారు.

E-పేపర్

అంగన్వాడీలను బలోపేతం చేయండి

తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలను బలోపేతం చేయాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలు సునీత ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రెండో మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషన్ ట్రాకర్ యాప్ లో ఎఫ్ ఆర్ ఎస్ (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్) విధానాన్ని రద్దు చేయాలని, ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ (ప్రైం మినిస్టర్స్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) విద్యను అంగన్వాడి సెంటర్స్ లోనే నిర్వహించాలని పిలుపునిచ్చారు. పియం శ్రీ విద్యను, ప్రీ-స్కూల్ విద్యను స్కూల్స్‌కు మార్చితే, పిల్లలు అంగన్వాడి సెంటర్స్ లో నిర్వహించే పోషకాహారం, ఆరోగ్య పరీక్షలు కోల్పోతారన్నారు. అంగన్వాడీ కేంద్రాలు పిల్లలకు చదువుతో పాటు ఆహారం, ఆరోగ్య సంరక్షణ కలిపి ఇస్తాయి, ఇది పిల్లల ఆకలి, ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు చిన్న పిల్లల చదువు బోధనలో శిక్షణ పొంది ఉన్నారు. పల్లెల్లో లక్షలాది అంగన్వాడీలు ఉండటం వల్ల పేద, గ్రామీణ పిల్లలు సులభంగా అంగన్‌వాడీ కేంద్రాలలో చేరి, అందరికీ చదువు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా ఉపాధ్యక్షులు G.కిషన్, ఆదివాసీ గిరిజన సంఘం కార్యదర్శి తొడసం. శoభు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గంగారాము తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

అంగన్వాడీ వర్కర్స్ యూనియన్( సిఐటియు) నూతన కార్యవర్గం

అంగన్ వాడి వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులుగా రాజమణి, జిల్లా అధ్యక్షులు గా బి. లలిత, ఉపాధ్యక్షులు గా H.పద్మ, కమల, రజియా, లావణ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గా V. శైలేజా, సహాయ కార్యదర్శి గా కవిత, కళ, రాధా, భాగ్య, రమ్య, N.గీత, జిల్లా కోశాధికారి గా బి. ప్రసాద, జిల్లా కమిటీ సభ్యులు గా అనురాధ, జయశ్రీ, M.సత్య, రాధా, హేమలత, ట్.రాతవ్వ, రాణి, మునేంద్ర, రత్నమాల, రాజేశ్వరి, సావిత్రి, నర్సమ్మ లను శనివారం ఎన్నుకున్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు దేవస్థానాలలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు పట్టణంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి మరియు శ్రీ వేంకటాచల స్వామి వార్ల దేవస్థానాల నూతన చైర్మన్లు మరియు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు దేవస్థానాలలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు పట్టణంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి మరియు శ్రీ వేంకటాచల స్వామి వార్ల దేవస్థానాల నూతన చైర్మన్లు మరియు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని దేవాదాయ, ధర్మాదాయ శాఖ గన్నవరం ఇన్స్పెక్టర్ అనురాధ పర్యవేక్షణలో, ఆలయ ఈ.ఓ. దుర్గా ప్రసాద్ నిర్వహించారు. కొత్త పాలకవర్గాలు ముందుగా ఆయా ఆలయాల్లోని శ్రీ వేంకటాచల స్వామి మరియు శ్రీ రామలింగేశ్వర స్వామి వార్లను దర్శించుకుని, ఆలయ అర్చకుల ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కూటమి నాయకులు, పట్టణ వ్యాపార ప్రముఖులు, స్నేహితులు నూతన చైర్మన్లను (జంగాల మురళి, పర్వతం శ్రీనివాసరావు) మరియు సభ్యులను శాలువాలు కప్పి, పూలదండలు వేసి సత్కరించారు. తిరువూరు నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ఎం.పి., ఎమ్మెల్యేల సమక్షంలో జరగాల్సిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికెట్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మాజీ ఏ ఏం సి చైర్మన్ తాళ్లూరి రామారావు, మున్సిపల్ కౌన్సిలర్లు షేక్ హుస్సేన్, జీడిమళ్ళ సత్యవతి, తిరువూరు సొసైటీ చైర్మన్ కంచి బాబీ, పట్టణ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మల్లెల శ్రీనివాసరావు, పరిశే రామలింగేశ్వర రావు, మండల పార్టీ అధ్యక్షులు దుబ్బాకు వెంకటేశ్వర రావు, విజయవాడ పార్లమెంట్ తెలుగు యువత నాయకులు మాదల హరి చరణ్ (కిట్టు), టిడిపి నాయకులు మోదుగు వెంకటేశ్వర రావు, గద్దె వెంకన్న, జనసేన నాయకులు లింగినేని సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయొద్దని డిమాండ్ చేస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విస్సన్నపేట పట్టణంలో ఉధృతంగా జరిగింది.

ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయొద్దని డిమాండ్ చేస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విస్సన్నపేట పట్టణంలో ఉధృతంగా జరిగింది. విస్సన్నపేటలో కోటి సంతకాల సేకరణ శనివారం (నవంబర్ 8, 2025) నాడు విస్సన్నపేట పట్టణంలోని బీసీ కాలనీ షాది ఖానా సెంటర్లలో ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను వ్యతిరేకిస్తూ ప్రజల నుంచి మద్దతు కూడగట్టడంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, ప్రభుత్వ నిర్ణయంపై తమ నిరసనను వ్యక్తం చేశారు. విసన్నపేట జడ్పిటిసి సభ్యులు భీమిరెడ్డి లోకేష్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు నెక్కలపు వెంకట కుటుంబరావు, సర్పంచ్ సాదుపాటి నాగమల్లేశ్వరి, ఎంపీటీసీ గద్దల మల్లయ్య, సీనియర్ జిల్లా నాయకులు శిరసాని ప్రకాష్, పల్లెపాము లక్ష్మయ్య, యరబర్ల నాంచారయ్య, బోనం మహేశ్వరరావు, వార్డు నెంబర్లు సానం సత్యవతి, కరీం, మైనార్టీ నాయకులు మైనార్టీ జిల్లా నాయకులు దస్తగిరి, మైనార్టీ మండల నాయకులు ఆలీ, బాజీ బాబా, టైలర్ బాజీ, షరీఫ్, తిరుపతి రెడ్డి, మేకల రవి, లాజరస్, రెడ్డి నటరాజ్, పెండెం విక్రం, సాదుపాటి కోటేశ్వరరావు, వెంగళ దుర్గాప్రసాద్, కోపల్లి జయకర్, సానం నాగేంద్ర రావు, గోపిశెట్టి శివ, రామాంజనేయులు, గంజినబోయిన ఆంజనేయులు, భారతి తదితర నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఘనంగా ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు వేడుకలు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

పున్నమి ప్రతినిధి నవంబర్ 8 అక్బర్ పేట భూంపల్లి అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. 299500/-రూపాయల చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం. దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్.జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్. అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందోత్సవాలతో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు. అనంతరం మండలంలోని లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 299500/-రూపాయలు పంపిణీ చేసిన దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకులు ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని ఈ సందర్భంగా వారు తెలిపారు. గ్రామాల వారిగా లబ్ధిదారుల వివరాలు వేల్పుల నాగవ్వ తాళ్లపల్లి 25000/-, బండారి స్వామి గౌడ్ పోతారెడ్డి పేట 46000/-,పంజ లక్ష్మి బేగంపేట్ 13000/-, ఎర్రబాగిని ఎల్లం చౌదర్పల్లి 22500/-, శేరి బిక్షపతి రుద్రారం 30500/-, బెంజిరం విజయ భూంపల్లి 15000/-తొంట యాదగిరి మోతే 60000/-, బైండ్ల మధు మోతే 60000/-, గుంటి నర్సింలు మోతే 17000/-, మడ్డి కుమార్ మోతే 10500/-అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ గుండా శంకర్, మాజీ ఎంపిటిసిలు పాతూరి శ్రీనివాస్ గౌడ్, మండల నర్సింలు, కూడా వెళ్లి దేవస్థానం డైరెక్టర్లు వెలుపుల యాదగిరి ముదిరాజ్, పుద్దోజి ప్రభాకర్ చారి, ఆత్మ కమిటీ డైరెక్టర్లు ఎర్రోళ్ల స్వప్న బాలు, బండారి సతీష్, మండల ప్రధాన కార్యదర్శి కోనపురం బాలు యాదవ్, మండల ఫిషర్మెన్ అధ్యక్షులు అన్నబోయిన చంద్రశేఖర్, దుబ్బాక సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్ణంపల్లి రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డిపల్లి నరసింహారెడ్డి, పోతారం రాజు, భీం రావ్, ఉత్తం నరేష్, జీడిపల్లి రమేష్, బోయిని పరశురాములు, మారి దుబ్బరాజు, కుమార్, సత్య గౌడ్, రాజు, ఎదురు బాలరాజు, పంజా మహేందర్, పంజా నరేష్, మిద్దె ఎల్లా గౌడ్, జనగామ పరుశరాములు, తిప్పనిపోయిన స్వామి, తిప్పనిపోయిన విజయ, కొండ్ర కనకయ్య పెద్ద ఎత్తున నాయకులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.