Friday, 3 April 2026

Blog

E-పేపర్

రాములోరి గుడి పూజలో పాల్గొన్న…. ముక్కా వరలక్ష్మి. ఘనంగా ఆహ్వానం పలికిన నాగ శివశంకర్ రెడ్డి, గ్రామ పెద్దలు ప్రజలు

శ్రీ రాములోరి గుడి పూజలో పాల్గొన్న…. ముక్కా వరలక్ష్మి. ఘనంగా ఆహ్వానం పలికిన నాగ శివశంకర్ రెడ్డి, గ్రామ పెద్దలు ప్రజలు అన్నమయ్య జిల్లా నవంబర్ 08 ( మనం న్యూస్ ప్రతినిధి): రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం చిన్న ఓరంపాడు దిగువపల్లి లో నూతనంగా నిర్మించిన శ్రీరాము లోరీ గుడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి శనివారం ముక్కా వరలక్ష్మి తో పాటు కూటమి నాయకులు రాముల వారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముక్క వరలక్ష్మికి ప్రత్యేక ఆహ్వానం పలికి వేద పండితులు చేత పూజలు చేయించిన సీనియర్ నాయకులు నాగ శివశంకర్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా ముక్క వరలక్ష్మి మాట్లాడుతూ, ఎంతో ఘన చరిత్ర కలిగిన దిగువపల్లి గ్రామానికి తగినట్లు శ్రీరామ సీతా లక్ష్మణ ఆంజనేయస్వామి విగ్రహాలను గుడిలో ప్రతిష్టించి కనుల పండుగగా శ్రీరామనవమి పండుగను తలపించే విధంగా విధంగా గుడి ప్రాంగణం వేదమంత్రాలతో తప్పెట్లు మేళాలతో. విద్యుత్ దీపాల అలంకరణతో పూలమాలలతో ఎంతో ఆకర్షణీయంగా ఎంతో ఘనంగా గుడి ప్రారంభించి ధజస్తంభం నిర్మించి గుడిని ప్రారంభించడం ఎంతో అభినందనీయమని గ్రామస్తులకు ప్రత్యేక అభినందనలు ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ పెద్దలు గ్రామస్తులు మాజీ సర్పంచ్ సరస్వతి నాయకులు ముక్కా రమేష్ రెడ్డి, సుబ్బరాయుడు నాయుడు నరేందర్ రెడ్డి ముక్క మోహన్ రెడ్డి, శ్రీనివాసులు నాయుడు, నరసింహారెడ్డి గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు

E-పేపర్

కార్యకర్తలకు అండగా… యువ నాయకులు ముక్కా సాయి వికాస్ రెడ్డి

కార్యకర్తలకు అండగా… యువ నాయకులు ముక్కా సాయి వికాస్ రెడ్డి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 8 (మనం న్యూస్ ప్రతినిధి ): రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు ఏకష్టం వచ్చినా తాము అండగా నిలబడతామని టిడిపి యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి తెలిపారు. ఓబులవారిపల్లి మండలం గద్దలరేవులపల్లి గ్రామ వాస్తవ్యులు సంఘ రాజు చంద్ర రాజు కొద్దిరోజుల క్రితం మరణించగా, శనివారం నాడు చంద్ర రాజు సతీమణి, సరస్వతి కి ఆర్థిక సహాయం అందించారు, అనంతరం అదే గ్రామానికి చెందిన రేవూరి కృష్ణయ్య వారి భార్యకు ఆర్థిక సహాయం అందజేశారు అనంతరం వారి కుటుంబాలకు పార్టీ తరఫున వ్యక్తిగతంగా అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లొ కూటమి నాయకులు పాల్కొన్నారు

E-పేపర్

ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.

ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్. అన్నమయ్య జిల్లా /తిరుపతి జిల్లా నవంబర్ 08 ( మనం న్యూస్ ప్రతినిధి ) తిరుపతి, చిత్తూరు జిల్లాల పర్యటనలో భాగంగా శనివారం ఉదయం రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్న జనసేన అధినేత, అటవీ శాఖ మరియు డిప్యూటీ సీఎం కే.పవన్ కల్యాణ్ కు స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ ఈ కార్యక్రమంలో పలు శాఖ అధికారులు, పలువురు ఎమ్మెల్యేలు, తదితర నాయకులు పాల్గొన్నారు.

జనగాం

వందేమాతరం 150 సంవత్సరాల వేడుకలు – ZPHS ఏడునూతులలో ఘనంగా

ఏడునూతుల: నవంబర్ 7: జెడ్పీహెచ్‌ఎస్ ఏడునూతుల పాఠశాలలో వందేమాతరం 150 సంవత్సరాల వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విద్యార్థులు సమూహంగా వందేమాతరం గీతాన్ని ఆలపించి దేశభక్తి గీతాలతో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వందేమాతరం గీతం చరిత్ర, దాని ప్రాముఖ్యత, మరియు స్వాతంత్ర్య సంగ్రామంలో దాని పాత్ర గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు దేశభక్తి నినాదాలతో పాఠశాల ఆవరణాన్ని మారుమోగించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమల్ కుమార్, రాంబాబు, సోమేశ్వర్, జి.రజిత, ఎం.రజిత, యాదగిరి, కవిత, భాస్కర్, విజయశ్రీ పాల్గొన్నారు.

రంగారెడ్డి

* జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఎల్లారెడ్డి డివిజన్ ప్రచారంలో పాల్గొన్న బాల్ నింగని జంగయ్య *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 08 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆదేశాలతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కి మద్దతుగా టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు బాల్ నింగని జంగయ్య, ఎల్లారెడ్డి డివిజన్లో అభ్యర్థితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు మనవి చేయడమైనది ఈ కార్యక్రమంలో 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీ శెట్టి మనోహర్ బాబు, మహేశ్వరం నియోజకవర్గం క్రిస్టియన్ మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ సిహెచ్ అరుణ్ జ్యోతి మహేశ్వరం నియోజకవర్గం ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి తొట్ల భాను ప్రసాద్, బాబాయ్ తదితరులు పాల్గొన్నారు

రంగారెడ్డి

* జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్ జెండా సిహెచ్ యాదయ్య, మల్లేష్ యాదవ్ *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 08 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా 282 బూత్ లో పలు కాలనీలోని ఇంటింటి ప్రచారంలో భాగంగా మహేశ్వరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య మల్లేష్ యాదవ్ మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి యువ నాయకుడు నవీన్ యాదవ్ గెలుపే లక్ష్యంగా ప్రచారం లొ పాల్గొని ప్రభుత్వ పథకాల గురించి ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం నాయకులు మల్లేష్ యాదవ్,అల్లే కుమార్ మంత్రి బాలరాజ్,బిసి సెల్ మహేశ్వరం మండల్ అధ్యక్షులు బొల్లు కుమార్ యాదవ్, రాజు నాయక్,లోకేష్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎర్ర నవీన్ కుమార్, మాణిక్యము కూడా మాజీ ఎంపీటీసీ వడ్డేమోని దాసు, మండల్ యూత్ కాంగ్రెస్ నాయకులు సిహెచ్ బాలకృష్ణ, తోపాటు కార్యకర్తలు కాంగ్రెస్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది

E-పేపర్

మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారితో, శ్రీశైలం అన్నపూర్ణ సత్రం ఉపాధ్యక్షులు బై సాని నాగ వెంకట సత్యనారాయణ గుప్తా

6-11-25 కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం మల్లన్న దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారితో, శ్రీశైలం అన్నపూర్ణ సత్రం ఉపాధ్యక్షులు బై సాని నాగ వెంకట సత్యనారాయణ గుప్తా

E-పేపర్

నీటిలో మునిగి వ్యక్తి మృతి

నీటిలో మునిగి వ్యక్తి మృతి రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు మండలం స్థానిక సురపు రాజు పల్లి బ్రిడ్జి వద్ద సాయంత్రం సుమారు 05.00 గంటల సమయంలో ఒక మగ వ్యక్తి సురపురాజుపల్లి బ్రిడ్జ్ కి పై వైపున సుమారు 200 మీటర్ల దూరానా నీటిలో మునిగి చనిపోయి ఉండినాడు. అతని వయస్సు సుమారు 30 నుండి 35 సంవత్సరాల మద్యలో వుంటుంది, అతను చామనచాయ రంగులో వున్నాడు, అతను చనిపోయిన చోట నలుపు రంగు చెప్పులు మరియు తెలుపు & నలుపు రంగు కలిగిన గళ్ళ టవల్ ఒకటి వున్నది, అతని మెడ లో ఒక నల్ల పూసల ప్లాస్టిక్ దండ ఉండి దానికి హనుమాన్ స్వామి లాకెట్ కలదు. సదరు వ్యక్తికి బీడీ త్రాగే అలవాటు కలిగి వున్ననాడు. ఈ వ్యక్తి వివరాలు తెలిసినవారు SI కోడూరు, 9121100577, ఇన్స్పెక్టర్ కోడూరు సెల్ నెంబర్ 9121100578 కి తెలుపగలరు.

విశాఖపట్నం

శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ ఆధ్వర్యంలో ఘనంగా “కిడ్స్ డే” వేడుకలు

శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ ఆధ్వర్యంలో విశాఖ హుడా చిల్డ్రన్ థియేటర్‌లో కిడ్స్ డే వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. చిన్నారుల సృజనాత్మక ప్రతిభ, ఉత్సాహం, ఆనందం అచ్చొత్త వాతావరణాన్ని సృష్టించాయి. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన వినూత్న హస్తకళలు, బొమ్మలు, చిత్రాలు, వంటకాలు, అలంకరణలు, పండ్ల ప్రదర్శనలు వంటి అనేక ఆకర్షణీయ అంశాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. పిల్లల సృజనాత్మకతను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ పి. అనురాధ, ఇంగ్లీష్ హెచ్‌ఓడి ఇ. జ్యోతి, రచయిత శ్రీ రామానుజం, వర్క్‌షాప్ డైరెక్టర్ సుజాత, వనితా మూర్తి తదితరులు హాజరయ్యారు. వారంతా పిల్లల సృజనాత్మకత, ఉత్సాహం, చైతన్యం పట్ల మెచ్చుకున్నారు. డాక్టర్ పి. అనురాధ మాట్లాడుతూ – “నేటి తరం పిల్లలు టెక్నాలజీని సరిగ్గా వినియోగించుకోవాలి. కానీ అదే సమయంలో ప్రకృతితో మమేకమవడం, ఆటలతో జీవన పాఠాలు నేర్చుకోవడం కూడా అవసరం. తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడపాలి” అని సూచించారు. రచయిత శ్రీ రామానుజం మాట్లాడుతూ – “కథలు చెప్పడం ఒక కళ. కథల ద్వారా మనసును, మన సంస్కృతిని అర్థం చేసుకోవచ్చు. పిల్లల్లో పఠనాభిరుచి పెంపొందించడం అవసరం” అన్నారు. వర్క్‌షాప్ డైరెక్టర్ సుజాత మాట్లాడుతూ – “చిన్నారుల్లోని ప్రతిభను వెలికితీయడం, ప్రోత్సహించడం విద్యాసంస్థల ప్రధాన లక్ష్యం” అని పేర్కొన్నారు. పిల్లలు “వెల్‌కమ్ డ్యాన్స్”, “బాప్ బాప్”, “కృష్ణ”, “ఫ్రూట్ షేక్”, “మెక్‌డొనాల్డ్”, “యెస్ ఐ క్యాన్”, “ఓ మై ఫ్రెండ్ గణేశా” వంటి నృత్య ప్రదర్శనలతో కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా మార్చారు. చివరగా ప్రధాన నిర్వాహకులు అతిథులకు ధన్యవాదాలు తెలుపుతూ పిల్లల ప్రతిభను అభినందించారు. కార్యక్రమం ఆనందభరిత వాతావరణంలో ముగిసింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జోన్సులగడ్డ నర్మదా గారి మరణంపై సిపిఎం నేతల సంతాపం

( పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా కమిటీ సభ్యులు, సిపిఎం పార్టీ నాయకులు కామ్రేడ్ జోన్నలగడ్డ వెంకమరాజు గారి సతీమణి జోన్నలగడ్డ నర్మద అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం పార్టీకి, కుటుంబానికి తీరని లోటని సిపిఎం నేతలు తెలిపారు. నెల్లూరు జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి మరియు జిల్లా కమిటీ సభ్యులు ,మండల కమిటీ సభ్యులు కలిసి నర్మద మృతదేహానికి నివాళులర్పించారు. పార్టీ తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ఈ కష్టసమయంలో ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు. *సిపిఎం పార్టీ నేతల సంతాప ప్రకటన* కామ్రేడ్ జోన్నలగడ్డ వెంకమరాజు సతీమణి జోన్నలగడ్డ నర్మద అకాల మరణం చెందడంతో, సిపిఎం పార్టీ నేతలు ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖ్యంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు మోహన్రావు, అజయ్ కుమార్, గోగుల శ్రీనివాస్, మాదాల వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, కత్తి శ్రీనివాసులు, ముత్యాల గురునాథం, డాక్టర్ దత్తాత్రేయులు,డాక్టర్ రాజేశ్వరరావు, రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగలి పుల్లయ్య, మూలె వెంగయ్య, యుటిఎఫ్ నాయకులు బాబిరెడ్డి,పరం ధామయ్య, జనవిజ్ఞాన వేదిక నాయకులు మాదాల రాము, పోతంసెట్టి విద్యాచరణ్, న్యాయవాది ఐ.రాజా, నారా గోపాల్, ప్రజాశక్తి డెస్క్ ఇన్‌చార్జి ఎం.రమణయ్య, వరికూటి వేంకటరెడ్డి,జగన్నాథం, రామచంద్రరావు, జానా వెంకయ్య, మాజీ మండల అధ్యక్షుడు చంద్రమౌళి గారు తదితరులు పాల్గొని సంతాపం తెలిపారు. నర్మద మరణానంతరం ఆమె కళ్ళని దానం చేసారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.