Friday, 3 April 2026

Blog

అల్లూరి సీతారామరాజు

అరకు: పర్యాటకులతో కళకళలాడిన గిరిజన మ్యూజియం

కార్తిక మాసం, వారాంతం కావడంతో అరకులోయ కు పర్యాటకుల తాకిడి పెరిగింది. పర్యాటకులతో గిరిజన మ్యూజియం కళకళలాడింది. గిరిజన మ్యూజియంలో ఉన్న గిరిజనుల జీవన విధానం, వ్యవసాయ పని ముట్లు, అలంకరణ వస్తువులు, ఆచార వ్యవహారాలు, సామాజిక స్థితిగతులను తెలిపే కళాకృతులు, దింసా నృత్యాలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి. శనివారం మ్యూజియంను 2174 మంది పర్యాటకులు సందర్శించడంతో సుమారు రూ. 1,35,000/- ఆదాయం వచ్చినట్లు మ్యూజియం సిబ్బంది తెలిపారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని గిరిజన సంఘం డిమాండ్

మాడగడ పంచాయతీ దానిరంగిని జంక్షన్ నుండి బస్కి పంచాయితీ భరెంగి బంధ గ్రామం వరకు తారు రోడ్డు మరమత్తులు చేయాలని ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం ఆయా గ్రామస్తులతో గిరిజన సంఘం నాయకులు మరమత్తుకు గురైన రోడ్డును పరిశీలించి, మరమ్మత్తులు చేయాలని నిరసన తెలిపారు. రోడ్డు అద్వానంగా ఉండటంతో అత్యవసర వైద్య సేవలకు ఇబ్బందులు కలుగుతున్నాయని గిరిజన సంఘం నాయకులు కే రామారావు పేర్కొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు (DWCRA Women) E-Bike & E-Auto సబ్సిడీ అందిస్తోంది

పథకం ముఖ్యాంశాలు: ➤ E-Bike కొనుగోలు చేస్తే: ₹ 12,000 సబ్సిడీ ➤ E-Auto కొనుగోలు చేస్తే: ₹ 30,000 సబ్సిడీ ➤ పెట్టుబడి లేకుండా బ్యాంక్ రుణం ➤ Rapido ద్వారా నెలకు ₹25,000 – ₹30,000 ఆదాయం పొందే అవకాశం ➤ ఉచిత డ్రైవింగ్ శిక్షణ కూడా అందుబాటులో అర్హత: • డ్వాక్రా గ్రూప్ సభ్యురాలు కావాలి • Driving License తప్పనిసరి • వయస్సు: 21 – 50 సంవత్సరాలు ఎలా దరఖాస్తు చేయాలి? 1. మీ జిల్లా MEPMA కార్యాలయాన్ని సంప్రదించండి 2. Driving License + Aadhaar + DWCRA ID సమర్పించండి 3. ఫారం పూరించండి → 15 రోజుల్లో ఎంపిక 4. ఎంపికైతే E-Bike లేదా E-Auto అందజేస్తారు పథకం ప్రస్తుతం అందుబాటులో: విజయవాడ • విశాఖపట్నం • తిరుపతి • గుంటూరు • నెల్లూరు • కర్నూలు (త్వరలో ఇతర పట్టణాలకు విస్తరణ).

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఇకపై Google Maps లోనే APSRTC బస్ టికెట్లు

రాష్ట్ర ప్రభుత్వం & Google కలిసి APSRTC బసు టికెట్ బుకింగ్ ను Google Maps లో ప్రారంభిస్తున్నారు. మొదటగా విజయవాడ ↔ హైదరాబాద్ రూట్ పై పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రూట్లకు విస్తరణ. ప్రారంభం: వచ్చే వారం నుండి ప్రయోగాత్మకంగా మొదలు. బుకింగ్ ఎలా చేయాలి? 1. Google Maps ఓపెన్ చేయండి 2. మీ గమ్యస్థానం సెర్చ్ చేయండి (ఉదా: Vijayawada → Hyderabad) 3. చూపించిన APSRTC Bus Routes పై క్లిక్ చేయండి 4. “Buy Ticket / Book Ticket” ఎంపిక చేయండి 5. Online Payment చేసి టికెట్ కొనుగోలు చేయండి ప్రయాణికులకు లాభాలు: • వేర్వేరు Apps ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు • బస్ సమయాలు & మార్గాలు రియల్ టైమ్ లో తెలుస్తాయి • Safe Digital Payment • ఎక్కడ ఎక్కాలి / ఎక్కడ దిగాలి — Maps లోనే స్పష్టంగా కనిపిస్తుంది • అధికారిక APSRTC డేటా నేరుగా Maps లో తరువాత మరిన్ని రూట్లు: విశాఖపట్నం • తిరుపతి • కర్నూలు • కడప మరియు ఇతర ప్రధాన రూట్లు కూడా త్వరలో చేర్చబడతాయి.

E-పేపర్

అయ్యప్ప స్వామి భక్తుల కోసం అందుబాటులో కి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు.. రైల్వే డివిజన్ వినియోగదారుల సభ్యులు.. తల్లెం భరత్ కుమార్ రెడ్డి.

అయ్యప్ప స్వామి భక్తుల కోసం అందుబాటులో కి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు.. రైల్వే డివిజన్ వినియోగదారుల సభ్యులు.. తల్లెం భరత్ కుమార్ రెడ్డి. శబరిమలై కి వెళ్లి శ్రీ అయ్యప్ప స్వామి వారిని దర్శించుకొనుట కొరకు అయ్యప్ప స్వామి భక్తులకు రవాణా సౌకర్యార్థం రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను, ఏర్పాటు చేసినట్లు గుంతకల్ రైల్వే డివిజన్ వినియోగదారుల సభ్యులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన వివరాలు తెలియజేస్తూ 1. రైలు నం. 07101/07102 మచిలీపట్నం కొల్లాం మచిలీపట్నం ప్రత్యేకతలు (10 సేవలు): ఈ ప్రత్యేక రైళ్లు గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పోదనూరు, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, కొట్టాయం, కొట్టాయం, తిరువళ్ల స్టేషన్‌లలో ఆగుతాయి. 2. రైలు నెం. 07103/07104 మచిలీపట్నం-కొల్లం మచిలీపట్నం ప్రత్యేకతలు (10 సర్వీసులు): ఈ ప్రత్యేక రైళ్లు పెడన, గుడ్లవల్లేరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, దొనకొండ, మార్కపూర్‌ రోడ్డు, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట, జోంపేట, సాల్‌పాడి, జోంపేట, మార్గమధ్యంలో ఆగుతాయి. పొడనూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, తిరువల్ల, చెంగన్నూర్ మరియు కాయంకుళం స్టేషన్‌లు ఇరువైపులా ఉన్నాయి. *గమనిక – రైలు నం. 07104 తిరుగు దిశలో దిగువమెట్ట స్టేషన్‌లో కూడా ఆగుతుంది. 3. రైలు నెం. 07105/07106 నర్సాపూర్ – కొల్లాం – నర్సాపూర్ స్పెషల్ (20 సర్వీసులు): ఈ ప్రత్యేక రైళ్లు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొడనూరు, ఈరోడ్, పాలక్కకుళం, పొదనూరు, పాలకొల్లులో ఆగుతాయి. కొట్టాయం, తిరువళ్ల, చెంగన్నూర్ మరియు కాయంకుళం స్టేషన్‌లు ఇరువైపులా ఉన్నాయి. 4. రైలు నెం. 07107/07108 చర్లపల్లి కొల్లాం – చర్లపల్లి స్పెషల్స్ (20 సర్వీసులు): ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడే, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొడనూరు, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూరు, పాలక్కడ్లువున్, పాలక్కడ్లువున్, ఇ. తిరువళ్ల, చెంగన్నూర్ మరియు కాయంకుళం స్టేషన్‌లు ఇరువైపులా ఉన్నాయి అని ఆయన తెలియజేశారు.

E-పేపర్

అయ్యప్ప స్వామి భక్తుల కోసం అందుబాటులో కి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు.. రైల్వే డివిజన్ వినియోగదారుల సభ్యులు.. తల్లెం భరత్ కుమార్ రెడ్డి.

అయ్యప్ప స్వామి భక్తుల కోసం అందుబాటులో కి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు.. రైల్వే డివిజన్ వినియోగదారుల సభ్యులు.. తల్లెం భరత్ కుమార్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం నవంబర్ 08 ( పున్నమి న్యూస్ ప్రతినిధి ) శబరిమలై కి వెళ్లి శ్రీ అయ్యప్ప స్వామి వారిని దర్శించుకొనుట కొరకు అయ్యప్ప స్వామి భక్తులకు రవాణా సౌకర్యార్థం రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను, ఏర్పాటు చేసినట్లు గుంతకల్ రైల్వే డివిజన్ వినియోగదారుల సభ్యులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన వివరాలు తెలియజేస్తూ 1. రైలు నం. 07101/07102 మచిలీపట్నం కొల్లాం మచిలీపట్నం ప్రత్యేకతలు (10 సేవలు): ఈ ప్రత్యేక రైళ్లు గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పోదనూరు, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, కొట్టాయం, కొట్టాయం, తిరువళ్ల స్టేషన్‌లలో ఆగుతాయి. 2. రైలు నెం. 07103/07104 3. మచిలీపట్నం-కొల్లం మచిలీపట్నం ప్రత్యేకతలు (10 సర్వీసులు): ఈ ప్రత్యేక రైళ్లు పెడన, గుడ్లవల్లేరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, దొనకొండ, మార్కపూర్‌ రోడ్డు, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట, జోంపేట, సాల్‌పాడి, జోంపేట, మార్గమధ్యంలో ఆగుతాయి. పొడనూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, తిరువల్ల, చెంగన్నూర్ మరియు కాయంకుళం స్టేషన్‌లు ఇరువైపులా ఉన్నాయి. – రైలు నం. 07104 తిరుగు దిశలో దిగువమెట్ట స్టేషన్‌లో కూడా ఆగుతుంది. 3. రైలు నెం. 07105/07106 నర్సాపూర్ – కొల్లాం – నర్సాపూర్ స్పెషల్ (20 సర్వీసులు): ఈ ప్రత్యేక రైళ్లు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొడనూరు, ఈరోడ్, పాలక్కకుళం, పొదనూరు, పాలకొల్లులో ఆగుతాయి. కొట్టాయం, తిరువళ్ల, చెంగన్నూర్ మరియు కాయంకుళం స్టేషన్‌లు ఇరువైపులా ఉన్నాయి. 4. రైలు నెం. 07107/07108 చర్లపల్లి కొల్లాం – చర్లపల్లి స్పెషల్స్ (20 సర్వీసులు): ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడే, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొడనూరు, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూరు, పాలక్కడ్లువున్, పాలక్కడ్లువున్, ఇ. తిరువళ్ల, చెంగన్నూర్ మరియు కాయంకుళం స్టేషన్‌లు ఇరువైపులా ఉన్నాయని భరత్ కుమార్ రెడ్డి తెలియజేశారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆస్ట్రేలియాలో చరిత్ర పునరావృతం – టీమిండియాకు మరో సిరీస్ కైవసం!

ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించడం గొప్ప విషయం. కానీ టీ20ల్లో భారత్‌కి ఆ జట్టుపై అద్భుతమైన రికార్డు ఉంది. గత 17 ఏళ్లలో ఒక్కసారి కూడా టీమిండియా ఆస్ట్రేలియాలో సిరీస్ కోల్పోలేదు. అదే రికార్డును కొనసాగిస్తూ, ఈసారి కూడా భారత్ 2-1 తేడాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. బ్రిస్బేన్‌లో జరిగిన ఐదో టీ20 వర్షంతో రద్దయింది. ఆ సమయానికి భారత్ 4.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 52 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (23), శుభ్‌మన్ గిల్ (29) వేగంగా రన్స్‌ సాధించారు. కానీ వర్షం ఆ మ్యాచ్‌ను నిలిపివేసింది. తద్వారా భారత్ స్ఫూర్తిదాయక ప్రదర్శనతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. టాస్‌లు ఓడినా టీమిండియా గెలిచింది. వన్డేలు, టీ20లు కలిపి ఈ టూర్‌లో మొత్తం 8 టాస్‌ల్లో 7 సార్లు ఓడినా భారత్ గెలిచి చరిత్ర సృష్టించింది.

కాకినాడ

కార్యకర్త కుటుంబానికి రూ. 5లక్షలు భీమా చెక్కు అందజేసిన ఎమ్మెల్యే చినరాజప్ప

పున్నమి న్యూస్, పెద్దాపురం, 08/11., పెద్దాపురం నియోజకవర్గం ఇటీవల ప్రమాదవశాస్తూ మరణించినటువంటి తెదేపా కార్యకర్త కంది అప్పన అనే రమణ కుటుంబానికి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప చేతుల మీదుగా ఐదు లక్షల రూపాయలు చెక్కును అందజేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో కార్యకర్త రమణ భార్య మంగమాట్లాడుతూ తెదేపా సభ్యత్వం చేయించుకోవడం వల్ల తమ కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు. సభ్యత్వం ద్వారా వచ్చిన ఐదు లక్షల రూపాయలతో ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబం వాటినుంచి బయటపడిందని భావోద్వేకానికి లోనైంది. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కు, ఎమ్మెల్యే చిన రాజప్పలకు ఆమె కృతజ్ఞతలు

విశాఖపట్నం

స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్

స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- అక్కయ్య పాలెం నారాయణ ఇంగ్లీష్ మీడియo పాఠశాలలో “స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ” వినూత్న పద్ధతిలో దిగ్విజయంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల యొక్క తల్లి దండ్రులు పాల్గొని, విద్యార్థుల యొక్క ప్రశ్నాపత్రాలు పరిశీలించడమే కాకుండా ఇప్పటి వరకు పూర్తి అయిన పాఠ్యాంశాల నుంచి నేరుగా ప్రశ్నలను అడిగి వాళ్ళలో “నిబిడీ క్రృతమైన సృజనాత్మక శక్తిని”తెలుసు కున్నారు. ఈ రకమైన బోధనలతో తల్లి దండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం నారాయణ పాఠశాల” ఏ.జి.యం.రాజ్ కుమార్ గారు, ప్రిన్సిపాల్ కె.ఉషారాణి గారు,కో ఆర్డినేటర్ వి.లావణ్య గారు, విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను ,ఈ రకమైన ప్రోగ్రామ్స్ ని, నిర్వహించడం ద్వారా తల్లి దండ్రులు నేరుగా వారి వారి పిల్లలలో వివిధ అంశాల పట్ల అవగాహన ఎలా ఉందో ప్రత్యక్షంగా తెలుసుకోగలిగారు. ఇది ఒక వినూత్న మైన ప్రక్రియగా ప్రతీ ఒక్కరూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో,”వైస్. ప్రిన్సిపాల్ శ్వేత” తో పాటు ఇతర ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు..

విశాఖపట్నం

కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం

కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- కింగ్ జార్జి ఆసుపత్రిలో అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విశాఖపట్నంలో రేడియాలజిస్టులు, రేడియోగ్రాఫర్లు ఉత్సాహంగా పాల్గొని ఎక్స్రే ఆవిష్కర్త డాక్టర్ రాంట్జెన్ కి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేడియాలజిస్టుల సంఘ అధ్యక్షులు డాక్టర్ సురేష్ మాట్లాడుతూ ప్రజల్లో రేడియాలజీ సేవల పట్ల అవగాహన తీసుకురావాలన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన కేజీహెచ్ పర్యవేక్షణాధికారి డాక్టర్ వాణి సందేశాన్నిస్తూ ప్రజల నుండి రేడియాలజీ సేవల కోసం ఎంతో ఒత్తిడితో కూడిన డిమాండ్ ఉన్నప్పటికీ కేజీహెచ్ లో మంచి సేవలు అందిస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తూ ఇంకా మెరుగైన సేవల కోసం ప్రయత్నం చేయాలన్నారు. రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ బుజ్జి బాబు తొలి పలుకులుగా అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తూ 2025 సంవత్సరం థీమ్ ని అనుసరించి రేడియో గ్రాఫర్స్ అంటే కంటికి కనిపించని జబ్బు ని చూపించేవారుగా అభివర్ణించి అభినందించారు.సమావేశంలో రేడియాలజీ ఫ్యాకల్టీ, రేడియోగ్రాఫర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, ఇమేజింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.