Friday, 3 April 2026

Blog

నాగర్‌కర్నూల్

సంపు గుంతలో పడి బాలుడి మృతి*

*నాగర్ కర్నూల్ జిల్లా. నవంబర్ 8 *సంపు గుంతలో పడి బాలుడి మృతి* నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం సుబ్బయ్య కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ప్రాథమిక పాఠశాల ఆవరణం ముందు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో భాగంగా తవ్విన సంపు గుంతలో పడి శశిధరన్ (3) మృతి చెందాడు. ఇటీవల వర్షాలకు నీరు నిండిన గుంతను కాంట్రాక్టర్ భాస్కర్ వదిలివేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. రెండేళ్ల క్రితం తండ్రిని కోల్పోయిన బాలుడి మృతితో తల్లి కన్నీరుమున్నీరైంది. బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

అన్నమయ్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరికు ఘన స్వాగతం

జనసేన పార్టీ పీ.ఏ.సీ సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినా కనకరాజు సూరిను రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు ఘన స్వాగతం పలికారు. రాజంపేట మండలం పులపుత్తూరు గ్రామంలో క్షత్రియ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా జరగనున్న కార్తీక వనమహోత్సవంకు ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు కనకరాజు సూరి రాజంపేటకు విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్ అండ్ బి బంగ్లాలో ఆయనకు జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు,పుష్పగుచ్చాలతో సాదర స్వాగతం పలికారు.కార్యక్రమ ఏర్పాట్లు జోరుగా సాగుతుండగా,రేపటి వనమహోత్సవం క్షత్రియ సమాజం సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించనుందని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ అద్దేపల్లి ప్రతాప్ రాజు, క్షత్రియ సంఘ నాయకులు,ఎన్డీఏ కూటమి నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

టీడీపి సీనియర్ నేత తిరుపతిరెడ్డి కన్నుమూత

సియస్ పురం : మండలంలో ని ఉప్పలపాడు గ్రామానికి చెందిన సింగింగ్ విండో అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి తండ్రి గారైన సీనియర్ నాయకులు చెరుకుపల్లి తిరుపతిరెడ్డి (75)అనారోగ్యంతో శనివారం ఒంగోలు లోని ప్రైవెట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు ఈ సందర్బంగా మండల టీడీపీ అధ్యక్షులు బొప్పూరి రమేష్, రాష్ట్ర కనీస వేతనాల సలహాలామండలి సభ్యులు డాక్టర్ బొమ్మనబోయిన వెంకటేశ్వర్లు, మాజీ సింగల్ విండో చైర్మన్ బోయల్ల నారాయణరెడ్డి, యన్. సి మాలకొండయ్య, మన్నేపల్లి శ్రీనివాసులు, షేక్ రజ్జాబ్ బాషా, కోనంగి వెంకట కొండయ్య, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అమరావతి(ఓఆర్ఆర్‌) పనులు ప్రారంభించిన NHAI

మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక అడుగు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) ప్రాజెక్టుకు నూతన ఊపునిచ్చింది NHAI. మొదటి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తూ, తొలిదశలో 9 గ్రామాల్లో 1,173 ఎకరాల భూమి సేకరణ ప్రారంభమైంది. రైతులకు భూసేకరణ చట్టం 2013 ప్రకారం న్యాయమైన పరిహారం అందించనున్నారు. 189.4 కిలోమీటర్ల పొడవు, ఆరు లేన్లతో రూపొందే ఈ రోడ్డు అమరావతిని గుంటూరు, విజయవాడ, తెనాలి అర్బన్ క్లస్టర్‌లతో అనుసంధానం చేస్తుంది. రూ.24,791 కోట్ల వ్యయంతో గ్రీన్ హైవేగా అభివృద్ధి చెందనున్న ఈ ప్రాజెక్టు 12 ప్యాకేజీలుగా విభజించబడింది. 2019లో నిలిచిపోయిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతోంది.

అల్లూరి సీతారామరాజు

జనజాతియ గౌరవ దివాస్ నీ విజయవంతం చేద్దాం* బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవిఎన్ మాధవ్*

స్వాతంత్ర్య సమర యోధుడు భగవాన్ బిర్ష ముండా జయంతి (జనజాతియ గౌరవ దివాస్ ) నీ అందరూ సమిష్టిగా పని చేసి విజయవంతం చేద్దాం అని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పీవిఎన్ మాధవ్ పిలుపు నిచ్చారు, శనివారం పాడేరు లోని ఎన్జిఓ కార్యాలయం వద్ద జనజాతి గౌరవ దివాస్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన తెగల పెద్దల సమావేశం లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు, ముందుగా భారత మాత, భగవాన్ బిర్షా ముండా చిత్రపటాల వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి, పూల మాలలు వేసి నివాళులు అర్పించారు, అనంతరం పాడేరు, అరకు, రంపచోడవరం, పార్వతీపురం నుంచి వచ్చిన వివిధ గిరిజన ఉప తెగల పెద్దలతో భగవాన్ బిర్షా ముండా జయంతి నిర్వహణ గురించి చర్చించి, పలు అభిప్రాయాలను సేకరించారు, అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం గిరిజన స్వాతంత్ర సమర యోధులు త్యాగాలు మరువలేనిదనీ అన్నారు, అందులో ప్రముఖులు భగవాన్ బిర్షా ముండా ఆంగ్లయులను ఎదరించి 25 ఏళ్ళకే ప్రాణ త్యాగం చేసారని అన్నారు, గిరిజనులను ఏకం చేసి ఆధ్యాత్మిక మార్గం లో తీసుకు వెళ్లి విదేశీ మూకల ఆగడాలను అరికట్టడం లో సఫలం అయ్యారని పేర్కొన్నారు, వారి త్యాగలను గుర్తించిన గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం నవంబర్ 15 నీ జనజాతీయ(గిరిజన) గౌరవ దివాస్ గా ప్రకటించి గిరిజన ప్రజల ఆత్మ గౌరవాన్నీ నిలబెట్టారన్నారు, కావున గిరిజన ప్రజల తరుపున నరేంద్ర మోదీ కి ధన్యవాదములు తెలుపుతున్నామని అన్నారు, నవంబర్ 15 న బిర్షా ముండా జయంతి సందర్బంగా 16 వ తేదీన పాడేరు లోని జూనియర్ కళాశాల వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని అన్ని గిరిజన తెగల ప్రజలు,బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు, ఉద్యోగ, ఉపాధ్యాయ,గిరిజన సంఘాల ను కలుపుకొని భారీ బహిరంగ సభను నిర్వహించుకోవటం కోసం విశేషప్రయత్నం చేస్తున్నాం అన్నారు, రాష్ట్రం లోని ముఖ్య మైన వ్యక్తులు అతిధులుగా పాల్గొంటారని అన్నారు, గిరిజన ప్రజలు అందరూ కలిసి జనజాతీయ గౌరవ దివాస్ నీ నిర్వహించుకుని అదే రోజు భగవాన్ బిర్షా ముండా కాంశ్య విగ్రహ ప్రతిష్ట చేద్దాం అన్నారు, ఈ కార్యక్రమం లో బీజేపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి మట్ట ప్రసాద్,ఎస్టి కమిషన్ చైర్మన్ బొజ్జి రెడ్డి,ఆంధ్ర వనవాసి కళ్యాణ్ ఆశ్రమం క్షేత్ర సంఘటన కార్యదర్శి తాడేపల్లి రామకృష్ణ, రాష్ట్ర సంఘటన కార్యదర్శి ఆదినారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు మఠం శాంత కుమారి,బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పాంగి రాజారావు,రాష్ట్ర కార్యదర్శి స్వప్న కుమారి, కేతినేని సురేంద్ర మోహన్,మాజీ మంత్రి మణికుమారి,జానపద కలలు, సృజనాత్మక అకాడమీ చైర్మన్ గంగులయ్య, ట్రైకర్ డైరెక్టర్ కూడ కృష్ణ రావు, టూరిజం డైరెక్టర్ కిల్లు రమేష్ నాయుడు,ఎస్టి కమిషన్ సభ్యులు కిల్లో సాయిరాం,వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ప్రతినిధులు సన్యాసి నాయుడు, లకే రవీంద్ర పాత్రుడు,వైస్సార్సీపీ మహిళ అధ్యక్షులు కురుస పార్వతమ్మ,జనసేన అరకు నియోజకవర్గం ఇంచార్జి శెట్టి చిరంజీవి, జనసేన నాయకులు శెట్టి ఆనంద్,మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పెనుమాక రవికుమార్, బీజేపీ పూర్వ జిల్లా ప్రధాన కార్యదర్శి సల్ల రామకృష్ణ బీజేవైఎం నాయకులు గోపాల పాత్రుడు, పాంగి మత్స్య కొండ బాబు, ఏబీవీపీ నాయకులు అంగనైని ఆనంద్, జేఏసీ జిల్లా చైర్మన్ రామారావు దొర, ముక్కి శేషాద్రి,గిరిజన తెగల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

E-పేపర్

కేంద్ర పౌర విమానాయ శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్ కి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం చంగల్ రాజు

రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ గడ్డం చంగల్ రాజు కేంద్ర పౌర విమానాయ శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్ కి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగినది.

అల్లూరి సీతారామరాజు

ప్రైవేటీకరణతో వైద్య విద్య అందని ద్రాక్ష : అరకు ఎమ్మేల్యే

ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసిపి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని అరకులోయ మండలం పెదలబుడు పంచాయతి లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను నిర్మిస్తే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పడం దారుణమని అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరమైతే పేద, మధ్యతరగతి వారు వైద్య విద్యకు దూరమవుతారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి వారు తీసుకున్న నిర్ణయం ఏ స్థాయిలో ఉన్నదని తెలియజేయడానికే ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: పర్యాటకులతో కళకళలాడిన గిరిజన మ్యూజియం

కార్తిక మాసం, వారాంతం కావడంతో అరకులోయ కు పర్యాటకుల తాకిడి పెరిగింది. పర్యాటకులతో గిరిజన మ్యూజియం కళకళలాడింది. గిరిజన మ్యూజియంలో ఉన్న గిరిజనుల జీవన విధానం, వ్యవసాయ పని ముట్లు, అలంకరణ వస్తువులు, ఆచార వ్యవహారాలు, సామాజిక స్థితిగతులను తెలిపే కళాకృతులు, దింసా నృత్యాలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి. శనివారం మ్యూజియంను 2174 మంది పర్యాటకులు సందర్శించడంతో సుమారు రూ. 1,35,000/- ఆదాయం వచ్చినట్లు మ్యూజియం సిబ్బంది తెలిపారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని గిరిజన సంఘం డిమాండ్

మాడగడ పంచాయతీ దానిరంగిని జంక్షన్ నుండి బస్కి పంచాయితీ భరెంగి బంధ గ్రామం వరకు తారు రోడ్డు మరమత్తులు చేయాలని ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం ఆయా గ్రామస్తులతో గిరిజన సంఘం నాయకులు మరమత్తుకు గురైన రోడ్డును పరిశీలించి, మరమ్మత్తులు చేయాలని నిరసన తెలిపారు. రోడ్డు అద్వానంగా ఉండటంతో అత్యవసర వైద్య సేవలకు ఇబ్బందులు కలుగుతున్నాయని గిరిజన సంఘం నాయకులు కే రామారావు పేర్కొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు (DWCRA Women) E-Bike & E-Auto సబ్సిడీ అందిస్తోంది

పథకం ముఖ్యాంశాలు: ➤ E-Bike కొనుగోలు చేస్తే: ₹ 12,000 సబ్సిడీ ➤ E-Auto కొనుగోలు చేస్తే: ₹ 30,000 సబ్సిడీ ➤ పెట్టుబడి లేకుండా బ్యాంక్ రుణం ➤ Rapido ద్వారా నెలకు ₹25,000 – ₹30,000 ఆదాయం పొందే అవకాశం ➤ ఉచిత డ్రైవింగ్ శిక్షణ కూడా అందుబాటులో అర్హత: • డ్వాక్రా గ్రూప్ సభ్యురాలు కావాలి • Driving License తప్పనిసరి • వయస్సు: 21 – 50 సంవత్సరాలు ఎలా దరఖాస్తు చేయాలి? 1. మీ జిల్లా MEPMA కార్యాలయాన్ని సంప్రదించండి 2. Driving License + Aadhaar + DWCRA ID సమర్పించండి 3. ఫారం పూరించండి → 15 రోజుల్లో ఎంపిక 4. ఎంపికైతే E-Bike లేదా E-Auto అందజేస్తారు పథకం ప్రస్తుతం అందుబాటులో: విజయవాడ • విశాఖపట్నం • తిరుపతి • గుంటూరు • నెల్లూరు • కర్నూలు (త్వరలో ఇతర పట్టణాలకు విస్తరణ).

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.