* జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి చేసే నాయకులను గెలిపిస్తారు.సబితా ఇంద్రారెడ్డి*
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 09 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్ పరిధిలో పలు ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా నల్ల పోచమ్మ దేవాలయం, నాగార్జున నగర్ కాలనీ, ఎల్లారెడ్డి గూడ పరిసర కాలనీల్లో సబితా ఇంద్రారెడ్డి ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. అడుగడుగునా స్థానిక ప్రజలు, మహిళలు, యువత కారు గుర్తు నినాదాలతో నీరాజనాలు పలికారు.పాదయాత్ర సందర్భంగా మాట్లాడిన సబితా ఇంద్రారెడ్డి జూబ్లీహిల్స్ ప్రజలు ఎల్లప్పుడూ అభివృద్ధి, సంక్షేమం పట్ల నిబద్ధత గలవారు.రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కారు గుర్తుకు ఓటు వేయండి కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరచండి మా పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ని భారీ మెజార్టీతో గెలిపించండిఅని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉప్పల్ శాసనసభ్యుడు లక్ష్మారెడ్డి, తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎల్ రమణ నవీన్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా విభాగం సభ్యులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











