Thursday, 2 April 2026

Blog

E-పేపర్

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి ప్రజా ఉద్యమం. *పార్టీలకు అతీతంగా కదలిన యువత, విద్యార్థి లోకం వామపక్షాలు* ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి…కొరముట్ల శ్రీనివాసులు, కొండూరు అజయ్ రెడ్డి.

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి ప్రజా ఉద్యమం. *పార్టీలకు అతీతంగా కదలిన యువత, విద్యార్థి లోకం వామపక్షాలు* ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి…కొరముట్ల శ్రీనివాసులు, కొండూరు అజయ్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 12 ( పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ ): మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి నియోజకవర్గ ఇన్చార్జ్ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో, కడప పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు కొండూరు అజయ్ రెడ్డి పర్యవేక్షణలో, రైల్వే కోడూరు పట్టణంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపి చేపట్టిన ప్రజా ఉద్యమం కార్యక్రమంలో ఐదు మండలాల వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు, మరియు, వామపక్షాలు, మేధావులు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో, కలిసి బుధవారం నాడు పట్టణంలోని రాజ్ కన్వెన్షన్ నుండి ర్యాలీగా మొదలై తహసిల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ ఇన్స్పెక్ట ర్ కు వినతిపత్రం సమర్పించిన అనంతరం పత్రికా విలేకరులతో కొరముట్ల శ్రీనివాసులు, కొండూరు అజయ్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చినప్పటినుండి రాష్ట్రంలో 11 మెడికల్ కళాశాలలు ఉండగా 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ముందు చూపు ఉన్న ముఖ్యమంత్రిగా పేద పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతనంగా 17 మెడికల్ కళాశాలలు తీసుకురాగా వీటిలో 5 మెడికల్ కళాశాలలను 2023-2024 లో ప్రారంభించారని తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు ఆదనంగా అందించారని, తదనంతరం గతేడాది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా గద్దెనెక్కడంతో వైద్య విద్యకు గ్రహణం పట్టుకుందని, 90 శాతం పనులు పూర్తయి మరికొన్ని నిర్మాణ దశలో ఉండంగా నేడు వాటిని చంద్రబాబు నాయడు పిపిపి విధానంలో ప్రైవేటుపరం చేస్తూ కూటమి ప్రభుత్వం యొక్క యొక్క ముఖ్య అనుచరులకు గంపగుత్తగా కట్టబెట్టే నిర్ణయం తీసుకోవడం దారుణమని అన్నారు, కొత్త వైద్య కళాశాలలను చంద్రబాబు కుట్రపూరితంగా అడ్డుకోవడంతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని, ఎంబిబిఎస్ చదువు కోవాలన్న విద్యార్థుల ఆశలకు చంద్రబాబు సర్కారు గండి కొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు, వెంటనే ప్రైవేటీకరణను ఉపసంహ రించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పుల్లంపేట ఎంపీపీ సీనియర్ నాయకులు ముద్దా బాబుల్ రెడ్డి, ఓబులవారిపల్లి మండల కన్వీనర్ వత్తలూరు సాయి కిషోర్ రెడ్డి, చిట్వేల్ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులురెడ్డి, పుల్లంపేట మండల కన్వినర్ ముస్తాక్, పెనగలూరు మండల కన్వీనర్ చక్రపాణి, కోడూరు మండల కన్వీనర్, వైస్ ఎంపీపీ ధ్వజా రెడ్డి, రాయలసీమ జోగు బూత్ కమిటీ మెంబర్ తల్లెం రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు తల్లెం భరత్ కుమార్ రెడ్డి సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పండుగోలమణి, ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి రాజశేఖర్ జెడ్పిటిసి రత్నమ్మ,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముందల నాగేంద్ర, స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ నంద బాల, పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్, వైయస్సార్సీపి ఎస్సీ సెల్ కార్యదర్శి లింగం లక్ష్మీకర్, సర్పంచులు ఎంపీటీసీలు ఐదు మండలాల కార్యకర్తలు నాయకులు తదితరులు భారీగా పాల్గొన్నారు

తిరుపతి

ప్రైవేట్​ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఆర్టీవో, సీఐ

పట్టణంలోని ప్రైవేట్ స్కూల్ బస్సులను బుధవారం ఆర్టీవో దామోదరం నాయుడు, టూ టౌన్ సీఐ ప్రకాష్ కుమార్ సంయుక్తంగా తనిఖీ చేశారు. వాహనాల ఫిట్నెస్, పత్రాలు మరియు డ్రైవర్ల లైసెన్సులను పరిశీలించారు. పరిమితికి మించి విద్యార్థులను విద్యార్థులను తీసుకుని వెళుతున్న రెండు ప్రైవేట్ స్కూల్ బస్సులపై జరిమానా విధించారు. అధికారులు మాట్లాడుతూ విద్యార్థుల భద్రతను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని, డ్రైవర్లను వేగంగా నడపవద్దని ఆయన సూచించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గుబ్బాల సూర్యప్రకాశ్‌ అప్పనపల్లి ZPHS పాఠశాల సందర్శన

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ను ఈరోజు జిల్లా డిప్యూటీ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ గుబ్బల సూర్యప్రకాశ్‌ గారు సందర్శించారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రత, బోధనా విధానం, విద్యార్థుల హాజరు, మరియు సమ్మెటివ్‌ అసెస్మెంట్‌-1 పరీక్షల నిర్వహణపై ఆయన సమీక్ష చేశారు. విద్యార్థులతో పరస్పర ముచ్చట చేస్తూ వారి అభ్యాస స్థాయిని తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాల విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు సూచనలు ఇచ్చారు. పాఠశాల ఆవరణను పరిశీలిస్తూ పచ్చదనం మరియు పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. విద్యార్థుల్లో పోటీ భావన, నైతిక విలువలు పెంపొందించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ సందర్శనలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Blog

కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నాయకులు

ఈరోజు రైల్వే కోడూరు.ధర్మపురములో ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు మరియు మాజీ శాసన సబ్యులు. కొరమట్ల. శ్రీనివాసులు గారి ఆదేసాలా మేర కు17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చెస్తునందుకు కుటమి సర్కారు పై నిరా సనాగా కోటి సంతకాలు కార్యక్రమములో పాల్గోని సంతకాలు చేయిస్తున్న వైఎస్సార్‌సీపీ ఏపీ టూరిజం మాజీ డైరెక్టర్‌ మండల నాగేంద్ర. పట్టణ కన్వీనర్ చెనంశెట్టి రమేష్.సర్పంచ్.బి.శివయ్య. రమణ b. నాగరాజు సుబ్బారాయుడు

తెలంగాణ

ఎంపీ గారిని కలిసిన శాలిగౌరారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు

నకిరేకల్ :నవంబర్ (పున్నమి ప్రతినిధి) 👉 వంగమర్తి గ్రామం నుండి చిత్తలూరు వరకు (ఆర్ అండ్ బి రోడ్డు ) 👉 శాలిగౌరారం నుండి భైరవుని బండ వయా అమ్మనబోలు (ఆర్ అండ్ బి రోడ్డు ) 👉 గురజాల నుండి ఉప్పలంచ (పి అండ్ ఆర్ రోడ్డు ) 👉 దోనబండ ఎక్స్ రోడ్డు నుంచి సాకర్ల (శాలిగౌరారం) వరకు (పి అండ్ ఆర్ రోడ్డు ) రోడ్ల నిర్మాణం కోసం త్వరగా నిధులు మంజూరు చేసేలా కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులతో కలిసి శాలిగౌరారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు కందాల సమరం రెడ్డి బుధవారం హైదరాబాదులో గౌరవ భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి కోరారు.దీనికి ఎంపీ గారు సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగిందని త్వరలోనే రోడ్లు మంజూరు అవతాయని మండల కాంగ్రెస్ అధ్యక్షులు తెలిపారు. ఎంపీ గారిని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చింతా ధనంజయ,వడ్లకొండ పరమేష్, ఇంద్రకంటి యాదయ్య, యాదగిరి తదితరులు ఉన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా నిరసన

నందిగామ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా భారీ పాదయాత్ర మరియు ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ముఖ్య సమన్వ యకర్తలుగా పాల్గొని ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది.పోటు వైపున గాంధీ సెంటర్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తంచేశారు. పార్టీ నేతలు ప్రస్తుత ప్రభుత్వ ప్రభుత్వ వైద్య విద్యా ప్రైవేటీ కరణతో పేద విద్యార్థులవల్ల ఉద్దేశ్యం నష్టం, కూటమి ప్రభుత్వం మనుషులే సంపద సృష్టించుకోవడం కోసం మాత్రమే ముందడుగు వేస్తోంది, వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్న సమయంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు అభివృద్ధి చెందాయని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగబోతుందని స్పష్టమైనది గా తెలిపారు. రాష్ట్రంలో సర్వాంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం లోపాలని, ప్రజల సమర్ధనతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ నిరసన కార్యక్రమంలో బహుళంగా పాల్గొన్నారు.

తిరుపతి

ప్రతి కార్యకర్తకు న్యాయం చేయడమే నా లక్ష్యం…. ఎమ్మెల్యే బొజ్జల

పార్టీ ని నమ్ముకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేయడమే నా లక్ష్యం అని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం శ్రీకాళహస్తి, ఏర్పేడు, రేణిగుంట మండల , గ్రామ, వార్డు అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్టులు, బూత్ లెవెల్ ఏజెంట్ల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం చేసిన నాయకులు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కార్యకర్తకు న్యాయం చేయడం, పార్టీని బలోపేతం చేయడం తన లక్ష్యమని, కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ గుర్తింపు లభించేలా బాధ్యతలు కేటాయించామని, అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించామని ఆయన స్పష్టం చేశారు. పదవి చిన్నదా, పెద్దదా అన్నది కాదని, బాధ్యతలతో పనిచేసే ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఇవ్వడమే ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

E-పేపర్

శ్రీ సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గురువుగారు. ముత్యాల పెంచలయ్య గారికి. హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

రైల్వే కోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు స్థానిక రంగనాయకులపేటలోని ఉన్నటువంటి శ్రీ సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గురువుగారు.ముత్యాల పెంచలయ్య గారికి. హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన అధ్యాపకులు విద్యార్థులు ఆయన స్నేహితులు బంధువులు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు.

ఎన్ టి ఆర్ జిల్లా

క్లస్టర్ యూనిట్ ఇన్‌ఛార్జిలు, బూత్ కన్వీనర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా – పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ పట్టణంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో క్లస్టర్ యూనిట్ ఇన్‌ఛార్జిలు మరియు బూత్ కన్వీనర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్ర మం నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాల యంలో బహుళ ఉత్సాహంతో నిర్వహించారు.కార్యక్రమంలో పాల్గొన్న తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, పార్టీ పదవి పొందడం గౌరవప్రదమైన విషయం అని పేర్కొన్నారు. “పార్టీలో చిన్నదా, పెద్దదా అనే తేడా లేకుండా కష్టపడిపనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు తప్పదు,” అని ఆమె స్పష్టం చేశారు. ఆమె మాట్లాడుతూ, మనబోతుల శ్రీరామ్ పార్టీ పట్ల విశ్వాసం, నిబద్ధతతో పనిచేసి రాష్ట్ర దాసరి కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఎంపిక కావడం గర్వ కారణమని అభినందించారు. “కోట్లల్లో మనకూ ఒక పదవి రావడం గౌరవప్రదమైన విషయం. ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతం కోసం కృషిచేయాలి,” అని పిలుపునిచ్చారు. సౌమ్య మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతౌ ల్యంగా ముందుకు తీసుకెళ్తోం దని తెలిపారు. ప్రజల వద్దకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు.“బూత్ కన్వీనర్లు, యూనిట్ మరియు క్లస్టర్ ఇన్‌ఛార్జిలు పార్టీకి వెన్నెము కలు. వీరు సమర్థవంతంగా పని చేస్తే పార్టీ మరింత బలపడుతుం ది, ప్రజా విశ్వాసం పెరుగు తుంది,” అని ఎమ్మెల్యేఅన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు బొచ్చుల సుబ్రహ్మణ్యం బోసు, లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, మండల పట్టణ తెదేపా నేతలు, గ్రామ వార్డు నాయకులు, కూటమి నేతలు, మహిళా కార్యకర్తలు, క్లస్టర్ మరియు యూనిట్ ఇన్‌ఛార్జిలు, బూత్ కన్వీనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తగా నియమితు లైన బాధ్యులు పార్టీ పట్ల అంకితభావంతో పనిచేయాలని సంకల్పం వ్యక్తం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.