Wednesday, 1 April 2026

Blog

విశాఖపట్నం

14న ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ విశాఖ రాక*

*14న ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ విశాఖ రాక* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * ఈ నెల 14వ తేదీన ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ విశాఖపట్నం రానున్నారు. ఈ నెల 14వ తేదీన ఉదయం 8.30 గంటలకు వాయు మార్గం ద్వారా విశాఖపట్నం చేరుకొని అక్కడ నుండి ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ కు చేరుకుంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలసి ఇంజనీరింగ్ గ్రౌండ్ లో అల్పాహార విందులో పాల్గొంటారు. అనంతరం ఉదయం 8.55 గంటలకు 30వ సిఐఐ పార్ట్ నర్షిప్ లో పాల్గొంటారు. అదే రోజున ఉదయం 11.15 గంటలకు బయలుదేరి ఐఎన్ఎస్ డేగ చేరుకొని అక్కడ నుండి ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఈమేరకు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ MN హరేందిర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి ,ఉప రాష్ట్రపతి సెక్యూరిటీ ఆఫీసర్ సింగ్,జాయింట్ కలెక్టర్,మయూర్ అశోక్,ఇతర ఉన్నత అధికారులు yvs మూర్తి ఆడిటోరియం లో ఏర్పాట్లపై సమీక్ష చేశారు.ఉప రాష్ట్రపతి పర్యటనకు అన్ని పటిష్టమైన ఏర్పాట్లు , పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కార్యదర్శి కార్తికేయ మిశ్రా,పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సమావేశం లో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

మాదకద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖపట్నం రేంజ్ పరిధిలో “అభ్యుదయం సైకిల్ ర్యాలీ” ప్రారంభం-* *హోం శాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారి చేతులమీదుగా ప్రారంభం*

*మాదకద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖపట్నం రేంజ్ పరిధిలో “అభ్యుదయం సైకిల్ ర్యాలీ” ప్రారంభం-* *హోం శాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారి చేతులమీదుగా ప్రారంభం* *“మాదకద్రవ్యాల రహిత భవిష్యత్తు వైపు పెడలింగ్!”* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు విశాఖపట్నం రేంజ్ పరిధిలోని అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం మరియు శ్రీకాకుళం జిల్లాలలో “అభ్యుదయ సైకిల్ ర్యాలీ” ప్రారంభమైంది. విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపినాథ్ జట్టి, ఐపీఎస్ గారి ఆలోచనలతో, జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో సుమారు 30 రోజుల పాటు, 1,000 కిలోమీటర్ల దూరం సైకిల్ యాత్రగా కొనసాగుతుంది. ర్యాలీని ఈ రోజు ఉదయం పాయకరావుపేటలోని గౌతమ్ థియేటర్ జంక్షన్ వద్ద గౌరవ హోం శాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు ఘనంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి గారు స్వయంగా సైకిల్ తొక్కి ర్యాలీని శ్రీప్రకాశ్ కాలేజ్ వరకు నడిపారు. విద్యార్థులతో కలిసి మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించి, “మాదకద్రవ్యాలు వద్దు – జీవితమే ముద్దు” అంటూ ఆకట్టుకున్నారు. ర్యాలీ ప్రారంభానికి విద్యార్థుల ఫ్లాష్‌మాబ్ ఆకర్షణగా నిలిచింది. స్థానిక ప్రజలు, విద్యార్థులు అడుగడుగునా ర్యాలీకి హర్షధ్వానాలు చేశారు. *హోం శాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు మాట్లాడుతూ –*  “మాదకద్రవ్యాల నిర్మూలన కోసం రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయం. యువతే మన భవిష్యత్తు – వారి జీవితాలను మత్తు పదార్థాలు చెడగొట్టకుండా కాపాడటం మనందరి బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలనలో ఉక్కుపాదం మోపింది.  ఈ దిశగా ‘ఈగల్’ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాం. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించాలి. గంజాయి రవాణా చేసినా, సేవించినా వెంటనే 1972 నంబర్‌కి కాల్ చేయండి – పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుంటారు.  ప్రస్తుతం కఠినమైన NDPS చట్టాలు అమల్లో ఉన్నాయి. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. డ్రగ్స్‌కు నో, జీవితానికి యెస్ చెప్పుదాం” అని ఆమె పిలుపునిచ్చారు. *విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపినాథ్ జట్టి, ఐపీఎస్ గారు మాట్లాడుతూ –*  అభ్యుదయం సైకిల్ యాత్రలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పాయకరావుపేట నియోజకవర్గం నుండి ప్రారంభించడం జరిగింది. ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం విశాఖపట్నం రేంజ్ పరిధిలో సుమారు 1000 కిలోమీటర్లు సైకిల్ యాత్రలో ఐదు జిల్లాలకు చెందిన 25 మంది బృందంతో కూడిన పోలీస్ సిబ్బంది వెళ్తున్న మార్గంలో స్కూల్స్, కాలేజీలు మరియు గ్రామాలు,ముఖ్య కూడళ్ల వద్ద ప్రజలకు మాదక ద్రవ్యాలు అక్రమ వినియోగం పట్ల అవగాహన, చైతన్యం కల్పించడం జరుగుతుంది. డిఐజి గారు రేంజ్ ఫరిదిలో అన్ని జిల్లాల ఎస్పీలతో సంప్రదించి ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గం నుండి ప్రారంభమైన సైకిల్ ర్యాలీ వారి వారి ప్రాంతాల్లో ర్యాలీ జరిగినప్పుడు ఆ జిల్లాల ఎస్పీలు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని డిఐజి గారు ఆదేశించారు.  “ఈ ‘అభ్యుదయ సైకిల్ ర్యాలీ’ మాదకద్రవ్యాల నిర్మూలనలో ఒక చారిత్రాత్మక అడుగు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా హోం శాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారి మార్గదర్శకత్వంలో గంజాయి నిర్మూలనలో విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంది.  గత 14 నెలల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి పంటను పండించే రైతులకు అవగాహన కల్పించి, వారికి ప్రత్యామ్నాయ పంటల సాగు అవకాశాలు కల్పించాము. ఏఎస్ఆర్ జిల్లాలో 2024-2025 వ సంవత్సరం కి గాను 10,817.25 ఎకరాల్లో సుమారు 46.8 లక్షల మొక్కలను ప్రత్యామ్నాయ పంటలు పంపిణి చేయడం జరగగా, 2025-2026 వ సంవత్సరం కి గాను 196 మంది రైతులకు 210 ఎకరాలు లో 1,35,453 యూకలిప్టస్ మొక్కలు పంపిణీ చేయడం జరిగినది.  దీని ఫలితంగా, గంజాయి పంట సాగు 2021 -2022 వ సంవత్సరం కి గాను 7515 ఎకరాలలో సాగు చేయగా 2024-2025 వ సంవత్సరం కి గాను 93 ఎకరాలకు, 2025-2026 వ సంవత్సరం కి గాను ZERO సాగు (Cultivation) కు తీసుకురావడం జరిగినది. ఆ పంటను పూర్తిగా ధ్వంసం చేసి, చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. డ్రోన్ లు, ఉపగ్రహ చిత్రాల ద్వారా నిరంతరం పర్యవేక్షించడం వలన గంజాయి సాగు తగ్గిందని నిర్ధారించబడింది.  గత 14 నెలల్లో రేంజ్ పరిధిలో 865 కేసుల్లో 2,500 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 95 మందిపై PIT NDPS, 61 మందిపై PD యాక్ట్, 1,474 మంది పై సస్పెక్ట్ షీట్లు తెరవడం జరిగింది.  గంజాయి అక్రమ వ్యాపారంలో పాల్గొన్న వారిపై 14 ఆస్తి కేసులు నమోదు చేసి,13 మంది నిందితులపై రూ.10,04,89,621/- కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశాము.  2024-2025 సంవత్సరానికి గాను 53 NDPS కేసుల్లో 87 మందికి 10 నుండి 20 సంవత్సరాల కఠిన శిక్షలు విధించబడ్డాయి.  2024-2025 సంవత్సరానికి గాను 1109 కేసులు లో 60,369 కేజీ ల గంజాయి ని పట్టుకొని, 768 వాహణములను సీజ్ చేయడం జరిగినది.  ఇప్పటివరకు 18,314 “సంకల్పం” అనే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు – 10,41,325 మంది హాజరయ్యారు – 13,606 గ్రామాలు/పట్టణాలలో ఈ కార్యక్రమాలు జరిగాయి – 4,649 విద్యా సంస్థలు – సుమారు 4 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.  గంజాయి పిర్యాదులకోశం 3 88 డ్రాప్ బాక్సులు ను వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేశారు.  ఈ చర్యలన్నీ యువత భవిష్యత్తు రక్షణ కోసమే. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. ఈ ర్యాలీ విజయవంతం కావడానికి సహకరిస్తున్న విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.” *జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు మాట్లాడుతూ –*  “మాదకద్రవ్యాల సేవనాన్ని, అక్రమ రవాణాను అరికట్టే దిశగా ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు విశాఖపట్నం రేంజ్ పరిధిలో ‘అభ్యుదయ సైకిల్ ర్యాలీ’ను ప్రారంభించాం.  ఈ ర్యాలీ సుమారు 30 రోజుల పాటు 800 కిలోమీటర్ల దూరం కొనసాగుతుంది. ర్యాలీ సందర్భంగా ప్రతి మండలంలో అవగాహన సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థులతో చర్చలు జరిపి మత్తు పదార్థాల దుష్ప్రభావాలను వివరించనున్నాం.  గత ఏడాది కాలంలో అనకాపల్లి జిల్లా పరిధిలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. ఇప్పటివరకు 3,500కి పైగా విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం.  మత్తు పదార్థాల గురించి ఎవరైనా సమాచారం ఇస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972 లేదా 112కి కాల్ చేయాలని ప్రజలను, యువతను కోరుతున్నాను. ఈ ర్యాలీకి అండగా నిలిచిన హోం శాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారికి, రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరికీ నా కృతజ్ఞతలు.” ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన్ రావు, సబ్‌ డివిజన్ డీఎస్పీలు శ్రీమతి ఎం.శ్రావణి, శ్రీ పి.శ్రీనివాసరావు, శ్రీ వి.విష్ణు స్వరూప్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఈ.శ్రీనివాసులు , పాయకరావుపేట ఇన్స్పెక్టర్ అప్పన్న, ఎక్సైజ్ మరియు ఇతర జిల్లా అధికారులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుపతి

వైద్య విద్య సేవలను ప్రైవేటీకరణను వ్యతెరేకిస్తూ భారీ నిరసన ర్యాలీ చేపట్టన వైకాపా

శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి,MLC సిపాయి సుబ్రమణ్యం నాయకత్వంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ర్యాలీగా తరలివెళ్లి ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్బంగా వైకాపా నాయకులూ మాట్లాడుతూ.. పేద ప్రజల వైద్యవిద్య హక్కును కాలరాస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టామని పేద, మధ్యతరగతి ప్రజలకు దక్కాల్సిన వైద్య విద్య, వైద్య సేవలను ప్రైవేటీకరణ చేస్తూ, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగిందన్నారు. అనంతరం, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకుల బృందం ఆర్డీవో కార్యాలయ ఏవోని కలిసి, పేద విద్యార్థులు, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ, ఈ ప్రైవేటీకరణ చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మెమరాండంను సమర్పించారు. ఈ ర్యాలీలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అన్ని మండలాలు, పట్టణ ప్రాంతం నుండి భారీ సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు,కార్యకర్తలు ముఖ్యంగా మహిళలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

తిరుపతి

పుదూరు లక్ష్మణ్ రెడ్డి కర్మ క్రియలలో పాల్గొన్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం

శ్రీకాళహస్తి నవంబర్ 12, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి బిపి అగ్రహారం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుదూరు లక్ష్మణ్ రెడ్డి కర్మ క్రియలలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, పాల్గొని లక్ష్మణ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియచేసారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, రత్నం రెడ్డి, ఆర్కార్డు శంకర్, పటాన్ ఫరీద్, కంట ఉదయ్ కుమార్, ముని కృష్ణారెడ్డి, సాధన మున్నా రాయల్ , బాలా గౌడ్ పాల్గొని తమ సంతాపం తెలియజేశారు.

జోగులాంబ గద్వాల

శ్రీ జోగులాంబ దేవిని దర్శించుకున్న HRPCP తెలంగాణ అధ్యక్షురాలు.

అలంపూర్ : నవంబర్ 12 ( పున్నమి ప్రతినిధి ) హెచ్ఆర్పిసిపి ( హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ ) తెలంగాణ అధ్యక్షురాలు అనురాధ రెడ్డి బుధవారం జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం జోగులాంబ దేవి ఆలయంలో కుంకుమార్చన నిర్వహించారు, వేదపండితులతో ఆశీర్వచనం పొందారు. అనంతరం అనురాధ రెడ్డి మాట్లాడుతూ …. మానవుల హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత, ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ నేనుంటానని సగర్వంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఆర్ పి సి పి సభ్యులు జ్యోతి, కవిత, రశ్మిత, కవిత, జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు తిరుపాల్, ఉపాధ్యక్షులు జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శివయ్యను దర్శించిన విశాఖ ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి నవంబర్ 12, పున్నమి టెంపుల్ న్యూస్ : శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవార్ల దర్శనార్ధం వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కుటుంబసమేతంగా విచ్చేశారు. వీరికి ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయి స్వాగతం పలికి ప్రత్యెక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీ గురువేద దక్షణమూర్తి సన్నిధిలో వేదపండితులచే ప్రత్యేక ఆశీర్వచనాలు చేయించి వాయు లింగేశ్వరుని తీర్థప్రసాదాలు, చిత్రపటం, శేషవస్త్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

పేదోళ్ల సొంతింటికల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం- ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి నవంబర్ 12, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణ సమీపంలో సుఖబ్రాహ్మశ్రమం వద్ద ప్రభుత్వం మంజూరు చేసిన ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదోళ్ల సొంతింటికల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు ఆశయం మన్నారు. ఒకే రోజులో పేదలకు 3 లక్షల ఇళ్ళ గృహ ప్రవేశాలు జరుగుతున్నాయని రాష్ట్రంలో ఇదొక చరిత్రని కూటమి పాలనలో పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మేలు చేస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని అయన తెలిపారు.

తిరుపతి

టిడిపి మండలాధ్యక్షుని చొరవతో వీధిలైట్లు ఏర్పాటు

తొట్టంబేడు నవంబర్ 12, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని తొట్టంబేడు పంచాయతీ పలు ప్రాంతాల్లో మండల టిడిపి అధ్యక్షులు రావిళ్ళ మునిరాజు నాయుడు సూచనల మేరకు , ఎంపీడీవో సురేంద్రనాథ్, డిప్యూటీ ఎంపీడీవో గిరిధర్ ఆదేశాల మేరకు చిలకా వారి కండ్రిగ, మయూరి టవర్స్ రోడ్డు, బంగారమ్మ కాలనీలోని 3,5 వీధులలో బుధవారం వీధిలైట్లు ఏర్పాటు చేశారు. గురువారం బంగారమ్మ కాలనీలోనే మిగిలిన వీధులు, సి ఆర్ ఎన్ కండ్రిగ, సాయి నగర్, రామచంద్రపురం రోడ్డు, మయూర్ అపార్ట్మెంట్, కుర్నగుంట హరిజనవాడ ప్రాంతాల్లో వీధిలైట్లు వేయనున్నట్లు పంచాయతీ కార్యదర్శి భార్గవ్, పంచాయతీ సర్పంచ్ సుబ్బయ్య తెలిపారు. ఈ వీధిలైట్లు ఏర్పాటు కార్యక్రమంలో తొట్టంబేడు సింగిల్ విండో చైర్మన్ భీమాల భాస్కర్ ముదిరాజ్, చిలకూరు మనీ, చిలక వారి కండ్రిక కృష్ణయ్య లు పాల్గొన్నారు.

తిరుపతి

వసతి గృహంలో ఆర్.ఓ. ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి నవంబర్ 12, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలోని బి సి బాలుర వసతి గృహం నందు నూతన ఆర్.ఓ. ప్లాంట్ ను బుధవారం నాడు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వసతి గృహ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్ ఆంధ్రప్రదేశ్

పేదల పాలిట పెన్నిధి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!🔹వింజమూరు అశోక్ నగర్ లో నవ వధువుకు 10 వేల రూపాయల పెళ్లి కానుక..

నవంబర్ 12న వింజమూరు మండల కేంద్రంలోని అశోక్ నగర్ లో పాజర్ల చిన్నయ్య – శ్రీమతి శోభా దంపతుల కుమార్తె చి||ల||సౌ|| వనజ వివాహం ఎంతో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ కాకర్ల చారిటబుల్ ట్రస్టు తరపున రూ.10,000 (పది వేల రూపాయలు) లను పెళ్లి కానుకగా వింజమూరు మండల టీడీపీ పార్టీ నాయకులు ద్వారా వధువు కుటుంబ సభ్యులకు అందజేయించి, తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ప్రతి పేద కుటుంబానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వింజమూరు మండల టీడీపీ అధ్యక్షుడు గూడ నరసారెడ్డి, టౌన్ టీడీపీ అధ్యక్షులు యోగినేని శ్రీనివాసులు, మండల ఎస్సీ సెల్ విభాగం సీనియర్ నాయకులు జి. హజరత్, బూత్ కో-కన్వీనర్ జి. జ్ఞాన కుమార్, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.