Wednesday, 1 April 2026

Blog

విశాఖపట్నం

ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేరుస్తాం. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేరుస్తాం. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద లబ్ధిదారులు ఎంపిక చేసి మంజూరు పత్రాలు అందజేస్తున్నట్టు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం సీతంపేట లోని పార్టీ కార్యాలయంలో 21 మంది లబ్ధిదారులు ఎంపిక చేసి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతి అని, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని అన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అదేవిధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. లబ్ధిదారులందరికీ ఈసందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ హోసింగ్ AE M. M. నాయుడు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ T. రాజశేఖర్, జనసేన సౌత్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివ ప్రసాద్ రెడ్డి, 33 వార్డ్ కార్పొరేటర్ GK, కనీస వేతనాలు సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ తెలుగు లక్ష్మి, 32 వార్డ్ కార్పొరేటర్ కందుల నాగరాజు 34 వ వార్డ్ అధ్యక్షులు నీలం రాజు, 32వ వార్డ్ అధ్యక్షులు తెలుగు అర్జున్, 29 వ వార్డ్ అధ్యక్షులు శ్రవణ్, 37 వార్డ్ అధ్యక్షులు గరికిన రవి, జనసేన వార్డ్ ఇంచార్జిలు డా, మర్రివేముల శ్రీనివాస్, నారా నాగేశ్వరావు, జనసేన నాయకులు మాన్యల శ్రీనివాస్, ప్రణీత్ మరియు జనసైనికులు, వీరామహిళలు పాల్గొన్నారు.

E-పేపర్

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కూటమి ప్రభుత్వం : మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

నంద్యాల ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పేదలందరికీ ఇళ్ల నిర్మాణ పథకం కింద ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టిందని . పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తూ, రాష్ట్రంలో కోట్లాది మంది పేదలకు గూడు కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు ఈ రోజు పేదల సొంతింటి కల సాకారమవుతున్న పండుగ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటిస్తుందని. ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని అందులో భాగంగానే నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో సొంతింటి కలను నెరవేర్చుకున్న మారెళ్ళ వైష్ణవి (లబ్దిదారుని పేరు) భర్త పేరు మారెళ్ళ ఆదినారాయణ వారి ఇంటిని ఈరోజు అధికారులతో కలిసి మంత్రివర్యులు ఫరూక్ ప్రారంభించడం జరిగింది. అనంతరం నూతన గృహప్రవేశం చేసినందుకు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మారెళ్ళ వైష్ణవి, మారెళ్ళ ఆదినారాయణ కు నూతన వస్త్రములు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ గత 16 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,85,557 గృహాలను పూర్తి చేయడం జరిగిందని ఇందులో ముఖ్యమంత్రి చొరవతో చేపట్టిన నిర్మాణాలు, PMAY, BLC, PMJM పథకాల కింద పూర్తైనవి ఉన్నాయన్నారు . గత 16 నెలల్లో దాదాపు 3 లక్షల ఇళ్ల పూర్తి చేసి పేదలకు తాళాలు అప్పగించడానికి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నిర్మాణంలో ఆగిపోయి ఉన్న ఒక్క ఇళ్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారని . ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో ఇళ్ల నిర్మాణంలో వేగం పెరిగిందని. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా 3 లక్షల ఇళ్లను పూర్తి చేసి సామూహిక గృహ ప్రవేశాలకు ప్రభుత్వం వేడుకకు సిద్ధమవుతోందని తెలిపారు. పూర్వ పాలకుల వైఫల్యాలు – ప్రస్తుత ప్రభుత్వం చొరవ గత టీడీపీ ప్రభుత్వంలో (2014-19)లో పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేందుకు పట్టణాల్లో 1.5, గ్రామాలలో 2 సెంట్లు ఇచ్చి పేదల పెన్నిదిగా చంద్రబాబు నిలిస్తే దాన్ని సెంటుకే కుదించి పేదల ద్రోహిగా జగన్ రెడ్డి నిలిపోయాడని. 2014-19లో టిడ్కోతో కలిపి 12 లక్షల గృహాలను పూర్తి చేసి పేదలకు అందిస్తే జగన్ రెడ్డి మాత్రం ప్రచార ఆర్భాటం తప్పించి పేదలకు గృహాలను పూర్తి చేసి ఇచ్చింది లేదని పైగా NTR రూరల్ హౌసింగ్ లబ్ధిదారులకు రూ.920 కోట్ల బకాయిలా చెల్లించకుండా నిలిపివేశాడని అన్నారు. “ఇళ్లు కాదు, ఊళ్లే నిర్మిస్తాం” అని చెప్పి రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ ఏవి కల్పించకుండానే పెండింగ్ లోనే ఉన్న ఇళ్లకు గృహ ప్రవేశాలు చేసి వైసీపీ నాయకులు చేతులు దులుపుకున్నారని. నేడు కూటమి ప్రభుత్వం ఇళ్లతో పాటు రోడ్లు, నీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు అందిస్తుందని. గత వైసీపీ ప్రభుత్వం పేదల కలలకు తాళం వేస్తే , కూటమి ప్రభుత్వం ఆ తాళం తెరిచి గౌరవంగా ఇల్లు ఇస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రూలర్ ఎమ్మార్వో శ్రీవాణి, ఎంపీడీఓ సుగుణ శ్రీ , డిప్యూటీ ఎంపీడీఓ నాగజ్యోతి, హోసింగ్ డిఈ విజయ బాబు , చాపిరేవుల గ్రామ టిడిపి నాయకులు భూపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి , సుబ్బారెడ్డి, సర్పంచ్ రాజు, సంజన , సుబ్బరాయుడు, మునిస్వామి, రాజశేఖర్, బిజ్జల శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

ఘణంగా విశాఖ బీచ్ రోడ్డులో యూనిటీ రన్*

*ఘణంగా విశాఖ బీచ్ రోడ్డులో యూనిటీ రన్* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* ఉక్కు మనిషి భారత మాజీ ఉప ప్రధాని, మాజీ కేంద్ర హోంమంత్రి సర్ధార్ వల్లబాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా యూనిటీ రన్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా విశాఖ బీచ్ రోడ్డులో మైభారత్ ఆధ్వర్యంలో జరిగిన యూనిటీ రన్ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ , నార్త్ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జెండా ఊపి ఐక్యతా రన్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖండ భారతావని కోసం ఎంతో కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ నేటి యువతకు స్ఫూర్తి అని అన్నారు. బీచ్ రోడ్ కాళీమాత ఆలయం నుండి వైయంసిఏ వరకు భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేస్తూ యూనిటీ రన్ చేసారు. కార్యక్రమంలో బిజేపి రాష్ట్ర మీడియా పేనలిస్ట్ కరణంరెడ్డి నరసింగరావు, రాష్ట్ర కార్యదర్శి సుజాత,టిడిపి జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ,కూటమి నాయకులు సిరసపల్లి నూకరాజు, దానేష్, శంకరరావు, నాగేశ్వరరావు, కృష్ణారెడ్డి ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు మహిళ డిగ్రీ కళాశాలలో ఆర్వో ప్లాంట్ ప్రారంభించిన పీఓ

శుభ్రమైన త్రాగునీటి వలన ఆరోగ్యంగా ఉంటామని పాడేరు ఐటీడీఏ పీఓ తిరుమణి శ్రీపూజ తెలిపారు. బుధవారం అరకులోయ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ జితేంద్ర శర్మ తో కలసి ఆర్వో ప్లాంటు ప్రారంభించిన సంధర్బంగా పీఓ మాట్లాడారు. విద్యార్ధినిలు త్రాగునీటికి ఆర్వో ప్లాంట్ వాటర్ ను వినియోగించాలని ప్రిన్సిపల్ చలపతి రావు తెలిపారు. కళాశాలకు ఆర్వో ప్లాంట్ మంజూరు చేసినందు జిల్లా కలెక్టర్ కు, పీఓ కు, యూనిబ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ కు ప్రిన్సిపల్ చలపతిరావు కృతజ్ఞతలు తెలిపారు.

విశాఖపట్నం

ప్రతి పేదవానికి సొంత గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం*

*ప్రతి పేదవానికి సొంత గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం* *నగర మేయర్ పీలా శ్రీనివాసరావు* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * నగరంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంత గూడు కల్పించడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన పెందుర్తి జోన్ వేపగుంట లోని కళ్యాణ మండపంలో పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అర్బన్ పథకం కింద బెనిఫిసరీ లీడ్ కన్స్ట్రక్షన్ (బి. ఎల్. సి) పత్రాలను పంపిణీ కార్యక్రమం పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పలువురు కార్పొరేటర్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ పీలా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఇది పేదల సంక్షేమ ప్రభుత్వమని గూడు లేని ప్రతి నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు గూడు కల్పించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. నీడ లేని పేదలకు సొంతంగా ఇల్లు నిర్మించుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృషి చేస్తున్నాయని తెలిపారు. పట్టణ ప్రాంతాలలో స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక స్థోమత లేని వారికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాని మంత్రి ఆవయాస్ యోజన 2.0 అర్బన్ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. ఈ పథకం ద్వారా 2 లక్షల 50 వేలు అందిస్తుందని, నేడు 77, 78, 93, 94, 95, 96, 97, 98 వార్డులలో 709 మంది అర్హులైన వారికి బెనిఫిసరీ లీడ్ కన్స్ట్రక్షన్ (బి. ఎల్. సి) పత్రాలను అందించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వాటా కింద 1లక్ష 50 వేలు, రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు సమకూర్తుంది అన్నారు. అనంతరం పెందుర్తి శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిరంతరం సంక్షేమం కార్యక్రమాలు చేపడుతుందన్నారు. పెందుర్తి నియోజకవర్గం లోని పలు వార్డులలో ఇండ్ల స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక స్తోమత లేని వారి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అర్బన్ పథకం ద్వారా 2 లక్షల 50 వేలు అందిస్తుందన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి, సంక్షేమం రెండు నిరంతరం కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని పేర్కొన్నారు నేడు 709 మందికి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అందించడం జరిగినది అన్నారు. ఈ కార్యక్రమంలో బల్ల శ్రీనివాసరావు, ముమ్మన దేముడు, రాపర్తి కన్నా, సేనాపతి వసంతలక్ష్మి, జోనల్ కమిషనర్ శంకర్, ఎమ్మార్వో ఆఫీస్ సిబ్బంది, హౌసింగ్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఏపీలో ట్రిలియల్ డాలర్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం*

*ఏపీలో ట్రిలియల్ డాలర్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం* *గత 16 నెలల్లో ఏపీకి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి* *ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ఏకైక అజెండా* *ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది* *స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ముందుకు వెళ్తున్నాం* *సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ పై ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్* *న్యూఢిల్లీ* నవంబర్ (విశాఖ పున్నమి ప్రతినిధి) ఏపీలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ పై ఢిల్లీలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. విశాఖపట్నంలో ఈ నెల 14,15 తేదీల్లో జరగబోయే సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ కు మిమ్మల్ని ఆహ్వానించేందుకు ఇక్కడకు వచ్చాను. రాష్ట్రం కోసం యువగళం పేరుతో 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. పాదయాత్రలో ఎదురైన అనేక సంఘటనలు నన్ను తీర్చిదిద్దాయి. పాదయాత్ర సమయంలో గంగాధర నెల్లూరులో మోహన అనే మహిళతో మాట్లాడాను. తన భర్త మద్యానికి బానిసై చనిపోయాడని, రోడ్డు పక్కన బజ్జీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారని సదరు మహిళను అడిగినప్పుడు.. తన ఇద్దరు పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఆ సమయంలో యువత అంతా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అడిగారు. *గత 16 నెలల్లో ఏపీకి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి* ఎన్నికల సమయంలో మేం ఆరు హామీలు ఇచ్చాం. మొదటి హామీ కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పిస్తామని చెప్పాం. ఇది కేవలం లక్ష్యం మాత్రమే కాదు.. ఇది మా యువతకు ఇచ్చిన ప్రమాణం. దేశంలో ఏ రాష్ట్రం ఇప్పటివరకు చేపట్టని ఎంప్లాయిమెంట్ విషన్ ఇది. అందుకే మేం రూపొందించిన ప్రతి పాలసీ కూడా ఉద్యోగాల సృష్టికోసమే రూపొందించాం. ఉద్యోగాల కల్పనే ఏకైక అజెండాగా పెట్టుకున్నాం. గత 16 నెలల్లో 120 బిలయన్ డాలర్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. ఇవి కేవలం సంతకాలకి పరిమితమైన ఎంవోయూలు కావు. నిజమైన ప్రాజెక్టులు. కొన్ని ప్రాజెక్టులకు ఎంవోయూలు కూడా కుదుర్చుకోలేదు. ఉదాహరణకు ఆర్సెలర్ మిట్టల్. దేశంలో అతిపెద్ద ఉక్కు కర్మాగారం. ఆర్సెలర్ మిట్టల్ తో మేం ఎలాంటి ఎంవోయూ చేసుకోలేదు. ఆదిత్య మిట్టల్ తో ఒక్క జూమ్ కాల్ ద్వారా ఆ సంస్థ వచ్చింది. మరో ఉదాహరణ గూగుల్. దేశంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి గూగుల్ డేటా సిటీ విశాఖకు వచ్చింది. దేశంలోనే ప్రముఖ 10 సోలార్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీల్లో 5 సంస్థలు ఏపీని ఎంచుకున్నాయి. బీపీసీఎల్ లక్ష కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ప్రాజెక్ట్ ను స్థాపిస్తోంది. ఎన్టీపీసీ రూ.1.65 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ను అభివృద్ధి చేస్తోంది. *స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం* ఈ పెట్టుబడుల ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయనేదే ముఖ్యం. విశాఖలో జరిగే పార్టనర్ షిప్ సమ్మిట్ లో కూడా పెట్టుబడులకు వేగవంతమైన సౌకర్యాల కల్పన కోసం ఏపీని ఎంచుకోవాలనే థీమ్ తో ముందుకు వెళ్తున్నాం. రాష్ట్రంలో పెట్టుబడుల వేగం ఎంతో పెరిగింది. స్థానిక కంపెనీలు, ఎంఎస్ఎంఈలు కూడా వెయ్యి కోట్లకు పైగా క్యాపిటల్ ఎక్స్ పాన్షన్ చేస్తున్నాయి. నెల రోజులు ఆలస్యం అయినా మొత్తం బిజినెస్ ప్లాన్ మారిపోతోంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది చాలా ముఖ్యం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల వల్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. అందుకే టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలు వచ్చాయి. ఇది కేవలం ఐటీ రంగానికే కాదు. బ్లూ కాలర్ ఉద్యోగాలు, హాస్పిటాలిటీ వరకు విస్తరించింది. పర్యాటక రంగాన్ని ఇండస్ట్రీగా గుర్తించిన తొలి రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. వచ్చే మూడేళ్లలో 50వేల హోటల్ గదులు సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. *ఏపీలో నమో(NAMO) ప్రభుత్వం ఉంది* పెట్టుబడిదారులు ఏపీని ఎందుకు ఎంచుకోవాలో మూడు కారణాలు చెబుతాను. ఒకటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. రెండోది సమర్థవంతమైన నాయకత్వం. చంద్రబాబునాయుడు గారికి అనుభవం కలిగిన మంచ్రి ట్రాక్ రికార్డ్ ఉంది. మూడోది పరిపాలన. పలు రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండగా.. ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. ఏపీలో నమో(NAMO) ప్రభుత్వం ఉంది. నాయుడు గారు, మోడీ గారు. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం. ఈ కారణాల వల్ల యువ పారిశ్రామిక వేత్తలు ఏపీని ఎంచుకుంటున్నారు. విశాఖలో నవంబర్ 14,15 తేదీల్లో పార్టనర్ షిప్ సమ్మిట్ నిర్వహణకు ఏపీకి అవకాశం ఇచ్చినందుకు సీఐఐకి ధన్యవాదాలు. చంద్రబాబునాయుడు గారితో సీఐఐకి మంచి అనుబంధం ఉంది. విశాఖలో జరిగే పార్టనర్ షిప్ ఎందుకంటే.. పెట్టుబడిదారులు, పాలసీ మేకర్లు, ప్రభుత్వం, ప్రజలందరూ కలిసి భవిష్యత్ అవకాశాలను పరిశీలించే వేదిక. క్వాంటమ్, ఏఐ, మెటీరియల్ సైన్సెనస్ రంగాల్లో భవిష్యత్ అవకాశాలను పరిశీలించబోతున్నాం. 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం 410 ఒప్పందాలు కుదుర్చుకోనుంది. వీటి ద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ఈ సమ్మిట్ కు రానున్నారు. మొత్తం 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు, 12 అంతర్జాతీయ సంస్థలు, జీ20 దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ వక్తలు హాజరుకానున్నారు. ఈ సదస్సులో మొత్తం 48 సెషన్లు, ఒక ప్లీనరీ, 27 సాంకేతిక సెషన్లు, 3 స్టాండ్ అలోన్ సెషన్లు, 11 రాష్ట్ర పరమైన సెషన్లు ఉంటాయి. *ఏపీలో ట్రిలియల్ డాలర్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం* పార్టనర్ షిప్ సమ్మిట్ జరిగే సమయంలో రూ.2.7 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. అప్పుడే దేశం విజయం సాధిస్తుంది. ఏపీలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా నిర్దేశించారు. క్లస్టర్ల వారీ విధానంలో పారిశ్రామికాభివృద్ధికి కృషిచేస్తున్నామని మంత్రి లోకేష్ వెల్లడించారు.

సి ఐ ఐ సమ్మిట్ కు జీవీఎంసీ ఏర్పాట్లు సర్వం సిద్ధం.

సి ఐ ఐ సమ్మిట్ కు జీవీఎంసీ ఏర్పాట్లు సర్వం సిద్ధం. *దేశ ,విదేశాల అతిథులను ఆకర్షించేలా నగర అభివృద్ధి, సుందరీకరణ. *దేశంలోనే మొట్టమొదటి జీరో వేస్ట్ మోడల్ కార్యక్రమానికి శ్రీకారం. -జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్. *విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి * విశాఖ వేదికగా నవంబరు 14 ,15 తేదీల్లో జరుగనున్న 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సు కు జీవీఎంసీ చేపట్టిన ఏర్పాట్లను సర్వం సిద్ధం చేయడమైనదని, పరిశుభ్రత ప్రాధాన్యత దిశగా దేశంలోనే మొట్టమొదటి జీరో వేస్ట్ మోడల్ కార్యక్రమంగా ఈ సదస్సు నిర్వహించబడుతుందని, దేశ, విదేశాల నుండి పారిశ్రామికవేత్తలు, అతిథులు, ప్రతినిధులు ఈ పెట్టుబడుల సదస్సుకు విచ్చేయుచున్నందున వారిని ఆకట్టుకునేలా విశాఖ నగరాన్ని దీర్ఘకాలిక పద్ధతిలో మరింత అభివృద్ధి పరుస్తూ, సుందరీకరణ పనులతో తీర్చిదిద్దడం జరిగినదని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ బుధవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యం స్వచ్ఛతకు, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తున్నారని, ఆ దిశగా ఆయన ఆదేశాల మేరకు విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరుగుచున్న ఈ సదస్సును “జీరో వేస్ట్ మోడల్ ” కార్యక్రమంగా శ్రీకారం చుట్టి దేశంలోనే మొట్టమొదటి కార్యక్రమంగా చేపడుతున్నామని, ఉత్పత్తి అయ్యే అన్ని రకాల వ్యర్థాలను 100 శాతం రీసైకిల్ చేసి పునర్వినియోగం చేయనున్నామని, అలాగే ప్రాంగణం సమీపంలో ఆన్ సైట్ కంపోస్ట్ యూనిట్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని అలాగే ఈ కార్యక్రమం దేశంలో మొట్టమొదటి కార్యక్రమంగా విశాఖ నగరంలో జరుగుచున్నదని, ఇకపై విశాఖ నగరంలో జరుగబోయే అన్ని కార్యక్రమాలు జీరో వేస్ట్ కార్యక్రమాలుగా ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. విశాఖ నగర అభివృద్ధి ,సుందరీకరణ పనులను జీవీఎంసీ చేపట్టి పూర్తిచేసిన పనులను కేవలం సిఐఐ భాగస్వామ్య సదస్సు కొరకు మాత్రమే కాకుండా త్వరలో విశాఖలో జరుగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్, నేవీ డే, తదితర కార్యక్రమాల కొరకు విశాఖ నగరం సుందరీకరణతో సిద్ధంగా ఉండేలా దీర్ఘకాలిక కార్యచరణ చేపట్టి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమైనదన్నారు. ముఖ్యంగా విశాఖ నగరానికి విచ్చేస్తున్న సందర్శకులు, విహారయాత్రికలు, అతిధులు బీచ్ ను సందర్శిస్తున్నందున బీచ్ రోడ్లను, ఫుట్ పాత్ లను,అందమైన మొక్కలతో పచ్చదనంతో సెంటర్ మీడియన్ లను, విద్యుత్తు కాంతులను , రాత్రిపూట కూడా ఎక్కువ కాంతినిచ్చేలా ఆర్కే బీచ్ లో నాలుగు అతిపెద్ద బీచ్ సాండ్ పోల్స్ లను ఏర్పాటుచేసి రంగు రంగుల విద్యుత్ దీపాలతో బీచ్ ని సుందరంగా తీర్చిదిద్దడమైనదన్నారు. అలాగే భాగస్వామ్య సదస్సుకు విచ్చేయనున్న అతిథులను ఆకర్షించుకునేందుకు గాను జీవీఎంసీ యంత్రాంగం మూడు నెలల కాలం నుండి నగరంలో 26 స్ట్రెచెస్ లో ఐదు కేటగిరీలలో రోడ్లు , ఫుట్పాతులు, సెంటర్ మీడియన్ లు, పలు జంక్షన్ లు, బస్ బే లు, వినూత్న ఆకృతి గల బొమ్మలు, పచ్చదనంతో కూడిన ఆకర్షణీయమైన మొక్కలు, విద్యుత్ దీపాలంకరణ, వాల్ పెయింటింగులు, మ్యూరల్ ఆర్ట్స్, తదితర అభివృద్ధి, సుందరీకరణ పనులను పూర్తి చేసామన్నారు. సదస్సు ప్రాంగణం ,పరిసరాలలో , పార్కింగ్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, టాయిలెట్ల సదుపాయాన్ని ఏర్పాటు చేయడమైనదని, అలాగే వ్యర్థాలను వెలికి తీసి నిత్య పరిశుభ్రత కొరకు పారిశుద్ధ్య కార్మికులను 15వ తేదీ వరకు మూడు షిఫ్ట్ ల లో 24 గంటలు విధులు నిర్వహించేలా ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమం జయప్రదం చేసేందుకు జీవీఎంసీ అధికారులు ,జోనల్ కమిషనర్లు, అన్ని విభాగాలు మూడు నెలల నుండి నిరంతరం శ్రమించి నగర అభివృద్ధి ,సుందరీ కరణ పనులను తీర్చిదిద్దారన్నారు.

విశాఖపట్నం

మాధవధార ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహంలో మంత్రి డీఎస్ బీవీ స్వామి ఆకస్మిక తనిఖీ

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* మాధవధార ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహంలో మంత్రి డీఎస్ బీవీ స్వామి ఆకస్మిక తనిఖీ హాస్టల్ పరిసరాలు పరిశీలించిన మంత్రి స్వామి విద్యార్థినిలతో ముఖాముఖి నిర్వహించి హాస్టల్లో సౌకర్యాలు, సమస్యలు తెలుసుకున్న మంత్రి విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలని సిబ్బందికి మంత్రి సూచన విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ వైసీపీ హయాంలో సమస్యలకు నిలయాలుగా ఉన్న గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు నేడు పరిశుభ్ర,ఆరోగ్యకర వాతావరణంతో విద్యార్థులకు ఆనంద నిలయాలుగా మారాయి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.143 కోట్లతో గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు చేశాం గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం పేద పిల్లలు సమాజంలో గొప్ప స్థాయికి ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం అని మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు

విశాఖపట్నం

విశాఖపట్నం పోర్ట్ పూల్ కళాసీలగా టైం స్కేల్

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* నవంబర్ 13న విశాఖపట్నం పోర్ట్ అథారిటీస్ ఆధ్వర్యంలో జరగబోయే బోర్డ్ మీటింగ్లో, గత 30 సంవత్సరాల నుండి విశాఖపట్నం పోర్ట్ పూల్ కళాసీలగా తక్కువ జీతాలకు పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, టైం స్కేల్ విధానంగా జీతభత్యాలు 43240 రూపాయలకి పెంచుతూ, రేపు బోర్డు మీటింగ్ లో నిర్ణయం తీసుకోవాలని ,విశాఖపట్నం పోర్ట్ పూల్ కళాశీల గౌరవ అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ ఈరోజు విశాఖ పోర్టు ఏవోబి ఆఫీస్ వద్ద విశాఖ పోర్ట్ చైర్మన్ అంగముత్తు గారిని ,సెక్రటరీ వేణుగోపాల్ గారిని కోరారు. వారు సానుకూలంగా స్పందించారు. గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ,పవన్ కళ్యాణ్ గారు,నారా లోకేష్ గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు,కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రులు శర్వానంద్ సోనావాళ్ళ, సంతన్ ఠాకూర్, విశాఖ ఎంపీ శ్రీ భరత్, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పళ్ళ శ్రీనివాస్ రావు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తో పాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మరియు విశాఖ జిల్లా బిజెపి అధ్యక్షులు పరుశురామరాజు పోర్ట్ ఫుల్ కళాశాల అందరికీ టైం స్కేల్ చెయ్యమని గతంలో ఇచ్చిన లేఖలను పరిగణంలోకి తీసుకోవాలని, బోర్డు మీటింగ్ ద్వారా న్యాయం చేయాలని సెక్రటరీ సిహెచ్ పోతురాజు, అధ్యక్షులు కె.అప్పారావు, అలీమ్, వాసుపల్లి రాంబాబు, నాయుడు తదితరులు కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.