Wednesday, 1 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఏల కల్ల V p.r కృషితో నేరవేరిన వేల

-జాతీయ రహదారి -16పై చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ వధ వెచిలే అండర్ పాస్ యెర్పట్టుకు 115 కోట్లు మంజూరు – v.p.r అనుకుంటే సాధించి తిరుతరణి మరోసారి రుసువైంధి -గతంలో నిత్యం ట్రాఫిక్,ప్రమధాలతో అవస్థలు పడే వారు ప్రజలు -ఇకాపై ప్రమధలకు తవుందాదు….ట్రాఫిక్ కి ఇబంది వుండదు -చింతారెడ్డి పాలెం జంక్షన్ నుండి ముత్తుకూరు రోడ్డు వరకు ఇరువిపుల సర్వీస్ రోడ్లు ఏర్పటు -సి.ఎం.చంద్రబాబు గారికి,కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ వేమిరెడ్డి -వేమిరెడ్డి కృషి వల్ల హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

Blog

మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం… కందం తొక్కిన వైసీపీ శ్రేణులు

వైద్య కళాశాలలను, వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నారని, ఇది ముమ్మాటికి దుర్మార్గమైన చర్యలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నేడు అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ఉద్యమ నిరసన ర్యాలీకి ఇచ్చిన పిలుపు మేరకు నేడు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పి పి నాగిరెడ్డి,మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా, వైసిపి స్టేట్ కౌన్సిల్ నెంబర్స్ సాయినాథ్ రెడ్డి, రామలింగారెడ్డి, వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, స్టేట్ వైసిపి మహిళా విభాగం జనరల్ సెక్రెటరీ శశికళ రెడ్డి ఎంపీపి, ఆర్థర్ సైమాన్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, వైసిపి మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షుడు కారు రవికుమార్ వైసీపీ జిల్లా సెక్రెటరీలు దేవనగర్ బాషా, శివనాగిరెడ్డి, సాంస్కృతిక విభాగం వైసీపీ జిల్లా అధ్యక్షుడు టీవీ రమణ గోస్పాడు మండలం వైసిపి అధ్యక్షుడు పి పి రాజశేఖర్ రెడ్డి నంద్యాల మండలం వైసీపీ అధ్యక్షుడు బసవేశ్వర రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు పురుషోత్తమ రెడ్డి విజయ శేఖర్ రెడ్డి నంద్యాల అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు శ్రీనివాసులు కౌన్సిలర్స్ కోఆప్షన్ సభ్యులు వార్డు ఇన్చార్జులు, సర్పంచులు ఎంపీటీసీలు ముఖ్య నేతల ఆధ్వర్యంలో, వైసీపీ విద్యార్థి విభాగం, వైసీపీ నేతలు, శ్రేణులు నేడు నంద్యాల పట్టణం ఉదయానందా రెసిడెన్సీ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. స్వాతంత్రానికి పూర్వం నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 12 మెడికల్ కళాశాలలు ఉన్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడు చేయని విధంగా ఏకంగా 17 మెడికల్ కళాశాలలను రాష్ట్రానికి తీసుకు వచ్చారని పేర్కొన్నారు. మొదటి విడతలో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించారని, ఈ కళాశాలల్లో 750 మెడికల్ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ప్రారంభించిన మెడికల్ కళాశాలల్లో నంద్యాల ఉండటం, అందులో చదివిన ప్రథమ సంవత్సరంలో చదివిన విద్యార్థి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం గర్వకారణం అన్నారు. నంద్యాల మెడికల్ కళాశాలకు 16 పీజీ సీట్లు కేటాయించారని తెలిపారు. అలాగే 11 డిస్టింక్షన్ లు సాధించారని చెప్పారు. ఇటువంటి సమయంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం విఫలం చేయాలని, పేదవారికి మెడికల్ విద్య అందకుండా చేయాలని కక్ష గట్టారని విమర్శించారు. ఇది ప్రజల ప్రభుత్వమా లేక ప్రైవేట్ ప్రభుత్వమా అని సూటిగా ప్రశ్నించారు. 2లక్షల కోట్లతో అమరావతి నిర్మిస్తానని ప్రగల్బాలు పలుకుతున్న ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల నిర్మాణాలకు 5వేల కోట్లు కేటాయించలేరా అని ప్రశ్నించారు. ప్రైవేట్ వ్యక్తులకు, వారి వ్యాపార ప్రయోజనాల కొరకు పీపీపీ విధానం తీసుకు రావడం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికైనా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పెదచెరుకురు లో విషాదచాయలు

• ఎన్టీఆర్ నగర్ వధ హైవే పై జరిగినా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ముగురు పెదచెరుకూరు సిరిగార్డెన్స్ వాసులే • నెల్లూరు 2వ డివిజన్ పరిధిలోని సిరిగార్డెన్స్ లో మృతుల బౌతికకాయలకు నివాళర్పించిన సర్వేపల్లి శాసన సబ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి •ఒకే ప్రదేశానికి చెందినా ముగురు ఓకే ఘటనలో ప్రాణాలు కోల్పోవడం,అందులో ఇధారు తండ్రి కొడుకులు కవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సోమిరెడ్డి •బాధిత కుట్టుంబలను పరమర్సించి సానుబూతి తేలియపరిచిన సోమిరెడ్డి

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

దేశాలే ఈర్ష్యపడే అద్భుతం — గ్రేటర్ వైజాగ్ ట్రిలియన్ ఎకానమీ వైపు!

భారతదేశ అభివృద్ధి పటంలో విశాఖపట్నం ఒక కొత్త చరిత్ర రాయబోతోంది. సాంకేతికత, పరిశ్రమ, పర్యాటకం, మౌలిక సదుపాయాలు – అన్ని రంగాల్లో వేగంగా ముందుకెళ్తున్న గ్రేటర్ వైజాగ్ ఇప్పుడు ట్రిలియన్ ఎకానమీ దిశగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు చిన్న పోర్ట్ నగరంగా ఉన్న విశాఖ, ఇప్పుడు ప్రపంచ దేశాలే ఈర్ష్యపడే స్థాయికి ఎదుగుతోంది. సముద్రతీర పరిశ్రమలు, ఐటీ పార్కులు, మెట్రో ప్రాజెక్టులు, గ్రీన్ ఎనర్జీ పరిశోధనలు నగరానికి కొత్త ఊపును అందిస్తున్నాయి. ‘ఇది సాధ్యమేనా?’ అని ఎగతాళి చేసిన వారిని ఆశ్చర్యపరుస్తూ వైజాగ్ ఇప్పుడు గ్లోబల్ హబ్‌గా మారుతోంది. భారత సాంకేతిక రంగాన్ని మళ్లీ నిర్వచించే ఈ అద్భుతం, ప్రతి తెలుగు వ్యక్తికి గర్వకారణం. గ్రేటర్ వైజాగ్ — రాబోయే తరాల గర్వం, భారత ఆర్థిక శక్తికి కొత్త గుర్తింపు!

విశాఖపట్నం

సీఎం చంద్రబాబుతో భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కల్యాణి భేటీ*

Press Release *సీఎం చంద్రబాబుతో భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కల్యాణి భేటీ* *రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించిన ముఖ్యమంత్రి* *షిప్ బిల్డింగ్, ఎలక్ట్రానిక్స్, పర్యాటక రంగాల్లో పెట్టుబడులకు భారత్ ఫోర్జ్ ఆసక్తి* *విశాఖ, నవంబరు పున్నమి ప్రతినిధి:* సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో నౌకా నిర్మాణంతో పాటు పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పెట్టుబడుల సదస్సు కోసం విశాఖ చేరుకున్న సీఎంతో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజ కంపెనీ భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కల్యాణి భేటీ అయ్యారు. రాష్ట్రంలో షిప్ బిల్డింగ్ తో పాటు అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిపై ఆసక్తిగా ఉన్నామని అమిత్ కల్యాణి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వెల్లడించారు. ఏపీలో నౌకా నిర్మాణంతో పాటు ఎలక్ట్రానిక్స్ రంగంలో అడ్వాన్స్డ్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమని అమిత్ కల్యాణి సీఎంకు వివరించారు. తిరుపతి సమీపంలో అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ సెన్సార్ల్ ఉత్పత్తిని చేపట్టాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. అలాగే పర్యాటక రంగంలోనూ కొన్ని ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్టు అమిత్ కల్యాణి సీఎంకు తెలిపారు. గండికోట వద్ద రివర్ క్రూయిజ్ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆలోచన చేస్తున్నామని ముఖ్యమంత్రికి స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి వాణిజ్య నౌకలతో పాటు డిఫెన్సు నౌకల నిర్మాణానికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని… ప్రస్తుతం ఈ రంగంలో భారత్ లో తయారీ అతి తక్కువగా ఉందని దీనిని దేశంలోని కంపెనీలు వినియోగించుకోవాల్సి ఉందని అన్నారు. భారత్ ఫోర్జ్ సంస్థ చేపట్టే ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం స్పష్టం చేశారు. పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా గండికోట, పాపికొండలు, అరకు వ్యాలీ లాంటి ప్రాంతాలు అనుకూలమని అన్నారు. అలాగే వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుకూ విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో హోటళ్ల నిర్మాణాన్ని కూడా ప్రోత్సహిస్తున్నామని.. వచ్చే రెండేళ్లలో పెద్దఎత్తున హోటల్ రూమ్ లు అందుబాటులోకి వస్తాయన్నారు. అరకు కాఫీ లాంటి ఉత్పత్తులను కూడా గ్లోబల్ బ్రాండ్లుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ కు తెలిపారు. హైదరాబాద్- అమరావతి- చెన్నై- బెంగుళూరు నగరాలను కలుపుతూ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కూడా రానున్నట్టు సీఎం వివరించారు. సమావేశం అనంతరం భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కల్యాణిని శాలువాతో సీఎం సత్కరించారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, ఈడీబీకి చెందిన అధికారులు, భారత్ ఫోర్జ్ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు.

అమరావతి

ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచితంగా యూపీఎస్సి సివిల్స్ కోచింగ్*

*ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచితంగా యూపీఎస్సి సివిల్స్ కోచింగ్* *నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి* *మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి* *అమరావతి, నవంబర్,( విశాఖ పున్నమి ప్రతినిధి):* ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగ యువతకు యూపీఎస్సీ సివిల్స్ ఉచిత శిక్షణ ఇస్తున్నామని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. బుధవారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలోని 340 మంది నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతకు యూపీఎస్సి సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కి ఉచిత శిక్షణ ఇవ్వనున్నాం. విజయవాడ,విశాఖపట్నం, తిరుపతి డా.బి.ఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిళ్లలో ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 4 నెలల శిక్షణా కాలంలో (10.12.2025 నుంచి 10.04.2026 వరకు) అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తాం. ఈ నెల 13 నుంచి 16 వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించబడతాయి. అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తాం, మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తాం. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, మరిన్ని వివరాలకు https://apstudycircle.apcfss.in వెబ్ సైట్ ని సంప్రదించాలని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి తెలిపారు.

విశాఖపట్నం

$30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా విద్యాసంస్కరణలు చేపట్టాలి* *డిగ్రీలతోపాటు నైపుణ్యాలపై యువత దృష్టి సారించాలి*

*Press Release* *$30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా విద్యాసంస్కరణలు చేపట్టాలి* *డిగ్రీలతోపాటు నైపుణ్యాలపై యువత దృష్టి సారించాలి* *స్కిల్ అంతరాలను భర్తీచేసేందుకే ఏపీలో నైపుణ్య గణన* *$ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లక్ష్యం* *పెట్టుబడుల సదస్సులో మరో $120 డాలర్ల పెట్టుబడులు* *సీఐఐ – విట్ ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ లో మంత్రి లోకేష్* అమరావతి నవంబర్ ( విశాఖ పున్నమి ప్రతినిధి) భారతదేశం త్వరలోనే $5 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటుంది, దేశాన్ని $30 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దాలన్నది ప్రధాని నరేంద్ర మోడీ విజన్, ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడానికి ఉన్నత విద్యారంగంలో సంస్కరణలు చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సీఐఐ సదరన్ రీజియన్ – విట్ ఏపీ సంయుక్తంగా అమరావతిలో నిర్వహించిన హయ్యర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ – 2025కు మంత్రి లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… భారతదేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఉన్నత విద్యను పునః రూపకల్పన చేయడం” అనే థీమ్ తో కాంక్లేవ్ ఏర్పాటుచేశారు, ఈ అంశంపై నేను ఏకీభవించడం లేదు, భారత్ త్వరలోనే $5 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యాన్ని చేరుకుంటుంది, $30 ట్రిలియన్ డాలర్ ఎకానమీకి ఎలా చేరుకోవాలన్నదే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. మానవవనరులు, మేధోసంపద లేకుండా ఆర్థికవృద్ధి సాధ్యం కాదు. ఈ మహోన్నత లక్ష్యఛేదనకు ఉన్నతవిద్యా రంగం వ్యూహాత్మక మూలస్థంభం. *ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు లక్ష్యం* గత 17నెలల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాల కారణంగా ఏపీకి $120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. త్వరలో జరగబోయే పెట్టుబడుల సదస్సులో మరో$120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయి. 2029 నాటికి ట్రిలియన్ డాలర్ పెట్టుబడులు మా లక్ష్యం, రాష్ట్రాలు బలంగా ఉంటే దేశం బలోపేతమవుతుంది. రాష్ట్రాలు పోటీ పడితే భారతదేశం గెలుస్తుంది. పెట్టుబడుల ఆకర్షణకు వేగం ముఖ్యం. మనం మార్పులను అందరికంటే ముందుగా స్వీకరించాలి. అమరావతిలో రాబోయే మూడేళ్లలో మీరంతా అద్భుతాలను చూడబోతున్నారు. యువత కలల సాకారానికి చిత్తశుద్ధితో కృషిచేయాలి. ఏపీలో ఎన్నో ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి. కరిక్యులమ్ మార్పులు అంత ఈజీకాదు, అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఉన్నత విద్యారంగంలో మార్పు అనివార్యం. ఆ దిశగా ఉన్నత విద్యారంగంలో సంస్కరణల అమలుకు ఉన్నత విద్యారంగ నిపుణులు కృషిచేయాలి. *డెమొగ్రఫిక్ డివిడెండ్ మన సొంతం* భారత జనాభాలో 54 శాతం మంది 25 సంవత్సరాలలోపు వయస్కులు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత బలీయమైన యువశక్తి మనకు మాత్రమే సొంతం, ఇది మనకు డెమోగ్రాఫిక్ డివిడెండ్‌. అయితే యువతను భవిష్యత్తుకు అవసరమైన విద్య, ఉద్యోగ యోగ్యమైన ప్రతిభావంతులుగా తీర్చిదిద్దినపుడే వారు మనకు వాస్తవిక డివిడెండ్ అవుతారు. భారతదేశపు పని యోగ్య జనాభాలో కేవలం 34.7 శాతం మందికి మాత్రమే అధికారిక నైపుణ్య శిక్షణ ఉంది. దక్షిణ కొరియాలో 96%, జపాన్‌లో 80%, జర్మనీ 75% తో పోలిస్తే భారత్ లో చాలా తక్కువ. మన ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో కేవలం 28.4 శాతం మాత్రమే ఉంది. *నైపుణ్యాలపై దృష్టి సారించాలి* ఆర్థిక సర్వే 2023-24 ప్రకారం మన గ్రాడ్యుయేట్లలో కేవలం 51 శాతం మాత్రమే ఉద్యోగయోగ్యులు. ఇది మేధస్సు లోపం కాదు. మనం బోధించే అంశాలు, మార్కెట్ అవసరాల మధ్య అసమతుల్యత దీనికి ప్రధాన కారణం. మన ఉన్నత విద్యాసంస్థల్లో 3-4 సంవత్సరాల కోర్సులు పూర్తిచేసినా ఉద్యోగావకాశాలు రావడంలేదు. కానీ అమీర్ పేటలో కోచింగ్ సెంటర్లు కేవలం 3-4 నెలల శిక్షణతోనే అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ అంతరాన్ని భర్తీచేసేందుకు ఉన్నత విద్యారంగంలో ప్రాథమికంగా మార్పురావాలి. యువత డిగ్రీ పొందడంతోపాటు క్రియాశీల నైపుణ్యాలపై దృష్టిసారించాలి. ప్రస్తుతం మనముందున్న ప్రధాన సవాలు నైపుణ్యలేమి. విద్యారంగం, పరిశ్రమల మధ్య స్థిరమైన అంతరం ఉన్నదనేది కఠోర సత్యం. ఈ సమస్యను అధిగమించేందుకు వేగవంతంగా సంస్కరణలు అమలు చేయాల్సి ఉంది. పరిశ్రమల్లో సాంకేతికతలపై ఫ్యాకల్టీ అధ్యయనం, టెక్నాలజీకి అనుగుణంగా డైనమిక్ కరిక్యులమ్, అభ్యాస అనుభవాన్ని ఇచ్చే స్ట్రక్చర్డ్ ఇంటర్న్‌షిప్‌లు, విద్యార్థులకు మెంటర్‌షిప్, కెరీర్ మార్గదర్శకత్వం వంటివాటిపై దృష్టిసారించాల్సి ఉంది. *స్కిల్ గ్యాప్ భర్తీకే స్కిల్ సెన్సస్* ఆంధ్రప్రదేశ్ లో 16నెలల క్రితం కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కిల్ సెన్సస్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో రాష్ట్రంలోని ప్రతి పౌరుడి ప్రొఫైల్ లోని నైపుణ్యాన్ని అంచనా వేసి, లోటుపాట్లను గుర్తిస్తాం. ఈ కార్యక్రమాన్ని నా సొంత నియోజకవర్గం మంగళగిరి నుంచే ప్రారంభించాం. యువతకు అవసరమైన స్కిల్ ట్రైనింగ్ అందించి పరిశ్రమ అవసరాల మేరకు వర్క్ ఫోర్స్ ను తయారు చేయడమే స్కిల్ సెన్సస్ లక్ష్యం. దీంతోపాటు ‘నైపుణ్యం పోర్టల్’ పేరిట కృత్రిమ మేధస్సు ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫారాన్ని తయారుచేశాం. త్వరలో ఈ పోర్టల్ ను ప్రారంభించబోతున్నాం. ఇది స్కిల్స్, ఉపాధి మధ్య అంతరాన్ని తొలగించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడింది. మన యువత సానుకూల దృక్పథం, క్రమశిక్షణలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారు. ఐటీ రంగంలో ఈరోజు తెలుగువారు ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన ఐటి కంపెనీల్లో కీలకస్థానాల్లో ఉన్నారు. *$2.4 ట్రిలియన్ ఎకానమీ మా లక్ష్యం* ఉన్నత విద్యారంగంలో మార్పును తెచ్చే ఐఐటీ – తిరుపతి, ఐఐఎం – విశాఖపట్నం, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్ ఐటీలు , VIT-AP వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఏపీలో ఉండటం మాకు గర్వకారణం. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నెక్ట్స్ జనరేషన్ జాబ్స్, స్టార్టప్స్ కు సిద్ధంగా ఉంది. డేటా సెంటర్లు, క్వాంటమ్, ఇన్నోవేషన్స్ లో ఏపీ ముందు వరుసలో ఉంది. ప్రధాని వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా మేం విజన్ -2047 డాక్యుమెంట్ “స్వర్ణ ఆంధ్ర” తో ముందుకు సాగుతున్నాం. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ను $2.4 ట్రిలియన్ ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దడం మా లక్ష్యం. *మార్పునకు 5 అంశాలు కీలకం* ఈ ప్రయాణంలో విద్యే మూలస్తంభం కాగా, ఐదు రంగాలు పరివర్తన అనుబంధ స్తంభాలు. ఏపీ ఉన్నత విద్యారంగాన్ని నాలెడ్జి అండ్ ఇన్నోవేషన్ హబ్ గా మార్చడానికి ఇవి దోహదపడతాయి. 1.కరిక్యులమ్ టు కెరీర్: పుస్తకాల్లోని పాఠాలే కాకుండా నైపుణ్యం, సమస్య – పరిష్కారాలతో కూడిన విద్యాబోధన. ఇందుకోసం పరిశ్రమతో కలిసి సిలబస్ రూపొందించి, ఉద్యోగాలకు సరిపడా సమతుల్యత సాధించాలి. 2. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్: ప్రతి యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇంక్యుబేషన్ హబ్‌లు, పేటెంట్ సెల్‌లు, స్టార్ట్‌అప్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కనీసం 25 శాతం విశ్వవిద్యాలయ సంస్కరణలు కార్యరూపంలోకి రావాలి. 3. డిజిటల్ భవిష్యత్ నైపుణ్యాలు: ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్స్, గ్రీన్ టెక్నాలజీ & రోబోటిక్స్ కోర్సులు విస్తరించాలి. ప్రతి గ్రాడ్యుయేట్ డిజిటల్ నైపుణ్యం కలిగి, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు సాధించగలిగేలా చూడాలి. 4.అంతర్జాతీయీకరణ: ప్రపంచస్థాయి యూనివర్సిటీలతో పరస్పర డిగ్రీలు, పరిశోధన భాగస్వామ్యాలు ఏర్పాటు చేయాలి. భారతదేశంలో విద్యను సాఫ్ట్ పవర్ ఎగుమతిగా అభివృద్ధి చేయాలి. 5. ప్రాంతీయ సమతుల్యత, వ్యాప్తి: వేగవంతమైన పారిశ్రామికీకరణకు క్లస్టర్ బేస్డ్ విధానాన్ని రూపొందించాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. సీఐఐ సదరన్ రీజియన్ చైర్మన్ అశ్విన్ మహాలింగం, విట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జీవీ సెల్వం, ఫస్ట్ జెన్ ఫౌండర్ & సీఈవో ఫిలిప్ ఆస్మస్, ఏపీ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ కె.రత్నషీలామణి, సిఐఐ ఏపీ వైస్ చైర్మన్ శరణం నరేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.

అమరావతి

భాగస్వామ్య సదస్సుకు సన్నద్ధమైన విశాఖ*

• *భాగస్వామ్య సదస్సుకు సన్నద్ధమైన విశాఖ* • *ఈనెల 14, 15 తేదీల్లో ఏపీ ప్రభుత్వం – సీఐఐ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహణ* • *దేశ, విదేశాల నుంచి హాజరు కానున్న వివిధ సంస్థల ప్రతినిధులు* *పెట్టుబడిదారులతో భేటీ కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు* *సదస్సు వేదికగా సమావేశాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు* • *నాలుగు రోజుల పాటు విశాఖలోనే సీఎం చంద్రబాబు* • *ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా సదస్సుకు భారీ ఏర్పాట్లు* • *రాష్ట్రంలో పెట్టుబడులు, యువతకు ఉద్యోగాలే లక్ష్యంగా భాగస్వామ్య సదస్సు* • *ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ చేతుల ఎల్లుండి ప్రారంభం కానున్న సదస్సు* *అమరావతి, నవంబర్ ( విశాఖ పున్నమి ప్రతినిధి):* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) సంయుక్తంగా నిర్వహిస్తున్న 30వ ‘సి.ఐ.ఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2025’ కోసం విశాఖ సన్నద్ధం అయ్యింది. సదస్సు ను విజయవంతంగా నిర్వహించేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తునారు. అందుకు తగినట్టుగా అధికార యంత్రాగాన్ని సన్నద్ధం చేశారు. ‘ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనే సందేశాన్ని ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. గ్రీన్ ఎనర్జీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, స్పేస్, డిఫెన్స్, టూరిజం రంగాల్లో భారీగా పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు విశాఖపట్నంను భారత తూర్పు తీరంలో గ్లోబల్ ట్రేడ్ గేట్‌వే గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. విశాఖలోని ఆంధ్ర విశ్వ విద్యాలయ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్ – ఇండియాస్ రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్-2047’ థీమ్‌తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. 100కి పైగా విదేశీ ప్రతినిధులు పాల్గొనే అవకాశంతో పాటు పెట్టుబడులకు సంబంధించి 30కి పైగా అవగాహనా ఒప్పందాలు జరగనున్నాయి. బుధవారం నుంచి సదస్సు ముగిసే శనివారం వరకు వివిధ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అవుతారు. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా వివిధ రంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను ముఖ్యమంత్రి ఈ వేదిక నుంచి వారికి వివరించనున్నారు. అలాగే రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రధాన థీమ్ సెషన్లు నిర్వహిస్తారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. *నవంబర్ 12, బుధవారం :* బుధవారం ముఖ్యమంత్రి విశాఖ చేరుకున్న అనంతరం భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణితో సమావేశం అవుతారు. తర్వాత భాగస్వామ్య సదస్సు నిర్వహణపై సీఐఐ ప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షిస్తారు. *నవంబర్ 13, గురువారం :* గురువారం విశాఖలోని నొవటెల్‌లో ‘పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్ – ఇండియా – యూరప్ కోపరేషన్ ఫర్ సస్టెయినబుల్ గ్రోత్’ అంశంపై జరిగే ఇండియా–యూరోప్ బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. గ్రీన్ షిఫ్ట్, సస్టైనబుల్ ఇన్నోవేషన్, యూరోపియన్ పెట్టుబడులపై చర్చలు జరుపుతారు. మధ్యాహ్నం తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో ముఖ్య భేటీలు ఉన్నాయి. ఎస్పీపీ పంప్స్ లిమిటెడ్, రెన్యూ పవర్, బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్, మురుగప్ప గ్రూప్, జూల్ గ్రూప్, హీరో ఫ్యూచర్ ఇంజినీర్స్ ప్రతినిధులతో సీఎం సమావేశమై చర్చిస్తారు. సాయంత్రం ‘వైజాగ్ ఎకనమిక్ రీజియన్’ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ‘స్పెషల్ మీటింగ్ ఆఫ్ సీఐఐ నేషనల్ కౌన్సిల్’కు హాజరవుతారు. *నవంబర్ 14, శుక్రవారం :* శుక్రవారం 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సును భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రారంభించనున్నారు. ఏపీ పెవిలియన్ ప్రారంభోత్సవంలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొంటారు. యూసుఫ్ అలీ, బాబా కళ్యాణి, కరణ్ అదానీ వంటి విశిష్ట అతిధులు దీనికి హాజరు కానున్నారు. సదస్సు ప్రారంభ కార్యక్రమం తర్వాత ‘టెక్నాలజీ, ట్రస్ట్, ట్రైడ్’ సెషన్ జరగనుంది. మధ్యాహ్నం జరిగే ‘ఏఐ ఫర్ వికసిత్ భారత్’ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఆర్టిఫీషియల్ ఇంటిజెన్స్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధికి ఏ విధంగా దోహద పడుతుందో సీఎం తన ప్రసంగంలో వివరిస్తారు. సింగపూర్ నుంచి విజయవాడకు నేరుగా విమాన సర్వీసులు నడిపేలా రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ ప్రతినిధులతో ఒప్పందం చేసుకోనుంది. సాయంత్రం రాష్ట్ర ఆర్ధిక శాఖ నిర్వహించే ‘రీఇమేజినింగ్ పబ్లిక్ ఫైనాన్స్ సమ్మిట్’లో సీఎం పాల్గొంటారు. సంజీవ్ గోయింకా గ్రూప్ వైస్ చైర్మన్‌తో సమావేశమై అనంతరం విశాఖలో లులూ నిర్మించే నూతన మాల్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. రాత్రికి వివిధ కంపెనీలు ప్రభుత్వ ప్రతినిధులు, ఆహ్వానితుల గౌరవార్ధం ఇచ్చే గాలా డిన్నర్‌లో పాల్గొంటారు. *నవంబర్ 15, శనివారం :* సదస్సు రెండో రోజు శనివారం… ఉదయం బ్లూమ్‌బెర్గ్ మీడియా ఇంటరాక్షన్‌లో సీఎం పాల్గొంటారు. తర్వాత రేమండ్, శ్రీసిటీ, ఇండోసోల్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే… బహ్రెయిన్, న్యూజిలాండ్, కెనడా, జపాన్ ప్రతినిధులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం వరల్డ్ ఎకనమిక్ ఫోరానికి చెందిన ‘సెంటర్ ఫర్ ఫ్రంటయిర్ టెక్నాలజీస్’ను ప్రారంభిస్తారు. అనంతరం గూగుల్ సంస్థ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం ఎవోయూల మార్పిడి కార్యక్రమం నిర్వహించనున్నారు. సదస్సు చివరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహిస్తారు. భాగస్వామ్య సదస్సుతో సాధించిన ఫలితాలను వివరిస్తారు. *రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం :* సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించడం ద్వారా రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని, ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ సదస్సును విజయవంతం చేసేందుకు ఇప్పటికే సింగపూర్, యూఏఈ, యూకే వంటి దేశాల్లో పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి రోడ్ షోలు, పర్యటనలు నిర్వహించారు. అటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహా పలువురు ఇతర మంత్రులు దేశ, విదేశాల్లో పెట్టుబడుల కోసం పలు సంస్థల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. భాగస్వామ్య సదస్సు ద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది

విశాఖపట్నం

14,15 తేదీలలో నగరంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న CII partnership సమ్మిట్ భద్రతా ఏర్పాట్లను, కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ను పర్యవేక్షించిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి

విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- 14,15 తేదీలలో నగరంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న CII partnership సమ్మిట్ భద్రతా ఏర్పాట్లను, కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ను పర్యవేక్షించిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు.* CII partnership సమ్మిట్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా విజయవంతముగా పూర్తి కావడానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగినది. నగరానికి విచ్చేయనున్న దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు మరియు ప్రముఖుల కోసం ఇప్పటికే పోలీసు అధికారులు మరియు సిబ్బందితో నిరంతర నిఘాతో, నగర ప్రజల భద్రతతో పాటుగా నగరానికి వచ్చు విదేశీ ప్రతినిధులకు, వి.ఐ.పిలకు, సదస్సులకు పూర్తి భద్రతా చర్యలు చేపట్టమైనది. నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని హోటల్స్ లో, లాడ్జీలలో,రిసార్టులలో,గెస్ట్ హౌస్ లలో నగర పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు ఆంధ్ర విశ్వ విద్యాలయం, ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ వద్ద గల సదస్సు ప్రాంగణం వద్దా , హెలిపాడ్ ల వద్దా మరియు సదస్సుకు హాజరగు ప్రతినిధులకు వసతి కల్పించే హోటళ్ల వద్దా స్నిఫర్ డాగ్ స్క్వాడ్లతో, బాంబు స్క్వాడ్లతో క్షుణ్ణంగా పరిశీలీస్తున్నారు. సదస్సుకు వచ్చే ప్రతినిధులు, వి.ఐ.పిలు ప్రయాణించు రహదారులూ, సదస్సు వద్దా పూర్తి నిఘాతో ఏ.ఎస్.సి ,ఆర్.ఓ.పి లను నిర్వహిస్తున్నారు. బందోబస్తును పలు కేటగిరిలుగా విభజించి, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టి, ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క పోలీసు ఉన్నతాధికారిని పర్యవేక్షణాధికారిగా నియమించడం జరిగినది. నగరంలో ముఖ్య ప్రాంతాలలో పికెట్స్,గార్డులను ఏర్పాటు చేసి నిరంతరం వాహనాలను తనిఖీ చేయడం జరుగుతుంది. నగర కమిషనర్ గారు పలు శాఖల నగర అధికారులతో పాటూ, రాష్ట్రఅధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ భద్రతా మరియు ఇతర ఏర్పాట్లను చర్చిస్తున్నారు. ప్రత్యేక కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో సదస్సు చుట్టూ ప్రత్యేక నిఘా పెట్టడం జరిగినది. ఆర్.ఓ.పి లు,ఏ.ఎస్.సి టీంలతో నగరంలో వి.ఐ.పి లు, సదస్సుకు వస్తున్న ప్రతినిధులు ప్రయాణిస్తున్న రహదారులను అనుక్షణం తనిఖీలు చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ డైవర్సన్స్ పై పత్రిక ప్రకటన తేదీ 14.11.2025 మరియు 15.11.2025 లలో విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో 30వ భారత పరిశ్రమల సమాఖ్య (CII SUMMIT-2025) నిర్వహించబడుతున్నది. ఈ సదస్సుకు భారత ఉపరాష్ట్రపతి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు,ఉపముఖ్యమంత్రి వర్యులు, కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖా మాత్యులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మరియు 40 దేశాల నుండి సుమారు 3,000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. కావున ఈ సదస్సు దృష్ట్యా విశాఖ నగరవాసులు, సాధారణ వాహనదారులు ఈ క్రింది సూచనలు పాటించవలసిందిగా విశాఖ నగర ట్రాఫిక్ పోలీస్ వారు తెలియజేస్తున్నాము. సిటీ డైవర్షన్స్: మూడవ పట్టణం పోలీస్ స్టేషన్ జంక్షన్ నుండి మద్దిలపాలెం ఆర్చ్ వరకు ఇరువైపులా సాధారణ వాహనదారులకు తేదీ 12.11.2025 నుండి 16.11.2025 వరకు ఎటువంటి అనుమతి లేదు. విశాఖ కంటి ఆసుపత్రి (Visakha Eye Hospital) జంక్షన్ నుండి సిరిపురం వైపు వచ్చు సాధారణ వాహనదారులు తేదీ 14.11.2025 మరియు 15.11.2025 లలో విశాఖ కంటి ఆసుపత్రి జంక్షన్ వద్ద డైవర్షన్ తీసుకొని శివాజీ పాలెం మీదుగా హైవేకు చేరుకొని తమ గమ్యస్థానాలను చేరుకొనవలెను. సిరిపురం జంక్షన్ నుండి మూడవ పట్టణం పోలీస్ స్టేషన్ వైపు వచ్చు సాధారణ వాహనదారులు టైకూన్ జంక్షన్ వద్ద డైవర్షన్ తీసుకుని మాస్క్ జంక్షన్ మీదగా తమ గమ్య స్థానాలను చేరుకొనవలెను. నగరంలో కొన్ని ముఖ్యమైన హోటల్స్ అనగా Novotel, Grand Bay, Radission Blu, Green park, Four Points by Sheroton, భీమిలి Novotel, థ పార్క్ మరియు ఆయా హోటల్స్ నుండి సదస్సు (AU గ్రౌండ్స్) వరకు, సిరిపురం జంక్షన్ నుండి ఎన్టీఆర్ భవనం వరకు VIP లు వచ్చే సమయంలో వారి బధ్రత సౌలబ్యం దృష్ట్యా VIP లు ప్రయాణించే రోడ్డుకు ఆనుకొని ఉన్న ముఖ్యమైన ట్రాఫిక్ జంక్షన్ లలో కొద్ది సమయం ట్రాఫిక్ ని నిలుపుదల చేయవలసిన అవసరము ఏర్పడుతుంది. కావున ఆ సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకొనవలసిందిగా తెలియజేయడమైనది. అలాగే VVIP ప్రయాణించే రోడ్లలో వాహనాలను అక్రమoగా నిలుపుదల (Wrong Parking) చేయకూడదని తెలియజేయడమైనది. II. హైవే డైవర్షన్స్ తేదీ 14.11.2025 మరియు 15.11.2025 లలో నగరంలో అంతర్జాతీయ, జాతీయ స్తాయి ప్రముఖుల పర్యటనలు ఉన్నందున వారి భద్రత దృష్ట్యా ఆ రెండు రోజులు శ్రీకాకుళం, విజయనగరం నుండి అనకాపల్లి వైపు వెళ్ళు అన్ని రకాల భారీ వాహనాలు( పోర్టు వాహనాలు సహా) ఆనందపురం జంక్షన్ వద్ద డైవర్షన్ తీసుకొని పెందుర్తి,సబ్బవరం మీదుగా అనకాపల్లి చేరుకోవలెను అనకాపల్లి నుండి శ్రీకాకుళం విజయనగరం వైపు వెళ్ళు భారీ వాహనాలు లంకెలపాలెం జంక్షన్ వద్ద డైవర్షన్ తీసుకొని సబ్బవరం, పెందుర్తి మీదుగా ఆనందపురం చేరుకొనవలెను III పార్కింగ్ ప్రదేశములు: కేంద్ర మంత్రివర్యులకు సంబంధించిన వాహనాలు సిరిపురం, రూరల్ SP బంగ్లా రోడ్డు ద్వారా సదస్సుకు చేరుకొని వేదిక ముందు వైపున గల alighting point వద్ద VVIP ని దించి, YVS మూర్తి ఆడిటోరియం ముందర గల VVIP పార్కింగ్ ప్రదేశము (A-1 పార్కింగ్) లో వాహనాలు పార్కింగ్ చేసుకొనవలెను. సీనియర్ IAS, IPS అధికారుల వాహనాలు YVS Murthy Auditorium ప్రక్కనగల VVIP Parking(Parking Place -B) లో పార్కింగ్ చేసుకొనవలెను. VIP Protocol delegates వాహనాలు, రాష్ట్ర మంత్రివర్యుల వాహనాలు సిరిపురం, మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ జంక్షన్ ద్వారా సదస్సు వద్దకు చేరుకొని వేదిక ముందు వైపున గల alighting point వద్ద VVIP ని దించి, YVS మూర్తి ఆడిటోరియం ప్రక్కన గల VVIP పార్కింగ్ ప్రదేశము (A-3 పార్కింగ్)లో వాహనాలు పార్కింగ్ చేసుకొనవలెను. Novotel, Grand Bay, Green Park, Four Points by Sheraton, Marriott మొదలగు హోటల్స్ నుండి వచ్చిన VIP Passes కలిగిన delegates మరియు MPs, MLsC, MLsA, వాహనాలు అన్నియు, సిరిపురం గుండా 3వ పట్టణ పోలీస్ స్టేషన్ జంక్షన్ గుండా వెళ్లి సదస్సు వేదిక ముందు వైపున గల VIP alighting point వద్ద VIP ని దించి AU College ‘B”గ్రౌండ్ లో వారికి నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశoలో వారి వాహనాలను పార్కింగ్ చేసుకొనవలెను భీమిలి నోవాటేల్, రాడిసన్-బ్లూ, పార్క్ హోటల్ నుండి వచ్చే VIP Passes కలిగిన delegates వాహనాలు అన్నియు అరుకు కాఫీ జంక్షన్ వద్ద టర్న్ తీసుకోని , గవర్నమెంట్మెంటల్ హాస్పిటెల్ రోడ్ నుండి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ జంక్షన్ గుండా వెళ్లి సదస్సు వేదిక ముందు వైపున గల VIP alighting point వద్ద VIP ని దించి AU బి గ్రౌండ్ లో వారికి నిర్దేసించిన పార్కింగ్ ప్రదేశoలో వారి వాహనాలను పార్కింగ్ చేసుకొని సదస్సుకు హాజరు కావలెను. సిరిపురము వైపు నుండి మరియు పోలమాంబ గుడి వైపు నుండి వచ్చే delegates వారి యొక్క వాహనాలు, పోలమాంబ గుడి దగ్గరలో గల, ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లోనికి ప్రవేశించి, “B” గ్రౌండ్లో గల alighting point వద్ద delegates దింపి, వారి యొక్క వాహనాలను “B” గ్రౌండ్లో (D-1 పార్కింగ్ స్థలం) పార్కింగ్ చేసుకొనవలెను. ఈ B గ్రౌండ్లో వాహనాలు నిండిన యెడల, వారి యొక్క వాహనాలను న్యూటన్ హాస్టల్ ఎడమ వైపున గల పార్కింగ్ ప్రదేశము (D-3) నందు గాని, న్యూటన్ హాస్టల్ వెనుక వైపున గల పార్కింగ్ ప్రదేశము (D-4) నందు గాని, సమత హాస్టల్ ముందర గల పార్కింగ్ ప్రదేశము (D-5) నందు గాని, మెటా హాస్టల్ ముందర గల పార్కింగ్ ప్రదేశము (D-6) నందు గాని వాహనాలను పార్కింగ్ చేసుకొనవలెను. అలాగే మద్దిలపాలెం Arch నుండి వచ్చిన Deligates యొక్క వాహనాలు B ground లొ ప్రవేశించి B Ground Alighting Point వద్ద deligates ను దించి B Ground లొ పార్కింగ్ (D-1) చేసుకొనవలెను. ఈ B గ్రౌండ్లో వాహనాలు నిండిన యెడల, వారి యొక్క వాహనాలను పిఠాపురం కాలనీ గెట్ పార్కింగ్ ప్రదేశము (D-2) నందు వాహనాలను పార్కింగ్ చేసుకొనవలెను. పోలీసు, రెవెన్యూ, GVMC మరియు ఇతర ప్రభుత్వ ప్రభుత్వ అధికారుల వాహనాలన్నియు హెలిపాడ్ గ్రౌండ్ కు ఎదురుగా ఉన్న పార్కింగ్ స్థలంలో(Parking Place-C) పార్కింగ్ చేసుకొనవలెను. ఇటీవల ఢిల్లీలో జరిగిన బాంబు బ్లాస్ట్ సందర్భంగా విశాఖపట్నం నందు వాహనాల తనిఖీ ( Vehicle Checking) ఉధృతం చేయడమైనది. కావున నగర ప్రజలు ఏమైనా అనుమానాస్పద (Unclaimed / abandoned) వాహనాల సమాచారం పోలీసులకు తెలియ చేయవలసిందిగా కోరడమైనది మరియు పోలీసులకు సహకరించవలసిందిగా కోరడమైనది. విశాఖనగరం నందు తే.12-11-2025 దీ నుండి తే.15-11-2025 దీ వరకు డ్రోన్లు ఎగురవేయడం నిషేధించడమైనది. ఎవరైనా డ్రోన్లు ఎగరవేసినచో వారి యొక్క డ్రోన్లు సీజ్ చేసి చట్టరిత్యా చర్య తీసుకోబడును. పై తేదీలలో ప్రముఖుల పర్యటనలు, వారి భద్రత దృష్ట్యా పై ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరుగుతుంది. కావున, పైన తెలిపిన సూచనలు పాటించి ప్రజలు పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరడమైనది.

విశాఖపట్నం

గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ *

* *గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- * విశాఖ పర్యటన నిమిత్తం విశాఖ విమానాశ్రయానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని విశాఖ విమానాశ్రయంలో జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆప్యాయంగా పలకరించి, పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కూటమి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు…

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.