Tuesday, 31 March 2026

Blog

విశాఖపట్నం

సి ఐ ఐ సమ్మిట్ ని స్వాగతిస్తున్నాం : ప్రియాంక దండి*

శుక్రవారం, శనివారం విశాఖలో జరగబోయే సి ఐ ఐ సమ్మిట్ ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ప్రకటన విడుదల చేసారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సులో సుమారు 9.5 లక్షల కోట్లు పెట్టుబడులకు ఒప్పందం జరగవచ్చని అంచనాలు ఉన్నాయని, ఆచరణలోకి వస్తే రాష్ట్ర అర్థిక పరిస్థితి మెరుగు పడుతుందని, ఎదరికో ఉపాధి అవకాశాలు వస్తాయని, ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు ఐ టీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషిని అభినందిస్తున్నామని ప్రియాంక అన్నారు.

E-పేపర్

అయ్యప్ప మాల దీక్షలో కుల వివక్ష, కన్నీళ్లు పెట్టుకున్న స్వాములు

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 అయ్యప్ప మాల దీక్షలో కుల వివక్ష, కన్నీళ్లు పెట్టుకున్న స్వాములు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ లో అయ్యప్ప మాల ధరించిన ఒక సామాజిక వర్గం కొంతమంది స్వాములు ఆలయం లోకి రానివ్వకుండా తాళం వేశారని ఆరోపణ నిన్నటి నుండి చలికి వణుకుతూ ఆరుబయటే ఉన్న అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు

విశాఖపట్నం

సృష్టి వరల్డ్ స్కూల్‌లో ప్రీ చిల్డ్రన్స్ డే వేడుకలు

విశాఖపట్నం, నవంబర్ (పున్నమి ప్రతినిధి) ఉక్కు నగరంలోని సృష్టి వరల్డ్ స్కూల్‌లో ప్రీ-చిల్డ్రన్స్ డే సందర్భంగా “Srishti’s CareNest – Fun and Brain Development Event”ను నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి కాగ్నిటివ్, మోటార్, సోషల్, ఎమోషనల్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ వంటి ఐదు ప్రధాన బాల్య నైపుణ్యాలపై ఆధారిత వినోదాత్మక ఆటల్లో పాల్గొన్నారు. మొత్తం 48 మంది తల్లిదండ్రులు 60 కంటే ఎక్కువ కార్యకలాపాలు పూర్తి చేసి సత్కారాలు అందుకున్నారు. ఈ సందర్భంగా “Care and Grow” వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమం వోటు ఆఫ్ థ్యాంక్స్‌, గ్రూప్ ఫోటో, తల్లిదండ్రుల అనుభవాలు పంచుకోవడం తో ముగిసింది. కార్యక్రమంలో Founder & Director P. సుశీల రాణి, Executive Director మేఘనా, Executive Principal కిరణ్, Chief Academic Head P.N.V.K. సంతోష్, Creative Head రాధా పాల్గొన్నారు.

E-పేపర్

రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీలకు ఎస్ వి కె స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు ఎంపిక

ఈనెల 8.9 తేదీ పొద్దుటూరు లో వై ఎమ్ ఆర్ కాలనీ లో స్టేడియం క్యాడిట్. సబ్ జూనియర్ జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో చిట్వేల్ ఎస్ వి కే స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థులలో బాలికల విభాగంలో బి లోహిత. సుదీప. కుష్మిత.బాలుల విభాగంలో అనూజ్. గ్రీతేశ్వర్ రెడ్డి. ధవనేశ్వర్ రెడ్డి బంగారు పతకాలు సాధించారని కోచ్ శివాజీ తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 14 15 16 తేదీల్లో కాకినాడలో జరగబోయే రాష్ట్ర పాల్గొంటారని తెలిపారు. విజేతలకు ఈరోజు చిట్వేలి ఎస్ వి కే స్పోర్ట్స్ అకాడమీ లో ముఖ్య అతిథులుగా విచ్చేసిన సోషల్ యాక్టివిస్ట్ గాడి ఇంతియాజ్ అహ్మద్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ డి చంద్రశేఖర్, సాయి వికాస్ విద్యాసంస్థల కరస్పాండెంట్ టీ. రెడ్డయ్య నాయుడు ల ద్వారా పతకాలు అందించి అభినందన సర్టిఫికెట్లతో సత్కరించారు. ఈ సందర్భంగా కోచ్ శివాజీ మాట్లాడుతూ చిట్వేలి ఎస్ వి కే అకాడమీ నుండి విద్యార్థులు రాష్ట్రస్థాయికి సెలెక్ట్ అవడం చాలా సంతోషంగా ఉందని, తన మీద నమ్మకంతో పిల్లలను పంపిస్తున్న తల్లిదండ్రులకు మరియు మొదటి నుండి తనను ప్రోత్సహిస్తూ వస్తున్న సీఐ వెంకటేశ్వర్లు సార్ గారికి మరియు గ్రామీణ ప్రాంతాలలో చిన్నారులను ప్రేరేపిస్తూ తమ అకాడమీ అభివృద్ధికి సహకరిస్తున్న గాడి ఇంతియాజ్ అహ్మద్ కు, మరియు సాయి వికాస్ పాఠశాల రెడ్డయ్య కు కృతజ్ఞతలు తెలియజేశారు. విచ్చేసిన ముఖ్య అతిథులు మాట్లాడుతూ చిట్వేలి లో టైక్వాండో అకాడమీని స్థాపించి అనతి కాలంలోనే విద్యార్థులను రాష్ట్రస్థాయి వరకు తీసుకువెళ్లడానికి కృషిచేసిన శివాజీ మాస్టర్ ను అభినందించారు. చదువులతో పాటు క్రీడలలో కూడా ప్రతి ఒక్కరూ రాణించాలని మానసిక వికాసానికే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని రాష్ట్రస్థాయి నుండి జాతీయస్థాయి వరకు పిల్లలు ఎదగాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఫిట్నెస్ జిమ్ వ్యాయామకారులు కొరముట్ల నరసింహ, అలిశెట్టి పెంచలయ్య, చంద్రశేఖర్, ఓసూరయ్య, మరియు అకాడమీ క్రీడాకారులు పాల్గొన్నారు

Featured

రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి

రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి రైల్వేకోడూరు మేజర్ న్యూస్ రైల్వేకోడూరు:మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా రెడ్డివారిపల్లి పంచాయతీ గాంధీనగర్ నందు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వైష్ ఎంపీపీ #రామిరెడ్డి #ద్వాజారెడ్డి. ఈ కార్యక్రమం లో గాంధీనగర్ రామిరెడ్డి వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు రమేష్ బాబు , మాజీ టూరిజం డైరెక్టర్ మందల నాగేంద్ర, మాజీ మార్కెట్ చైర్మన్ సుబ్బరామరాజు , సర్పంచులు హరికృష్ణ రెడ్డి, ఆర్ వి రమణ,ఎంపీటీసీలు మహేశ్వర్ రెడ్డి, బండారు మల్లి,లత, ఎనుమల మహేష్ , ప్రతాప్ రెడ్డి, కొప్పల శంకరయ్య ,రాజగోపాల్, ఇరగబోయిన నాగేశ్వరరావు, భూంపల్లి నాగరాజు, బత్తల సుబ్రహ్మణ్యం, ex సర్పంచ్ శంకర్ రెడ్డి, రాజారావు,షఫీ , కోటి, శ్రీరాములు, రవి, షేక్ మొహమ్మద్, మహేష్,శివ,మని యాదవ్ , షేక్ గౌసియా,ప్రమీల,మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని స్పష్టం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

వింజమూరు మండలంలోని బుక్కాపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గృహ నిర్మాణ సంస్థ అధికారుల ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (UDA) పథకం కింద మంజూరైన గృహా ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని, నూతనంగా నిర్మించబడిన గృహామును రిబ్బన్ కటింగ్ చేసి గృహప్రవేశోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ — కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం తీసుకొస్తున్న నూతన సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచే పథకాల గురించి వివరిస్తూ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా పేద మరియు అర్హులైన కుటుంబాలకు స్వంత గృహం కలిగే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.అలాగే తన నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరయ్యేలా తాను కృషి చేస్తానని, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు, పథకాలు ప్రతి ఇంటికి చేరేలా పని చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వింజమూరు మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉదయగిరి హౌసింగ్ డిఈఈ సయ్యద్ పీరన్,దుత్తలూరు వర్క్ ఇన్స్పెక్టర్ S. పోలయ్య, వింజమూరు వర్క్ ఇన్స్పెక్టర్ K.సందీప్ రాజ్,డిపార్ట్మెంట్ అధికారులు డీఈవో. ప్రసాద్, బాలాజీ, ఆన్సర్, గ్రామస్థులు, లబ్ధిదారులు పాల్గొని, నూతన గృహాల నిర్మాణం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

E-పేపర్

క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ.

వ్యాధిగ్రస్తులు వైద్యులు సిబ్బంది సూచనలు సలహాలు పాటించడంతోపాటు ఆరు నెలల పాటు మందులు వాడితే పూర్తిస్థాయిలో క్షయ వ్యాధి దూరమవుతుందని నందలూరు మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ ప్రభుత్వ వైద్యులు శరత్ కార్తీక్ లు అన్నారు. ప్రధానమంత్రి టీబి ముక్తాభారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నందలూరు మండలంలోని 13 మంది టీబీ పేషెంట్లను నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ దత్తత తీసుకున్నారు. గురువారం నందలూరు ప్రభుత్వ వైద్యశాల లో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వ్యాధి సోకిన వారు ప్రభుత్వం ఆరు నెలల పాటు ఉచితంగా అందించే మందులను వాడడంతో పాటు బహిరంగ ప్రదేశాలలో ప్రజలలో తిరగకుండా మాస్కులు కచ్చితంగా వాడాలన్నారు. తద్వారా వ్యాధి నుండి బయటపడవచ్చున్నారు.మంచి పౌష్టిక ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో అధిక శక్తి లభిస్తుందన్నారు. క్షయ వ్యాధి పట్ల నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇంట్లో కూడా మాస్కు ధరించి ఉండాలన్నారు. అనంతరం రెండు నెలలకు సరిపడా పౌష్టిక ఆహార పదార్థాలను సర్పంచ్ జంబు సూర్యనారాయణ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి సుబ్రహ్మణ్యం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రణీత్ శివరాం సిహెచ్ఓ వెంకటనారాయణ ఆరీఫ్. మాజీ మార్కెటింగ్ డైరెక్టర్లు బె స్త సుబ్రహ్మణ్యం తెలుగుదేశం నాయకులు తుమ్మాది శివకుమార్ తాజ్ మార్ట్ సయ్యద్ అఫ్జల్ శివ నరసింహులు పఠాన్ మేహార్ ఖాన్ ఆశ వర్కర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

E-పేపర్

అన్నదాన సత్రం కు 50,000 విరాళం ఇచ్చిన కుంచా సుధాకర్

అన్నదాన సత్రం కు 50,000 విరాళం ఇచ్చిన కుంచా సుధాకర్ రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు మండలం, బుడుగుంటపల్లె గ్రామంలో వేలసిన అయ్యప్ప స్వామి ఆలయం ప్రక్కన నిర్మిస్తున్న అన్నదాన సత్రమునకు సింగిరివారిపల్లి వాస్తవ్యులు కీll శేll కుంచా జయరామయ్య, కుంచా వెంకట సుబ్బమ్మ జ్ఞాపకార్థం కుమారుడు కుంచా సుధాకర్ బాబు, కోడలు కళావతమ్మ రూ. 50,000/- ల విరాళమును, ఆలయ ధర్మకర్త, పూజారి అదునుకోట నరసింహస్వామి వారికి అందించారు. వీరికి వీరి కుటుంబానికి ఆ హరి హర సుతుడైన అయ్యప్ప స్వామి బ్రహ్మోత్సవం ఆశీస్సులు ఎల్ల వేళల ఉండాలనికోరుతున్నాను. దాతలు ఇంకా ముందుకు వచ్చి అన్నదాన మండపం నిర్మాణమునకు పూర్తిగా సహకరించ వలసినదిగా కోరుతున్నానని తెలుపుతున్నాను. ఆలయాలు అభివృద్ధి జరగాలంటే భక్తుల సహాయ సహకారాలు ఎంతో అవసరమున్నది. కావున భక్తులు తమకు తోచిన, శక్తి కొలది విరాళములు ఇవ్వవలసినదిగా కోరుతున్నాను.

అనకాపల్లి

అనకాపల్లి జిల్లా లో వరుస చోరీల కేసుల పరిష్కారంలో కీలక విజయాన్ని సాధించిన జిల్లా పోలీసులు: ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్

అనకాపల్లి, (చోడవరం) నవంబర్ 13: ఇటీవల చోడవరం, బుచ్చయ్యపేట, వి.మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి మండలాల్లో వరుసగా రాత్రి వేళల్లో దేవాలయాల్లో హుండీ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను చోడవరం పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి మొత్తం 26 కేసుల్లో దొంగతనాలకు గురైన 10.32 గ్రాముల బంగారం, 26 తులాల వెండి, నగదు 44,218 రూపాయలు — మొత్తం 66,418 రూపాయల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు పెద్దవాడు కాగా, మిగిలిన ముగ్గురు మైనర్లు. నిందితులు జల్సాలకు అలవాటు పడి, దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని రాత్రి వేళల్లో హుండీలను దొంగిలించేవారు. నేర స్థలాల్లో లభించిన ఆనవాళ్ల ఆధారాలతో పాటు ఆధునిక సాంకేతిక పద్ధతులు ఉపయోగించి పోలీసులు నిందితులను గుర్తించి పట్టుకోవడంలో విజయం సాధించారు. నిందితులు: 1. రాసూరి పోతురాజు, తండ్రి అప్పారావు, 20 సంవత్సరాలు, బుడబుక్కల (ఎస్టీ), దొరబాబు కాలనీ, వడ్డాది గ్రామం, బుచ్చయ్యపేట మండలం, అనకాపల్లి జిల్లా. మైనర్ నిందితులు (జువెనైల్): 1. బుచ్చయ్యపేట మండలం 2. బుచ్చయ్యపేట మండలం 3. బుచ్చయ్యపేట మండలం, అనకాపల్లి జిల్లా (పరారీలో ఉన్నాడు) నిందితులు చెడు వ్యసనాలకు బానిసై ఈ హుండీ చోరీలకు పాల్పడ్డారు. దొంగిలించిన బంగారం, వెండి, నగదులో కొంత ఖర్చు చేసి, మిగతా సొత్తును విజయరామరాజుపేట ప్రాంతంలో దాచి ఉంచారు. ఈ రోజు ముగ్గురు బైక్‌పై వడ్డాది నుండి చోడవరం వైపు వస్తుండగా చోడవరం పోలీసులు గౌరిపట్నం వద్ద వారిని పట్టుకున్నారు. వీరిలో మొదటి ముగ్గురు అన్ని కేసుల్లో పాల్గొనగా, నలుగవ వ్యక్తి ఒక కేసులో మాత్రమే పాల్పడ్డాడు. కేసులు నమోదు అయిన పోలీస్ స్టేషన్లు: చోడవరం – 2, బుచ్చయ్యపేట – 11, వి.మాడుగుల – 9, చీడికాడ – 2, దేవరాపల్లి – 2, మొత్తం – 26 కేసులు. ఈ కేసులను ఎస్పీ తుహిన్ సిన్హా మార్గదర్శకత్వంలో, అదనపు ఎస్పీ క్రైమ్స్ ఎల్. మోహనరావు పర్యవేక్షణలో, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం. శ్రావణి ఆధ్వర్యంలో చోడవరం ఇన్స్పెక్టర్ పి. అప్పలరాజు, ఎస్సై బి. నాగకార్తీక్, ఎస్సై బి. జోగారావు మరియు సిబ్బంది ఆధునిక సాంకేతిక పద్ధతులతో ఛేదించారు. అధికారులు వారిని అభినందిస్తూ ప్రశంస పత్రాలు అందజేశారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ — ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించాలని సూచించారు. ఇళ్లలో విలువైన వస్తువులు, నగదు బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. బయట ప్రాంతాలకు వెళ్ళేవారు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం (ఎల్‌హెచ్‌ఎం‌ఎస్) సేవలను వినియోగించుకోవాలని సూచించారు. దేవాలయాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, భద్రత లేని దేవాలయాల్లో విలువైన వస్తువులు, నగదు ఉంచరాదని హెచ్చరించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్పీ తుహిన్ సిన్హా, అదనపు ఎస్పీలు ఎం. దేవ ప్రసాద్, ఎల్. మోహనరావు, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం. శ్రావణి, చోడవరం ఇన్స్పెక్టర్ పి. అప్పలరాజు, ఎస్సై బి. నాగకార్తీక్, ఎస్సై బి. జోగారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

వరంగల్

వరంగల్ బస్టాండ్ లో పడవ ప్రయాణం

వరంగల్ బిఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు మాయల మరాఠీ పార్టీలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే వరంగల్‌ బస్టాండ్‌ పేరుతో నయవంచన చేస్తే.. ప్రస్తుత ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ అసమర్థతతో బస్టాండ్‌ నిర్మాణానికి నోచుకోవడం లేదని మండిపడ్డారు. చారిత్రక నగరమైన వరంగల్‌కు బస్టాండ్‌ నిర్మాణానికి ఒక్క అడుగు ముందుకు పడకపోవడంతో వరంగల్‌ ఆత్మగౌరవ పోరాటం మహా ధర్నా- 2 పేరుతో గురువారం బీజేపీ వరంగల్‌ బస్టాండ్‌ ఏర్పాటు ప్రాంతంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులకు ఉచిత పడవ ప్రయాణం వినూత్న నిరసన చేపట్టింది

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.