Tuesday, 31 March 2026

Blog

రంగారెడ్డి

* కామారెడ్డి బీసీల ఆక్రోశ సభను విజయవంతం చేద్దాం — బీసీఐఎఫ్ కో ఆర్డినేటర్ బొల్లంపల్లి ఆంజనేయులు పిలుపు *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 13 : కామారెడ్డిలో తలపెట్టిన బీసీల ఆక్రోశ సభకు బీసీ కులాల ప్రజలు పెద్ద పాల్గొని విజయవంతం చేయాలని బీసీఐఎఫ్ రంగా రెడ్డి జిల్లా కో ఆర్డినేటర్ బొల్లంపల్లి ఆంజనేయులు పిలుపు నిచ్చారు. గురువారం ఆంజనేయులు మాట్లాడుతూ.. ఈ నెల 15న కామారెడ్డి జిల్లా కేంద్రం సత్య కన్వెన్షన్ హాల్ లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన బీసీల అక్రోశ సభకు బీసీ సంఘాల, బీసీ కుల సంఘాల, బీసీ మేధావులు, యువకులు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీల ఆక్రోశ సభకు ముఖ్య అతిథులుగా బీసీఐఎఫ్ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, మాజీ జస్టిస్ ఈశ్వరయ్య, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసి చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్, బీసీఐఎఫ్ రాష్ట్ర కో ఆర్డినేటర్ చామకూర రాజు, తదితరులు పాల్గొననున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో స్థానిక సంస్థలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఉప వర్గీకరణతో అమలు చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. స్థానిక సంస్థలో 42 శాతం రిజర్వేషన్లతో పాటు దాదాపు 21 హామీలు ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండు ఏళ్ళు అవుతున్న ఏ ఒక్క హామీని అమలు చేసిన దాఖలాలు లేవని మండిపడ్డారు. బీసీ హక్కులను విస్మరించిన ఏ ఒక్క పార్టీని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు.

నాగర్‌కర్నూల్

విద్యార్థుల‌పై టీచ‌ర్ పైశాచికం.. ఏకంగా 30 మందిపై..!

క‌ల్వ‌కుర్తి : సాధార‌ణంగా జోక్ వేస్తే ఎవ్వ‌రైనా న‌వ్వుతారు. న‌వ్వ‌డ‌మే ఆ విద్యార్థులు చేసిన పాపం.. 30 మంది విద్యార్థుల‌ను గొడ్డును బాదిన‌ట్టు బాదాడు ఉపాధ్యాయుడు. ఈ ఘ‌ట‌న కల్వ‌కుర్తి ప‌ట్టణంలోని మినిస్టేడియంలో ఉన్న మ‌హాత్మ‌గాంధీ జ్యోతి బాపూలే గురుకుల విద్యాల‌యం(బాలుర‌) పాఠ‌శాల‌లో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. క‌ల్వ‌కుర్తి ప‌ట్ట‌ణంలోని మినీ స్టేడియంలో మ‌హాత్మ జ్యోతి బాపులే గురుకుల విద్యాల‌యంలో ఈనెల 11న 9వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు మధ్యాహ్న భోజ‌న‌ సమయంలో బయాలజీ పరీక్ష నిర్వహించారు. ఇన్విజిలేటర్ గా గెస్ట్ టీచర్ అయిన వెంకటేశ్వర్లు ను పంపారు. అదే సందర్భంలో ఈ ఇన్విజిలేటర్ పిల్లలపై జోక్ వేయగా ఆ తరగతి విద్యార్థులు పడి పడి నవ్వారు. అదే క్రమంలో విద్యార్థులు గుసగుస లాడుతూ పగలపడి నవ్వడంతో ఆవేశంతో రెచ్చిపోయిన గెస్ట్ టీచర్ 30 మందికి పైగా విద్యార్థులను బెత్తంతో, చేతితో విపరీతంగా, క్రూరంగా వీపులపై, కాళ్ళపై వాతలు వచ్చేలా కొట్టాడు.ఈ విషయమై విద్యార్థులు వారి క్లాస్ టీచర్ తో వెళ్లి ప్రిన్సిపల్ ఉష రాణికి కంప్లైట్ చేశారు. మరుసటి రోజు విచారణ చేసిన ప్రిన్సిపల్ దీనిపై స్పందించి ఆర్సివో కు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. గెస్ట్ టీచర్ ను విధుల నుంచి తోలగించింది. ఈ విషయమై గురువారం విద్యార్థి సంఘాలు, పలు సంఘాల నాయకులు వెళ్లి పాఠ‌శాల వద్ద నానా రభస చేశారు. ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మా పిల్లలను క్రురంగా బాదిన టీచర్ పై విధుల నుంచి తొలగించడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ప్రిన్సిపల్ ను కోరారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఆ టీచర్ కు చర్యలు తప్పనిసరిగా ఉంటాయని ఆమె తెలిపారు.

అన్నమయ్య

జిల్లా స్థాయి టైక్వాండో పోటీలకు శ్రీ సాయి వికాస్ విద్యార్థుల ఎంపిక

అన్నమయ్య జిల్లా, చిట్వేల్‌లోని శ్రీ సాయి వికాస్ హై స్కూల్ విద్యార్థులు క్రీడా రంగంలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఇటీవల జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో మెరిసిన ఈ విద్యార్థులు, ఆ తర్వాత రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అద్భుత ప్రదర్శన ఇచ్చి జాతీయ వేదికపై తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. …జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులు: సాయి వికాస్ హై స్కూల్ నుండి జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులు: …వై. అనూజ్ (9వ తరగతి) …పి. సుదీప్ (9వ తరగతి) …కె. ధావనేశ్వర్ రెడ్డి (7వ తరగతి) …కె. గీతేశ్వర్ రెడ్డి (6వ తరగతి) కరస్పాండెంట్ అభినందన: ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తిరుమల రెడ్డయ్య విద్యార్థులను ఘనంగా అభినందించారు. “చదువుతో పాటు క్రీడలలోనూ మా విద్యార్థులు ప్రతిభ చూపడం మాకు ఎంతో గర్వకారణం. జాతీయ స్థాయిలోనూ విజయాలు సాధించి, పాఠశాల ఖ్యాతిని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను,” అని ఆయన అన్నారు. విద్యార్థులకు శిక్షణ అందించిన కోచ్ శివాజీ, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల ఈ విజయాలపై ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలోనూ ఈ విద్యార్థులు పతకాలు సాధించాలని వారు శుభాకాంక్షలు తెలియజేశారు.

అన్నమయ్య

కేజీబీవీ విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు — చిట్వేలి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో శిబిరం – విద్యార్థులకు పరీక్షలు చేసిన ఆప్తలామిక్ అధికారి ఓబులేసు

చిట్వేలి మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో విద్యార్థినుల కోసం గురువారం ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. చిట్వేలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వైద్యుడు డాక్టర్ మహమ్మద్ అన్సారి ఆధ్వర్యంలో ఈ శిబిరం జరిగింది. ఆప్తలామిక్ అధికారి ఓబులేసు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి, కంటి సమస్యలున్న వారికి తగిన సూచనలు, సలహాలు అందించారు.కంటి చూపులో లోపాలు ఉన్న విద్యార్థులను గుర్తించి, వారికి అవసరమైన చికిత్స లేదా కళ్లద్దాలు అందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వైద్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపాల్ తులసి, హెల్త్ ఆఫీసర్ విజయ్ కుమార్, హెచ్.పి. యా భాను, ఏ.ఎన్.ఏ. ఫరీదా సహా పలువురు ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ కోసం ఇలాంటి శిబిరాలు తరచూ నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

ఉక్కు కార్మికుల సమస్యలను పరిష్కరించండి . __ ఇంటక్ విజ్ఞప్తి . విశాఖ ఉక్కు కర్మాగారం లో కార్మికులు ఎదుర్కొంటున్న పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్టీల్ ఇంటక్ ఉక్కు యాజమాన్యానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం ప్లాంట్ జనరల్ మేనేజర్ ( హెచ్.ఆర్) ఎన్. బాను కు ఇంటక్ ప్రతినిధి వర్గం వినతి పత్రం అందజేసింది . ఈ సందర్భంగా ఇంటక్ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజ శేఖర్ , స్టీల్ ఇంటక్ అధ్యక్షులు పి.వి.రమణ మూర్తి మాట్లాడుతూ ఉక్కు యాజమాన్యం నిర్దేశించిన మేరకు ఉక్కు ఉత్పత్తి, ఉత్పాదకల్లో భాగస్వాములై కృషి చేస్తున్నారని అన్నారు. ఉక్కులో మ్యాన్ పవర్ కొరత తీవ్రంగా ఉందని , తద్వారా ఉక్కు ఉద్యోగులపై పని బారం పెరిగిందని అన్నారు . తక్షణమే మ్యాన్ పవర్ పెంచాలని , మ్యాన్ పవర్ తక్కువగా ఉండటం వల్ల కార్మికులు సెలవులు వాడటం లేదని అన్నారు. ఈ సమస్య వల్ల ఈ ఎల్స్ వాడటం లేదని అన్నారు. ఈ ఎల్ ఎన్క్యాష్మెంట్ కు అవకాశం ఇస్తే ఉద్యోగుల పిల్లలకు స్కూల్ ఫీజు లు , ఇతర అవసరాలకు ఉపయోగ పడతాయని అన్నారు .ఈ ఎల్స్ అధికారులకు మాదిరిగా 200 లీవ్స్ నుండి 300 లీవ్స్ ఇచ్చినట్లయితే కార్మికులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో ఇంటక్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ము ప్రసాద్ , సీనియర్ నాయకులు నడుపూరు వెంకన్న ,కోరిబిల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు కౌంటింగ్‌ కోసం మొత్తం 42 టేబుల్స్‌ ఏర్పాటు ఒకటో నెంబర్‌ పోలింత్‌ బూత్‌ షేక్‌పేట డివిజన్‌ నుంచి ప్రారంభమై ఎర్రగడ్డతో ముగియనున్న కౌంటింగ్‌ మొత్తం 10 రౌండ్లలో తేలనున్న ఉప ఎన్నిక ఫలితాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదట షేక్ పేట డివిజ‌న్ నుండి ప్రారంభం ఆ త‌ర్వాత వెంగ‌ళ్ రావు న‌గ‌ర్ , ర‌హ‌మ‌త్ న‌గ‌ర్, యూస‌ఫ్ గూడ‌, సోమాజిగూడ‌, బోర‌బండ‌, ఎర్ర‌గ‌డ్డ డివిజ‌న్లతో పూర్తి

పశ్చిమ గోదావరి

అయ్యప్ప స్వాముల పడిపూజ మహోత్సవంలో ఎమ్మెల్యే అంజిబాబు

భీమవరం ; . భీమవరం మెంటేవారి తోటలో గ్రంధి శ్యామ్ శివరాజ్ అధ్వర్యంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వాముల పడిపూజ మహోత్సవాన్ని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. స్వామి అయ్యప్ప, శరణం అయ్యప్ప, మణికంఠ మందారం గురుస్వాములు బంగారమంటూ కరిమళవాసుడు అయ్యప్ప స్వామిని కొలుస్తామని, భక్తిశ్రద్ద లతో అయ్యప్ప స్వాముల పడిపూజ నిర్వహించడం శుభ పరిణామమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. అనంతరం అయ్యప్ప స్వాములు స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ తీర్థ ప్రసాదాలు, నైవేధ్యాలు సమర్పించారు. అభిషేకాలు, మంగళ హారతులు, పాటలు పాడుతూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ చెనమల్ల చంద్రశేఖర్, మెంటే మనోజ్, తోట సురేష్, కారుమూరి సత్యనారాయణ మూర్తి, కూటమి నాయకులు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.

అన్నమయ్య

రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కె.కె.చౌదరి

రైల్వేకోడూరు మండలం రావఘవరాజపురం గ్రామంలో గురువారం రోజున జరిగిన రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి గారి దశదిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె.కె. చౌదరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కందల లోకేష్ ఆహ్వానం మేరకు నిర్వహించబడింది. ఈ సందర్భంగా చైర్మన్ కె.కె. చౌదరి మల్లికార్జున రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి సంతాపం తెలిపారు. గ్రామ ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అనేకమంది అభిమానులు పాల్గొన్నారు.

E-పేపర్

ఆదిబాట్ల మున్సిపాలిటీ ఏసీబి దాడులు… ఏసీబి వలలో చిక్కిన టౌన్ ప్లానింగ్ ఆఫిసర్ వరప్రసాద్…

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 ఆదిబాట్ల మున్సిపాలిటీ ఏసీబి దాడులు… ఏసీబి వలలో చిక్కిన టౌన్ ప్లానింగ్ ఆఫిసర్ వరప్రసాద్… 75 వేల లంచం తీసుకుంటూ ఏసీబి చిక్కిన వరప్రసాద్… రంగారెడ్డి జిల్లా అధిబట్ల మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు ఆధిబట్ల మున్సిపల్( టిపిఓ) ,టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వర ప్రసాద్ , అసిస్టెంట్ వంశీ ఇల్లు పర్మిషన్ విషయంలో ఆనంద్ అనే వ్యక్తి నుండి 75 వేల రూపాయలు తీసుకుంటుండగా పక్క సమాచారంతో ఏసీబీ రైడింగ్.. మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు…

E-పేపర్

సుప్రీంకోర్టు సంచలన తీర్పు

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 ఇకపై పోలీసులు ఎవర్ని అరెస్టు చేసిన….. లికిత పూర్వకంగా కారణం తెలపాల్సిందే..! సుప్రీంకోర్టు సంచలన తీర్పు అరెస్టు అయిన నిందితుల రాజ్యాంగ హక్కులను పరిరక్షించే దిశగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పును వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం.. ఎలాంటి నేరం కింద అరెస్టు చేసినా సరే, ఎలాంటి మినహాయింపులు లేకుండా అరెస్టుకు గల కారణాలను లిఖితపూర్వకంగా, నిందితుడికి అర్థమయ్యే భాషలోనే తెలియజేయాలని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని అధికరణం 22(1) ప్రకారం.. అరెస్టు చేసిన వ్యక్తికి అరెస్టు కారణాలు సాధ్యమైనంత త్వరగా తెలియజేయాలనే అంశాన్ని ఈ తీర్పు బలంగా సమర్థించింది. జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌ 52 పేజీల తీర్పులో.. “ఇది ఏదో లాంఛనప్రాయంగా పాటించాల్సిన విధానం కాదు. ఇది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక రక్షణ” అని స్పష్టం చేశారు. ముఖ్యంగా తనను ఎందుకు అరెస్టు చేశారో, తనపై మోపిన నేరారోపణల స్వభావం ఏమిటో నిందితుడికి తెలియాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ జ్ఞానం మాత్రమే నిందితుడు న్యాయ సహాయం కోసం ప్రయత్నించడానికి, తనపై వచ్చిన ఆరోపణలకు తగిన విధంగా ప్రతిస్పందించడానికి వీలు కల్పిస్తుంది. రిమాండ్‌కు 2 గంటల ముందు గడువు సాధారణంగా అరెస్టు సమయంలోనే లిఖితపూర్వక కారణాలు ఇవ్వడం తప్పనిసరి. అయితే ప్రత్యేక పరిస్థితుల కారణంగా అరెస్టు సమయంలో కారణాలు తెలియజేయడం సాధ్యం కాకపోతే.. వాటిని రిమాండ్‌ కోసం న్యాయమూర్తి ఎదుట నిందితుడిని హాజరు పరచడానికి కనీసం రెండు గంటల ముందుగానైనా లిఖిత పూర్వకంగా అందజేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ గడువును పాటించడంలో విఫలం అయితే.. ఆ అరెస్టును, నిందితుడి రిమాండ్‌ను చట్టవిరుద్ధ చర్యగా పరిగణించే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ తీర్పు ముంబయిలో 2024లో జరిగిన బీఎండబ్ల్యూ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో నిందితుడు మిహిర్‌ రాజేశ్‌ షా దాఖలు చేసిన అప్పీలుపై వెలువడింది. తన అరెస్టుకు గల కారణాలను రాతపూర్వకంగా ఇవ్వలేదనే కారణంపై షా తన అరెస్టు చట్టబద్ధతను సవాలు చేశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ చారిత్రక తీర్పు అమలు కోసం, దీని ప్రతులను అన్ని హైకోర్టుల రిజిస్ట్రార్‌ జనరళ్లకు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపించాలని సుప్రీం కోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.