Saturday, 14 March 2026

Blog

తిరుపతి

శ్రీ భక్త కన్నప్ప ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైధ్యసిభిరం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 20, శ్రీకాళహస్తి పట్టణంలోని కొత్తపేట గాండ్ల వీధి, శ్రీ రామా ఆలయం నందు శ్రీ భక్త కన్నప్ప కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగినది ఈ పరీక్షలలో 80మంది పేషెంట్లు చూపించుకోవడం జరిగినది వీరిలో 10 మంది కంటి శుక్లాలు ఉన్నాయని గుర్తించడం జరిగినది. వచ్చిన వారందరికీ ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ స్టాప్ శ్రీ T.జయచంద్రప్ప,M.భవానీ , SSF కార్యకర్తలు వరలక్ష్మి , గంగరాజు, వైశాలి, ముని కుమారి, తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

తొట్టంబేడు పంచాయతీలో వీది దీపాలు ఏర్పాటు

తొట్టంబేడు పున్నమి న్యూస్ డిసెంబర్ 20, తొట్టంబేడు మండలంలోని తొట్టంబేడు పంచాయతీ పరిధిలోని సచివాలయం 1,2 లోని పరిధిలోగల బంగారమ్మ కాలనీ, సాయి నగర్, ఎల్ఐసి కాలనీ, ఈదులు గుంట, శ్రీరామ్ నగర్, చిలక వారి కండ్రిగ, రామచంద్రపురం ప్రాంతాల్లో తొట్టంబేడు మండలం అధ్యక్షులు రావెళ్ల మునిరాజు నాయుడు, ఎంపీడీవో సురేంద్రనాథ్ సూచనల మేరకు విద్యుత్ లైట్లను పంచాయతీ కార్యదర్శి హరిప్రియ సర్పంచ్ సుబ్బయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుబ్బయ్య మాట్లాడుతూ..ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొన్నిచోట్ల వీధిలైట్లు మరమ్మతులు గురైనయని మరమ్మతులకు గురైన చోట్ల లైట్లును బాగు చేయడం, మరికొన్ని చోట్ల కొత్త లైట్లును ఏర్పాటు చేసామని లైట్ల ఏర్పాటు చేయడంలో తొట్టంబేడు సింగిల్ విండో చైర్మన్ భీమాల భాస్కర్ ముదిరాజ్, తొట్టంబేడు మండల టిడిపి కార్యదర్శి మనీ ముదిరాజ్ లు సహకరించారని అయన తెలిపారు.

తిరుపతి

వేడాం మార్గ మద్యంలో వరి నాట్లు నాటి నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 20, శ్రీకాళహస్తి మండలం, వేడాం మార్గంలో వ్యవసాయ తూములను ఆక్రమించినందువల్ల మార్గం గుండా వాహనాలు కూడా పోలేని విధంగా రోడ్డు దెబ్బతిన్నందువల్ల, ఆ మార్గం పూర్తిగా జలమయమై రాకపోకలకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో రోడ్డు నందు వరి నాట్లు నాటి, చేపలు పట్టిన కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్బంగా DCC అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ…ఈ మార్గం గుండా నిత్యం వేలాదిమంది జీవనోపాధి కొరకు, అత్యవసర సమయాల్లో ఈ రోడ్డు నందు ప్రయాణం చేస్తూ ఉంటారని, పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ రహదారినీ పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వల్లే ఈ విధంగా తయారయిందన్నారు. అనంతరం తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ వేడాం రోడ్డు మార్గం నిత్యం శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చే భక్తులు వెయ్యలింగాలకోన, భైరవకోన, దక్షిణ కాళికాదేవి ఆలయాల సందర్శన నిమిత్తం వేలాదిమంది ప్రయాణం చేస్తున్నటువంటి ఈ మార్గం బాగు చేయడం అత్యవసరమని అదే విధంగా ఈ మార్గం గుండా ప్రయాణం నరకప్రాయంగా, ప్రమాదాలకు నిలయంగా మారిందని, ఈ రోడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షులు రాహుల్ రాయల్, శ్రీకాళహస్తి మండలం యువజన అధ్యక్షులు నవీన్, రేణిగుంట మండల యువజన అధ్యక్షులు ఆసిఫ్, కళ్యాణ్, నాగరాజు, అల్లావుద్దీన్, చరణ్, మహాలక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో ఘంగ వైయస్ జగన్ మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 20, శ్రీకాళహస్తి నియోజికవర్గ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని ముందస్తు జన్మదిన వేడుకలల్లో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యువత రక్షణే ధ్యేయంగ బైక్ నడిపే ప్రతి యువకుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే అవగాహన కల్పిస్తూ, 600 మంది యువతకు ఉచితంగా హెల్మెట్ల పంపిణీ, కళాకారులకు అండగా నిరుపేద డప్పు కళాకారుల జీవనోపాధిని ప్రోత్సహిస్తూ 400 మందికి కొత్త డప్పుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ..మొదటగా తన దైవసమానులు జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తీలిపుకుంటూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 23 ఏళ్ల క్రితమే జగనన్న పుట్టినరోజు వేడుకలను జగన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తా మే ప్రారంభించమని నాటి నుండి నేటి వరకు ప్రతి ఏటా సేవా దృక్పథంతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. యువత క్షేమంగా ఉంటేనే ఆ కుటుంబాలు బాగుంటాయి, అందుకే హెల్మెట్ల పంపిణీ, మన సంస్కృతిని చాటిచెప్పే డప్పు కళాకారులకు అండగా నిలవడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం వైఎస్ఆర్సీపి అభిమానులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి జగనన్నకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, నియోజకవర్గ పరిశీలకులు ఓడూరు గిరిధర్ రెడ్డి, వయ్యాల కృష్ణారెడ్డి, ఉన్నం వాసుదేవ నాయుడు,సుధాకర్ రెడ్డి, జడ్పీటీసీ సంధ్య రాణి,పగడాల రాజు, బర్రి సుదర్శన్ రెడ్డి,చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి,గంగారి రమేష్, ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, కోగిలి సుబ్రహ్మణ్యం, గున్నేరి కిషోర్ రెడ్డి, కూనాటి రమణయ్య యాదవ్, సిరాజ్ భాషా, బుల్లెట్ జయశ్యామ్, మున్నా రాయల్, పటాన్ ఫరీద్, ఉత్తరాజి సర్వణ కుమార్, కంట ఉదయ్ కుమార్, శ్రీవారి సురేష్, మునిరత్నం నాయుడు, కొల్లూరు హరి నాయుడు, పసల కృష్ణయ్య, పులి రామచంద్ర, పెరుమాల చౌదరి, సాగి రవి, షర్మిల ఠాగూర్, సునీత సింగ్ మరియు భారీ సంఖ్యలో వైఎస్ఆర్సిపి నాయకులు,మహిళలు పాల్గొన్నారు.

తిరుపతి

గుండేలుగుంటలో క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 20, గుండేలుగుంట నందు నిర్వహించిన క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశం మూడవ సెషన్ లోని బోధన అభ్యసన సామాగ్రి తయారీ సెషన్ నందు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఉపయుక్త కరమైన బోధనోపకరణలు, వివిధTLM వర్కింగ్ మోడల్ లు తయారు చేసినటువంటి ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు అందరికీ అభినందనలు తెలియజేసి తరగతి గదిలో పిల్లలకు ఉపయుక్తకరమైన టిఎల్ఎం విరివిగా ఉపయోగించాలని క్లస్టర్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు మునితిరుమలయ్య కోరారు. ప్రత్యేక వనరులు, మెటీరియల్ అందుబాటులో ఉంచిన ప్రధానోపాధ్యాయులు ,క్లస్టర్ రిసోర్స్ పర్సన్ లకు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు అందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

తిరుపతి

రెండు చుక్కలతో పోలియోని పారద్రోలాలి… బొజ్జల రీషితా రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 20,శ్రీ కాళహస్తి శాసనసభ్యులు సతీమణి బొజ్జల రీషితా రెడ్డి డిసెంబర్ 21న ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజలు అయిదేళ్ళ వయసు కలిగిన పిల్లలకు పోలియో చుక్కలు తప్పకుండా వేయించి పోలియో మహమ్మరిని పారద్రోలాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విశాఖపట్నం

మధురవాడలో వాంబే కాలనీలో బయల్పడిన పురాతన శ్రీరాముడి విగ్రహం!

మధురవాడలో వాంబే కాలనీలో బయల్పడిన పురాతన శ్రీరాముడి విగ్రహం! *విశాఖపట్నండిసెంబర్ 20పున్నమి ప్రతినిధి* మధురవాడ వాంబే కాలనీలోని 80 అడుగుల రోడ్డు విస్తరణ పనుల్లో స్వయంభువుగా దర్శనమిచ్చారు. నేలతల్లి ఒడిలో ఇన్నాళ్లూ నిగూఢంగా ఉన్న ఆ పురాతన విగ్రహం బయటపడటంతో, స్థానికుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ​విగ్రహం దొరికిన వార్త దావాగ్నిలా వ్యాపించడంతో, పరిసర ప్రాంతాల ప్రజలంతా తండోపతండాలుగా తరలివచ్చారు. “జై శ్రీరామ్” అన్న నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. ఇది సాక్షాత్తూ ఆ రామచంద్రుడి సంకల్పమని, తమ కాలనీని ఆశీర్వదించడానికే స్వామివారు ప్రత్యక్షమయ్యారని భక్తులు భావోద్వేగానికి లోనయ్యారు. ​ఘనంగా పూజా కార్యక్రమాలు ​సామాన్య ప్రజలే కాకుండా, స్థానిక నాయకులు సైతం స్వామివారి సేవలో పాల్గొన్నారు ​

విశాఖపట్నం

ప్రాపర్టీ ఎక్స్‌పోలో గృహ కొనుగోలుదారుల ఆసక్తి*

*ప్రాపర్టీ ఎక్స్‌పోలో గృహ కొనుగోలుదారుల ఆసక్తి* *విశాఖపట్నం డిసెంబర్ 20పున్నమి ప్రతినిధి* 11వ క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్‌పో రెండో రోజున సందర్శకులతో కిటకిటలాడింది. గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు పెద్ద సంఖ్యలో హాజరై నివాస, వాణిజ్య ప్రాజెక్టులను పరిశీలించారు. ఒకే వేదికపై విభిన్న ప్రాజెక్టులను పోల్చుకోవడంతో పాటు డెవలపర్లు, బ్యాంకర్లు, రియల్ ఎస్టేట్ నిపుణులతో నేరుగా చర్చించారు. ఎక్స్‌పోకు తుది వినియోగదారులు, పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న APEPDCL ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీ తేజ్ ఇమ్మడి, విద్యుత్ ఖర్చులను తగ్గించి గృహ ఇంధన భద్రతను పెంచే పరిష్కారం రూఫ్‌టాప్ సోలార్ అని తెలిపారు. PM సూర్య ఘర్: ముఫ్ట్ బిజిలి యోజన ద్వారా ఒకసారి పెట్టుబడి పెడితే సుమారు 20 సంవత్సరాల పాటు విద్యుత్ అవసరాలు తీర్చుకోవచ్చని, మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపి ఆదాయం పొందవచ్చని చెప్పారు. ఈ పథకం కింద ప్రత్యక్ష సబ్సిడీలు, నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని పేర్కొన్నారు. రూఫ్‌టాప్ సోలార్‌కు రూ.78 వేల వరకు సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. APEPDCL పరిధిలోని 11 జిల్లాల్లో సుమారు 31 వేల గృహాలు దాదాపు 100 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు చేసుకున్నాయని, ఇందులో విశాఖపట్నంలోనే సుమారు 4,500 గృహాలు ఉన్నాయని వెల్లడించారు. ఎక్స్‌పోలో జరిగిన ప్యానెల్ చర్చలో గృహ రుణాలు, అర్హతలు, తిరిగి చెల్లింపు విధానం, నిర్మాణ నాణ్యతపై చర్చించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా పలు బ్యాంకులు వడ్డీ రేట్లు, వేగవంతమైన రుణ ఆమోదాలు, ప్రత్యేక ఎక్స్‌పో ఆఫర్లను ప్రకటించాయి. సరఫరాదారులు నాణ్యత పెంచే పరిష్కారాలను ప్రదర్శించగా, డెవలపర్లు అభివృద్ధి చెందుతున్న వృద్ధి కారిడార్‌లలో ఆమోదం పొందిన ప్రాజెక్టులను వివరించారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు అనుమతులను వేగవంతం చేసే చర్యలు, అభివృద్ధి ప్రాధాన్యతలను వివరించారు. దీంతో నగర రియల్ ఎస్టేట్ భవిష్యత్తుపై విశ్వాసం పెరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు తొలిసారి గృహం కొనుగోలు చేసే వారు వేదిక వద్దే సూత్రప్రాయ గృహ రుణ ఆమోదాలు పొందారు.

విశాఖపట్నం

29వ వార్డులో జగనన్న జన్మదిన వేడుకలు*మహిళలకు చీరలు పంపిణీ

*29వ వార్డులో జగనన్న జన్మదిన వేడుకలు* *విశాఖపట్నం డిసెంబర్ 20పున్నమి ప్రతినిధి* * మహిళలకు చీరలు పంపిణీ * *వార్డు అధ్యక్షుడు పీతల వాసు &రాష్ట్ర యువజన కార్యదర్శి కనకల ఈశ్వర్ గారు ఆధ్వర్యంలో కేక్ కటింగ్* *ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి*.. జనహృదయనేత జగన్మోహన్ రెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలు 29వ వార్డులో ఘనంగా నిర్వహించారు. వార్డు అధ్యక్షుడు పీతల వాసు & రాష్ట్ర యువజన కార్యదర్శి కనకల ఈశ్వర్ గారు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు. రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ తో కలిసి ముందుగా కేక్ కటింగ్ చేసి కార్యకర్తలు అభిమానులు మధ్య జననేతకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పార్టీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా నరనరాల్లో అభిమానాన్ని నింపుకున్నారని అన్నారు. పీతల వాసు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు దక్షిణ నియోజకవర్గంలో ముందస్తుగా ప్రారంభమయ్యాయన్నారు. నేడు దక్షిణ నియోజకవర్గంలో అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ సంబరాలు వాడ వాడల ఘనంగా నిర్వహించనున్నట్లు వాసుపల్లి తెలిపారు. ఇప్పటికే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ హోర్డింగులు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొన్ననున్నదని చెప్పారు. ఆయన జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని వాసుపల్లి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బెవర మహేష్ సౌత్ సోషల్ మీడియా ప్రెసిడెంట్, గుమ్మడి చంద్రమౌళి, జిల్లా యువజన విభాగం జనరల్ సెక్రటరీ, అరుగుల రాజ్ కుమార్, RTI జిల్లా సెక్రటరీ, అడప శివ, తమ్మినేని శ్రీను,సిటీ యూత్ సెక్రటరీ, ఎలమంచిలి సంతోష్, సిటీ యూత్ సెక్రటరీ, 29వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిటీ మహిళా జనరల్ సెక్రటరీ, బొండాడ వెంకటరావు, బీసీ సెల్ ప్రెసిడెంట్, కొయ్య చిన్ని, ఉరికిరి శివ పండు, ఇల్లిపిల్లి శ్రీనివాస్, సారిపల్లి రమనేశ్వరరావు, నీలాపు లక్ష్మి, లంకె మహేశ్వరి, మేడిశెట్టి రూప, బోర వెంకటలక్ష్మి, ఫైబోటి శివ, సతీష్, పడాల సూర్య, కోట ఆనంద ప్రసాద్, బొడ్డు ధనరాజ్, సారిపిల్లి శివ, వడ్డాది శివ, చందక భాస్కరరావు, కరీం, గండివలస పెంటయ్య, పీతల వినయ్, గొల్ల గాని మధు, ఆబోతుల వెంకటరమణ, మేడపాటి సుబ్బారెడ్డి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 29వ వార్డు నాయకులు చంద్రమౌళి, అనుబంధ సంఘాల అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ధ్యానంతో మానసిక. శారీరిక ప్రశాంతత* *ఘనంగా అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం*

*ధ్యానంతో మానసిక. శారీరిక ప్రశాంతత* *ఘనంగా అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం* *బ్రహ్మకుమారి ల 2026* *నూతన క్యాలెండర్ ఆవిష్కరణ* *విశాఖపట్నం డిసెంబర్ 20పున్నమి ప్రతినిధి* ధ్యానం జ్ఞాన శక్తిని పెంపొందించడమే కాకుండా మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుందని ఆంధ్ర యూనివర్సిటీ యోగ డైరెక్టర్ భాను కుమార్ అన్నారు.. శనివారం డాబా గార్డెన్స్ వి జె ఎఫ్ ప్రెస్ క్లబ్ లో ప్రజా పిత బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భానుకుమార్ మాట్లాడుతూ ధ్యానం తో ఆత్మ పరిశీలన అంతర్గత ప్రశాంతత . చేకూరుస్తుంది అన్నారు.. శారీరక ఆరోగ్య విషయంలో రక్త పోటు నియంత్రించడంతోపాటు నాణ్యతతో కూడిన నిద్ర కు చక్కగా ఉపయోగపడుతుందన్నారు.. హార్మోన్ల క్రియాశీలత అరికట్టి భావోద్వేగాల తరంగాలు మార్పు చేసి ప్రశాంతత. విశ్రాంతిని చేకూరుస్తుంది అన్నారు.. ప్రముఖ సైకాలజిస్ట్.. యోగ శిక్షకులు బికే వెంకటరావు మాట్లాడుతూ ధ్యానం వల్ల ఎన్నో లాభాలు చేకూరుతాయి అన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ధ్యానాన్ని చేర్చుకోవాలన్నారు.. ప్రజా ప్రతి బ్రహ్మకుమారిస్ విశ్వవిద్యాలయం ప్రతినిధి రామేశ్వరీ మాట్లాడుతూ రాజయోగతో ప్రతి ఒక్కరూ మానసిక ప్రశాంతంగా ఉండవచ్చునున్నారు.. ధ్యానం వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యమైన జీవనాన్ని గడిపేందుకు అవకాశం ఉందన్నారు.. సర్వ మానవాళి మానసిక శారీరక ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని అలవర్చుకోవాలన్నారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి. డాక్ యార్డ్ సంఘం గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు యోగ శిక్షకులు సన్యాసిరావు స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ కొరియోగ్రాఫర్ ఆర్ నాగరాజు పట్నాయక్. బ్రహ్మకుమారిల ప్రతినిధులు సోమేశ్వరి అపరంజి తదితరులంతా పాల్గొని బ్రహ్మకుమారిస్ రూపొందించిన 2026 నూతన వార్షిక క్యాలెండర్ ఆవిష్కరించారు..

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.