Friday, 3 April 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్

పినాకిని సత్యాగ్రహ(గాంధీ)ఆశ్రమం కి 100వ పుట్టినరోజు 

భారతదేశ చరిత్రలో  మహాత్మా గాంధీ స్థాపించిన ఆశ్రమాలలో ముఖ్యమైనవి మొదటిది  ఉత్తర భారతదేశంలో స్థాపించిన ఆశ్రమం “సబర్మతి  ఆశ్రమం” అయితే దక్షిణ  భారతదేశంలో స్థాపించిన ఆశ్రమం” పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం”.దీన్నే “దక్షిణ సబర్మతి” అని  పిలుస్తారు. ఈ ఆశ్రమం 1921  ఏప్రిల్ 7 వ తేదీ  మహాత్మా గాంధీ  స్వయంగా,స్వహస్తాలతో ప్రారంభించారు. ఈ మహిమాన్విత క్షేత్రం 7-4-2020  నాటికి 100 వ పుట్టిన రోజు జరుపుకోబోతున్నది.  సత్యం అహింస మీద ఆధారపడి గాంధీ గారు సాగించిన స్వాతంత్ర పోరాటంకి సత్యాగ్రహ సైనికులను తయారు చేయడానికి దక్షిణ భారతదేశంలో శిక్షణాలయం ప్రారంభించాలని ఆలోచిస్తుండగా,1890 సంవత్సరంలో ఒరిస్సా రాష్ట్రంలోని,గంజాంజిల్లాలో జన్మించిన హనుమంతరావుగారు తన జీవితాన్ని అంకితం చేయాలని నిశ్చయించుకుని, 1915 సంవత్సరంలో గాంధీగారిని హనుమంతరావు పూనా నగరంలో కలిశారు. గాంధీ వ్యక్తిత్వం పట్ల ఆకర్షితులై సబర్మతి ఆశ్రమంలో చేరి సేవ చేయడం ఆరంభించారు. హనుమంతరావు గారి క్రమశిక్షణ,అంకితభావం గమనించి, గాంధీ గారు ఆశ్రమం నడుపుటకు కావలసిన అన్ని లక్షణాలు  హనుమంతరావులో ఉన్నాయని గుర్తించి ఆశ్రమం ఏర్పాటు చేసే బాధ్యత  హనుమంతరావు భుజస్కందాలపై   ఉంచారు.పల్లిపాడులో 1894 వ సంవత్సరం లో పుట్టిన  చతుర్వేదుల వెంకటకృష్ణయ్య సబర్మతి ఆశ్రమంలో ఉంటూ హనుమంత రావు తో గాఢమైన స్నేహం ఏర్పడింది. పల్లెపాడు లో పినాకినీ నది ఒడ్డున ఆశ్రమ ఏర్పాట్లు అన్నివిధాలా తగినదని చెప్పటంతో ఇద్దరు గాంధీ గారి అనుమతితో పల్లెపాడు చేరుకున్నారు.కొండపర్తి పున్నయ్య గారు  వీరికి  తోడయ్యారు.   ఒక చేత స్వాతంత్ర్య సమరాన్ని,ఇంకొక చేత జమిందారు రైతు ఉద్యమాన్ని నడిపిన వీరనారీ,సవ్యసాచి  శ్రీమతి పొణకా కనకమ్మ గారు ఆశ్రమానికి కావాల్సిన  స్థలాన్నిఇచ్చారు. చిదంబరం పెళ్లై మున్నగు వారితో  కలసి తుపాకీ కేంద్రంగా ఉన్న ఆ స్థలాన్ని గాంధీ గారి పరిచయంతో అహింసా కేంద్రంగా మార్చే ఆలోచన చేసి 9 ఎకరాల మామిడి తోపును కొని  ఆశ్రమ స్థాపనకై ఇచ్చారు. చతుర్వేదుల వెంకట కృష్ణయ్య  మరి కొంత భూమిని సేకరించి  సమకూర్చారు. 1921 ఏప్రిల్ 7న మహాత్మా గాంధీ నెల్లూరుకు రైలులో వచ్చారు. శ్రీమతి పొణకా కనకమ్మ భర్త సుబ్బరామిరెడ్డి  ఇరువురు రైల్వే స్టేషన్ దగ్గరకు ఎద్దుల బండిలో వచ్చారు. బండిలో పెద్ద పరుపు వేసి గాంధీగారిని కూర్చుండబెట్టి  పల్లెపాడు కి తీసుకుని వెళ్లారు. నిర్మాణానికి గాను తన ఒంటి మీద నగలను మహాత్మునికి  విరాళంగా ఇచ్చింది. జీవితంలో తిరిగి నగల ధరించని వద్దని మహాత్ముడు  ఆమె వద్ద ప్రమాణం తీసుకున్నాడు. 1921వ  సంవత్సరం నవంబర్ 25 తేదీన ట్రస్ట్ డీడ్ ద్వారా ఆశ్రమాన్ని రిజిస్టర్ చేయించి, ప్రథమ ట్రస్టీలైన శ్రీ దిగుమర్తి హనుమంతరావు, వారి సతీమణి శ్రీమతి  దిగుమర్తి బుచ్చి కృష్ణమ్మ, శ్రీ చతుర్వేదుల  వెంకట కృష్ణయ్య,శ్రీ కొండపర్తి పున్నయ్య యావజ్జీవ ట్రస్టీలుగా,ఆశ్రమ సభ్యులనుండి ఎన్నుకోబడి మరి ఇద్దరు కలిసి బోర్డు గా వ్యవహరించుటకు ఏర్పాటు చేశారు. ట్రస్టు బోర్డు సభ్యుల సంఖ్య ఆరుగురికి మించ రాదని ఏర్పాటు చేశారు. గాంధీగారి గుజరాతీ స్నేహితులైన రుస్తుంజీ ,గాంధీగారి నిరాడంబరత ,ప్రేమ ఆదర్శ జీవితం,వారిపట్ల ఆకర్షితులై ఆశ్రమ నిర్మాణానికై 5వేల రూపాయల విరాళం ఇచ్చారు. జాతీయ కాంగ్రెస్ వారు 10.000 రూపాయలు, మునగాల రాజా 2 వేల రూపాయలు మరియు  కొంత ధనాన్ని  చందాల రూపంలో వసూలు చేసి  ఆశ్రమాన్ని నిర్మించడం జరిగింది. తొలుత పూరిపాకలతో ప్రారంభమైన ఆశ్రమం 1925 నాటికి ఆశ్రమంలో భవనాలు ఏర్పడ్డాయి. ఆ భవనానికి”రుస్తుంజీ భవన్” అని నామకరణం చేసారు. చతుర్వేదుల కృష్ణయ్య జనాన్ని సమీకరించడంలోనూ, సభలను చేయడంలో సమర్థులు,వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించేవారు. అస్పృశ్యత నిర్మూలన హరిజనోద్ధరణ వంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ జిల్లాలో తొలి హరిజన హాస్టల్ ను ప్రారంభించిన ఘనత వీరికి దక్కింది. కొంత కాలం గడిచిన తర్వాత ఈ బృందంలో   ఇస్కాచెంచయ్య దంపతులు ,కాళ్ళకూరి వెంకటరావు దంపతులు, హనుమంతరావు గారి సోదరులు వెంకటరామస్వామి, ఆయన భార్య జానకి దేవి చేరారు. పత్రికా సంపాదకులు ఖాసా సుబ్బారావు ,భార్య, వారి తల్లి, వాడ్రేవు జగ్గరాజు, శ్రీ గుణదల సుబ్బారావు గారు, తిరుపతి నాయుడు గారు, మణికొండ సత్యనారాయణ గారు, కొంతకాలం ఆశ్రమంలో ఉండి ఆశ్రమ కార్యక్రమాలలో సేవ చేస్తూ గడిపారు. పాటూరు సుబ్బరామయ్య,సరస్వతమ్మ దంపతులు,శ్రీమతి పొణకా కనకమ్మ,వెన్నెలకంటి రాఘవయ్య,తిక్కవరపు రామిరెడ్డి వంటి గాంధేయవాదులు ఆశ్రమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు.1923 లో ఆశ్రమం లో బందిపోటు దొంగలు జోరపడి ఆశ్రమవాసులను కొల్లగొట్టి స్త్రీల వద్ద ఉన్న నగలను కూడా దొంగిలించడంమే కాకుండా, గాయాలపాలు చేసి పారిపోయారు.  అయినప్పటికీ ఆశ్రమవాసులు పోలీస్ రిపోర్ట్ ఇవ్వకుండా తిండికి లేని వారు ఈ పని చేసి ఉంటారని సమాధానపడి ఊరుకుండినారు. ఈ ఉదంతము ఇతరుల అందరిలో సంచలనం కలిగించింది రిపోర్టు లేనప్పటికీ పోలీసులు ఈ దొంగలముఠాను పట్టుకుని ఆశ్రమవాసులను నిందితులపై సాక్ష్యాన్నిఇస్తే బందీలుగా చేస్తామని చెప్పినా, ఆశ్రమవాసులు నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వకుండా వదిలివేశారు.దొంగతనం చేసిన కొన్ని బంగారు ఆభరణాలను  పోల్చుకొనుటకు దిగుమర్తి వచ్చి కృష్ణమ్మ గారిని కోరగా  నగలు తమవి వలె ఉన్నవి కాని తమవే అని నిర్ధారణగా చెప్పలేమని,అంగీకరించని కారణంగా ఆమె ప్రవర్తన చూసినంతనే దొంగలు విస్మయం చెంది, నేరగాళ్లను తామే ఒప్పుకొని,ఆ వృత్తాంతమును చేసింది వారేనని చెప్పి వేసినారు. కేసు రుజువై దొంగలకు శిక్ష పడింది. ఈ విషయం గాంధీ గారికి తెలిసి ఆశ్రమవాసులు యొక్క, ముఖ్యముగా శ్రీమతి కృష్ణమ్మ గారి యొక్క ధైర్యం ముందు ప్రవర్తనను  మెచ్చుకున్నారు. ఆశ్రమవాసులు ఒక గుణపాఠం అని, అస్తేయము ఆదర్శముగా గల ఆశ్రమ సభ్యులు ఆకర్షించు ఆభరణములను ధరించుటకానీ, బంగారం ఉంచుకొనుటగాని కూడదని విషయమును గ్రహించి అప్పటినుంచి ఆశ్రమంలో విలువైన ఆభరణములు ధనమును కలిగి ఉండటం మానివేశారు.చక్కగా నడుస్తూ ఉండగా 1925లో దిగుమర్తి హనుమంతరావు ప్రకృతి చికిత్సని పొందుతూ,మూత్రపిండ వ్యాధితో బాధపడుతూ 1926 నాటికి భౌతిక దేహాన్నివిడిచి పరమపదించడం జరిగింది. ఆయన భార్య అక్కడ ఉండకపోవడం, పిమ్మట చతుర్వేదుల వెంకట కృష్ణయ్య  హనుమంతరావు మరణంతో మనస్థాపం చెంది తుదకు ఆధ్యాత్మిక మార్గాన్ని పట్టి, పాండిచ్చేరి,అరవింద ఆశ్రమం వెళ్లిపోవడం  జరిగింది.హనుమంతరావుగారు మరణించిన తర్వాత కొంతకాలం కృష్ణమ్మగారు ఆశ్రమాన్ని నిర్వహించి సీతానగరం వెళ్ళిపోవడం జరిగింది.1929లో  రెండవ సారి మే11వతేదీన గాంధీగారు ఆశ్రమం కి విచ్చేయడం జరిగింది. అదే రోజు రాత్రి పల్లెపాడులో ఆశ్రమానికి విచ్చేసి ఆ రోజు రాత్రి అక్కడే బస చేయడం జరిగింది.ఆ సందర్భంలో ఆ ఊరి బ్రాహ్మణలు, బ్రాహ్మణ అగ్రహారంకి గాంధీజీని రావలసినదిగా కోరగా ,దళితులను కూడా ఆ వీధిలో అనుమతిస్తేనే వస్తానని చెప్పి ఆతర్వాత వారికి కూడా అనుమతి ఇస్తామని చెప్పినట్లు,అప్పుడే గాంధీ గారు బ్రాహ్మణ వీధికి వెళ్లారని, దారి పొడుగూతా వారు పోసుకుంటూ గాంధీ గారిని ఆహ్వానించారని గ్రామ ప్రజలు చెప్తుండేవారు. తర్వాతి కాలంలో కొండపర్తి పున్నయ్య గారు ఖాదీ సంస్థ లో పనిచేయుటకు వెళ్లిపోవడం, శ్రీ ఖాసా సుబ్బారావు గారు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి “స్వరాజ్య పత్రిక “సంపాదకులుగా, దిగుమర్తి వెంకటస్వామిగారు కాంగ్రెస్ సేవకులుగా వెళ్లి పోవడం,ఇస్కా చెంచయ్య గారు ఆయన భార్య బ్రహ్మసమాజం ఆడపిల్లల హాస్టల్ నడుపుటకు వెళ్లిపోవడం, శ్రీ కాళ్లకూరి వెంకట్రావు, వారి కుటుంబం కూడా ఆశ్రమం విడిచి పోవడం, శాశ్వత ధర్మకర్తల అందరూ ఒకరి తర్వాత ఒకరు ఆశ్రమాన్ని వదిలి వేయడం జరిగింది. ఆశ్రమం స్థాపించిన తొలి రోజుల్లో  రెంటాల కృష్ణమ్మ(య్య), ఆయన భార్య సుబ్బమ్మ  ఆశ్రమంలోనే స్థిరపడి, సేవచేస్తూ ఉండిపోయారు.1930లో ఉప్పు సత్యాగ్రహం,క్విట్ ఇండియాఉద్యమాలు  ఆశ్రమం తరపున కార్యకర్తలు నిర్వహించారు.గాంధీగారు బాధ్యతలను1942లో  శ్రీ దేశభక్త కొండా వెంకటప్పయ్యకి అప్పగించడం జరిగింది. వెంకటప్పయ్య గారు ఆశ్రమంలో ఖాదీ ఉత్పత్తి ,హిందీ భాష ప్రచారం ,వయోజన విద్య, అంటరానితనం నిర్మూలనా కార్యక్రమాలను చేపట్టారు. వెంకటప్పయ్య గారి కోరిక మీద ఓరుగంటి వెంకటసుబ్బయ్య గారు ఆశ్రమ బాధ్యతలు  స్వీకరించారు. ఓరుగంటి వెంకటసుబ్బయ్య  వారి భార్య మహాలక్ష్మమ్మ ,వెంకటసుబ్బయ్య కుటుంబంతో పాటు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఉపేంద్ర దంపతులు ఆయన తండ్రి ఆశ్రమంలోని కాపురం ఉంటూ ఆయుర్వేద ప్రకృతి చికిత్సలు  నిర్వహిస్తూ, శిక్షణ ఇవ్వడం జరిగింది. 1952లో  ఈ కృష్ణమ్మగారు  తర్వాత  సీతానగరం నుండి తిరిగి వచ్చి  పినాకిని సత్యాగ్రహ ఆశ్రమానికి గ్రామస్థాయి సహాయకులకు ఆరోగ్యసంక్షేమానికి,బాలవాడి, తేనె ఉత్పత్తి ,స్త్రీలకు వృత్తి విద్యలు నేర్పటం  వంటి శిక్షణా కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది. కొన్నాళ్లు కస్తూరిబా స్మారక నిధి నుండి కొంత ధన సహాయముతో శ్రీమతి ప్రభవ గారు మరియు మరుపూరు రుక్మిణమ్మ గారు  కొంతకాలం కాపాడారు. తర్వాత ఆ ఆశ్రమాన్ని స్వరాజ్ సంస్థకు కౌలుకు నిర్వహణ నిమిత్తమై ఇవ్వడం జరిగింది. 1983-89 వరకు సుప్రసిద్ధ విద్యావేత్త శివరాం ఆంగ్లేయ వనిత ఎలిన  వాట్స్ పల్లెపాడు  గ్రామంలో “సృజన “పాఠశాలను,1990లో పినాకిని విద్యా సొసైటీ వారికి, పల్లిపాడువాసి హైదరాబాదు గొల్లపల్లి చక్రవర్తి, నెల్లూరు వాసి అల్లాడి వాసుదేవన్ చివర నిర్వాహక ట్రస్టీలుగా, 1991 లో బుచ్చి కృష్ణమ్మగారు మరణించటంతో ఆశ్రమం ట్రస్ట్ స్థాపన,1997 లో స్థానికులు వేదాచలం గారు, తిక్కవరపు వెంకటరెడ్డి,తిక్కవరపు సుకుమార్ రెడ్డి, 2002 సంవత్సరంలోగ్రామ సర్పంచ్  శ్రీ వేదాచలం హయాంలో ఆశ్రమం బాగా దెబ్బతిని ఉంటే దాన్ని మరమ్మతులు  చేయించి, ఇంక నడిపించచాలమని భావించి,  ట్రస్ట్ ని రద్దు చేసి,తర్వాత 2003లోఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ 2005లో  నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ సంస్థ వారిని  కోరడం జరిగింది.వారంగీకరించిన మీదట ఆశ్రమాన్ని  అప్పటి రెడ్ క్రాస్ చైర్మన్  డాక్టర్ శ్రీ ఏ. వి. సుబ్రహ్మణ్యం గారికి బాధ్యత అప్పగించారు.ఉపసంఘానికి  సమన్వయకర్తగా శ్రీ గణేశం  కృష్ణా రెడ్డి గారు, కొంత మంది  సభ్యులను ఆహ్వానించి సహాయ సహకారాలతో అనేక కార్యక్రమాలు నిర్వహించారు.భవనాన్ని సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి,జిల్లా పరిషత్ శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి   ప్రధాన విరాళంతో పూర్తిస్థాయిలో జీర్ణోద్ధరణ కావించారు.                  ఆశ్రమ వ్యవస్థాపకులు, గాంధీజీ పై డాక్యుమెంట్లు, జీవిత చరిత్ర విశేషాలు అందుబాటులో

Featured ఆంధ్రప్రదేశ్

కోవిడ్-19 నియంత్రణకు లాక్ డౌన్ ఒక్కటే మార్గం: డా.మానికిరెడ్డి, కాకినాడ.

    కోవిడ్ -19 నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తూ సేవలందిస్తున్న జిల్లా అధికారులు పనితీరు అభినందనీయం అని డా. మానికిరెడ్డీ హెల్త్ కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. మానికీరెడ్డి అన్నారు. దేశం లో కరోనా వైరస్ ప్రబలకుండా లాక్ డౌన్ స్వీయ నియంత్రణ సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటిస్తే కరోనా మహమ్మారిని దేశం నుండి తరిమి కొట్టవచ్చు అని డా . మానికి రెడ్డి సత్యన్నారాయణ గారు అన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా  మానవాళిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతీ ఒక్కరికీ ఉంది అన్నారు.ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ వల్ల జరుగుతున్న లాక్ డౌన్ ను విజయవంతం చెయ్యడానికి అహర్నిశలు శ్రమిస్తున్న  అధికారులకు పోలీస్ లకూ భాద్యతగా సహకరిస్తూ  ఇళ్ళకే పరిమితమై ప్రాణాలను కాపాడుకుందాం అని డా .మానికి రెడ్డీ అన్నారు .ప్రపంచములో భయంకరమైన కరోనా వైరస్ లక్షల్లో ప్రాణాలను కోల్పోయిన విషయం దృష్టిలో ఉంచుకొని దేశాన్ని కాపాడుకోవడానికి భాద్యతగా ప్రతీ ఒక్కరూ ఇంటిలోనే గడపాలి అన్నారు.దేశం లో ఇది దృష్టి లో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఆరోగ్య భద్రత కోసం లాక్ డౌన్ నిర్వహించారు.వైద్యులు,పోలీసులు, మునిసిపల్ కార్మికులు ,పాత్రికేయులతో పాటు ప్రజా సేవలో అన్ని ప్రభుత్వ శాఖ అధికారులు తమ ప్రాణాలను పణం గా పెట్టీ మన ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తూ ఉన్నవారికి సహకరించాలి అన్నారు.కరోనా పై ప్రభుత్వం వైద్యులు సూచనలు తప్పనిసరిగా పాటించాలి అని సూచించారు.మన దేశం లో రోజు రోజుకీ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో జాగ్రత్తలు పాటించకుండా ఉంటే ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని మానికి రెడ్డీ హెచ్చరించారు .

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

“ఇంట్లోనే ఉందాం – దేశాన్ని రక్షించుకుందాం”

“ఇంట్లోనే ఉందాం – దేశాన్ని రక్షించుకుందాం” అనే నినాదం వినడానికి విడ్డూరంగా ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అనివార్యం. లాక్ డౌన్ అనే పేరుతో ఈ కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. మనదేశంలోనే కాకుండా అనేక దేశాల్లో ఆచరిస్తున్నారు. ప్రస్తుతం దేశాన్ని కాపాడుకోవడానికి తుపాకి పట్టుకొని సరిహద్దుల్లో యుద్ధం చేయనక్కర్లేదు. రిమోట్ పట్టుకొని టీవీ ముందు కూర్చుని ఎక్కడికి పోకుండా ఇంట్లో ఉంటే చాలు. ఇప్పుడు మనం చేస్తున్న ఈ యుద్ధం శత్రు రాజ్యం మీద కాదు. కరోనా వైరస్ మీద.ఒక్క రోజు కాదు ఇరవై ఒక్క రోజులు. పనులన్నీ మానుకుని 21 రోజులపాటు ఇంట్లోనే కూర్చుని ఉండడం అవసరమా అని అనిపిస్తుంది. దీని అవసరాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ వ్యాధి తీవ్రత ఎంతుంది?ఎన్ని దేశాలకు పాకింది? వ్యాధి విస్తరణలో ఉన్న దశలు ఏమిటి? అనే అనే విషయాలను తెలుసుకోవాలి. ఈ కరోనా వైరస్ 3 నెలల క్రితం చైనా లో పుట్టింది. మూడు నెలల్లోనే ప్రపంచంలోని 200 దేశాలకు పాకింది. మార్చి 28 నాటికి సుమారు 8 లక్షల 35 వేల మందికి సోకింది. 39 వేల మంది మరణానికి కారణమయ్యింది. మనదేశంలో సుమారు 1250 మందికి సోకి, 32 మందిని బలి తీసుకుంది. మూడు నెలల్లోనే ఇంతమందికి సోకి ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్ వ్యాప్తి ఇంకోక నెల ఇలాగే కొనసాగితే జరగబోయే పరిణామాలను ఊహించడం కష్టతరంగా వుంది. ఈ వ్యాధిని కట్టడి చేయాలంటే ఈ వ్యాధి ఏ విధంగా వ్యాపిస్తుంది. విస్తరించడంలో ఉన్న దశలేమిటి అన్నది విషయం తెలుసుకోవాలి. ఈ వ్యాధి నాలుగు దశల్లో వ్యాపిస్తుంది. మొదటి దశ …. విదేశాల నుంచి దిగుమతిదశ.ఈ వైరస్ ఈ దేశం లో పుట్టింది కాదు. చైనా లో పుట్టి, దేశ దేశాలకు పాకుతూ మన దేశంలోకి కూడా ప్రవేశించింది. ఈ వ్యాధి సోకిన స్వదేశీయులు కానీ,విదేశీయులు గానే ఈ దేశంలోకి రావడంతో ఈ దశ ప్రారంభమైంది. ఈ దశలో కరోనా ను అదుపు చేయడం సులభం. విదేశాలనుండి వచ్చేవారిని 14 రోజులపాటు కట్టడిలో పెట్టి ఆ తర్వాతనే దేశంలోకి అనుమతించి ఉండాలి. రెండవ దశ……. విదేశాల నుంచి వచ్చిన ఈ వ్యాధిగ్రస్తుల ద్వారా ఈ దేశంలో ఉన్న వారికి సోకడం రెండవ దశ. ఈ జబ్బును తెచ్చుకున్న విదేశీ ప్రయాణికులు తన కుటుంబ సభ్యులకు, సహచరులకు, మిత్రులకు అంటించడం జరుగుతుంది. మూడవ దశ…. రెండవ దశలో సోకిన వారి ద్వారా వారిమిత్రులకు, సహచరులకు, కుటుంబ సభ్యులకు అంటుకోవడం. నాల్గవ దశ ఎవరి ద్వారా ఎవరికి అంటుకున్నది తెలుసుకోలేని విధంగా సమాజంలో ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడం. మన దేశం ప్రస్తుతం రెండవ దశలో ఉంది. మహారాష్ట్ర మూడవ దశలో ఉందేమో అన్న అనుమానం ఉంది. ఇటలీ,అమెరికాలు రెండవ దశను దాటి మూడవ దశలో కి ప్రవేశించాయి. ఆర్థికంగా ,వైద్యపరంగా అభివృద్ధి చెందిన ఈ దేశాలకే ఈ వైరస్ ని కట్టడి చేయడం కష్టమై రోజుకు కొన్ని వేల మంది చనిపోతున్నారు. వైద్య సేవలను సరైన పద్ధతిలో అందించడం కూడా సాధ్యం కావడం లేదు. వీరి పరిస్థితే ఇలా ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో. జనాభా ఎక్కువగా ఉన్న సాంద్రత ఎక్కువగా ఉన్న మనలాంటి దేశంలో ఈ వ్యాధి వ్యాప్తి తీవ్రంగా ఉండవచ్చు. వ్యాధి నిర్ధారణకు కావలసిన పరీక్షలు, ఆసుపత్రిలో చేరి వైద్యం చేయవలసి వస్తే అవసరమైన వైద్య సదుపాయాలు చాలా కస్టమవుతాయి. నిర్ధారణ పరీక్షలు లేక ,వైద్యం అందించడానికి ఆస్పత్రిలో పడకలు సరిపోక ,వెంటిలేటర్లు అందుబాటులో లేక చాలా ప్రాణాల్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మూడు నుంచి నాల్గవ దశలోకి పోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం మరీ కష్టం. ఈ వ్యాధిని కట్టడి చేయడానికి మన ప్రభుత్వాలు తీసుకున్న లాక్ డౌన్ కార్యక్రమం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. ఈ కార్యక్రమం ద్వారా వ్యాధి ఉన్నవారు ఇంట్లోనే ఉంటూ వేరే వారికి అంటించకుండా ఉండడానికి,వ్యాధి లేని వారు వేరే వారి నుంచి అంట్టించుకోకుండా ఉండే దానికి చాలా అవసరం. కష్టమైనా మనకు ఇష్టం లేకపోయినా లాక్ డౌన్ కార్యక్రమాన్ని ఆచరిద్దాం కరోనాను కట్టడి చేద్దాం.

Featured ఆంధ్రప్రదేశ్

పోలీస్‌ ‌సోదరులకు సలాం

కావలి, మార్చి 30, 2020 (పున్నమి విలేఖరి) : జంగమదేవర్ల సంక్షేమ సేవాసమితి-కావలి వారి ఆధ్వర్యంలో సోమవారం కరోనా వైరస్‌ ‌నిర్మూలనకు లాక్డౌన్‌ ‌విధుల్లో ఉన్న పోలీస్‌ ‌సోదరులకు కావలి డీఎస్పీ ప్రసాద్‌ ‌రావు సమక్షంలో నీళ్ళ బాటిళ్లు, బిస్కెట్‌ ‌ప్యాకెట్లు అందించడమైనది. ప్రజల ఆర్యోగం కోసం అహర్నిశలు తమ కుటుంబాలను వదిలి విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సోదరులకు మనమంతా అభినందనలు తెలియచేయాలి.

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

ప్రతి మెడికల్ షాపులో మాస్కులు లభ్యమయేలా చర్యలు తీసుకోవాలి

నెల్లూరులో మాస్కులు,శానిటైజర్ లు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. అందరూ మాస్కులేసుకోనఖ్ఖరలేదన్నా జనాలు మాస్కులు కొంటున్నారు. లిక్విడ్ సోప్స్, శానిటైజర్ లు కూడా డిమాండ్ పెరిగింది. దీన్ని అదునుగా చేసుకొని నెల్లూరు లోని మెడికల్ షాపులు కొందరు శానిటైజర్ లు మాస్కులు విపరీతమైన ధరలకు అమ్ముతున్నారు. రేటెక్కువంటే స్టాక్ లేవు అని అంటున్నారు. వేదాయపాళెంలో ఓ మెడికల్ షాపుపై చర్యలు తీసుకొన్నా బుద్ధిరాలేదు. అందుకే ఔషధ నియంత్రణ అధికారులు ప్రతి మెడికల్ షాపులో మాస్కులు లభ్యమయేలా శానిటైజర్ లు లభ్యమయేలా ప్రతి షాపు ధరలవివరణతో బోర్డులు పెట్టేలా చర్యలు తీసుకోవాలి. అపుడే నియంత్రించేందుకు అవకాశం ఉంటుంది. ఉల్లంఘించి నవారిపై క్రిమినల్ చర్యలకు ప్రభుత్వం చేపట్టాలి.

Featured ఆంధ్రప్రదేశ్

కలెక్టర్ ను కలిసిన నెల్లూరు జిల్లా APJF నేతలు.

నెల్లూరు జిల్లాలోని జర్నలిస్ట్ లకు కరోన, కోవిడ్ -19 సందర్భంగా ఆర్థికంగా వెనుకబడిన జర్నలిస్ట్ లకు పని వత్తిడి లో రేషన్ కార్డులు కూడా లేవని,ఆర్థికంగా ఎంతో వెనుక బడిన జర్నలిస్ట్ లకు బి.పి.ఎల్ క్రింద అందరికి మూడు నెలలు నిత్యావసర వస్తువులు, బియ్యం, గ్యాస్ సిలిండర్ లు ,నగదు ఇవ్వాలని కోరారు.గురువారం apjf నెల్లూరు జిల్లా నేతలు పత్రికముకంగా కొరగా శుక్రవారం కలెక్టర్ గారిని స్వయంగా ఇతర జర్నలిస్ట్ లతో కలిసి కోరడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారు స్పందించి సంబంధిత జిల్లా అధికారులు కు తగు సూచనలు చేశారు. అలాగే మీడియా లో పని చేస్తున్న జర్నలిస్ట్ లకు/నాన్ జర్నలిస్ట్ కు కరోన పాస్ లు మంజూరు చేయాలని కోరాము,తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చి జిల్లా సమాచార శాఖ D. D గారికి తగు ఆదేశాలు పంపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం గౌరవాధ్యక్షుడు ఆకుల పురుషోత్తం బాబు (సింహపురి బాబు) అధ్యక్షుడు శాఖమూరి శ్రీనివాసులు ( అభయం శీను)ప్రధాన కార్యదర్శి సుబ్బు సింగ్, కోశాధికారి మల్లికార్జున్, ఉపాధ్యక్షులు నన్నూరు శ్రీనివాసరావు ఓ.వెంకటేశ్వర్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ దిలీప్ జాయింట్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు జైపాల్ సింగ్ కమిటీ మెంబర్లు శ్రీహరి , శంకర్, శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

కరోనా వ్యాధిపై అవగాహన కల్పిస్తున్న ఆశావర్కర్లు గ్రామ వాలంటీర్లు

  రాపూరు పట్టణం కొత్తపేట లో ఏడవ వార్డు నందు ఆశ వాలంటీరు మరియు గ్రామ వాలంటీర్లు సర్వే నిర్వహిస్తూ వార్డు లోని ప్రజలకు ఎవరికైనా జలుబు దగ్గు జ్వరం ఉన్నాయా లేవా అని పరిశీలించి కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి ఉంటే వారి వివరాలను నమోదు చేసుకుని అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడం జరుగుతుంది మరియు కరోనా వ్యాధిపై అవగాహన కల్పిస్తు చేతులు మరియు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా చూసుకోవాలని వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు సలహాలు తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలోఆశా వాలంటీర్ లక్ష్మి గ్రామ వాలంటీర్ ఆస్మా

Featured ఆంధ్రప్రదేశ్

అన్నార్తులకు ఆహారం

లాక్ డౌన్ తో నెల్లూరు నగరంలో భోజనం లేక ఇబ్బందులు పడుతున్న పేదలు , నిరాశ్రయులకు మాగుంట సేవాసమితి ఆధ్వర్యంలో ఆహార పొట్లాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవాసమితి వ్యవస్థాపకులు మాగుంట శరత్ చంద్రారెడ్డి, సాయి, నిషాద్ పాల్గొన్నారు..

Featured ఆంధ్రప్రదేశ్

‘‘‌మనికిరెడ్డి సేవలు ఆదర్శనీయం’’ – స్పెషల్‌ ‌జ్యూడిషియల్‌ ‌జడ్జి చింతా పద్మారావు.

మనికిరెడ్డి సేవలు ఆదర్శనీయమని, ఉభయ గోదావరి జిల్లాలలో మానికిరెడ్డి హెల్త్ ‌కేర్‌ ‌ఫౌండేషన్‌ ‌ద్వారా డాక్టర్‌ ‌మానికిరెడ్డి సత్యనారాయణ చేస్తున్న సేవలు అభినందనీయమని కొవ్వూరు స్పెషల్‌ ‌జ్యూడిషియల్‌ ‌జడ్జి చింతా పద్మారావు అన్నారు. మార్వెల్‌ ‌బుక్‌ ఆఫ్‌ ‌రికార్డస్ ‌సామాజిక సేవలో తక్కువ సమయంలో వివిధ ప్రాంతాల్లో ఎక్కువ సేవలు చేసినందుకు గాను డాక్టర్‌ ‌మానికిరెడ్డి సత్యనారాయణ కు శనివారం సాయంత్రం కొవ్వూరులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రికార్డ్ ‌ధ్రువీకరణ పత్రాన్ని, జ్ఞాపికను, మెడల్‌ ‌ను జడ్జి పద్మారావు చేతులమీద అందించారు. మార్వెల్‌ ‌బుక్‌ ఆఫ్‌ ‌రికార్డస్ ‌ప్రతినిధి డాక్టర్‌ అద్దంకి రాజా మాట్లాడుతూ మానికిరెడ్డి హెల్త్ ‌కేర్‌ ‌ఫౌండేషన్‌ ‌ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్‌ ‌క్యాంపులు, కాలేజీలలో విద్యార్థులకు చీ•• ద్వారా సామాజిక సేవతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు, లయన్స్ ‌క్లబ్‌, ‌రెడ్‌ ‌క్రాస్‌ ‌ద్వారా సేవా కార్యక్రమాలు. దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాల ఆడ పిల్లలకు ఉన్నత విద్యకు నగదు ప్రోత్సహకాలు. ఎయిడ్స్, ‌కుష్టు నివారణా కార్యక్రమాలు తక్కువ సమయంలో ఎక్కువ కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా గుర్తించి ఈ రికార్డును అందించామన్నారు. కార్యక్రమంలో జి. కె స్టడీ సర్కిల్‌ ‌నిర్వాహకుడు సామాజికవేత్త గెల్లా కేశవ, పి.డి.ఎస్‌. ‌యూ రాష్ట్ర నాయకుడు నంబూరి మహర్షి తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

ఒక్క ఫోన్‌ ‌కాల్‌తో ఇంటి వద్దకే సరుకులు

కరోనా మహమ్మారి ప్రబలమవుతున్న కారణంగా నెల్లూరు నగరంలో ప్రజలు తిరగకుండా ఉండేందుకు గాను నెల్లూరు నగర మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌ప్రత్యేక శ్రద్ద తీసుకుని నెల్లూరు నగరము నందు గల ప్రజలకు అందుబాటులో నిత్యావసర సరుకులు, కూరగాయలు కాల్‌ ఆన్‌ ‌డెలివరి సర్వీసు ద్వారా అందించుటకు జిల్లా కలెక్టర్‌ ఆదేశానుసారం నెల్లూరు నగర కమిషనర్‌, ఆహార భద్రత అధికారి, కిరాణా మర్చంట్స్ అసోసియేషన్స్ ‌వారితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఒక్క ఫోన్‌ ‌కాల్‌తో ఇంటి వద్దకే సరుకులు పంపిణీ చేయుటకు నిర్ణయించారు. ఈ క్రింద తెలిపిన షాపులలో సరకులు తీసుకొనవచ్చును. ఒక్క ఫోన్‌ ‌కాల్‌ ‌ద్వారా మీకు అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయలు పొందవచ్చని కమిషనర్‌ ‌తెలిపారు. 1. ‌మోర్‌ ‌సూపర్‌ ‌మార్కెట్‌, వేదాయపాళెం  ‌నిత్యావసర సరుకులు, కూరగాయలు  9705807146 8008534066 2. మోర్‌ ‌సూపర్‌ ‌మార్కెట్‌, మాగుంట లేఅవుట్‌   ‌నిత్యావసర సరుకులు,  ‌కూరగాయలు  9912226853, 9666452697 3. మోర్‌ ‌సూపర్‌ ‌మార్కెట్‌, రాంజీనగర్‌  ‌నిత్యావసర సరుకులు, కూరగాయలు 9030929165 4. రిలయన్స్ ‌స్మార్ట్, ‌దర్గామిట్ట నిత్యావసర సరుకులు, కూరగాయలు 9398736650,  8886083226, 7569042117 5. వెంకయ్య స్వామి ట్రేడర్స్, ఎ.కె.నగర్‌  ‌నిత్యావసర సరుకులు 9030544863 6. ‌మంచికంటి శ్రీనివాసులు ప్రొవిజన్స్, ‌స్టోన్‌హౌస్‌పేట –  నిత్యావసర సరుకులు 9849226000 7. మంచికంటి సూపర్‌ ‌మార్కెట్‌, స్టోన్‌హౌస్‌పేట –  ‌నిత్యావసర సరుకులు 9985995995 8. అద్దెపల్లి సుబ్బారావు ప్రొవిజన్స్, స్టోన్‌హౌస్‌పేట –  ‌నిత్యావసర సరుకులు 8978433867 9. సరాబు వెంకటేశ్వర్లు ప్రొవిజన్స్, స్టోన్‌హౌస్‌పేట –  ‌నిత్యావసర సరుకులు 9885190744 10. భార్గవి ప్రొవిజన్స్, స్టోన్‌హౌస్‌పేట –  ‌నిత్యావసర సరుకులు 8309238999 11. శ్రీనివాస ప్రొవిజన్స్, స్టోన్‌హౌస్‌పేట –  ‌నిత్యావసర సరుకులు 9700555844 12. బిగ్‌ ‌బజార్‌, ఎం.‌జి.బి.మాల్‌ ‌- నిత్యావసర సరుకులు, కూరగాయలు  9136976270 పైన తెలిపిన షాపులు ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించుటకు అంగీకారము తెలియపరిచారు. సరుకులు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల లోపు చేరవేయుటకు పోలీసులు అనుమతిచ్చారు. కావున ప్రజలకు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిత్యావసర సరుకులు, కూరగాయలు కావల్సిన వారు పైన తెలిపిన ఫోన్‌ ‌నెంబర్లకు ఫోన్‌ ‌చేసి తెప్పించుకొనవచ్చునని తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.