Sunday, 7 December 2025
  • Home  
  • *_Health Services: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 31 అర్ధరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్..!_*
- ఖమ్మం

*_Health Services: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 31 అర్ధరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్..!_*

పున్నమి Daily న్యూస్ ఖమ్మం Telangana Aarogyasri: కార్పొరేట్‌ స్థాయిలో పేదలకు ఉచిత వైద్యం అందించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులో సరైనా ఫెసిలిటిస్ లేని కారణంగా.. చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్లడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే పేదలు ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్లాలంటే ఉన్న ఆస్తులు అన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి. దీంతో ఈ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేయడానికి.. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా పేదలకు, మధ్య తరగతి ప్రజలకు.. ప్రైవేట్, కార్పోరేట్ హాస్పిటల్స్‌లో ఫ్రీగా వైద్యం అందిస్తున్నారు. అయితే.. రేవంత్ రెడ్డి సర్కార్ గతంలో ఉన్న ఆరోగ్రశ్రీ పరిధిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 31 అర్థరాత్రి నుండి అన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో.. పేద ప్రజల ఆరోగ్యానికి అండగా నిలిచే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఆరోగ్యశ్రీ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడమే. బకాయిల చెల్లింపు గురించి జనవరిలో ప్రభుత్వ హామీ ఇచ్చినప్పటికీ.. అది మాత్రం అమల్లోకి రాలేదు. ప్రభుత్వం సకాలంలో ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో ఆస్పత్రులపై ఆర్థికభారం పడుతుందని.. అందుకే సమస్య పరిష్కారం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌(TANHA)తెలిపింది. ఈమేరకు ఆరోగ్యశ్రీ సీఈవోకు టీఏఎన్‌హెచ్‌ఏ లేఖ రాసింది. ఈ నెల 31 నుంచి ఆరోగ్యశ్రీతో పాటు జర్నలిస్టులు, ఉద్యోగుల హెల్త్ స్కీమ్స్‌కు కూడా ఈ నిలిపివేత వర్తించనుందని తెలుస్తోంది. గత ఏడాది కాలంగా ఆరోగ్య శ్రీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆయా ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.1000 కోట్లకు పైగా బిల్లులు బకాయి ఉన్నట్లుగా తెలుస్తోంది. బిల్లులు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో.. తప్పనిసరి పరిస్థితిలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయాలని ప్రైవేట్ నెట్‌వర్క్ హాస్పిటల్స్ నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ జాప్యంతో చిన్న చిన్న హాస్పిటల్స్ మూతపడే పరిస్థితికి వచ్చాయన్నారు TANHA అధ్యక్షుడు వడ్డిరాజు రాకేష్. 4 నుండి 5 నెలల్లో బకాయిలు చెల్లిస్తామంటూ గతంలో ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చింది. ప్యాకేజీలు కూడా సవరిస్తామంటూ కాకమ్మ కబుర్లు చెప్పిందని.. కానీ 6 నెలలు గడిచినా వాటిని అమలు చేయలేదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. మరి ఇంకా కొంచెం టైమ్ ఉంది కాబట్టి.. దీనిపై రేవంత్ రెడ్డి సర్కార్ చర్చలు జరపడమో.. లేదా బకాయిలు చెల్లించడమూ చేస్తుందో లేదో చూడాలి.

పున్నమి Daily న్యూస్
ఖమ్మం

Telangana Aarogyasri: కార్పొరేట్‌ స్థాయిలో పేదలకు ఉచిత వైద్యం అందించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులో సరైనా ఫెసిలిటిస్ లేని కారణంగా..

చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్లడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే పేదలు ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్లాలంటే ఉన్న ఆస్తులు అన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి. దీంతో ఈ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేయడానికి.. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా పేదలకు, మధ్య తరగతి ప్రజలకు.. ప్రైవేట్, కార్పోరేట్ హాస్పిటల్స్‌లో ఫ్రీగా వైద్యం అందిస్తున్నారు. అయితే.. రేవంత్ రెడ్డి సర్కార్ గతంలో ఉన్న ఆరోగ్రశ్రీ పరిధిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 31 అర్థరాత్రి నుండి అన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో.. పేద ప్రజల ఆరోగ్యానికి అండగా నిలిచే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఆరోగ్యశ్రీ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడమే. బకాయిల చెల్లింపు గురించి జనవరిలో ప్రభుత్వ హామీ ఇచ్చినప్పటికీ.. అది మాత్రం అమల్లోకి రాలేదు. ప్రభుత్వం సకాలంలో ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో ఆస్పత్రులపై ఆర్థికభారం పడుతుందని.. అందుకే సమస్య పరిష్కారం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌(TANHA)తెలిపింది. ఈమేరకు ఆరోగ్యశ్రీ సీఈవోకు టీఏఎన్‌హెచ్‌ఏ లేఖ రాసింది.

ఈ నెల 31 నుంచి ఆరోగ్యశ్రీతో పాటు జర్నలిస్టులు, ఉద్యోగుల హెల్త్ స్కీమ్స్‌కు కూడా ఈ నిలిపివేత వర్తించనుందని తెలుస్తోంది. గత ఏడాది కాలంగా ఆరోగ్య శ్రీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆయా ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.1000 కోట్లకు పైగా బిల్లులు బకాయి ఉన్నట్లుగా తెలుస్తోంది. బిల్లులు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో.. తప్పనిసరి పరిస్థితిలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయాలని ప్రైవేట్ నెట్‌వర్క్ హాస్పిటల్స్ నిర్ణయం తీసుకున్నాయి.

ప్రభుత్వ జాప్యంతో చిన్న చిన్న హాస్పిటల్స్ మూతపడే పరిస్థితికి వచ్చాయన్నారు TANHA అధ్యక్షుడు వడ్డిరాజు రాకేష్. 4 నుండి 5 నెలల్లో బకాయిలు చెల్లిస్తామంటూ గతంలో ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చింది. ప్యాకేజీలు కూడా సవరిస్తామంటూ కాకమ్మ కబుర్లు చెప్పిందని.. కానీ 6 నెలలు గడిచినా వాటిని అమలు చేయలేదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. మరి ఇంకా కొంచెం టైమ్ ఉంది కాబట్టి.. దీనిపై రేవంత్ రెడ్డి సర్కార్ చర్చలు జరపడమో.. లేదా బకాయిలు చెల్లించడమూ చేస్తుందో లేదో చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.