Friday, 27 March 2026
  • Home  
  • _*- అపోలో హాస్పిటల్ లో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం*_
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

_*- అపోలో హాస్పిటల్ లో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం*_

_*- కార్యక్రమంలో పాల్గొని అవగాహన కల్పించిన డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ జి.వి.వి. ప్రసాద్ రెడ్డి, డాక్టర్ హరిత*_ ప్రతీ స్త్రీ తన వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతీ రోజూ ఒక్క క్షణం సమయం కేటాయిస్తే ఎన్నో ప్రమాదకరమైన వ్యాధుల నుండి బయటపడి ఆనందకరమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉందని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జి.వి.వి. ప్రసాద్ రెడ్డి, ఆంకాలజిస్ట్ డాక్టర్ హరిత, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ సూచించారు. ప్రధానంగా రొమ్ము క్యాన్సర్ ను ముందస్తుగా సులభంగా గుర్తించవచ్చునన్నారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన మాస కార్యక్రమంలో భాగంగా నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో మహిళలకు ప్రత్యేకంగా రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జి.వి.వి. ప్రసాద్, ఆంకాలజిస్ట్ డాక్టర్ హరిత, యూనిట్ హెడ్ బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జి.వి.వి. ప్రసాద్ రెడ్డి, డాక్టర్ హరిత, డాక్టర్ శ్రీరామ్ సతీష్ మాట్లాడుతూ ఈ అక్టోబర్ నెలను రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా జరుపుకుంటున్నామని అన్నారు. అందులో భాగంగా అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించామని చెప్పారు. ప్రధానంగా నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో ” చెక్ – ఓలేట్ ” ( చాక్లెట్ ) పేరుతో అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రతీ స్త్రీ తన వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతీ రోజూ ఒక్క క్షణం సమయం కేటాయిస్తే వారి జీవితం చాక్లెట్ కంటే తీయగా ఉంటుందన్న అర్ధంతో ” చెక్ – ఓలేట్ ” కార్యక్రమాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. అంతర్జాతీయ గణాంకాల ప్రకారం భారతీయ మహిళల్లో క్యాన్సర్ సంభవం మరియు మరణాలకు రొమ్ము క్యాన్సర్ ప్రధానంగా ఉందని, ప్రతీ ఏడాది క్యాన్సర్ కేసుల్లో పేరుగుతున్నా, స్క్రీనింగ్ టెస్టుల నిర్వహణ విషయంలో భారతదేశం వెనుకబడి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అపోలో హాస్పిటల్స్ సంస్థ క్యాన్సర్ నివారణ చర్యల్లో భాగంగా మహిళలకు అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడించారు. మహిళలు చిన్న చిన్న స్వీయ పరీక్షల ద్వారా రొమ్ము క్యాన్సర్ లక్షణాలను ముందే గుర్తించవచ్చునని, వెంటనే వైద్యులను సంప్రదిస్తే దాన్ని త్వరగా నివారించే అవకాశం ఉందన్నారు. 40 ఏళ్లు పై బడ్డ ప్రతీ మహిళా నెలకోసారి రొమ్ములకు చిన్న చిన్న స్వీయ పరీక్షలు చేసుకోవాలని, అనుమానం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. స్వీయ పరీక్ష చేసుకోలేని వారు కనీసం ఏడాదికి ఓ సారి రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించుకోవాలని డాక్టర్ జి.వి.వి. ప్రసాద్ రెడ్డి, డాక్టర్ హరిత, డాక్టర్ శ్రీరామ్ సతీష్ మహిళలను కోరారు. నెల్లూరు అపోలో హాస్పిటల్ లో రొమ్ము క్యాన్సర్ కు తక్కువ ఫీజుతోనే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, అత్యాధునిక వైద్య పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

_*- కార్యక్రమంలో పాల్గొని అవగాహన కల్పించిన డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ జి.వి.వి. ప్రసాద్ రెడ్డి, డాక్టర్ హరిత*_

ప్రతీ స్త్రీ తన వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతీ రోజూ ఒక్క క్షణం సమయం కేటాయిస్తే ఎన్నో ప్రమాదకరమైన వ్యాధుల నుండి బయటపడి ఆనందకరమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉందని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జి.వి.వి. ప్రసాద్ రెడ్డి, ఆంకాలజిస్ట్ డాక్టర్ హరిత, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ సూచించారు. ప్రధానంగా రొమ్ము క్యాన్సర్ ను ముందస్తుగా సులభంగా గుర్తించవచ్చునన్నారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన మాస కార్యక్రమంలో భాగంగా నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో మహిళలకు ప్రత్యేకంగా రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జి.వి.వి. ప్రసాద్, ఆంకాలజిస్ట్ డాక్టర్ హరిత, యూనిట్ హెడ్ బాలరాజు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ జి.వి.వి. ప్రసాద్ రెడ్డి, డాక్టర్ హరిత, డాక్టర్ శ్రీరామ్ సతీష్ మాట్లాడుతూ ఈ అక్టోబర్ నెలను రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా జరుపుకుంటున్నామని అన్నారు. అందులో భాగంగా అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించామని చెప్పారు. ప్రధానంగా నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో ” చెక్ – ఓలేట్ ” ( చాక్లెట్ ) పేరుతో అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రతీ స్త్రీ తన వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతీ రోజూ ఒక్క క్షణం సమయం కేటాయిస్తే వారి జీవితం చాక్లెట్ కంటే తీయగా ఉంటుందన్న అర్ధంతో ” చెక్ – ఓలేట్ ” కార్యక్రమాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. అంతర్జాతీయ గణాంకాల ప్రకారం భారతీయ మహిళల్లో క్యాన్సర్ సంభవం మరియు మరణాలకు రొమ్ము క్యాన్సర్ ప్రధానంగా ఉందని, ప్రతీ ఏడాది క్యాన్సర్ కేసుల్లో పేరుగుతున్నా, స్క్రీనింగ్ టెస్టుల నిర్వహణ విషయంలో భారతదేశం వెనుకబడి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అపోలో హాస్పిటల్స్ సంస్థ క్యాన్సర్ నివారణ చర్యల్లో భాగంగా మహిళలకు అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడించారు. మహిళలు చిన్న చిన్న స్వీయ పరీక్షల ద్వారా రొమ్ము క్యాన్సర్ లక్షణాలను ముందే గుర్తించవచ్చునని, వెంటనే వైద్యులను సంప్రదిస్తే దాన్ని త్వరగా నివారించే అవకాశం ఉందన్నారు. 40 ఏళ్లు పై బడ్డ ప్రతీ మహిళా నెలకోసారి రొమ్ములకు చిన్న చిన్న స్వీయ పరీక్షలు చేసుకోవాలని, అనుమానం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. స్వీయ పరీక్ష చేసుకోలేని వారు కనీసం ఏడాదికి ఓ సారి రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించుకోవాలని డాక్టర్ జి.వి.వి. ప్రసాద్ రెడ్డి, డాక్టర్ హరిత, డాక్టర్ శ్రీరామ్ సతీష్ మహిళలను కోరారు. నెల్లూరు అపోలో హాస్పిటల్ లో రొమ్ము క్యాన్సర్ కు తక్కువ ఫీజుతోనే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, అత్యాధునిక వైద్య పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.