UTF ఆధ్వర్యంలో
పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ…
మర్రిపాడు :మార్చి 31(పున్నమివిలేకరి )
.
మర్రిపాడు మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి మోహన్ ప్రసాద్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందచేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ అందజేస్తున్నామని,ఈ మెటీరియల్ ఉపయోగించుకొని పదవ తరగతి విద్యార్థులు మంచి ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మర్రిపాడు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శివ జ్యోతి,యు టి ఎఫ్ ప్రధాన కార్యదర్శి సుధాకర్ అధ్యక్షులు షేక్ ఖాజా రసూల్,సీనియర్ నాయకులు జి.సుబ్బరాయుడు, ఎన్.సుబ్బరాయుడు,విద్యార్థిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.