లావు తగ్గాలా?
‘‘పీత పాట్లు పీతవి’’ అనేది తెలుగు నానుడి. పీతకు పాట్లు ఉన్నాయో లేవో తెలి యదు కానీ ఉన్న పాట్లు అన్నీ మనిషికే. కాకుంటే మనుషులుగా మనం ఆ సంగతిని నేరుగా ఒప్పుకోము. పిల్లి మీదా, కుక్క మీదా పెట్టి అదేదో తెగ ఇక్కట్లు పడుతూ ఉన్నట్టు జాలి చూపెట్టి ‘తుత్తి’ పడుతాం. ఆ కోవ లోనిదే కా ఒచ్చు ఈ పీత కష్టాలు కూడా. నిజానికి ప్లాట్లు, ఫ్లాట్లు కొని వెనుక వేసుకుందాము అనే పాట్లూ, ఫీట్లు తిన్న దాన్ని తినకుండా ఎప్పుడూ వెరయిటీగా తినాలి అను కొనే తిప్పలూ, కష్టాలు ఉండేది మనకే.
మనం అంటే ఎవరూ? నేనూ, మీరూ, మన ఇంట్లో వారు, చుట్టు పక్కల జనం, ఊరు, పక్క ఊరు, ఆ పక్క ఊరు… వీరిలో తిప్పలు పడే వారు. తిప్పలు పడే వారు అంటే ఎవరికి ఏది కావాలో అది అందని వారూ, ఎవరు ఏది అనుకుంటారో అది జరగని వారు. ఈ రెంటికీ కారణం ‘కోరిక’లే అని బోది చెట్టు తోడుగా బుద్ధ భగవానుడు నెత్తీ నోరు మొత్తుకున్నా అది మన నెత్తికి ఎక్క లేదు. కావాలసినవి దొరక బుచ్చు కోనూ, అనుకున్నవి తీర్చుకోనూ దారులు దొరక్క, ‘‘దేవుడా! ఎక్కడ ఉన్నావయ్యా నువ్వూ..?’’ అంటూ దొరికిన చెట్లకూ చెట్లకూ రాళ్ళకూ రప్పలకూ మొక్కుకుంటూ, కనపడ్డ గుళ్ళకూ గోపురాలకు తిరిగే జనానికి కొదవ లేదు కదా!,
చెట్టులు, పుట్టలు, దేవుడి విగ్రహాలు మన మాటలు వినటమే తప్ప గోడు వెళ్ళ పోసుకున్న వారికి నేరుగా ఏదయినా పరిష్కారాన్ని చూపు తాయా అంటే అదీ లేదు. మొక్కుకున్నాక మంచి జరిగితే అంతా ఆ పయి వాడి దయ అనుకోవటం, జరగక పోతే దేవుడు నా మొర ఆలకించ లేదనో, ఆలకించక పోవటానికి ఏదో గట్టి కారణమే ఉంటుందని సర్దుకొని మళ్ళీ మన తిప్పలు ఏవో మనం పడక తప్పదు. బహుశా స్పందించని దేవుడి చోటును భర్తీ చేసేందుకే కాబోలు కానుకలు తీసుకొని స్పం దించే స్వాములు, బాబాలు, అమ్మలు అవ తారం ఎత్తారు. దేవుడిని నిలువెల్లా తమలో నింపుకున్నాము అనేది వీరి అనిపింపు. సాధా రణ జనానికి నమ్మింపు.
ఏ మాటకు ఆ మాటే మాటాడు కోవాలి. నిష్టూరంగా ఉన్నా నిజాలు మాట్లాడుకో వద్దూ? అసలు పాట్లు లేని జనం ఎక్కడ ఉంటారు చెప్పండీ? అమెరిక అధ్యక్షుడు ఒబామా అయినా, ఆముదాలవలసలో అంగడి నడిపే అంజయ్య అయినా వారి పుట్టుక మనిషి గానే కదా! మనిషి అన్నాక పాట్లు తప్పవు. ఎలాంటి పాట్లు ఉండ వచ్చూ? ఎలాంటివి అయినా ఉండ వచ్చు. తిండి కోసం సత్యనారాయణ పాటు పడ తాడు. తిన్నది అరగ లేదని కొండల రావు ఏడుపు. అరుగుతుంది కానీ ఆ అరిగింది ఒంటికి పట్టటం లేదు అనేది నారాయణ అను మానం. అసలు ఏమి తినాలి అనేది గంగా రాం అడక. ‘సల్పేటు’ కూటిలో సత్తానే లేదు కాబట్టి ‘ఆర్గానిక్కు’ పుడ్డు లోనే అయిదో తనం ఉందనే సంగతిని బలరాం బల్ల గుద్ది మరీ చెబుతుండే! చూడండీ! ఎన్ని తిప్పలో! ఎన్ని ఇక్కట్లో!! ఎన్ని సమస్యలో!!!. ఒక్క తిండి సంగతి లోనే. చెప్పే వాడికి వినే వాడు లోకువ. వినే వాళ్ళు అంటే తెలియని వారు అని ఇక్కడ తెల్లము. తెలియని వారు ఉన్నంత వరకూ తెలియ చెప్పే వారు పుట్టుకు రావటం సహజం. అంటే తెలియని వారికి దారి చూపటం కోసం తెలిసిన వారు వెలుస్తారు అన్న మాట. చెప్పే వాళ్ళూ రెండు రకాలుగా ఉంటారు. కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పే వారు తొలి రకం. సమస్యకు పరిష్కారం చూపండయ్యా అంటే కష్టం అయినా ఇదే మంచి దారి అని చెప్పే రకం. అంటే గులక రాళ్ళ దారి వయిపు చూపించే రకం. భారత జాతి బానిస బతుకు నుంచి బయట పడటానికి గాందీ తాత చూపిన దారి ఇది.నడిచే దారి కష్టం అయినా గెలుపు తధ్యం. కానీ షరా మామూలే! ఇది ఎక్కువ మందికి నచ్చదు. ‘‘అబ్బే ఈ దారిలో నడవటం కష్టం!’’ అని అనుకున్నారు అనుకోండి దాని అర్థం ‘‘దగ్గరి దారులు ఏమయినా ఉన్నాయా అని అడగకనే అడిగినట్టు కదా! ఇక్కడ దగ్గరి దారులు అంటే అడ్డదారులూ అని చదువు కోమని మనవి. ‘అడ్డ దారులు’ అనే మాటను నేరుగా బయటకు ఒప్పుకోక పో ఒచ్చు. కానీ ముమ్మాటికి ఎక్కువ మంది జనంలో ఉండే ఆలోచనా తీరు అదే. అనుకున్న వెంటనే పని అయిపోవాలి, కష్ట పడకుండా పని జరగాలి, సులువుగా జరిగి పోవాలి… అని అనుకొనే వారి కోరికలను నెర వేర్చటానికి అంటే తెలియని వారికి తెలియ చెప్పటానికి పుట్టుకు ఒచ్చిన కారణ జన్ములు మలి రకం. నిజం చదువును చదివారో లేదో తెలియదు కానీ జనం ఫేసు ఫీలింగు చదివే ‘ఉత్త’ములు ఈ మలి రకం కోవలో వారే.
ఇదిగో!! మీకు కావాల్సి వాటిని సులువు దారుల్లో ప్రసాధిస్తాం’’ అనే అవతార పురుషులు వీరు. ‘‘భార్యా భర్తలు పార్వతీ పరమేశ్వరుల్లా అన్యోన్యంగా ఉండాలి’’ అంటాడు పెళ్ళాం పోరు పడలేక కషాయం కట్టి స్వామి అవ తారం ఎత్తిన రాఘవరావు వురఫ్ శ్రీశ్రీశ్రీ రావు రాఘవేంద్ర స్వామీ కంత్రీజి.
‘‘ఆ..హా.. స్వామీజీ ఎంత బాగా సెల విచ్చారూ.. విన్నావుటే వెధవ ముండా! నువ్వు ఎప్పుడయినా నాతో అన్యోన్యంగా ఉన్నావా? ఆ.. స్వామి వారు చెప్పింది అయినా తలకు ఎక్కించుకొని అన్యోన్యంగా ఉండి చావు’’ మంచి బతుకు ఎలా బతకాలో జనానికి చెప్పటానికి ఏర్పాటు చేసిన ప్రబోధ సభలకు నాలుగు వందల కిలో మీటర్ల నుండి పెళ్ళాంతో ఒచ్చిన కనకారావు విసుగు అది.
‘‘ఇదుగో రోజూ ఈ వేప పుల్ల నమలండి! ఆ కషాయం తాగండి ఇలా ఆసనాలు వేయండి!! ఇక మీ జీవితం స్వర్గానికి బెత్తడు అంటే బెత్తెడు దూరంలో’’ కాళ్ళూ చేతులు మెలెసుకొని టీవిలలో దూరిన కార్పోరేటు యోగా గురువు దేకు బాబా పిలుపు. మా ఆశ్రమంలో తయారు చేసిన కషాయం మాత్త రమే సుమా! ఇది కొస మెరుపు. ‘‘ఉప్పు తినకు ఊరి పోతావు, నిప్పులోది తినకు కాలిపోతావు – మీ కోసం పెసలూ పప్పులు స్పెషలుగా పండించి తెచ్చా. అంగట్లో కొంటే అసలు దనం ఉండదు. నా విత్తనాలలో జీవం ఉంది. నాన పెట్టి మొలక ఎత్తాక తినండి’’ రెండు గంటలు ప్రబోధించి వెనుక వెంట తెచ్చుకున్న లారీ గింజలను అమ్ముకునే మాటు అజెండా.‘‘లావుగా ఉన్నారా? మా ప్రోటీను పొడిని వాడండి. గాలి తీసిన బెలూనులా బక్క పడి పోతారు. దీని అసలు ధర పది వేలు. మీ కోసం రెండు వేలకే ఇస్తున్నాము’’ మద్దినేళ అన్నీ టీవీలలో ఒకే సారి ఊదరగొట్టే ప్రకటనలు.
‘‘బనూసు ఒబేసిటీ రిడక్షను పోగ్రాంలో చేరండి నెల రోజుల్లో మీ షేపులు మారుస్తాం’’ ఒక పక్క అడ్డంగా సాగబీకిన పోటో మరో పక్క కుదించిన ఫోటోతో అట్టహాసంగా పత్రి కల అట్టల మీద రంగు రంగుల యాడులు.
‘‘ఇదుగో బోనా బెల్టు. దీన్ని పొట్టకు కట్టు కుంటే మీరు ఎంత తిన్నా ఆ కొవ్వు అట్టే కరిగిపోతుంది’’ ‘‘మీరు తిండి మానక్కర్లా! పని చెయ్యనక్కర లేదు. మీ ఇంటి దగ్గరే ఉండి లావు తగ్గటానికి ఈ ఫోను నంబరును సంప్రదించండి. బీడీ బంకుల దగ్గరా, ఏటీఎంల వద్ద, అపార్టు మెంట్ల ముందు అంటించిన డీటీపీ కాగితాలు
లావు తగ్గటానికి మార్కెట్టులో ఉన్న వస్తు వులు, తిండ్లు, పద్ధతులు, జీవన విధానాల గురించి రాసుకుంటూ పోవాలే కానీ ఈ పేపరు అంతా వాటి తోనే నిండి పోతుంది.
ఇంతకీ చెప్చొచ్చేది ఏమిటంటే అందరికీ తెలిసిన సంగతే మళ్ళీ మళ్ళీ చెబుతున్న సంగతే ‘‘లావు తగ్గటానికి మంచి దారి లావు పెరగ కుండా ఉండటం’’. ఎంత పని చేస్తారో అంతే తినటం దీనికి పాటింపు.
డాక్టర్ పి. శ్రీనివాస తేజ
లావు తగ్గాలా? ‘‘పీత పాట్లు పీతవి’’ అనేది తెలుగు నానుడి. పీతకు పాట్లు ఉన్నాయో లేవో తెలి యదు కానీ ఉన్న పాట్లు అన్నీ మనిషికే. కాకుంటే మనుషులుగా మనం ఆ సంగతిని నేరుగా ఒప్పుకోము. పిల్లి మీదా, కుక్క మీదా పెట్టి అదేదో తెగ ఇక్కట్లు పడుతూ ఉన్నట్టు జాలి చూపెట్టి ‘తుత్తి’ పడుతాం. ఆ కోవ లోనిదే కా ఒచ్చు ఈ పీత కష్టాలు కూడా. నిజానికి ప్లాట్లు, ఫ్లాట్లు కొని వెనుక వేసుకుందాము అనే పాట్లూ, ఫీట్లు తిన్న దాన్ని తినకుండా ఎప్పుడూ వెరయిటీగా తినాలి అను కొనే తిప్పలూ, కష్టాలు ఉండేది మనకే. మనం అంటే ఎవరూ? నేనూ, మీరూ, మన ఇంట్లో వారు, చుట్టు పక్కల జనం, ఊరు, పక్క ఊరు, ఆ పక్క ఊరు… వీరిలో తిప్పలు పడే వారు. తిప్పలు పడే వారు అంటే ఎవరికి ఏది కావాలో అది అందని వారూ, ఎవరు ఏది అనుకుంటారో అది జరగని వారు. ఈ రెంటికీ కారణం ‘కోరిక’లే అని బోది చెట్టు తోడుగా బుద్ధ భగవానుడు నెత్తీ నోరు మొత్తుకున్నా అది మన నెత్తికి ఎక్క లేదు. కావాలసినవి దొరక బుచ్చు కోనూ, అనుకున్నవి తీర్చుకోనూ దారులు దొరక్క, ‘‘దేవుడా! ఎక్కడ ఉన్నావయ్యా నువ్వూ..?’’ అంటూ దొరికిన చెట్లకూ చెట్లకూ రాళ్ళకూ రప్పలకూ మొక్కుకుంటూ, కనపడ్డ గుళ్ళకూ గోపురాలకు తిరిగే జనానికి కొదవ లేదు కదా!, చెట్టులు, పుట్టలు, దేవుడి విగ్రహాలు మన మాటలు వినటమే తప్ప గోడు వెళ్ళ పోసుకున్న వారికి నేరుగా ఏదయినా పరిష్కారాన్ని చూపు తాయా అంటే అదీ లేదు. మొక్కుకున్నాక మంచి జరిగితే అంతా ఆ పయి వాడి దయ అనుకోవటం, జరగక పోతే దేవుడు నా మొర ఆలకించ లేదనో, ఆలకించక పోవటానికి ఏదో గట్టి కారణమే ఉంటుందని సర్దుకొని మళ్ళీ మన తిప్పలు ఏవో మనం పడక తప్పదు. బహుశా స్పందించని దేవుడి చోటును భర్తీ చేసేందుకే కాబోలు కానుకలు తీసుకొని స్పం దించే స్వాములు, బాబాలు, అమ్మలు అవ తారం ఎత్తారు. దేవుడిని నిలువెల్లా తమలో నింపుకున్నాము అనేది వీరి అనిపింపు. సాధా రణ జనానికి నమ్మింపు. ఏ మాటకు ఆ మాటే మాటాడు కోవాలి. నిష్టూరంగా ఉన్నా నిజాలు మాట్లాడుకో వద్దూ? అసలు పాట్లు లేని జనం ఎక్కడ ఉంటారు చెప్పండీ? అమెరిక అధ్యక్షుడు ఒబామా అయినా, ఆముదాలవలసలో అంగడి నడిపే అంజయ్య అయినా వారి పుట్టుక మనిషి గానే కదా! మనిషి అన్నాక పాట్లు తప్పవు. ఎలాంటి పాట్లు ఉండ వచ్చూ? ఎలాంటివి అయినా ఉండ వచ్చు. తిండి కోసం సత్యనారాయణ పాటు పడ తాడు. తిన్నది అరగ లేదని కొండల రావు ఏడుపు. అరుగుతుంది కానీ ఆ అరిగింది ఒంటికి పట్టటం లేదు అనేది నారాయణ అను మానం. అసలు ఏమి తినాలి అనేది గంగా రాం అడక. ‘సల్పేటు’ కూటిలో సత్తానే లేదు కాబట్టి ‘ఆర్గానిక్కు’ పుడ్డు లోనే అయిదో తనం ఉందనే సంగతిని బలరాం బల్ల గుద్ది మరీ చెబుతుండే! చూడండీ! ఎన్ని తిప్పలో! ఎన్ని ఇక్కట్లో!! ఎన్ని సమస్యలో!!!. ఒక్క తిండి సంగతి లోనే. చెప్పే వాడికి వినే వాడు లోకువ. వినే వాళ్ళు అంటే తెలియని వారు అని ఇక్కడ తెల్లము. తెలియని వారు ఉన్నంత వరకూ తెలియ చెప్పే వారు పుట్టుకు రావటం సహజం. అంటే తెలియని వారికి దారి చూపటం కోసం తెలిసిన వారు వెలుస్తారు అన్న మాట. చెప్పే వాళ్ళూ రెండు రకాలుగా ఉంటారు. కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పే వారు తొలి రకం. సమస్యకు పరిష్కారం చూపండయ్యా అంటే కష్టం అయినా ఇదే మంచి దారి అని చెప్పే రకం. అంటే గులక రాళ్ళ దారి వయిపు చూపించే రకం. భారత జాతి బానిస బతుకు నుంచి బయట పడటానికి గాందీ తాత చూపిన దారి ఇది.నడిచే దారి కష్టం అయినా గెలుపు తధ్యం. కానీ షరా మామూలే! ఇది ఎక్కువ మందికి నచ్చదు. ‘‘అబ్బే ఈ దారిలో నడవటం కష్టం!’’ అని అనుకున్నారు అనుకోండి దాని అర్థం ‘‘దగ్గరి దారులు ఏమయినా ఉన్నాయా అని అడగకనే అడిగినట్టు కదా! ఇక్కడ దగ్గరి దారులు అంటే అడ్డదారులూ అని చదువు కోమని మనవి. ‘అడ్డ దారులు’ అనే మాటను నేరుగా బయటకు ఒప్పుకోక పో ఒచ్చు. కానీ ముమ్మాటికి ఎక్కువ మంది జనంలో ఉండే ఆలోచనా తీరు అదే. అనుకున్న వెంటనే పని అయిపోవాలి, కష్ట పడకుండా పని జరగాలి, సులువుగా జరిగి పోవాలి… అని అనుకొనే వారి కోరికలను నెర వేర్చటానికి అంటే తెలియని వారికి తెలియ చెప్పటానికి పుట్టుకు ఒచ్చిన కారణ జన్ములు మలి రకం. నిజం చదువును చదివారో లేదో తెలియదు కానీ జనం ఫేసు ఫీలింగు చదివే ‘ఉత్త’ములు ఈ మలి రకం కోవలో వారే. ఇదిగో!! మీకు కావాల్సి వాటిని సులువు దారుల్లో ప్రసాధిస్తాం’’ అనే అవతార పురుషులు వీరు. ‘‘భార్యా భర్తలు పార్వతీ పరమేశ్వరుల్లా అన్యోన్యంగా ఉండాలి’’ అంటాడు పెళ్ళాం పోరు పడలేక కషాయం కట్టి స్వామి అవ తారం ఎత్తిన రాఘవరావు వురఫ్ శ్రీశ్రీశ్రీ రావు రాఘవేంద్ర స్వామీ కంత్రీజి. ‘‘ఆ..హా.. స్వామీజీ ఎంత బాగా సెల విచ్చారూ.. విన్నావుటే వెధవ ముండా! నువ్వు ఎప్పుడయినా నాతో అన్యోన్యంగా ఉన్నావా? ఆ.. స్వామి వారు చెప్పింది అయినా తలకు ఎక్కించుకొని అన్యోన్యంగా ఉండి చావు’’ మంచి బతుకు ఎలా బతకాలో జనానికి చెప్పటానికి ఏర్పాటు చేసిన ప్రబోధ సభలకు నాలుగు వందల కిలో మీటర్ల నుండి పెళ్ళాంతో ఒచ్చిన కనకారావు విసుగు అది. ‘‘ఇదుగో రోజూ ఈ వేప పుల్ల నమలండి! ఆ కషాయం తాగండి ఇలా ఆసనాలు వేయండి!! ఇక మీ జీవితం స్వర్గానికి బెత్తడు అంటే బెత్తెడు దూరంలో’’ కాళ్ళూ చేతులు మెలెసుకొని టీవిలలో దూరిన కార్పోరేటు యోగా గురువు దేకు బాబా పిలుపు. మా ఆశ్రమంలో తయారు చేసిన కషాయం మాత్త రమే సుమా! ఇది కొస మెరుపు. ‘‘ఉప్పు తినకు ఊరి పోతావు, నిప్పులోది తినకు కాలిపోతావు – మీ కోసం పెసలూ పప్పులు స్పెషలుగా పండించి తెచ్చా. అంగట్లో కొంటే అసలు దనం ఉండదు. నా విత్తనాలలో జీవం ఉంది. నాన పెట్టి మొలక ఎత్తాక తినండి’’ రెండు గంటలు ప్రబోధించి వెనుక వెంట తెచ్చుకున్న లారీ గింజలను అమ్ముకునే మాటు అజెండా.‘‘లావుగా ఉన్నారా? మా ప్రోటీను పొడిని వాడండి. గాలి తీసిన బెలూనులా బక్క పడి పోతారు. దీని అసలు ధర పది వేలు. మీ కోసం రెండు వేలకే ఇస్తున్నాము’’ మద్దినేళ అన్నీ టీవీలలో ఒకే సారి ఊదరగొట్టే ప్రకటనలు. ‘‘బనూసు ఒబేసిటీ రిడక్షను పోగ్రాంలో చేరండి నెల రోజుల్లో మీ షేపులు మారుస్తాం’’ ఒక పక్క అడ్డంగా సాగబీకిన పోటో మరో పక్క కుదించిన ఫోటోతో అట్టహాసంగా పత్రి కల అట్టల మీద రంగు రంగుల యాడులు. ‘‘ఇదుగో బోనా బెల్టు. దీన్ని పొట్టకు కట్టు కుంటే మీరు ఎంత తిన్నా ఆ కొవ్వు అట్టే కరిగిపోతుంది’’ ‘‘మీరు తిండి మానక్కర్లా! పని చెయ్యనక్కర లేదు. మీ ఇంటి దగ్గరే ఉండి లావు తగ్గటానికి ఈ ఫోను నంబరును సంప్రదించండి. బీడీ బంకుల దగ్గరా, ఏటీఎంల వద్ద, అపార్టు మెంట్ల ముందు అంటించిన డీటీపీ కాగితాలు లావు తగ్గటానికి మార్కెట్టులో ఉన్న వస్తు వులు, తిండ్లు, పద్ధతులు, జీవన విధానాల గురించి రాసుకుంటూ పోవాలే కానీ ఈ పేపరు అంతా వాటి తోనే నిండి పోతుంది. ఇంతకీ చెప్చొచ్చేది ఏమిటంటే అందరికీ తెలిసిన సంగతే మళ్ళీ మళ్ళీ చెబుతున్న సంగతే ‘‘లావు తగ్గటానికి మంచి దారి లావు పెరగ కుండా ఉండటం’’. ఎంత పని చేస్తారో అంతే తినటం దీనికి పాటింపు. డాక్టర్ పి. శ్రీనివాస తేజ