29-07-2020 మనుబోలు(పున్నమిప్రతినిధి)మనుబోలు మండలం లోని కట్టుపల్లి గ్రామమునందు జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని బుధవారం నాడు ఘనంగా నిర్వహించినారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చేగువేరా ఫౌండేషన్ అధ్యక్షులు వైకాపా నేత గుండాల ఆదినారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి చెట్లు పెంచడం ద్వారా ప్రతి ఇంటినీ, ప్రతి ఊరునూ పచ్చదనంతో సింగారిద్దాం’ అనే నినాదంతో 71వ వన మహోత్సవాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారుఅన్నారు ఆయన స్ఫూర్తితో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నియోజకవర్గంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారన్నారు వారి పిలుపు మేరకు కట్టువపల్లి లో పేదలకోసంఏర్పాటుచేసినలేఅవుట్‌లో మొక్కలునాటి‘
ఈ కార్యక్రమానికి శ్రీకారంచుట్టామన్నారు ఎంపీడీవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరువిధిగామొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్న ప్రభుత్వం వన మహోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ పేదల కోసం సిద్ధం చేసిన లే అవుట్లను పచ్చదనంతో నింపేందుకు సంకల్పించింది అన్నారు. ఆరోగ్యంతో మనం’ అనే నినాదంతో ప్రతీ ఒక్కరూ పది మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ యజ్ఞంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చా రు ప్రతి ఇల్లు, ప్రతీ ఊరూ పచ్చదనంతో ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు సన్నారెడ్డి జానకీరామిరెడ్డి , పోచారెడ్డి అశోక్ రెడ్డి , శీనా రెడ్డి,గ్రామ సచివాలయ సిబ్బంది , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.