01-06-2020 *బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్)* బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని ఇసుక పాలెం గ్రామపంచాయతీ పల్లప్రోలు గ్రామ సమీపంలోని మలిదేవి వాగుకు సుమారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ వేసవి నీటి ఎద్దడి కి త్రాగు నీటి కోసం వచ్చిన మచ్చల జింక ప్రమాదవశాత్తు కాలువలో పడింది. ఘటనా స్థలానికి సమీపంలో అటుగా వెళ్తున్న ఇస్కపాలెం గ్రామ వాలేంటర్ కిరణ్ అనే వ్యక్తి జింక ను కాపాడడం జరిగింది. గతంలో కూడా జింకల గుంపు ఇదే మలిదేవి వాగు దగ్గరకు మంచి నీటి కొరకు రావడం అనేది చాలా సార్లు జరిగింది. గ్రామ వాలేంటర్ కిరణ్ విఆర్ఓ కీ సమాచారం అందించడంతో వారు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారి సంఘటనా స్థలానికి చేరుకుని ఆ మచ్చల జింక ను తీసుకెళ్లడం జరిగింది.
త్రాగునీటికోసం వచ్చిన మచ్చల జింక – త్రుటిలో తప్పిన ప్రమాదం.