పున్నమి ప్రతినిధి షేక్. ఉస్మాన్ అలీ ✍️✍️
నెల్లూరు సిఐడి విభాగంలో ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాలేపాటి బ్రహ్మానందం అనుమానస్పదంగా మృతి చెందారు. మంగళవారం ఉదయం యూనిఫాం ధరించి విగతజీవిగా ఇంట్లోని బెడ్ రూంలో మంచంపై పడి ఉండగా బంధువులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. నెల్లూరు రూరల్ మండలం, 3వ మైలు వద్ద నివాసం ఉండే బ్రహ్మానందం ప్రస్తుతం లాక్ డౌన్ విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య, కుమార్తె అమెరికాలో ఉంటున్నారు. కుమారుడు హైదరాబాద్ లో ఉన్నారు. ప్రస్తుతం ఇంట్లో ఒంటరిగా ఉంటున్న బ్రహ్మానందం మంగళవారం ఉదయం డ్యూటీ వెళ్లేందుకని యూనిఫాం ధరించిన తర్వాత అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు. దీనిపై వారి కుటుంబసభ్యులు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు.