Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

పోషణ మాస ఉత్సవాల్లో చిన్నారులకు అన్నప్రాసన

తిరుమలాయపాలెం, అక్టోబర్ 3 (న్యూస్): పోషణ మాస ఉత్సవాల్లో భాగంగా మేకలతండా గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ బానోతు లక్ష్మి బద్రు నాయక్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సావిత్రి ఆధ్వర్యంలో చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించి ప్లేట్లు, గ్లాసులు అందజేశారు.

ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలని, చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఆర్. ఎల్లమ్మ, సీహెచ్. జయమ్మ, ఆశా వర్కర్ గుగులోతు పద్మ, అంగన్వాడీ ఆయా గుగులోతు లక్ష్మి, ఇస్లావత్ హనుమ, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *