ఖమ్మం డిసెంబర్
పున్నమి ప్రతి నిధి
సర్పంచ్ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ మధ్యాహ్నం 1 గంట కి ముగిసింది. భోజన విరామం అనంతరం కౌంటింగ్ ప్రారంభం అయింది. 5 నియోజకవర్గాల ఖమ్మం జిల్లా లో మొదటి దశలో మధిర నియోజకవర్గం లో ఎన్నికలు జరిగాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం తొ ప్రజలు ఫలితాలు మీద ఆసక్తి గా ఎదురు చూస్తన్నారు. మొత్తం మీద ఈ రోజు రాత్రి కి ఫలితాలు విడుదల అయి ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలియజేసారు.


