ప్రజా సేవకు, ప్రజల అభివృద్ధికి అంకితమైన ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైల్వే కోడూరులో నిర్వహించిన ఆరో ఉచిత కంటి శిబిరం (ఐ క్యాంప్)కు అనూహ్య స్పందన లభించింది. వేలాది మంది ప్రజలు భారీగా తరలివచ్చి ఈ శిబిరాన్ని విజయవంతం చేశారు. రైల్వే కోడూరు ప్రజల అభివృద్ధిని ధ్యేయంగా ముందుకు సాగుతున్న ముక్కా రూపానంద రెడ్డి సేవలకు ప్రజలు ఘనంగా అభినందించారు.
రికార్డు స్థాయిలో సేవలు:
ఇప్పటికే నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో విజయవంతంగా కంటి శిబిరాలు నిర్వహించిన ఫౌండేషన్, ఈరోజు నిర్వహించిన శిబిరం ఆరోవది. శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పూర్తిస్థాయి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు.
ఉచితంగా శతాధిక
ఆపరేషన్లకు ఏర్పాట్లు:-
కంటి ఆపరేషన్ అవసరమైన సుమారు 200 నుండి 300 మంది రోగులను ఆదివారం సాయంత్రం ప్రత్యేక బస్సుల ద్వారా తిరుపతికి తరలించారు. అక్కడ అరవింద ఐ హాస్పిటల్లో మరిన్ని పరీక్షలు పూర్తి చేసిన అనంతరం సోమవారం వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించనున్నారు. ఆపరేషన్ల అనంతరం తిరిగి కోడూరుకు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.
పరీక్షలు, కళ్లద్దాలు, తిరుపతి ప్రయాణం, ఆపరేషన్లు, వసతి, ఆహారం – ఈ మొత్తం వ్యయాన్ని పూర్తిగా ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ భరించడం విశేషం. ఆపరేషన్ పూర్తయ్యేంత వరకు రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు.
పాల్గొన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్:-
ఈ బృహత్తర సేవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ పాల్గొని ఫౌండేషన్ సేవలను కొనియాడారు.
సేవలో ముక్కా కుటుంబం:-
ఈ శిబిరం వ్యవహారాలను రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్, కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, వారి సతీమణి ముక్కా వరలక్ష్మి, యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. వారు రోగులను పరామర్శిస్తూ, వారికి ధైర్యం చెప్పి నమ్మకాన్ని పెంపొందించారు. ప్రజల సేవ కోసం ముక్కా కుటుంబం చేస్తున్న కృషి పట్ల స్థానికులు అపారమైన కృతజ్ఞతలు తెలియజేశారు.


