రైల్వేకోడూరులో రాష్ట్రస్థాయి అండర్-19 బేస్బాల్ పోటీలు ప్రారంభం.
రైల్వే కోడూరు మేజర్ న్యూస్
రైల్వే కోడూరు మండలం కే. బుడుగుంట పల్లి పంచాయతీలోని ప్రభుత్వ ఉన్నత కళాశాల మైదానంలో ఎస్.జి.ఎఫ్. ఏపీ సెక్రటరీ భానుమూర్తి రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని 13 జిల్లాల అండర్-19 బాలబాలికల బేస్బాల్ పోటీలను శనివారం ప్రారంభించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి ఆంధ్ర రాష్ట్రం నుండి అంతర్ రాష్ట్ర స్థాయి బేస్బాల్ NS 25 జట్టులో ఆడే అవకాశం దక్కుతుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ యశోదర, తాసిల్దార్ అమర్నాథ్, సీఐ హేమ సుందర్ రావు, ఎంఈఓ సుందర్ బాబు, సర్పంచ్ దార్ల చంద్రశేఖర్, హెడ్మాస్టర్ ఉమా శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


