Sunday, 7 December 2025
  • Home  
  • హమాలి యూనియన్ జిల్లా మహాసభను జయప్రదం చేయండి. ఆల్ హమాలి యూనియన్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ రాపర్తి రాజు పిలుపు
- జనగాం

హమాలి యూనియన్ జిల్లా మహాసభను జయప్రదం చేయండి. ఆల్ హమాలి యూనియన్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ రాపర్తి రాజు పిలుపు

Neela Rakesh పున్నమి ప్రతినిధి ఘనపూర్ స్టేషన్ ఘనపూర్ (స్టే):-ఈరోజు స్టేషన్ ఘనపూర్ మండలంలోని పలు గ్రామాలలో ఐకెపి సెంటర్లను సందర్శించి సెంటర్ లో పనిచేసే హమాలి కార్మికులతో సంఘం జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు మాట్లాడుతూ ఈనెల 14 వ తేది శుక్రవారం రోజున ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ జనగామ జిల్లా మహాసభ జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ఉంటుందని ఈ మహాసభకు జిల్లా వ్యాప్తంగా హమాలీ కార్మికులు హాజరై మహాసభను జయప్రదం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది హమాలీ కార్మికులు ఉన్నారని జిల్లాలో వేలాదిమంది కార్మికులు హమాలీ పని మీద ఆధారపడి బ్రతుకుతున్నారని. కానీ వారికి ఎలాంటి సౌకర్యాలు గాని పనిభద్రత గాని లేదు అనేక కుటుంబాలు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఉంది. హమాలీలు మూటలు, బస్తాలు మోసి మోకాళ్లు నడుము నొప్పులతో అలాగే పనిచేసే చోట దుమ్ము ధూళితో తీవ్ర అనారోగ్యాలకు గురి అవుతున్నారు . హమాలీ కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హమాలీ కార్మికులకు ఇల్లు ఇస్తామని ప్రకటించింది. హమాలీ కార్మికుల ఇంటి నిర్మాణం కోసం ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని. కేరళలో కమ్యూనిస్టు వామపక్ష ప్రభుత్వం హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి హమాలీ కార్మికుల ఇంటి నిర్మాణం కోసం 7 లక్షల 80 వేల రూపాయలను కేటాయిస్తుందని అలాగే ప్రమాద బీమాను 16 లక్షల రూపాయలు అందిస్తుందని అలాగే హమాలీ కార్మికులకు రెండు రకాల పెన్షన్లు అమలుపరుస్తుంది ఒకటి కుటుంబ పెన్షన్ రెండవది 60 సంవత్సరాలు దాటిన కార్మికునికి వ్యక్తిగత పెన్షన్ అందిస్తుందని తద్వారా కేరళ వామపక్ష ప్రభుత్వం కార్మికులకు అండగా నిలుస్తుందని దేశంలోని అన్ని రాష్ట్రాలకు భిన్నంగా కార్మికుల పక్షపాతిగా వ్యవహరిస్తుంది దేశంలోని ఇతర రాష్ట్రాలకు కేరళ ఒక రోల్ మోడల్ గా ఉందని కేరళ తరహా కార్మిక పాలసీని రాష్ట్రంలో అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి జిల్లా ఉపాధ్యక్షులు కొడపాక యాకయ్య, హమాలి యూనియన్ నాయకులు బొల్లం యాదగిరి, గుమ్ముల కృష్ణమూర్తి, వెలిశాల రాజు, తోడంగల అనిల్, తెల్దారి దశరథం, కత్తుల రత్నాకర్, అన్నెపు రాజు తదితరులు పాల్గొన్నారు.

Neela Rakesh పున్నమి ప్రతినిధి ఘనపూర్ స్టేషన్

ఘనపూర్ (స్టే):-ఈరోజు స్టేషన్ ఘనపూర్ మండలంలోని పలు గ్రామాలలో ఐకెపి సెంటర్లను సందర్శించి సెంటర్ లో పనిచేసే హమాలి కార్మికులతో సంఘం జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు మాట్లాడుతూ ఈనెల 14 వ తేది శుక్రవారం రోజున ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ జనగామ జిల్లా మహాసభ జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ఉంటుందని ఈ మహాసభకు జిల్లా వ్యాప్తంగా హమాలీ కార్మికులు హాజరై మహాసభను జయప్రదం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది హమాలీ కార్మికులు ఉన్నారని జిల్లాలో వేలాదిమంది కార్మికులు హమాలీ పని మీద ఆధారపడి బ్రతుకుతున్నారని. కానీ వారికి ఎలాంటి సౌకర్యాలు గాని పనిభద్రత గాని లేదు అనేక కుటుంబాలు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఉంది. హమాలీలు మూటలు, బస్తాలు మోసి మోకాళ్లు నడుము నొప్పులతో అలాగే పనిచేసే చోట దుమ్ము ధూళితో తీవ్ర అనారోగ్యాలకు గురి అవుతున్నారు . హమాలీ కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హమాలీ కార్మికులకు ఇల్లు ఇస్తామని ప్రకటించింది. హమాలీ కార్మికుల ఇంటి నిర్మాణం కోసం ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని. కేరళలో కమ్యూనిస్టు వామపక్ష ప్రభుత్వం హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి హమాలీ కార్మికుల ఇంటి నిర్మాణం కోసం 7 లక్షల 80 వేల రూపాయలను కేటాయిస్తుందని అలాగే ప్రమాద బీమాను 16 లక్షల రూపాయలు అందిస్తుందని అలాగే హమాలీ కార్మికులకు రెండు రకాల పెన్షన్లు అమలుపరుస్తుంది ఒకటి కుటుంబ పెన్షన్ రెండవది 60 సంవత్సరాలు దాటిన కార్మికునికి వ్యక్తిగత పెన్షన్ అందిస్తుందని తద్వారా కేరళ వామపక్ష ప్రభుత్వం కార్మికులకు అండగా నిలుస్తుందని దేశంలోని అన్ని రాష్ట్రాలకు భిన్నంగా కార్మికుల పక్షపాతిగా వ్యవహరిస్తుంది దేశంలోని ఇతర రాష్ట్రాలకు కేరళ ఒక రోల్ మోడల్ గా ఉందని కేరళ తరహా కార్మిక పాలసీని రాష్ట్రంలో అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి జిల్లా ఉపాధ్యక్షులు కొడపాక యాకయ్య, హమాలి యూనియన్ నాయకులు బొల్లం యాదగిరి, గుమ్ముల కృష్ణమూర్తి, వెలిశాల రాజు, తోడంగల అనిల్, తెల్దారి దశరథం, కత్తుల రత్నాకర్, అన్నెపు రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.