ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటననిర్మల్ నవంబర్ 12, (పున్నమి ప్రతినిధి)నిర్మల్ : ప్రభుత్వ స్నాతక కళాశాల నిర్మల్ విద్యార్థులు క్షేత్ర పర్యటన కోసం వెళ్లారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025 సంవత్సరం లో విద్యార్థుల కు జ్ఞాన సముపార్జన కై కవులను కలిసేసందర్భంగా తెలుగు విభాగం అధిపతి డాక్టరు ఎల్మల రంజిత్ కుమార్ మరియు తెలుగు అధ్యాపకుడు డాక్టరు మురహరి రాథోడ్ విద్యార్థులను నిర్మల్ మహాత్మా జ్యోతిభా పూలే సొసైటీ డిగ్రీ కళాశాల నిర్మల్ ప్రిన్సిపాల్ డాక్టర్ బట్టు విజయ్ కుమార్ ను కళాశాల విద్యార్థులు తన రచనల గురించి అడిగారు. సింగిడి పువ్వు నానీలు, హైకులు, అనేకమైన ప్రక్రియల్లో రచనలు చేశానని చెప్పారు. తెలుగు సాహిత్యం పై అలాగే పరిశోధన ఎలా చేయాలి అనే అంశాల పై పూర్తి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్, డాక్టర్ రాథోడ్ మురహరి, డాక్టర్ బట్టు విజయ్ కుమార్, బిట్ల భారతి, జి శృతిక, జి పూజ, డి గాయత్రి, కే కీర్తన, బి శ్రీజ, డి గంగాసాగర, గౌతమి, పవన శృతి, కే ప్రణయ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



1 Comment
A RANJITH KUMAR
November 12, 2025https://punnami.in/wp-content/uploads/2025/11/IMG-20251111-WA0018.jpg