మెగాస్టార్ చిరంజీవి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల AI సాయంతో తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలు రూపొందిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు ద్వారా ఫిర్యాదు చేసిన ఆయన, ఇప్పుడు సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారంటూ మరో ఫిర్యాదు చేశారు. ఓ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను ఆధారంగా చూపిస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన చిరంజీవి, ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఇలాంటి పోస్టులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన చిరంజీవి