👉🏻 *తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా నకిలీ మద్యం కుట్రకు వైసీపీ నేతల కుట్ర*
*‘ఏపీ సురక్షా యాప్’ – మద్యం పారదర్శకతకు కొత్త యుగం*
👉🏻 *విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ₹1.30 లక్షల కోట్లు పెట్టుబడి, నగర అభివృద్ధిలో కొత్త అధ్యాయం చంద్రబాబు నాయుడు విజన్, నారా లోకేష్ కృషి ఫలితంగా విశాఖలో గూగుల్ డేటా సెంటర్*
– రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు
– రాష్ట్ర మైనింగ్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
*విశాఖపట్నం అక్టోబర్పున్నమి ప్రతినిధి :* గాజువాక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, రాష్ట్ర మైనింగ్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు వైసీపీ నకిలీ మద్యం దందా, గూగుల్ పెట్టుబడులపై అసత్య ప్రచారం, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
*తాడేపల్లి ప్యాలెస్ – కల్తీ మద్యం కుట్రకు కేంద్రం*
“నకిలీ మద్యం కుట్రకు కేంద్రం తాడేపల్లి ప్యాలెస్” అని పల్లా శ్రీనివాసరావు గారు దుయ్యబట్టారు. జనార్ధన్‌రావు–జోగి రమేష్ చిన్ననాటి స్నేహాన్ని దుర్వినియోగం చేసి సెప్టెంబర్ 23న తాడేపల్లిలో కుట్ర పన్నారని, తదుపరి రోజు ఆఫ్రికాకు వెళ్లాల్సిన జనార్ధన్‌రావును మద్యం కల్తీ కేసులో చిక్కించారని ఆయన పేర్కొన్నారు. జనార్ధన్‌రావు చెప్పినట్టే, జోగి రమేష్ ప్రోత్సాహంతోనే ఇబ్రహీంపట్నం, మొలకలచెరువులో కల్తీ మద్యం తయారైంది. వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీయాలనే దురుద్దేశ్యంతో ఈ కుట్ర పన్నారు,” అని ఆయన వివరించారు.
*జగన్ ముఠా అవినీతి బహిర్గతం – ఆఫ్రికా కనెక్షన్లు బట్టబయలు*
“వైసీపీ పాలనలో రూ.3,500 కోట్ల లిక్కర్ మాఫియా నడిచింది. జే బ్రాండ్లలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు చెన్నై, బెంగళూరు, అమెరికా ల్యాబ్ రిపోర్టులు నిర్ధారించాయి. ఆ అవినీతి సొమ్ముతో వైసీపీ నేతలు ఆఫ్రికా, దుబాయ్ దేశాల్లో వ్యాపారాలు ప్రారంభించారు. జగన్ బినామీలు వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి 2013లో ఆఫ్రికాలో ‘రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్’ పేరిట కల్తీ మద్యం తయారుచేసిన కంపెనీని అక్కడి ప్రభుత్వం సీజ్ చేసింది ఇది రికార్డుల్లో ఉంది,” అని చెప్పారు.
*సిట్ విచారణ – వైసీపీ కుట్రలకు బహిరంగ సాక్ష్యం*
మద్యం కుట్ర వెనుక ఉన్న వైసీపీ నాయకుల బండారం బయటపడుతోంది. దానిపై నాలుగు మంది సీనియర్ ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేసాం. ఎవరు నిందితులైనా, ఎవరైనా కుట్ర చేసినా తగిన శిక్ష తప్పదు అని మంత్రి కొల్లు రవీంద్ర గారు తెలిపారు. మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్న దాసరి పల్లి జయచంద్రరెడ్డి, కట్టా సురేంద్రనాయుడు లను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. ఇది ప్రభుత్వ–పార్టీ నిబద్ధతకు నిదర్శనం. వైసీపీ తమ మాఫియాను కప్పిపుచ్చేందుకు మమ్మల్ని దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. కానీ వాస్తవాలు బయటపడ్డాయి,” అన్నారు.
*‘ఏపీ సురక్షా యాప్’ – మద్యం లో పారదర్శకతకు కొత్త యుగం*
మంత్రి కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో “ఏపీ సురక్షా యాప్”ను లాంచ్ చేశారు. గాజువాక పాత సెంటర్‌లో ర్యాలీ నిర్వహించి, దగ్గరలోని మద్యం షాపులో ప్రజలకు యాప్ పనితీరుపై అవగాహన కల్పించారు. ప్రతి మద్యం బాటిల్‌ను యాప్ ద్వారా స్కాన్ చేసి నాణ్యతను పరిశీలించే విధానం ప్రజల్లో విశ్వాసం కల్పిస్తుందని ఆయన తెలిపారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో 3 లక్షల బెల్ట్ షాపులు నడిచాయి. ఇప్పుడేమో వాటిని మూసివేశాం. మద్యం కల్తీపై రూ.5 లక్షల వరకు జరిమానా, కఠిన శిక్షలు అమల్లో ఉన్నాయి. విశాఖ, కర్నూలు, చిత్తూరు, గుంటూరు, కాకినాడలో నూతన ల్యాబ్‌లు ఏర్పాటు చేసాం. దేశంలో ఎక్కడా లేని విధంగా 13 రకాల ENA టెస్టులు నిర్వహిస్తున్నాం. డిస్టిలరీలు, డిపోలు, షాపులు, బార్లలో ఆకస్మిక తనిఖీలు జరుగుతున్నాయి,” అని మంత్రి రవీంద్ర తెలిపారు.
*గూగుల్ 1.30 లక్షల కోట్ల పెట్టుబడితో విశాఖకు చరిత్రాత్మక గౌరవం*
విశాఖపట్నం అభివృద్ధి దిశగా చరిత్ర సృష్టించే దశలో ఉంది. గూగుల్ రూ.1.30 లక్షల కోట్లతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. ఇది కేవలం ఒక పెట్టుబడి కాదు విశాఖ భవిష్యత్తును మార్చే సంస్కరణ. గూగుల్ సీఈవో స్వయంగా విశాఖను ‘భారతదేశంలో అద్భుత నగరం’గా అభివర్ణించారు,” అని పల్లా శ్రీనివాసరావు గారు పేర్కొన్నారు.
డేటా సెంటర్ వస్తుందంటే దాన్ని చుట్టూ వందల కంపెనీలు వస్తాయి. వచ్చే 10 సంవత్సరాల్లో విశాఖ రూపురేఖలే మారిపోతాయి. భారతదేశ చరిత్రలో అతి వేగంగా అభివృద్ధి చెందే నగరం ఏదైనా ఉందంటే అది విశాఖపట్నమే. ఈ దిశలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి కృషి వల్లే గూగుల్ వంటి ప్రపంచ దిగ్గజం రాష్ట్రానికి వచ్చింది అని అన్నారు.
*విశాఖ – ప్రపంచ గ్లోబల్ మ్యాప్‌లో సరికొత్త గుర్తింపు*
విశాఖలో ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించగా, గూగుల్ రాకతో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ మ్యాప్‌లో స్థానం సంపాదిస్తుందని పల్లా గారు పేర్కొన్నారు. విపక్షాలు గూగుల్ పెట్టుబడులపై అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయి. వైసీపీకి అభివృద్ధి పట్ల ఆసక్తే లేదు. గూగుల్ ప్రాజెక్టుపై అపోహలు సృష్టించి ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఇది కేవలం అభివృద్ధిని ఆపడం కాదు, రాష్ట్ర పరువును బజారుకీడ్చడమే అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
*ప్రపంచానికి AI, ఇంటర్నెట్ కనెక్టివిటీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్*
నాడు తండ్రి మైక్రోసాఫ్ట్ తెస్తే, నేడు తనయుడు గూగుల్ తెచ్చాడు” అని పల్లా గారు పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం మంత్రి నారా లోకేష్ గారి కృషిని అభినందిస్తుంటే వైసీపీ మాత్రం ఫేక్ ప్రచారంలో మునిగిపోయింది. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాలతో గ్లోబల్ కంపెనీలు ఆకర్షితమవుతున్నాయి. ఆ విధానాలకు ఆకర్షితమై గూగుల్ విశాఖకు వచ్చింది అన్నారు. పక్క రాష్ట్రాలు మన రాష్ట్రానికి గూగుల్ రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. లోకేష్ గారి విజన్ వల్లే గూగుల్ మన రాష్ట్రానికి వచ్చింది. వైసీపీ నేతలు తలలు పట్టుకుని, పెట్టుబడులు రావడాన్ని తట్టుకోలేక అవహేళన చేస్తున్నారు అని అన్నారు.
*గూగుల్ క్లౌడ్ – ప్రపంచంలోనే అతిపెద్ద AI హబ్‌గా విశాఖ*
గూగుల్ క్లౌడ్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద AI హబ్ ను విశాఖలో 15 బిలియన్ డాలర్ల (₹1.30 లక్షల కోట్లు) పెట్టుబడితో ఏర్పాటు చేయనుంది. ఇది కేవలం డేటా సెంటర్ కాదు, ప్రపంచానికి కనెక్టివిటీ కేంద్రం. సబ్‌సీ గేట్వే ద్వారా గూగుల్ ఇప్పటికే సముద్ర గర్భంలో అమర్చిన కేబుల్లతో విశాఖను ప్రపంచ నెట్‌వర్క్‌కు అనుసంధానిస్తుంది,” అని పల్లా గారు వివరించారు. దీంతో విశాఖ AI, ఇంటర్నెట్ కనెక్టివిటీ, డేటా ఆపరేషన్స్, ఇంజినీరింగ్, సెక్యూరిటీ, ట్రాన్స్‌పోర్టేషన్, హౌసింగ్ రంగాల్లో 1.88 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని తెలిపారు.
*వైసీపీ ఫేక్ ప్రచారం – అభివృద్ధి అడ్డుకునే రాజకీయాలు*
వైసీపీ నేతలు గూగుల్ రాకపై అసత్యాలు చెబుతున్నారు. ఒకసారి ‘మాది ఘనత’ అంటారు, మరోసారి ‘ఉద్యోగాలు రావు’, ‘డేటా సెంటర్ కాదు గోదాం’ అంటారు. గూగుల్‌లో ఎన్ని ‘ఓ’లు ఉంటాయో కూడా తెలియని వారు ఇప్పుడు గూగుల్ గురించి మాట్లాడుతున్నారు,” అని పల్లా గారు ఎద్దేవా చేశారు…


