జాతీయ నాయకుల చిత్రపటాలు *పంపిణీ*
నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాల, అంగన్వాడి పాఠశాలకు శనివారం కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ నాయకులు, శాస్త్రవేత్తలు, రచయితల ఫోటోలు, విద్యార్థులకు నోటు బుక్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ మెంబర్, మాజీ ఎంపిటిసి సుగుణమ్మ తనయుడు కంకణాల నర్సిరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు రేపటి పౌరులని అన్నారు. విద్యార్థులకు స్ఫూర్తిని కలిగించటానికి జాతీయ నాయకుల చిత్రపటాలను పాఠశాలకు అందించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలకు భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయం అందజేస్తానని నర్సిరెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, జాతీయ నాయకులు, శాస్త్రవేత్తలు, రచయితల చిత్రపటాలు అందించడం మంచి కార్యక్రమం అని అభినందించారు. ఉపాధ్యాయులు వారి జీవితం గురించి విద్యార్థులకు బోధించాలని సూచించారు. పాఠశాల హెచ్ఎం బాబురావు, ఉపాధ్యాయులు శ్రీను నాయక్, సునీత, లక్ష్మీదేవి, అంగన్వాడీ టీచర్ కోట్ల లలితమ్మ, కోట్ల తనియా, గోకమోళ్ల శివశంకర్, ఆయా శాంతమ్మ, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

