Sunday, 7 December 2025
  • Home  
  • ప్రతి నియోజకవర్గంలో MSME పార్కులు ఏర్పాటు చేస్తున్నాం
- ఖమ్మం - జాతీయ అంతర్జాతీయ - తెలంగాణ - పెద్దపల్లి

ప్రతి నియోజకవర్గంలో MSME పార్కులు ఏర్పాటు చేస్తున్నాం

మధిర నియోజకవర్గంలో రెండు పారిశ్రామిక పార్కులకు ఆర్థిక సహాయం అందించండి కేంద్ర మంత్రి జితేంద్ర మాంజిని కలిసి విజ్ఞప్తి చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు న్యూఢిల్లీ, ఆగస్టు 06, పున్నమి ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం MSME (మైక్రో, చిన్న మరియు మధ్యతరః పరిశ్రమల) రంగ అభివృద్ధిలో మరో అడుగు ముందుకు వేస్తోంది. రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రెండు కొత్త MSME పార్కులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందనీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కేంద్ర MSME మంత్రి జితన్ రామ్ మాంజీ కి వివరించారు. బుధవారం ఉదయం ఢిల్లీలో కేంద్ర మంత్రిని డిప్యూటీ సీఎం తో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ మల్లు రవి , కలిసి విజ్ఞప్తి చేసి లేఖను అందించారు. MSME రంగం సమగ్ర ఆర్థిక ప్రగతికి కీలక క్షేత్రంగా మారుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఖమ్మం జిల్లా మధిర మండలంలోని యెండపల్లి, ఎర్రుపాలెం మండలంలోని రె మిడిచర్ల గ్రామాల్లో MSME పార్కులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని, వరుసగా 85 ఎకరాలు మరియు 60 ఎకరాల్లో ఈ పార్కులు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. జాతీయ రహదారి 65 (హైదరాబాద్–విజయవాడ కారిడార్) కు సమీపంలో ఉండటంతో, వీటి భౌగోలిక స్థానం వ్యూహాత్మకంగా ఉందనీ, సమీప పట్టణాలు, రైల్వే నెట్వర్క్‌లు, పోర్టులతో అనుసంధానం ఉందనీ తెలిపారు. ఈ పార్కుల అభివృద్ధి ద్వారా ఆ ప్రాంత యువతకు, ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు చెందిన యువతకు పారిశ్రామిక అవకాశాలు అందుబాటులోకి వస్తాయనీ తెలిపారు. ఈ పార్కులు వివిధ తయారీ రంగాలకు అనుకూలంగా అభివృద్ధి చేయబడి, కనీసం 5,000 ప్రత్యక్ష మరియు 15,000 పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించగలవనే అంచనాలతో ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. MSME-CDP పథకం కింద ఈ పార్కుల అభివృద్ధికి ఆర్థిక సహాయానికి ప్రాజెక్ట్ ప్రతిపాదనలు పంపించేందుకు ముందస్తు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం లేఖలో కోరింది.తెలంగాణలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక MSME పార్క్ – రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనMSME-CDP పథకం కింద కేంద్ర నుంచి ఆర్థిక సహాయం ఆశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రికి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం MSME రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రతిష్టాత్మక ప్రణాళికను రూపొందించిందనీ, రాష్ట్రంలోని ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో (మొత్తం 119) చిన్న స్థాయి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీలతో కూడిన MSME పార్క్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందనీ, ఈ పార్కులు, చిన్న స్థాయి పారిశ్రామిక సంస్థలు తమ వ్యాపారాలను ప్రారంభించి, నడిపించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ అనుకూలమైన పారిశ్రామిక వాతావరణాన్ని అందించనున్నాయని కేంద్ర మంత్రికి తెలిపారు.ఈ MSME పార్కుల్లో హాస్టళ్లు, కిచెన్లు, టాయిలెట్లు, టెస్టింగ్ సెంటర్లు, ఇతర సాధారణ వసతులు ఉంటాయనీ, వ్యాపార అభివృద్ధి, ఉత్పత్తి ఆవిష్కరణ, మార్కెట్ వ్యూహం వంటి సేవలు అందుబాటులో ఉంటాయనీ, మహిళా ప్రాధాన్యత గల సంస్థలకు ప్రోత్సాహంగా స్ట్రీనిధి పథకం ద్వారా రుణాల మద్దతు కూడా ఇవ్వనున్నామని కేంద్రమంత్రికి వివరించారు. దీని ద్వారా మహిళల ఆధ్వర్యంలోని సంస్థలు బలోపేతం కావడంతోపాటు, జీవనోపాధి అవకాశాలు విస్తరించనున్నాయనీ,ప్రస్తుతం MSME-CDP పథకం కింద తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 25 ప్రాజెక్టులను కేంద్ర MSME మంత్రిత్వ శాఖ సహకారంతో అమలు చేస్తోందనీ, వీటిలో ఇండస్ట్రియల్ పార్కులు, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సులు, కామన్ ఫెసిలిటీ సెంటర్లు (CFCs) ఉన్నాయి. ఇవి రాష్ట్రంలో MSME వ్యవస్థను బలంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయనీ తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం, కేంద్ర MSME మంత్రిత్వ శాఖ మద్దతుతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేకంగా MSME పార్కులను నెలకొల్పడానికి సంబంధిత పథకాల ద్వారా ఆర్థిక సహాయం కోరుతోంది. ఈ ప్రయోజనాత్మక కార్యక్రమాల ద్వారా భారతదేశం లక్ష్యంగా పెట్టుకున్న 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా తెలంగాణ రాష్ట్రం కీలక భాగస్వామిగా నిలుస్తుందనే నమ్మకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రి ఎదుట వ్యక్తం చేశారు.

మధిర నియోజకవర్గంలో రెండు పారిశ్రామిక పార్కులకు ఆర్థిక సహాయం అందించండి

కేంద్ర మంత్రి జితేంద్ర మాంజిని కలిసి విజ్ఞప్తి చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

న్యూఢిల్లీ, ఆగస్టు 06, పున్నమి ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్రం MSME (మైక్రో, చిన్న మరియు మధ్యతరః పరిశ్రమల) రంగ అభివృద్ధిలో మరో అడుగు ముందుకు వేస్తోంది. రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రెండు కొత్త MSME పార్కులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందనీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కేంద్ర MSME మంత్రి జితన్ రామ్ మాంజీ కి వివరించారు.

బుధవారం ఉదయం ఢిల్లీలో కేంద్ర మంత్రిని డిప్యూటీ సీఎం తో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ మల్లు రవి , కలిసి విజ్ఞప్తి చేసి లేఖను అందించారు.

MSME రంగం సమగ్ర ఆర్థిక ప్రగతికి కీలక క్షేత్రంగా మారుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఖమ్మం జిల్లా మధిర మండలంలోని యెండపల్లి, ఎర్రుపాలెం మండలంలోని రె మిడిచర్ల గ్రామాల్లో MSME పార్కులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని, వరుసగా 85 ఎకరాలు మరియు 60 ఎకరాల్లో ఈ పార్కులు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. జాతీయ రహదారి 65 (హైదరాబాద్–విజయవాడ కారిడార్) కు సమీపంలో ఉండటంతో, వీటి భౌగోలిక స్థానం వ్యూహాత్మకంగా ఉందనీ, సమీప పట్టణాలు, రైల్వే నెట్వర్క్‌లు, పోర్టులతో అనుసంధానం ఉందనీ తెలిపారు. ఈ పార్కుల అభివృద్ధి ద్వారా ఆ ప్రాంత యువతకు, ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు చెందిన యువతకు పారిశ్రామిక అవకాశాలు అందుబాటులోకి వస్తాయనీ తెలిపారు. ఈ పార్కులు వివిధ తయారీ రంగాలకు అనుకూలంగా అభివృద్ధి చేయబడి, కనీసం 5,000 ప్రత్యక్ష మరియు 15,000 పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించగలవనే అంచనాలతో ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రికి వివరించారు.

MSME-CDP పథకం కింద ఈ పార్కుల అభివృద్ధికి ఆర్థిక సహాయానికి ప్రాజెక్ట్ ప్రతిపాదనలు పంపించేందుకు ముందస్తు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం లేఖలో కోరింది.
తెలంగాణలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక MSME పార్క్ – రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన
MSME-CDP పథకం కింద కేంద్ర నుంచి ఆర్థిక సహాయం ఆశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రికి తెలిపారు.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం MSME రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రతిష్టాత్మక ప్రణాళికను రూపొందించిందనీ, రాష్ట్రంలోని ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో (మొత్తం 119) చిన్న స్థాయి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీలతో కూడిన MSME పార్క్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందనీ, ఈ పార్కులు, చిన్న స్థాయి పారిశ్రామిక సంస్థలు తమ వ్యాపారాలను ప్రారంభించి, నడిపించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ అనుకూలమైన పారిశ్రామిక వాతావరణాన్ని అందించనున్నాయని కేంద్ర మంత్రికి తెలిపారు.
ఈ MSME పార్కుల్లో హాస్టళ్లు, కిచెన్లు, టాయిలెట్లు, టెస్టింగ్ సెంటర్లు, ఇతర సాధారణ వసతులు ఉంటాయనీ, వ్యాపార అభివృద్ధి, ఉత్పత్తి ఆవిష్కరణ, మార్కెట్ వ్యూహం వంటి సేవలు అందుబాటులో ఉంటాయనీ, మహిళా ప్రాధాన్యత గల సంస్థలకు ప్రోత్సాహంగా స్ట్రీనిధి పథకం ద్వారా రుణాల మద్దతు కూడా ఇవ్వనున్నామని కేంద్రమంత్రికి వివరించారు. దీని ద్వారా మహిళల ఆధ్వర్యంలోని సంస్థలు బలోపేతం కావడంతోపాటు, జీవనోపాధి అవకాశాలు విస్తరించనున్నాయనీ,
ప్రస్తుతం MSME-CDP పథకం కింద తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 25 ప్రాజెక్టులను కేంద్ర MSME మంత్రిత్వ శాఖ సహకారంతో అమలు చేస్తోందనీ, వీటిలో ఇండస్ట్రియల్ పార్కులు, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సులు, కామన్ ఫెసిలిటీ సెంటర్లు (CFCs) ఉన్నాయి. ఇవి రాష్ట్రంలో MSME వ్యవస్థను బలంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయనీ తెలిపారు.

ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం, కేంద్ర MSME మంత్రిత్వ శాఖ మద్దతుతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేకంగా MSME పార్కులను నెలకొల్పడానికి సంబంధిత పథకాల ద్వారా ఆర్థిక సహాయం కోరుతోంది. ఈ ప్రయోజనాత్మక కార్యక్రమాల ద్వారా భారతదేశం లక్ష్యంగా పెట్టుకున్న 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా తెలంగాణ రాష్ట్రం కీలక భాగస్వామిగా నిలుస్తుందనే నమ్మకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రి ఎదుట వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.