కార్డు ముక్క :వారాల ఆనంద్

0
124

కార్డు ముక్క
వారాల ఆనంద్

సాహితీ పున్నమి)

పోస్ట్ మాన్ కోసం ఎదురు చూసీ చూసీ
అలసిపోయాక

ఈ రోజు నన్ను వెతుక్కుంటూ
ఓ పోస్ట్ కార్డు వచ్చింది
నత్తనడకన ఎన్ని వూర్లు ఎన్ని వీధులు
ఎన్ని రోజులు తిరిగిందో

కార్డు మీద చూస్తే ఊరి పేరులేదు
రాసిన తేదీలేదు రాసిన వారి పేరూ లేదు

చాలాసేపటివరకూ
ఖాళీ ఉత్తరాన్ని చదువుతూ కూర్చున్నాను

తెల్లకాగితంలా ఉన్న ఆ కార్డు ముక్క
ఎన్ని సంగతుల్ని చెబుతున్నదో
ఎంత దుఃఖాన్ని మోస్తున్నదో

వూర్లో ఏమీ మిగలలేదని
వూరు బాధని గాధని నింపు కొచ్చిన
కార్డు ఇంకా ఏమయినా చెప్పాలా

నిశబ్దాన్ని మోసుకొచ్చిన కార్డు ముక్క
కళ్ళల్లో ప్రవాహాన్నీ
మనసులో ఎడారినీ నింపేసింది
********************

POST CARD
++++++

After weary days of waiting,
The postman never visited

Yet today, a postcard arrived,
Wandering through nameless towns,
Unnamed streets
Countless days

Upon its face
No station whisper
No breath of date
No hand to claim its words.

For a long time,
I sat reading the hollow silence
Of that blank piece of card

How much it murmurs,
How much sorrow it carries

It echoes the empty village and
Its grief poured into brittle paper

What more could it confess?
A fragment of silence in my hands

It filled
My eyes flooded,
My heart with desert winds

*****************
Original poem in Telugu and English translation
By VARALA ANAND

0
0