*89 వ వార్డు లో గౌరీ కేదారేశ్వర ఆలయంలో కార్తీక అన్న సమారాధనలో పాల్గొన్న సిపి.డా.శంఖబ్రత భాగ్చి*
*కోనేరు పక్కన ఆహ్లాదకర దేవాలయం:సిపి.డా.శంఖబ్రత భాగ్చి ప్రశంసలు*
విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-
విశాఖ జీవీఎంసీ 89వ వార్డు భగత్ సింగ్ నగర్‌లోని శ్రీ శ్రీ శ్రీ గణపతి సహిత గౌరీ కేదారేశ్వర ఆలయంలో, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక అన్నసమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన విశాఖ నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత భాగ్చి కి సభ్యులు సాలువాతో సత్కారం చేసి బొకే అందజేసి ఘన స్వాగతం పలికారు. అలాగే గోపాలపట్నం సీఐ ఎల్. సన్యాసినాయుడు కి కూడా కమిటీ సభ్యులు సాదర స్వాగతం చెప్పారు.తరువాత కమిషనర్ శంఖబ్రత భాగ్చి కేదారేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ పరిసరాలను పరిశీలించిన ఆయన కమిటీ సభ్యులు తీర్చిదిద్దిన తీరు పట్ల ప్రశంసలు కురిపించారు.ఈ సందర్భంగా సీపీ శంఖబ్రత భాగ్చి మాట్లాడుతూ—
“విశాఖ నగరంలో ఎన్నో దేవాలయాలు చూశాను. కానీ ఇలా కోనేరు పక్కన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న దేవాలయం చాలా అరుదు. ఎంతో చక్కగా, శాంతియుతంగా ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా మళ్లీ దర్శనం చేసుకుంటాను” అన్నారు.
అలాగే ఆలయ కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తరువాత నిర్వహించిన కార్తీక అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న సీపీ భాగ్చి, భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయం కమిటీ సభ్యులు కృష్ణ చారి,చంద్రశేఖర్,నాగేశ్వరరావు, సంతోష్ కుమార్,వాసు,ఉగాది నాయుడు తదితర సభ్యులు పాల్గొన్నారు.


