Thursday, 5 February 2026
  • Home  
  • 8 గంటల పని పునరుద్ధరణకు CITU డిమాండ్ – నందిగామ లో కరపత్రాల పంపిణీ
- ఎన్ టి ఆర్ జిల్లా

8 గంటల పని పునరుద్ధరణకు CITU డిమాండ్ – నందిగామ లో కరపత్రాల పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా పనిగంటలను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ, నందిగామ మున్సిపల్ వర్కర్ యూనియన్ (CITU) ఆధ్వర్యంలో శుక్రవారం కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా CITU ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు కె.గోపాల్ మాట్లాడుతూ – “రాష్ట్రంలో టిడిపి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కార్మిక వర్గానికి అన్యాయం చేస్తూ, యజమాను లకు అనుకూలంగా కార్మిక చట్టాల్లో అనేక మార్పులు చేసింది. కార్మికులు పోరాటాల తో సాధించుకున్న 8 గంటల పని వ్యవస్థను 10 గంటలకు పెంచడం అన్యాయమని,” అన్నారు. అతను చెప్పిన ముఖ్యాంశాలు: రోజుకు 10 గంటల పని, కానీ వారానికి 48 గంటలు – ఇది అభ్యంతరకరం. 8 గంటలు పని, 8 గంటలు కుటుంబం, 8 గంటలు విశ్రాంతి అనే తత్వాన్ని ప్రభుత్వం గౌరవించడం లేదు. షాపులు, ఫ్యాక్టరీల చట్టాలలో చేసిన సవరణలు తక్షణం రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం పనిగంటల పెంపుపై కార్మిక సంఘాలతో కనీసంగా చర్చించలేదు. గత 3 దఫాలుగా కనీస వేతనాల సవరణను ప్రభుత్వం అమలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో బీజేపీ పాలిత రాష్ట్రాలు పనిగంటలు పెంచిన తరహాలో, ఇక్కడ కూడా అదే ధోరణి అనుసరించడాన్ని తీవ్రంగా ఖండించారు. సమావేశంలో కార్మిక సంఘాల నేతలు దాసవరకు సైదా (యూనియన్ అధ్యక్షుడు), పూట్టా మాణిక్యం, గరికపాటి ప్రసాదు, రాజరత్నం, రూత్తుమ్మ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. CITU విజ్ఞప్తి – పని గంటలు పెంచే సవరణలను రద్దు చేసి, 8 గంటల పని విధానాన్ని పునరుద్ధరించేవరకు నిరసన పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సి ఐ టి యు), నందిగామ మండల కమిటీ

రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా పనిగంటలను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ, నందిగామ మున్సిపల్ వర్కర్ యూనియన్ (CITU) ఆధ్వర్యంలో శుక్రవారం కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా CITU ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు కె.గోపాల్ మాట్లాడుతూ – “రాష్ట్రంలో టిడిపి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కార్మిక వర్గానికి అన్యాయం చేస్తూ, యజమాను లకు అనుకూలంగా కార్మిక చట్టాల్లో అనేక మార్పులు చేసింది. కార్మికులు పోరాటాల తో సాధించుకున్న 8 గంటల పని వ్యవస్థను 10 గంటలకు పెంచడం అన్యాయమని,” అన్నారు.

అతను చెప్పిన ముఖ్యాంశాలు:

రోజుకు 10 గంటల పని, కానీ వారానికి 48 గంటలు – ఇది అభ్యంతరకరం.

8 గంటలు పని, 8 గంటలు కుటుంబం, 8 గంటలు విశ్రాంతి అనే తత్వాన్ని ప్రభుత్వం గౌరవించడం లేదు.

షాపులు, ఫ్యాక్టరీల చట్టాలలో చేసిన సవరణలు తక్షణం రద్దు చేయాలి.

రాష్ట్ర ప్రభుత్వం పనిగంటల పెంపుపై కార్మిక సంఘాలతో కనీసంగా చర్చించలేదు.

గత 3 దఫాలుగా కనీస వేతనాల సవరణను ప్రభుత్వం అమలు చేయలేదు.

కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో బీజేపీ పాలిత రాష్ట్రాలు పనిగంటలు పెంచిన తరహాలో, ఇక్కడ కూడా అదే ధోరణి అనుసరించడాన్ని తీవ్రంగా ఖండించారు.

సమావేశంలో కార్మిక సంఘాల నేతలు దాసవరకు సైదా (యూనియన్ అధ్యక్షుడు), పూట్టా మాణిక్యం, గరికపాటి ప్రసాదు, రాజరత్నం, రూత్తుమ్మ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

CITU విజ్ఞప్తి – పని గంటలు పెంచే సవరణలను రద్దు చేసి, 8 గంటల పని విధానాన్ని పునరుద్ధరించేవరకు నిరసన పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సి ఐ టి యు), నందిగామ మండల కమిటీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.