కొండ ప్రాంతంలో రింగ్ పోల్స్ ఏర్పాటుపై ఫలించిన గంకల కవిత అప్పారావు యాదవ్ కృషి
పగలు రాత్రి తేడా లేకుండా వార్డు అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న గంకల కవిత అప్పారావు యాదవ్*
48వ వార్డులో అధికారులతో కలిసి నూతన రింగ్ పోల్స్ ను ఏర్పాటు చేసిన గంకల
జీవీఎంసీ 48వ వార్డు కొండవాలు ప్రాంతంలో రింగ్ పోల్స్ ఏర్పాటు చేయాలని 48వ వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ బిజెపి ఫ్లోర్ లీడర్, స్టాండింగ్ కమిటీ మెంబర్ గంకల కవిత అప్పారావు యాదవ్ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమీషనర్,జీవీఎంసీ మేయర్,ఏపీఈపీడీసీఎల్ సీఎండి లకు పలుమార్లు వినతులు చేశారు.గంకల కవిత అప్పారావు యాదవ్ పిర్యాదుపై అధికారులు స్పందించి శుక్రవారం వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా 48వ వార్డునకు ఏడు నూతన రింగ్ పోల్స్ కేటాయించినట్లు గంకల కవిత అప్పారావు యాదవ్ తెలిపారు.ఇందులో భాగంగా వార్డులో ఏ ప్రాంతంలో రింగ్ పోల్స్ అవసరం ఉన్నది అనేది అధికారులతో కలిసి గంకల కవిత అప్పారావు యాదవ్ పర్యటించి ఆ ప్రదేశంలో భారీ క్రేన్లు సహాయంతో రింగ్ పోల్స్ ను ఏర్పాటు చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఉదయం నుంచి కార్మికులతో కలిసి మధ్యాహ్నం భోజనం విరామం లేకుండా కార్మికులతో రాత్రి వరకు ఉండి వార్డులో నూతన రింగ్ పోల్స్ ను ఏర్పాటు చేసి నూతన రింగ్ పోల్స్ కు సిమ్మెంటుతో రక్షణ గట్టు నిర్మాణాలు చేశారు.ఈ సందర్భంగా గంకల కవిత అప్పారావు యాదవ్ మాట్లాడుతూ 48 వ వార్డు అంతా కొండ ప్రాంతం కావడంతో చీకటి ప్రదేశం నెలకొంటుందని,ఈ చీకటి ప్రదేశంలో ఆకతాయిల ఆగడాలు పెరుగుతున్నాయని, నిత్యం దొంగతనాలు జరుగుతున్నాయని పలుమార్లు కలెక్టర్, జీవీఎంసీ కమీషనర్,జీవీఎంసీ మేయర్,ఏపీఈపీడీసీఎల్ సీఎండి లకు వార్డులో నూతన రింగ్ పోల్స్ ఏర్పాటు చేయాలని వినతి అందజేయడం జరిగిందని, ఇదే విషయంపై జీవీఎంసీ కౌన్సిల్లో చర్చించడం జరిగిందన్నారు. గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంలో వార్డు ప్రజల సమస్యలు తెలుసుకుని వార్డులో రింగ్ పోల్స్ అవశ్యకత ఉందని ప్రజల ద్వారా తెలుసుకొని గత నాలుగు ఏళ్లగా పోరాటం చేశామని ఈ పోరాటానికి ఫలితం దక్కిందన్నారు.పలు మార్లు అందించిన వినతులపై జీవీఎంసీ కమిషనర్,మేయర్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు స్పందించి వార్డులో ఏడు రింగ్ పోల్స్ కేటాయించడం జరిగిందని,వాటిని జవహర్ లాల్ నెహ్రు నగర్, ఇందిరా నగర్ -2,ఇందిరా నగర్ -4,ఇందిరా నగర్ -5,జై భారత్ నగర్, పల్నాటి కాలనీ, బాపూజీ నగర్ లో ఒక్కొక్క పోల్ చొప్పున ఈరోజు ఏర్పాటు చేయడం జరిగిందని త్వరలో వాటికి ఒక్కొక్క రింగ్ పోల్ కు నాలుగు హైమాస్ట్ వీధి దీపాలను ఏర్పాటు చేసి వార్డు అంతట విద్యుత్ దీపాల వెలుగులను కురిపిస్తామన్నారు. వార్డులో అధికారులతో కలిసి పర్యటించి పలు సూచనలు ఇచ్చినట్లు గంకల పేర్కొన్నారు. అతి త్వరలో వార్డులో మరిన్ని వీధి దీపాలు,సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తామని గంకల హామీ ఇచ్చారు.48వ వార్డులో రింగ్ పోల్స్ ఏర్పాటు పట్ల గంకల కవిత అప్పారావు యాదవ్ కృషి ఫలించిందని, వార్డులో గంకల కవిత అప్పారావు యాదవ్ కృషితో నూతన వెలుగులు వెలగడం పట్ల పలువురు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వార్డు ప్రజలకు ఎటువంటి సమస్య ఏర్పడిన తక్షణమే తనను సంప్రదించాలని గంకల కవిత అప్పారావు యాదవ్ సూచించారు.


