గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ చేసిన ఎం.పి. చింతా. అనూరాధ
అమలాపురం, మే 31,2020 (పున్నమి విలేఖరి)
రక్త హీనత లేకుండా గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా పౌష్టికాహారాన్ని తీసుకోవాలని అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి చింతా అనూరాధ సూచించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఈ రోజుకు సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంగా మామిడికుదురు మండలం పాసర్లపూడి గ్రామంలో పి.గన్నవరం శాసన సభ్యులు కొండేటి చిట్టిబాబు తో కలిసి గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఎం.పి. చింతా.అనురాధ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగరం ఏ.ఎం.సి. చైర్మెన్ కొమ్ముల కొండలరావు తదితరులు పాల్గొన్నారు.