44 వార్డు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు సూచనల మేరకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన “కోటి సంతకాలు” కార్యక్రమం పెద్దవూరు మసీద్ వద్ద ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి బాణాల తరుణ్ కుమార్, 44వ వార్డు అధ్యక్షుడు ఎ.డి. హబీబ్ ఆధ్వర్యం వహించారు.
ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా విశాఖ జిల్లా అధ్యక్షులు, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె. రాజు పాల్గొని విద్య రంగంలో ప్రభుత్వ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతపై మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ నుంచి కాపాడాలి అనే లక్ష్యంతో విద్యార్థులు, ప్రజలు సమగ్రమైన భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో యాసిన్, మహాదాస్యం గోపి, ఎం. సునీల్, కన్నప్పడు, రామకృష్ణ, బాధ శ్రీనివాస్, పిడుగు వెంకట్, సన్యాసిరావు, మల్లేశ్వరావు, బషీర్, బాషా, రసీద్, నారాయణ, బిల్లు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరై ప్రభుత్వ మెడికల్ విద్య అందరికీ అందుబాటులో ఉండాలని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ సంతకాలతో మద్దతు తెలిపారు.


