Friday, 27 March 2026
  • Home  
  • 4 కోట్ల విలువ చేసే భూమిని వ్యవసాయ శాఖకు రిజిస్ట్రేషన్ చేసిన రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
- E-పేపర్

4 కోట్ల విలువ చేసే భూమిని వ్యవసాయ శాఖకు రిజిస్ట్రేషన్ చేసిన రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

పున్నమి ప్రతినిధి: ఆలంపల్లి దుర్గేష్ : 9640204826 : 4 కోట్ల విలువ చేసే భూమిని వ్యవసాయ శాఖకు రిజిస్ట్రేషన్ చేసిన కోదండరెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం తన సొంత భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేశారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఈరోజు ఇబ్రహీం పట్నం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారికంగా వ్యవసాయ శాఖకు రిజిస్ట్రేషన్ చేశారు. రెండు నెలల క్రితమే తన సొంత గ్రామం ఐనా యాచారం గ్రామంలోని 4 కోట్ల విలువ చేసే 2 వేల గజాల స్థలాన్ని, అందులో వున్న భవనాన్ని వ్యవసాయశాఖకు రాసివ్వనున్నట్లు ప్రకటించారు. యాచారం మండలంలోని రైతులు పండించే ఉత్పత్తుల నిల్వ, ఇతర వ్యవసాయ పరికరాలు, పనిమొట్లు పెట్టుకోడానికి ఎంతో ఉపయోగకరంగా వుంది. ఇక శాశ్వతంగా రైతులకు ఉపయోగకరంగా ఉండాలంటే ప్రభుత్వానికి రాసిస్తే బాగుంటదనే ఆలోచనతో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలోనే ఈ విషయాన్ని స్వయంగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును కలిసి వివరించారు. ఐతే దానికి సంబందించిన అధికారికంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ రోజు ముగిసింది. ఇబ్రహీం పట్నం సబ్ రిజిస్టర్ హర్షన్ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ ప్రక్రియలో వ్యవసాయ శాఖ తరుపున రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఉషా, ఏడీఏ సుజాత, ఏవో రవినాధ్ పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి:
ఆలంపల్లి దుర్గేష్ :
9640204826 :
4 కోట్ల విలువ చేసే భూమిని వ్యవసాయ శాఖకు రిజిస్ట్రేషన్ చేసిన కోదండరెడ్డి.
ఇచ్చిన మాట ప్రకారం తన సొంత భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేశారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఈరోజు ఇబ్రహీం పట్నం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారికంగా వ్యవసాయ శాఖకు రిజిస్ట్రేషన్ చేశారు. రెండు నెలల క్రితమే తన సొంత గ్రామం ఐనా యాచారం గ్రామంలోని 4 కోట్ల విలువ చేసే 2 వేల గజాల స్థలాన్ని, అందులో వున్న భవనాన్ని వ్యవసాయశాఖకు రాసివ్వనున్నట్లు ప్రకటించారు. యాచారం మండలంలోని రైతులు పండించే ఉత్పత్తుల నిల్వ, ఇతర వ్యవసాయ పరికరాలు, పనిమొట్లు పెట్టుకోడానికి ఎంతో ఉపయోగకరంగా వుంది. ఇక శాశ్వతంగా రైతులకు ఉపయోగకరంగా ఉండాలంటే ప్రభుత్వానికి రాసిస్తే బాగుంటదనే ఆలోచనతో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలోనే ఈ విషయాన్ని స్వయంగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును కలిసి వివరించారు. ఐతే దానికి సంబందించిన అధికారికంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ రోజు ముగిసింది. ఇబ్రహీం పట్నం సబ్ రిజిస్టర్ హర్షన్ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ ప్రక్రియలో వ్యవసాయ శాఖ తరుపున రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఉషా, ఏడీఏ సుజాత, ఏవో రవినాధ్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.