Sunday, 7 December 2025
  • Home  
  • 26 ఏళ్ల మిలేనియం ఘన వార్షికోత్సవం – MACT-2025 టాపర్స్కు భారీ బహుమతులు
- విశాఖపట్నం

26 ఏళ్ల మిలేనియం ఘన వార్షికోత్సవం – MACT-2025 టాపర్స్కు భారీ బహుమతులు

26 ఏళ్ల మిలేనియం ఘన వార్షికోత్సవం – MACT-2025 టాపర్స్కు భారీ బహుమతులు *విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:- * “భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నడుస్తోంది. అందుకు మనం సిద్ధంగా ఉండి, అవసరమైన నైపుణ్యాలను పొందాలి” అని పాత్రా ఇండియా బిపిఓ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మి ముక్కవిల్లి గారు మిలేనియం ఆప్టిట్యూడ్ & కోడింగ్ టెస్ట్-2025 బహుమతి ప్రదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పేర్కొన్నారు. ట్రెండింగ్ టెక్నాలజీలను క్రమశిక్షణతో నేర్చుకుంటే ఉద్యోగావకాశాలు ఎంతో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. MACT వంటి పరీక్షలు విద్యార్థుల్లో పోటీ భావనను పెంచుతాయని కూడా అభిప్రాయపడ్డారు. “ఎవరూ ఎదగడానికి ఎదురు చూసి సిద్ధం కాలేదు. ప్రారంభించడం ద్వారా మాత్రమే సిద్ధత వస్తుంది” అని వరదా రవికుమార్, సెంట్రల్ మేనేజర్, మిల్లేనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రారంభ ప్రసంగంలో చెప్పారు. ఈరోజు కార్యక్రమం మిల్లేనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ 26వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించబడుతోందని పేర్కొన్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన శిక్షణతో పాటు ప్లేస్మెంట్ సహాయంపై మిల్లేనియం ఎల్లప్పుడూ దృష్టి పెట్టిందని వివరించారు. CRT ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, 2023లో మిల్లీనియం ఆప్టిట్యూడ్ టెస్ట్ను 50 లక్షల రూపాయల ప్రతిభా వేతనంతో ప్రారంభించామని, ఇందులో ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్, వర్బల్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కంప్యూటర్ ఫండమెంటల్స్ వంటి ఇంటర్వ్యూలో కీలకమైన నైపుణ్యాలను పరీక్షించుకోడానికి విద్యార్థులకు అవకాశం లభిస్తుందని తెలిపారు. ఈ సంవత్సరం మిల్లేనియం ఆప్టిట్యూడ్ & కోడింగ్ టెస్ట్ 30 కళాశాలల్లో విజయవంతంగా నిర్వహించబడిందని, మొత్తం 5,500 మంది విద్యార్థులు పాల్గొన్నారని, అందులో 1,000 మంది ర్యాంకర్లుగా ఎంపికయ్యారని తెలిపారు. కార్యక్రమం నిర్వహణలో సహకరించిన విశాఖ పరిసర ప్రాంతాల ప్రఖ్యాత కళాశాలల ప్రిన్సిపాళ్లు, HODలు, TPOలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మరిసెట్టి డింపుల్ (NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) మొదటి ర్యాంక్ సాధించి ₹50,000 నగదు బహుమతి గెలుచుకున్నారని ప్రకటించారు. 2వ ర్యాంక్ – వెమనమంద స్రీ సాయి ప్రణవ్ వర్మ (ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్) 3వ ర్యాంక్ – బెజవాడ నూక శ్రీనివాసరావు (ASK కాలేజ్ ఆఫ్ టెక్ & మేనేజ్మెంట్) 4వ ర్యాంక్ – షేక్ కరీముల్లా (MVR డిగ్రీ కాలేజ్) 5వ ర్యాంక్ – చింతల గణేష్ (సెంచూరియన్ యూనివర్సిటీ) తరువాత, బేహ్రా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ CSE విభాగాధిపతి నారాయణరావు చొక్కాపు మాట్లాడుతూ—AI పరిశ్రమల్లో విస్తరిస్తున్నప్పటికీ, దాన్ని అమలు చేయడానికి ఇంజనీర్లు అవసరమని, విద్యార్థులు తాజా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. MVR డిగ్రీ కాలేజ్ ఫ్యాకల్టీ శ్రీ బి. రత్నకుమార్, విశాఖ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఫిజిక్స్ హెచ్ఓడీ డాక్టర్ పి.ఎల్. సరణ్య తదితరులు మిలేనియం 26 ఏళ్ల విజయవంతమైన ప్రయాణాన్ని కొనియాడారు. VIET, సెయింట్ ఆన్స్, BVK డిగ్రీ కాలేజీల ప్రతినిధులు కూడా ఈ ఉపయోక్తమైన పరీక్ష నిర్వహణకు మిలేనియంను అభినందించారు. తర్వాత ముఖ్య అతిథి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది.

26 ఏళ్ల మిలేనియం ఘన వార్షికోత్సవం – MACT-2025 టాపర్స్కు భారీ బహుమతులు
*విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:- *
“భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నడుస్తోంది. అందుకు మనం సిద్ధంగా ఉండి, అవసరమైన నైపుణ్యాలను పొందాలి” అని పాత్రా ఇండియా బిపిఓ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మి ముక్కవిల్లి గారు మిలేనియం ఆప్టిట్యూడ్ & కోడింగ్ టెస్ట్-2025 బహుమతి ప్రదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పేర్కొన్నారు. ట్రెండింగ్ టెక్నాలజీలను క్రమశిక్షణతో నేర్చుకుంటే ఉద్యోగావకాశాలు ఎంతో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. MACT వంటి పరీక్షలు విద్యార్థుల్లో పోటీ భావనను పెంచుతాయని కూడా అభిప్రాయపడ్డారు.

“ఎవరూ ఎదగడానికి ఎదురు చూసి సిద్ధం కాలేదు. ప్రారంభించడం ద్వారా మాత్రమే సిద్ధత వస్తుంది” అని వరదా రవికుమార్, సెంట్రల్ మేనేజర్, మిల్లేనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రారంభ ప్రసంగంలో చెప్పారు. ఈరోజు కార్యక్రమం మిల్లేనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ 26వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించబడుతోందని పేర్కొన్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన శిక్షణతో పాటు ప్లేస్మెంట్ సహాయంపై మిల్లేనియం ఎల్లప్పుడూ దృష్టి పెట్టిందని వివరించారు.

CRT ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, 2023లో మిల్లీనియం ఆప్టిట్యూడ్ టెస్ట్ను 50 లక్షల రూపాయల ప్రతిభా వేతనంతో ప్రారంభించామని, ఇందులో ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్, వర్బల్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కంప్యూటర్ ఫండమెంటల్స్ వంటి ఇంటర్వ్యూలో కీలకమైన నైపుణ్యాలను పరీక్షించుకోడానికి విద్యార్థులకు అవకాశం లభిస్తుందని తెలిపారు.

ఈ సంవత్సరం మిల్లేనియం ఆప్టిట్యూడ్ & కోడింగ్ టెస్ట్ 30 కళాశాలల్లో విజయవంతంగా నిర్వహించబడిందని, మొత్తం 5,500 మంది విద్యార్థులు పాల్గొన్నారని, అందులో 1,000 మంది ర్యాంకర్లుగా ఎంపికయ్యారని తెలిపారు. కార్యక్రమం నిర్వహణలో సహకరించిన విశాఖ పరిసర ప్రాంతాల ప్రఖ్యాత కళాశాలల ప్రిన్సిపాళ్లు, HODలు, TPOలకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మరిసెట్టి డింపుల్ (NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) మొదటి ర్యాంక్ సాధించి ₹50,000 నగదు బహుమతి గెలుచుకున్నారని ప్రకటించారు.
2వ ర్యాంక్ – వెమనమంద స్రీ సాయి ప్రణవ్ వర్మ (ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్)
3వ ర్యాంక్ – బెజవాడ నూక శ్రీనివాసరావు (ASK కాలేజ్ ఆఫ్ టెక్ & మేనేజ్మెంట్)
4వ ర్యాంక్ – షేక్ కరీముల్లా (MVR డిగ్రీ కాలేజ్)
5వ ర్యాంక్ – చింతల గణేష్ (సెంచూరియన్ యూనివర్సిటీ)

తరువాత, బేహ్రా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ CSE విభాగాధిపతి నారాయణరావు చొక్కాపు మాట్లాడుతూ—AI పరిశ్రమల్లో విస్తరిస్తున్నప్పటికీ, దాన్ని అమలు చేయడానికి ఇంజనీర్లు అవసరమని, విద్యార్థులు తాజా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

MVR డిగ్రీ కాలేజ్ ఫ్యాకల్టీ శ్రీ బి. రత్నకుమార్, విశాఖ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఫిజిక్స్ హెచ్ఓడీ డాక్టర్ పి.ఎల్. సరణ్య తదితరులు మిలేనియం 26 ఏళ్ల విజయవంతమైన ప్రయాణాన్ని కొనియాడారు. VIET, సెయింట్ ఆన్స్, BVK డిగ్రీ కాలేజీల ప్రతినిధులు కూడా ఈ ఉపయోక్తమైన పరీక్ష నిర్వహణకు మిలేనియంను అభినందించారు.
తర్వాత ముఖ్య అతిథి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.