Sunday, 7 December 2025
  • Home  
  • 24 ప్రధాన డిమాండ్లు 68 డిపార్ట్మెంట్ సమస్యలు సమావేశం దృష్టికి తీసుకువెళ్లినట్లు రాష్ట్ర అధ్యక్షులు
- ఆంధ్రప్రదేశ్

24 ప్రధాన డిమాండ్లు 68 డిపార్ట్మెంట్ సమస్యలు సమావేశం దృష్టికి తీసుకువెళ్లినట్లు రాష్ట్ర అధ్యక్షులు

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి : ఏపీ సచివాలయం లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధ్యక్షతన బుధవారం జరిగిన సివిల్ సర్వీస్ జాయింట్ స్టాప్ కౌన్సిల్ లో ఏపీ ఎన్జీ జీఓ సంఘం 24 ప్రధాన డిమాండ్లు 68 డిపార్ట్మెంట్ సమస్యలు సమావేశం దృష్టికి తీసుకువెళ్లినట్లు రాష్ట్ర అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ తెలిపారు. ఇందు లో భాగంగా పి.ఆర్.సి కమిషనర్ నియామకం గురించి గత ప్రభుత్వ కాలంలో డా. మన్మోహన్ సింగ్, ఐ.ఏ.ఎస్ (రిటైర్డ్) గారిని 12వ వేతన సవరణ సంఘం కమిషనర్‌గా నియమించడం జరిగిందని కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయన పదవికి రాజీనామా చేశారని జూలై 23 నుండి వేతన సవరణలు అమలుకావలసి ఉన్నప్పటికీ దాదాపు రెండు సంవత్సరాలు గడిచిందని ఉద్యోగులు పెన్షనర్లకు న్యాయం జరిగేలా తక్షణమే కొత్త కమిషనర్‌ననియమించవలసిందిగా విజ్ఞప్తిచేశామని తెలిపారు.బకాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డి.ఏ/డి.ఆర్‌ను తక్షణమే మంజూరు చేసి విడుదల చేయవలసిందిగా కోరడం జరిగింది తెలిపారు. సంపాదించిన సెలవు డబ్బులు, డి.ఏ. & పి.ఆర్.సి బకాయిలు గత 3–4 సంవత్సరాలుగా సంపాదించిన సెలవు మొత్తాలు, డి.ఏ. బకాయిలు, పి.ఆర్.సి బకాయిలు విడుదల కాకుండా పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని త్వరితగతిన ఆర్థిక ఆమోదం తెలపాలని కోరారు. తాత్కాలిక ఉపశమన భత్యం (Interim Relief) మంజూరు పి.ఆర్.సి కమిషనర్ పునర్నియామకంలో ఆలస్యం, పి.ఆర్.సి నివేదిక తుదీకరణలో జాప్యం దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తాత్కాలిక ఉపశమన భత్యం మంజూరు చేయవలసిందిగా కోరుకుంటున్నామన్నారు. పెన్షన్ ప్రయోజనాల చెల్లింపు రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, కమ్యూటేషన్ మొత్తాలు మొదలైనవి తక్షణమే విడుదల చేసి, వారికీ రిటైర్మెంట్ అనంతరం అవసరాలు తీర్చుకునేలా ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా కోరారు. అదనపు పెన్షన్ పునరుద్ధరణ 70 నుండి 75 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పెన్షనర్లు/ఫ్యామిలీ పెన్షనర్లకు బేసిక్ పెన్షన్‌పై 10%, 75 నుండి 80 సంవత్సరాల మధ్య వయస్సు వారికి 15% అదనపు పెన్షన్ ఇవ్వబడేది. 11వ పి.ఆర్.సి అమలు తర్వాత రద్దు అయిన ఈ సదుపాయాన్ని తిరిగి పునరుద్ధరించవలసిందిగా కోరుతున్నామన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ 2023లో ప్రభుత్వం జూన్ 2014 లోపు నియమించబడిన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయం తీసుకుని దాదాపు 3000 మందిని రెగ్యులరైజ్ చేసింది. మిగిలిన సుమారు 7000 మంది (కాంట్రాక్ట్ లెక్చరర్స్, హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్, ఎడ్యుకేషన్, పంచాయతీ రాజ్ మొదలైన శాఖలలో పనిచేస్తున్న వారు) సేవలను కూడా రెగ్యులరైజ్ చేయవలసిందిగా కోరడంజరిగిందని తెలిపారు రిటైర్మెంట్ వయస్సు పెంపు (పబ్లిక్ సెక్టార్ & గురుకుల ఉద్యోగులకు) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 నుండి 62 సంవత్సరాలకు పెంచారు. అదే విధంగా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ మరియు గురుకుల సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకూ ఈ సౌకర్యాన్ని కల్పించవలసిందిగా కోరుతున్నాము. OPS అమలు (01.09.2004 లోపు నియమితులైన వారికి) 01.09.2004 లోపు నియమించబడిన ఉద్యోగులకు CPS స్థానంలో పాత OPS విధానం అమలు చేయవలసిందిగా మనవి చేయడం జరిగిందన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక సారి ఆప్షన్ ఇచ్చినందున రాష్ట్ర ప్రభుత్వం కూడా OPS పునరుద్ధరించవలసిందిగా మనవి. CPS ఉద్యోగుల DA బకాయిలు, ఇప్పటికే ఆదాయపన్ను మినహాయింపు జరిపిన కాలానికి నగదుగా చెల్లించవలసిందిగా మనవి. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉద్యోగులకు హౌస్ సైట్లు అమరావతి క్యాపిటల్ రీజియన్‌లో HoD ఉద్యోగులకు హౌస్ సైట్లు కేటాయించేందుకు జి.ఓ (No.66, Dt:13-02-2019) జారీ అయినా ఇప్పటివరకు అమలు కాలేదు. దీన్ని తక్షణమే అమలు చేయవలసిందిగా మనవి. బోనస్ ప్రకటన (2014–2017, 2017–2020, 2020–2023) APGLI పాలసీలకు సంబంధించిన బోనస్‌లు ఇప్పటికీ ప్రకటించబడలేదు. దీంతో రిటైర్ అవుతున్నవారు, లోన్లు తీసుకున్నవారు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ ఫైలు (No.2489454) ఫైనాన్స్ శాఖలో పెండింగ్‌లో ఉన్నది. కావున ఈ ట్రైనియమ్స్‌కు సంబంధించిన బోనస్‌ను తక్షణమే ప్రకటించవలసిందిగా కోరుతున్నామ EHS స్టీరింగ్ కమిటీ సమావేశంగౌరవ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించవలసిన EHS స్టీరింగ్ కమిటీ సమావేశం తక్షణమే నిర్వహించవలసిందిగా మనవి చేశామని తెలిపారు . ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఇన్షూరెన్స్ స్కీమ్‌గా మార్చడం ప్రస్తుతం అమలులో ఉన్న EHS‌ను, ప్రైవేట్ హెల్త్ ఇన్షూరెన్స్ కంపెనీల ద్వారా ఇన్షూరెన్స్ పథకంగా మార్చి, ఉద్యోగులు, పెన్షనర్లకు అధిక పరిమితి రీయింబర్స్‌మెంట్ మరియు మెరుగైన చికిత్సా సదుపాయాలు అందేలా చేయవలసిందిగా మనవి EHS సబ్‌స్క్రిప్షన్ నిధుల నేరుగా జమ ఉద్యోగుల నుండి వసూలు చేసిన EHS సబ్‌స్క్రిప్షన్ రుసుములు మరియు ప్రభుత్వ వాటాను నేరుగా NTR ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కి జమ చేయాలని సర్క్యులర్ మెమో (26.05.2023) ద్వారా ఇప్పటికే నిర్ణయించారు. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి, ఆసుపత్రులకు చెల్లింపులు వేగంగా జరిగేలా చూడవలసిందిగా మనవి. వైద్య రీయింబర్స్‌మెంట్ విధానంలో మార్పులు రీయింబర్స్‌మెంట్ గరిష్ట పరిమితిని రూ.2 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచాలి. ప్యాకేజీ రేట్లు సవరించాలి. ప్రస్తుతం బిల్లులు 8–9 నెలలు ఆలస్యమవుతున్నాయి, వీలైనంత త్వరగా పరిష్కరించాలి. జిల్లా ఆసుపత్రుల గరిష్ట పరిమితిని రూ.50,000 నుండి రూ.1,00,000కి పెంచవలసిందిగా మనవి. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు APCOS ద్వారా పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు తక్కువ జీతాల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్నికల హామీగా ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమ పథకాలను అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు విస్తరించనుంది అని తెలిపింది. అయితే ఇప్పటివరకు అమలు కాలేదు. కాబట్టి తక్షణమే ఈ పథకాలను అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు విస్తరించవలసిందిగా మనవిగ్రామ/వార్డు కార్యదర్శుల డిమాండ్లు రెండు సంవత్సరాల సేవ పూర్తి చేసి ప్రొబేషన్ ప్రకటించబడిన తర్వాత వారికి నోటిషనల్ ఇన్‌క్రిమెంట్స్ మంజూరు చేయవలసిందిగా మనవి. II. గ్రామ/వార్డు కార్యదర్శుల పోస్టులను జూనియర్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేసి ప్రమోషన్ల అవకాశాలు కల్పించాలి. దీనివల్ల అదనపు ఆర్థిక భారం ప్రభుత్వంపై ఉండదు. జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ ఆడిటర్లు, జూనియర్ అకౌంటెంట్ల రెగ్యులరైజేషన్ కంపాషనేట్ గ్రౌండ్స్‌పై నియమించబడి, కావలసిన విద్యార్హత కలిగిన అభ్యర్థులు CPT (Computer Proficiency Test) ఉత్తీర్ణత పొందిన వెంటనే, రెండు సంవత్సరాల గ్రేస్ పీరియడ్‌లోనే రెగ్యులరైజ్ చేయాలని మనవి. పదోన్నతులపై స్పష్టీకరణ (GO Ms.No.92 ప్రకారం) ప్యానెల్ ఇయర్‌లో ప్రమోషన్ రద్దు చేసుకున్న ఉద్యోగులు, అదే సంవత్సరం తర్వాత ఖాళీ వస్తే పరిగణించాలా? లేక ఒక సంవత్సరం తర్వాత మాత్రమే పరిగణించాలా? అనే విషయంపై స్పష్టత ఇవ్వవలసిందిగా మనవి. 28.08.2023కి ముందు ప్రమోషన్ రద్దు చేసుకున్నవారికి GO 92/2023 రిట్రోస్పెక్టివ్‌గా వర్తిస్తుందా లేదా అనే విషయంపై కూడా స్పష్టీకరణ ఇవ్వవలసిందిగా మనవి. 01.04.2020 నుండి 31.12.2021 మధ్య రిటైర్ అయిన వారికి తేడా మొత్తాల చెల్లింపు CFMSలో సదరు కాలంలో రిటైర్ అయిన వారికి సంపాదించిన సెలవు ఎన్‌కాష్‌మెంట్ డిఫరెన్షియల్ అమౌంట్ చెల్లించే సదుపాయం కల్పించవలసిందిగా కోరామన్నారుAPPTD ఉద్యోగుల ప్రమోషన్లు గత 4 సంవత్సరాలుగా APPTD ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వలేదు. దీంతో చాలామంది ఆర్థిక నష్టంతోనే రిటైర్ అయ్యారు. సంబంధిత ఫైల్ (No.2379231) ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. దీన్ని తక్షణమే పరిష్కరించవలసిందిగా మనవిAPPTD నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్‌ను APCS జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో చేర్చడం APPTD నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్‌ను శాశ్వత సభ్యులుగా APCS జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో చేర్చవలసిందిగా మరియు వారి ప్రమోషన్ ఫైల్ క్లియర్ చేయవలసినదిగా మనవి…NGO అసోసియేషన్ భవనాలకు, కాంప్లెక్సెస్ కు ఇదివరకటి వలె ప్రాపర్టీ పన్ను నుంచి మినహాయించడం వంటివి సమావేశం దృష్టికి తీసుకు వెళ్ళడం జరిగిందని విద్యాసాగర్ వివరించారు.

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి :
ఏపీ సచివాలయం లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధ్యక్షతన బుధవారం జరిగిన సివిల్ సర్వీస్ జాయింట్ స్టాప్ కౌన్సిల్ లో ఏపీ ఎన్జీ జీఓ సంఘం

24 ప్రధాన డిమాండ్లు 68 డిపార్ట్మెంట్ సమస్యలు సమావేశం దృష్టికి తీసుకువెళ్లినట్లు రాష్ట్ర అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ తెలిపారు. ఇందు లో భాగంగా
పి.ఆర్.సి కమిషనర్ నియామకం
గురించి గత ప్రభుత్వ కాలంలో డా. మన్మోహన్ సింగ్, ఐ.ఏ.ఎస్ (రిటైర్డ్) గారిని 12వ వేతన సవరణ సంఘం కమిషనర్‌గా నియమించడం జరిగిందని కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయన పదవికి రాజీనామా చేశారని జూలై 23 నుండి వేతన సవరణలు అమలుకావలసి ఉన్నప్పటికీ దాదాపు రెండు సంవత్సరాలు గడిచిందని ఉద్యోగులు పెన్షనర్లకు న్యాయం జరిగేలా తక్షణమే కొత్త కమిషనర్‌ననియమించవలసిందిగా విజ్ఞప్తిచేశామని తెలిపారు.బకాయి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డి.ఏ/డి.ఆర్‌ను తక్షణమే మంజూరు చేసి విడుదల చేయవలసిందిగా కోరడం జరిగింది తెలిపారు.

సంపాదించిన సెలవు డబ్బులు, డి.ఏ. & పి.ఆర్.సి బకాయిలు
గత 3–4 సంవత్సరాలుగా సంపాదించిన సెలవు మొత్తాలు, డి.ఏ. బకాయిలు, పి.ఆర్.సి బకాయిలు విడుదల కాకుండా పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని త్వరితగతిన ఆర్థిక ఆమోదం తెలపాలని కోరారు.
తాత్కాలిక ఉపశమన భత్యం (Interim Relief) మంజూరు
పి.ఆర్.సి కమిషనర్ పునర్నియామకంలో ఆలస్యం, పి.ఆర్.సి నివేదిక తుదీకరణలో జాప్యం దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తాత్కాలిక ఉపశమన భత్యం మంజూరు చేయవలసిందిగా కోరుకుంటున్నామన్నారు.
పెన్షన్ ప్రయోజనాల చెల్లింపు
రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, కమ్యూటేషన్ మొత్తాలు మొదలైనవి తక్షణమే విడుదల చేసి, వారికీ రిటైర్మెంట్ అనంతరం అవసరాలు తీర్చుకునేలా ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా కోరారు.
అదనపు పెన్షన్ పునరుద్ధరణ
70 నుండి 75 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పెన్షనర్లు/ఫ్యామిలీ పెన్షనర్లకు బేసిక్ పెన్షన్‌పై 10%, 75 నుండి 80 సంవత్సరాల మధ్య వయస్సు వారికి 15% అదనపు పెన్షన్ ఇవ్వబడేది. 11వ పి.ఆర్.సి అమలు తర్వాత రద్దు అయిన ఈ సదుపాయాన్ని తిరిగి పునరుద్ధరించవలసిందిగా కోరుతున్నామన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
2023లో ప్రభుత్వం జూన్ 2014 లోపు నియమించబడిన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయం తీసుకుని దాదాపు 3000 మందిని రెగ్యులరైజ్ చేసింది. మిగిలిన సుమారు 7000 మంది (కాంట్రాక్ట్ లెక్చరర్స్, హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్, ఎడ్యుకేషన్, పంచాయతీ రాజ్ మొదలైన శాఖలలో పనిచేస్తున్న వారు) సేవలను కూడా రెగ్యులరైజ్ చేయవలసిందిగా కోరడంజరిగిందని తెలిపారు
రిటైర్మెంట్ వయస్సు పెంపు (పబ్లిక్ సెక్టార్ & గురుకుల ఉద్యోగులకు)
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 నుండి 62 సంవత్సరాలకు పెంచారు. అదే విధంగా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ మరియు గురుకుల సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకూ ఈ సౌకర్యాన్ని కల్పించవలసిందిగా కోరుతున్నాము.
OPS అమలు (01.09.2004 లోపు నియమితులైన వారికి)
01.09.2004 లోపు నియమించబడిన ఉద్యోగులకు CPS స్థానంలో పాత OPS విధానం అమలు చేయవలసిందిగా మనవి చేయడం జరిగిందన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక సారి ఆప్షన్ ఇచ్చినందున రాష్ట్ర ప్రభుత్వం కూడా OPS పునరుద్ధరించవలసిందిగా మనవి. CPS ఉద్యోగుల DA బకాయిలు, ఇప్పటికే ఆదాయపన్ను మినహాయింపు జరిపిన కాలానికి నగదుగా చెల్లించవలసిందిగా మనవి.
హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉద్యోగులకు హౌస్ సైట్లు
అమరావతి క్యాపిటల్ రీజియన్‌లో HoD ఉద్యోగులకు హౌస్ సైట్లు కేటాయించేందుకు జి.ఓ (No.66, Dt:13-02-2019) జారీ అయినా ఇప్పటివరకు అమలు కాలేదు. దీన్ని తక్షణమే అమలు చేయవలసిందిగా మనవి.
బోనస్ ప్రకటన (2014–2017, 2017–2020, 2020–2023)
APGLI పాలసీలకు సంబంధించిన బోనస్‌లు ఇప్పటికీ ప్రకటించబడలేదు. దీంతో రిటైర్ అవుతున్నవారు, లోన్లు తీసుకున్నవారు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ ఫైలు (No.2489454) ఫైనాన్స్ శాఖలో పెండింగ్‌లో ఉన్నది. కావున ఈ ట్రైనియమ్స్‌కు సంబంధించిన బోనస్‌ను తక్షణమే ప్రకటించవలసిందిగా కోరుతున్నామ EHS స్టీరింగ్ కమిటీ సమావేశంగౌరవ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించవలసిన EHS స్టీరింగ్ కమిటీ సమావేశం తక్షణమే నిర్వహించవలసిందిగా మనవి చేశామని తెలిపారు .
ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఇన్షూరెన్స్ స్కీమ్‌గా మార్చడం
ప్రస్తుతం అమలులో ఉన్న EHS‌ను, ప్రైవేట్ హెల్త్ ఇన్షూరెన్స్ కంపెనీల ద్వారా ఇన్షూరెన్స్ పథకంగా మార్చి, ఉద్యోగులు, పెన్షనర్లకు అధిక పరిమితి రీయింబర్స్‌మెంట్ మరియు మెరుగైన చికిత్సా సదుపాయాలు అందేలా చేయవలసిందిగా మనవి EHS సబ్‌స్క్రిప్షన్ నిధుల నేరుగా జమ
ఉద్యోగుల నుండి వసూలు చేసిన EHS సబ్‌స్క్రిప్షన్ రుసుములు మరియు ప్రభుత్వ వాటాను నేరుగా NTR ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కి జమ చేయాలని సర్క్యులర్ మెమో (26.05.2023) ద్వారా ఇప్పటికే నిర్ణయించారు. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి, ఆసుపత్రులకు చెల్లింపులు వేగంగా జరిగేలా చూడవలసిందిగా మనవి.
వైద్య రీయింబర్స్‌మెంట్ విధానంలో మార్పులు
రీయింబర్స్‌మెంట్ గరిష్ట పరిమితిని రూ.2 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచాలి. ప్యాకేజీ రేట్లు సవరించాలి. ప్రస్తుతం బిల్లులు 8–9 నెలలు ఆలస్యమవుతున్నాయి, వీలైనంత త్వరగా పరిష్కరించాలి. జిల్లా ఆసుపత్రుల గరిష్ట పరిమితిని రూ.50,000 నుండి రూ.1,00,000కి పెంచవలసిందిగా మనవి.
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు
APCOS ద్వారా పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు తక్కువ జీతాల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్నికల హామీగా ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమ పథకాలను అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు విస్తరించనుంది అని తెలిపింది. అయితే ఇప్పటివరకు అమలు కాలేదు. కాబట్టి తక్షణమే ఈ పథకాలను అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు విస్తరించవలసిందిగా మనవిగ్రామ/వార్డు కార్యదర్శుల డిమాండ్లు రెండు సంవత్సరాల సేవ పూర్తి చేసి ప్రొబేషన్ ప్రకటించబడిన తర్వాత వారికి నోటిషనల్ ఇన్‌క్రిమెంట్స్ మంజూరు చేయవలసిందిగా మనవి.
II. గ్రామ/వార్డు కార్యదర్శుల పోస్టులను జూనియర్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేసి ప్రమోషన్ల అవకాశాలు కల్పించాలి. దీనివల్ల అదనపు ఆర్థిక భారం ప్రభుత్వంపై ఉండదు.

జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ ఆడిటర్లు, జూనియర్ అకౌంటెంట్ల రెగ్యులరైజేషన్
కంపాషనేట్ గ్రౌండ్స్‌పై నియమించబడి, కావలసిన విద్యార్హత కలిగిన అభ్యర్థులు CPT (Computer Proficiency Test) ఉత్తీర్ణత పొందిన వెంటనే, రెండు సంవత్సరాల గ్రేస్ పీరియడ్‌లోనే రెగ్యులరైజ్ చేయాలని మనవి.
పదోన్నతులపై స్పష్టీకరణ (GO Ms.No.92 ప్రకారం)
ప్యానెల్ ఇయర్‌లో ప్రమోషన్ రద్దు చేసుకున్న ఉద్యోగులు, అదే సంవత్సరం తర్వాత ఖాళీ వస్తే పరిగణించాలా? లేక ఒక సంవత్సరం తర్వాత మాత్రమే పరిగణించాలా? అనే విషయంపై స్పష్టత ఇవ్వవలసిందిగా మనవి.

28.08.2023కి ముందు ప్రమోషన్ రద్దు చేసుకున్నవారికి GO 92/2023 రిట్రోస్పెక్టివ్‌గా వర్తిస్తుందా లేదా అనే విషయంపై కూడా స్పష్టీకరణ ఇవ్వవలసిందిగా మనవి.
01.04.2020 నుండి 31.12.2021 మధ్య రిటైర్ అయిన వారికి తేడా మొత్తాల చెల్లింపు
CFMSలో సదరు కాలంలో రిటైర్ అయిన వారికి సంపాదించిన సెలవు ఎన్‌కాష్‌మెంట్ డిఫరెన్షియల్ అమౌంట్ చెల్లించే సదుపాయం కల్పించవలసిందిగా కోరామన్నారుAPPTD ఉద్యోగుల ప్రమోషన్లు
గత 4 సంవత్సరాలుగా APPTD ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వలేదు. దీంతో చాలామంది ఆర్థిక నష్టంతోనే రిటైర్ అయ్యారు. సంబంధిత ఫైల్ (No.2379231) ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. దీన్ని తక్షణమే పరిష్కరించవలసిందిగా మనవిAPPTD నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్‌ను APCS జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో చేర్చడం
APPTD నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్‌ను శాశ్వత సభ్యులుగా APCS జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో చేర్చవలసిందిగా మరియు వారి ప్రమోషన్ ఫైల్ క్లియర్ చేయవలసినదిగా మనవి…NGO అసోసియేషన్ భవనాలకు, కాంప్లెక్సెస్ కు ఇదివరకటి వలె ప్రాపర్టీ పన్ను నుంచి మినహాయించడం వంటివి సమావేశం దృష్టికి తీసుకు వెళ్ళడం జరిగిందని విద్యాసాగర్ వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.