Saturday, 19 July 2025
  • Home  
  • 2021-22 రాష్ట్ర జీడీపీలో కనీసం 4 శాతం బడ్జెట్ ఆరోగ్యంపై కేటాయించాలని మనవి :ప్రజారోగ్య వేదిక
- Featured - ఆంధ్రప్రదేశ్

2021-22 రాష్ట్ర జీడీపీలో కనీసం 4 శాతం బడ్జెట్ ఆరోగ్యంపై కేటాయించాలని మనవి :ప్రజారోగ్య వేదిక

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి దివ్య సముఖమునకు _______________________________ ఆర్యాా ! విషయం:  2021-22 రాష్ట్ర జీడీపీలో కనీసం 4 శాతం బడ్జెట్ ఆరోగ్యంపై కేటాయించాలని విజ్ఞప్తి. ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రజలందరికీ ఏప్రిల్ 7 పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తుంది.  ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ  “ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మిద్దాం”. (Building a fairer, healthy world)అనే నినాదాన్ని ప్రకటించింది. కావున ప్రజలు మరిియు ప్రభుత్వాలు దీనిలో భాగస్వామ్యం కావాలని ప్రజా ఆరోగ్య వేదిక కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ క్రింది సూచనలను చేస్తుంది. 1. రాష్ట్ర జీ.డీ.పీ లో కనీసంగా నాలుగు శాతాన్ని ఆరోగ్య రంగానికి కేటాయించాలి. 2. వ్యాప్తి చెందుతున్న రెండవ దశ కోవిడ్ రోగులకు మొదటిిి దశలో లాగానేేేే ప్రభుత్వ వైద్యులు మరియు  ఆరోగ్య సిబ్బంది నియామకాలను చేయడం, ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేయడం, లేబరేటరీ ల సంఖ్యను పెంచడం, మందుల సేకరణ లాంటి కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. 3.కోవిడ్ వారియర్స్ కు పి. పి. ఈ కిట్లను మరియుుుు మాస్కులను  అందుబాటులో ఉంచాలి. 4.అన్ని జిల్లాలలో  నాన్ కోవిడ్ సేవలను యధాతధంగా నిర్వహించే ప్రణాళికను అమలు చేయాలి. 5. వ్యాక్సినేషన్  కార్యక్రమాన్ని వికేంద్రీకరించి సచివాలయ స్థాయికి తీసుకెళ్లి  నిర్వహించడాన్ని అభినందిస్తున్నాము. ప్రతి కేంద్రంలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రజలు కనీసం 30   నిమిషాలు విశ్రమించే ఏర్పాట్లుు తోపాటు వ్యాక్సిన్ తీసుకున్నవారిని పర్యవేక్షించేందుకు తప్పనిసరిగా వైద్యుని అందుబాటులో ఉంచాలి. 6. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఎవరికైనా అత్యవసర సమస్యలు వస్తే వారిని వెంటనే ఆసుపత్రికిి తరలించేందుకుు అవసరమైన  రవాణా సౌకర్యం అందుబాటులో ఉంచాలి. 7. వ్యాక్సినేషన్   సెంటర్లలో కోవిడ్ వ్యాక్సిన్ కొరత లేకుంండా చూడాలి. 8.జాతీయ ఇమ్యునైజేషన్ లో భాగంగా చిన్న పిల్లలకు షెడ్యూల్ టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని యధావిధిగా అన్ని జిల్లాలలో జరిగేే  విధంగా చర్యలు చేపట్టాలి. 9. కరోనా మొదటి దశలో ప్రభుత్వం స్పందించిన తీరుగానే ఇప్పుడు రెండవ దశలో కూడా వ్యాప్తి చెందుతున్న కరోనా కట్టడికి అవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రులను కూడా ఉపయోగించుకొని సేవలను కొనసాగించాలిి. 10. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నాణ్యమైన సరుకులను సకాలంలో ఇవ్వడం జరగాలి. 11. కరోనా మొదటి దశలో సేవలందించి, మంచి అనుభవం గడించిన కాంట్రాక్ట్ సిబ్బందిని  మరలా ఉద్యోగాల లోకి తీసుకోవాలిి. 12. వ్యాక్సినేషన్   చేయించుకున్న  వారిలో  వ్యాక్సిన్ ఫలితాలు మరియు సమస్యల సమాచారాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పడు విడుదల చేసి ప్రజలలో కరోనా వ్యాక్సిన్ పట్ల విశ్వాసం పెంచాలిి. 12.  టెస్ట్, ట్రేస్ మరియుు  ట్రీట్  విధానాన్ని విస్తృతం చేయాలి.అలాగే టెస్టుల సంఖ్యను పెంచాలి. మరియు ఎస్ .ఎం .ఎస్ అవసరం పట్ల, భౌతిక దూరం పాటించడం, మాస్క్ వేయించడం, సబ్బుతో చేతులు కడగడం లాంటి  కరోోన నివారణ మార్గాలపై అవగాహన పెంచడం పై మరింత ప్రచారం చేయాలి . డాక్టర్ ఎం.వి . రమణయ్య రాష్ట్ర అధ్యక్షులు ప్రజారోగ్య వేదిక టి కామేశ్వరరావు రాష్ట్ర ప్రధాాన కార్యదర్శి ప్రజారోగ్య వేదిక

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి దివ్య సముఖమునకు
_______________________________
ఆర్యాా !
విషయం:  2021-22 రాష్ట్ర జీడీపీలో కనీసం 4 శాతం బడ్జెట్ ఆరోగ్యంపై కేటాయించాలని విజ్ఞప్తి.

ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రజలందరికీ ఏప్రిల్ 7 పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తుంది.  ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ  “ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మిద్దాం”. (Building a fairer, healthy world)అనే నినాదాన్ని ప్రకటించింది. కావున ప్రజలు మరిియు ప్రభుత్వాలు దీనిలో భాగస్వామ్యం కావాలని ప్రజా ఆరోగ్య వేదిక కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ క్రింది సూచనలను చేస్తుంది.
1. రాష్ట్ర జీ.డీ.పీ లో కనీసంగా నాలుగు శాతాన్ని ఆరోగ్య రంగానికి కేటాయించాలి.
2. వ్యాప్తి చెందుతున్న రెండవ దశ కోవిడ్ రోగులకు మొదటిిి దశలో లాగానేేేే ప్రభుత్వ వైద్యులు మరియు  ఆరోగ్య సిబ్బంది నియామకాలను చేయడం, ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేయడం, లేబరేటరీ ల సంఖ్యను పెంచడం, మందుల సేకరణ లాంటి కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి.

3.కోవిడ్ వారియర్స్ కు పి. పి. ఈ కిట్లను మరియుుుు మాస్కులను  అందుబాటులో ఉంచాలి.
4.అన్ని జిల్లాలలో  నాన్ కోవిడ్ సేవలను యధాతధంగా నిర్వహించే ప్రణాళికను అమలు చేయాలి.
5. వ్యాక్సినేషన్  కార్యక్రమాన్ని వికేంద్రీకరించి సచివాలయ స్థాయికి తీసుకెళ్లి  నిర్వహించడాన్ని అభినందిస్తున్నాము.
ప్రతి కేంద్రంలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రజలు కనీసం 30   నిమిషాలు విశ్రమించే ఏర్పాట్లుు తోపాటు వ్యాక్సిన్ తీసుకున్నవారిని పర్యవేక్షించేందుకు తప్పనిసరిగా వైద్యుని అందుబాటులో ఉంచాలి.
6. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఎవరికైనా అత్యవసర సమస్యలు వస్తే వారిని వెంటనే ఆసుపత్రికిి తరలించేందుకుు అవసరమైన  రవాణా సౌకర్యం అందుబాటులో ఉంచాలి.
7. వ్యాక్సినేషన్   సెంటర్లలో కోవిడ్ వ్యాక్సిన్ కొరత లేకుంండా చూడాలి.

8.జాతీయ ఇమ్యునైజేషన్ లో భాగంగా చిన్న పిల్లలకు షెడ్యూల్ టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని యధావిధిగా అన్ని జిల్లాలలో జరిగేే  విధంగా చర్యలు చేపట్టాలి.
9. కరోనా మొదటి దశలో ప్రభుత్వం స్పందించిన తీరుగానే ఇప్పుడు రెండవ దశలో కూడా వ్యాప్తి చెందుతున్న కరోనా కట్టడికి అవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రులను కూడా ఉపయోగించుకొని సేవలను కొనసాగించాలిి.

10. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నాణ్యమైన సరుకులను సకాలంలో ఇవ్వడం జరగాలి.

11. కరోనా మొదటి దశలో సేవలందించి, మంచి అనుభవం గడించిన కాంట్రాక్ట్ సిబ్బందిని  మరలా ఉద్యోగాల లోకి తీసుకోవాలిి.
12. వ్యాక్సినేషన్   చేయించుకున్న  వారిలో  వ్యాక్సిన్ ఫలితాలు మరియు సమస్యల సమాచారాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పడు విడుదల చేసి ప్రజలలో కరోనా వ్యాక్సిన్ పట్ల విశ్వాసం పెంచాలిి.

12.  టెస్ట్, ట్రేస్ మరియుు  ట్రీట్  విధానాన్ని విస్తృతం చేయాలి.అలాగే టెస్టుల సంఖ్యను పెంచాలి. మరియు ఎస్ .ఎం .ఎస్ అవసరం పట్ల, భౌతిక దూరం పాటించడం, మాస్క్ వేయించడం, సబ్బుతో చేతులు కడగడం లాంటి  కరోోన నివారణ మార్గాలపై అవగాహన పెంచడం పై మరింత ప్రచారం చేయాలి .
డాక్టర్ ఎం.వి . రమణయ్య
రాష్ట్ర అధ్యక్షులు
ప్రజారోగ్య వేదిక

టి కామేశ్వరరావు
రాష్ట్ర ప్రధాాన కార్యదర్శి
ప్రజారోగ్య వేదిక

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.