
విశాఖపట్నం: ప్రతి ఒక్కరికి దేశభక్తి భావం కలిగి ఉండాలని గురజాడ విద్యా సంస్థల అధినేత జి.వి. స్వామినాయుడు అన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యా సంస్థల ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేసి, ఆయన మాట్లాడుతూ –
“స్వాతంత్ర్యం, స్వేచ్ఛల కోసం మన పూర్వికులు తమ ప్రాణాలను అర్పించారు. వారి వారసులుగా మనమూ ఆ స్ఫూర్తితో, క్రమశిక్షణతో పనిచేయాలి” అని సూచించారు.
ఎన్‌సిసి విద్యార్థుల ప్రదర్శనలు హాజరైన వారిని ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా వివిధ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ (సంయుక్త) అంబటి రంగారావు, గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపాల్ కె.వి.వి. సత్యనారాయణ, మేజర్ మహేష్, గాయత్రి స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి విజయలక్ష్మి, అలాగే ఇతర విద్యా సంస్థల ప్రిన్సిపాళ్లు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

