తాళ్లపూడి(పున్నమి ప్రతినిధి)జనవరి 27: కొవ్వూరులోని పి.ఎం.ఎం.ఎం (PMMMM) పాఠశాలలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు.. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు జెండాను ఆవిష్కరించారు.
అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ చదువు ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు ఆయన పలు కీలక సూచనలు చేశారు. “పదో తరగతి అనేది కేవలం పాస్ అవ్వడానికి మాత్రమే కాదు, ఇది మీ భవిష్యత్తును నిర్ణయించే కీలక మలుపు” అని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం పాస్ మార్కులు సరిపోవని, కనీసం70% నుండి 80% మార్కులు సాధిస్తేనే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ సమయాన్ని వృధా చేయకుండా, చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టి మంచి ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో చైర్ పర్సన్ భావన రత్నకుమారి. టూమెన్ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకృష్ణ, మద్దిపట్ల శివరామ కృష్ణ, దాన రామకృష్ణ, అర్జీల్లి రామకృష్ణ , పోట్రూ మురళి, బేతిన నారాయణ,వేమగిరి వెంకట్రావు మరియు ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.
Uploaded Video:



