Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Tirupati

💐✍️*అభివృద్ధికి చంద్రన్న ఆపన్న హస్తం*💯

Punnami Newsroom Published:

💐✌️అమరావతి: సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్యే ఆదిమూలం కలిసి, ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించిన నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.🎯

🙏💐ప్రధానంగా దాసుకుప్పం బైపాస్ రోడ్డు నిర్మాణం ఆవశ్యకతను ఎమ్మెల్యే వివరించారు. ఈ బైపాస్ రోడ్డు పూర్తయితే సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడటంతో పాటు, ప్రాంత అభివృద్ధికి ఊతం లభిస్తుందని తెలిపారు. తమిళనాడు మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుందని వివరించారు.

💐*అదేవిధంగా సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రిని ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ అప్‌గ్రేడేషన్ ఎంతో కీలకమని వివరించారు.*

✍️💐తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్న సత్యవేడు డిగ్రీ కళాశాలకు నూతన భవనం నిర్మించాల్సిన అవసరాన్ని కూడా ఎమ్మెల్యే ప్రస్తావించారు. ప్రస్తుతం ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని శాశ్వత భవనం మంజూరు చేయాలని కోరారు.

✍️💐మూడు, నాలుగు మండలాలకు కేంద్రంగా, నిత్యం రద్దీగా ఉండే పిచ్చాటూరు మండల కేంద్రంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

✍️అలాగే నియోజకవర్గంలోని అతిపెద్ద మండలమైన కేవీబీ పురంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కళ్యాణ మండపం నిర్మించాలని కోరారు. స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనను పరిశీలించాలని ముఖ్యమంత్రిని అభ్యర్థించారు.

💐🎯*ఎమ్మెల్యే ఆదిమూలం ప్రస్తావించిన సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతానని సీఎం హామీ ఇవ్వడంతో పాటు, ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించినట్లు తెలిపారు.*💯

🙏మర్మ రాజకీయాలు లేవు…
ఉనికి కోసం ఎత్తులకు పైఎత్తులు లేవు…
ప్రచార ఆర్భాటాలు లేవు…
వర్గపోరులో చలికాచుకునే ధోరణి లేదు…

🎯*ఆదిమూలం అజెండా ఒక్కటే — అభివృద్ధి*.✍️

💐ప్రజా సమస్యలను అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించడం నుంచి, వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం చూపే వరకు సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధినే లక్ష్యంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముందుకు సాగుతున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది.✍️

🙏సత్యవేడు అభివృద్ధికి చంద్రన్న సహకారం…👍
✌️💐*ఆ అభివృద్ధికి ఆదిమూలం కృషి…*
*ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.*🙏

💐✍️*అభివృద్ధికి చంద్రన్న ఆపన్న హస్తం*💯

Leave a comment

Your email address will not be published. Required fields are marked *